LOADING...
Trump's tariff twist: టారిఫ్స్ పై షాకింగ్‌ డాక్యుమెంట్స్‌.. మస్క్‌ స్టార్‌లింక్‌తో సహా పెద్ద కార్పొరేట్‌ మిత్రుల ప్రయోజనాలకే పెద్దపీట! 
మస్క్‌ స్టార్‌లింక్‌తో సహా పెద్ద కార్పొరేట్‌ మిత్రుల ప్రయోజనాలకే పెద్దపీట!

Trump's tariff twist: టారిఫ్స్ పై షాకింగ్‌ డాక్యుమెంట్స్‌.. మస్క్‌ స్టార్‌లింక్‌తో సహా పెద్ద కార్పొరేట్‌ మిత్రుల ప్రయోజనాలకే పెద్దపీట! 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2025
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచవ్యాప్తంగా భారీ సుంకాలు (టారిఫ్‌లు) విధించి, వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టిన ప్రధాన కారణం దేశ ఆర్థికాభివృద్ధి మాత్రమే కాదని, అంతర్గత ప్రభుత్వ పత్రాలు వెల్లడించాయి. వాషింగ్టన్ పోస్ట్ వెలువరించిన రిపోర్ట్‌ ప్రకారం, ట్రంప్‌ ఈ చర్యలతో కొంతమంది ప్రముఖ కంపెనీల ప్రయోజనాలను కూడా కాపాడే ప్రయత్నం చేశారు. వీటిలో ఎలాన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌, చెవ్రాన్‌ వంటి కంపెనీలు ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది.

వివరాలు 

చైనాను అడ్డుకునేందుకు దక్షిణ కొరియాపై ఒత్తిడి

ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్న కారణంగా 50 శాతం సుంకం విధించడం,ఇజ్రాయెల్‌ను ఒక ముఖ్యమైన పోర్టుపై చైనా కంపెనీ ఆధిపత్యం తొలగించమని కోరడం,చైనాను అడ్డుకునేందుకు అమెరికా సైన్యాన్ని మోహరించడాన్ని బహిరంగంగా మద్దతు ఇవ్వాలని దక్షిణ కొరియాపై ఒత్తిడి చేయడం వంటి చర్యలు ట్రంప్‌ చేపట్టారని ఆ పత్రాల్లో ఉంది. "సప్లిమెంటల్‌ నెగోషియేటింగ్‌ ఆబ్జెక్టివ్‌"పేరుతో ఉన్నఎనిమిదిపేజీల డాక్యుమెంట్‌లో,సాధారణంగా వాణిజ్య ఒప్పందాల్లో లేని మిలిటరీ బేసింగ్‌ వంటి అంశాలు కూడా చర్చకు వస్తాయని అమెరికా అధికారులు అంగీకరించారు. అంతేకాక,ఎలాన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌,ప్రపంచంలో టాప్‌10 చమురు ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన చెవ్రాన్‌ వంటి వ్యక్తిగత కంపెనీల కోసం ఇతర దేశాలపై రాయితీలు ఇవ్వమని ఒత్తిడి చేయాలని ప్రణాళికలు రూపొందించినట్టు వివరించారు.

వివరాలు 

అమెరికా రక్షణ పరికరాలు కొనుగోలు చేసిన చైనాకు సమీపంలోని దేశాలు 

ట్రంప్‌ తన "రిసిప్రోకల్‌ టారిఫ్‌లు" తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని వారాల తర్వాత, చైనాకు సమీపంలోని దేశాలను అమెరికా రక్షణ పరికరాలు కొనుగోలు చేయడం, అమెరికా నౌకాదళ పోర్టు సందర్శనలకు అనుమతులు ఇవ్వడం వంటి రక్షణ సంబంధాలను మెరుగుపరచమని ఒత్తిడి చేయడానికి యుఎస్‌ అధికారులు ప్రణాళికలు వేసినట్టు పత్రాలు చెబుతున్నాయి. "ట్రేడ్‌ ఒప్పందంలో ఇలాంటి డిమాండ్‌ నేను తొలిసారి వింటున్నాను. చర్చల టేబుల్‌ వద్ద కూర్చున్నప్పుడు ఇలాంటి విషయాలు సాధారణంగా రాకపోవు" అని అమెరికా ట్రేడ్‌ ప్రతినిధి కార్యాలయంలో దాదాపు 25 ఏళ్లు పనిచేసిన వెండీ కట్లర్‌ అన్నారు.

వివరాలు 

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడిపై  న్యాయవిచారణ ఆపకపోతే 50 శాతం టారిఫ్‌లు

ఒక స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి మాట్లాడుతూ.. "ఆ పత్రం ప్రభుత్వంలోనే షాక్‌ వేవ్‌లను సృష్టించింది. ఇది సాధారణంగా జరిగే విధానం కాదు" అని తెలిపారు. ఈ మధ్యే ట్రంప్‌ వాణిజ్య అంశాలను ఇతర సంబంధం లేని రాజకీయ, దౌత్య అంశాలతో కలిపి వ్యవహరిస్తున్నారని విమర్శలు వచ్చాయి. బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోపై న్యాయవిచారణను ఆపకపోతే 50 శాతం టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్‌ హెచ్చరించారు. ఈ ఏడాది జనవరిలో, కొలంబియా నేతను.. అమెరికాకు తిరిగి పంపించిన వలసదారులను అంగీకరించకపోతే కొలంబియా వస్తువులపై సుంకాలు పెంచుతానని బెదిరించారు.