
Chandrababu: సింగపూర్ పర్యటనలో చంద్రబాబుకు ఘన స్వాగతం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సింగపూర్‌ను భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్‌కు వెళ్లింది. ఈరోజు ఉదయం సింగపూర్ చేరుకున్న సీఎం బృందానికి అక్కడి ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. చంద్రబాబును సంప్రదాయ వస్త్రధారణతో పలకరించేందుకు అక్కడి తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి.
Details
మొత్తం 29 సమావేశాల్లో పాల్గొనే అవకాశం
చిన్నారులు కూచిపూడి నృత్యం ద్వారా ముఖ్యమంత్రి బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ ఐదు రోజుల పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 29 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి, ఆయన వెంట మంత్రులు పాల్గొననున్నారు. ఈ పర్యటనలో మంత్రులు నారా లోకేశ్, నారాయణ, టీజీ భరత్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.