NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mangalagiri: మంగళగిరిలో నైపుణ్య గణన సర్వే.. వచ్చే నెల 3న ప్రయోగాత్మకంగా మొదలు
    తదుపరి వార్తా కథనం
    Mangalagiri: మంగళగిరిలో నైపుణ్య గణన సర్వే.. వచ్చే నెల 3న ప్రయోగాత్మకంగా మొదలు
    మంగళగిరిలో నైపుణ్య గణన సర్వే.. వచ్చే నెల 3న ప్రయోగాత్మకంగా మొదలు

    Mangalagiri: మంగళగిరిలో నైపుణ్య గణన సర్వే.. వచ్చే నెల 3న ప్రయోగాత్మకంగా మొదలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 21, 2024
    12:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణన(skill Census) నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం సిద్దమైంది.

    రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వచ్చే నెల సెప్టెంబరు 3న ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.

    ఈ నైపుణ్య సర్వేకు వినియోగించే యాప్‌ తయారీ దాదాపుగా పూర్తయింది. సర్వేతోపాటుగా అభ్యర్థులు నేరుగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు కూడా ఇందులో అవకాశం ఉంది.

    సర్వే పూర్తయిన అనంతరం వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచితే కొత్తగా మార్కెట్‌లోకి వచ్చేవారు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు యోచిస్తున్నారు.

    వివరాలు 

    స్కిల్ సెన్సస్‌ను ఎలా లెక్కిస్తారు 

    స్కిల్ సెన్సస్‌తో పాటు నాగార్జున యూనివర్సిటీలోనూ విద్యార్థుల నుంచి సమాచారం సేకరిస్తారు. సర్వే ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సమాచారం సేకరించి, డేటాను విశ్లేషణ చేసేందుకు దాదాపు 8 నెలల సమయం పడుతుందని నైపుణ్యాభివృద్ధి సంస్థ అంచనా వేసింది.

    ఈ సర్వేకోసం ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం నుంచి ఆరుగురు చొప్పున ఉద్యోగులను వినియోగించనున్నారు.

    వీరికి ఈ నెలాఖరులో రెండు విడతలుగా ట్రైనింగ్ ఇస్తారు.ఈ ట్రైనింగ్ 23, 24, 30, 31 తేదీలలో నిర్వహిస్తారు.

    ట్రైనింగ్ అయ్యాక అపాయింట్ అయ్యిన ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ట్యాబ్‌ల్లో సమాచారం సేకరిస్తారు.

    25 రకాల ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తారు. సంఘటిత రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారి పీఎఫ్ ఖాతాలు,అసంఘటిత రంగంలో ఉంటే ఈ-శ్రమ్‌ ద్వారా వివరాలు తీసుకోనున్నారు.

    వివరాలు 

    సర్వే అనంతరం ఏం చేస్తారు? 

    ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారం దాదాపు 20 ఏళ్లపాటు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    ఈ సర్వే ద్వారా పిల్లలో ఉన్న నైపుణ్యాల గుర్తించి వారికీ ఎవరికి ఏ డొమైన్‌లో శిక్షణ అవసరం , నైపుణ్య కళాశాలలు, హబ్‌లు, నూతన కళాశాలలు, వర్సిటీల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

    ఈ ట్రైనింగ్ అనంతరంఅభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇస్తారు. మార్కెట్ లోకి వచ్చే కంపెనీలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో కూడా వివరాలు తీసుకుంటారు. తదనుగుణంగా ట్రైనింగ్ ఇచ్చి, ఆయా కంపెనీలకు అనుసంధానం చేస్తారు.

    ఈ ట్రైనింగ్ లకు ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన, కేంద్ర ప్రభుత్వ సెక్టార్‌ స్కిల్స్‌ కౌన్సిల్స్‌ సేవలను కూడా వినియోగించుకోనున్నారు.

    వివరాలు 

    ఏమేం వివరాలు సేకరిస్తారు? 

    అక్షరాస్యులు? నిరక్షరాస్యులు? ఉద్యోగులు? చదువుకుని ఉద్యోగం రాని వారు? ఉద్యోగం సంఘటిత రంగమా? అసంఘటిత రంగమా? నిరుద్యోగుల విద్యార్హతలు? పీహెచ్ఎ, ఎంఎస్, డిగ్రీ, ఇంటర్మీడి యట్, పదో తరగతి, ఎనిమిదో తరగతి? బీటెక్ చదివితే డొమైన్ నాలెడ్జ్ ఉందా? ఇలా 25 రకాల ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తారు.

    సంఘటిత రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారి పీఎఫ్ ఖాతాలు, అసంఘటిత రంగంలో ఉంటే ఈ-శ్రమ్ ద్వారా వివరాలు తీసుకోనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మంగళగిరి

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    మంగళగిరి

    టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    'టీడీపీ నాయకులను సీఎం చేయడానికి నేను లేను'; పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్  పవన్ కళ్యాణ్
    YCP MLA RK: ఏపీలో వైసీపీకి షాక్.. ఎమ్మెల్యే పదవి, వైసీపీకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా ఆంధ్రప్రదేశ్
    Alla Ramakrishna Reddy: షర్మిల వెంటే ఉంటా.. కాంగ్రెస్‌లో చేరుతా: ఆర్కే సంచలన కామెంట్స్  ఆళ్ల రామకృష్ణా రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025