ICC Champions Trophy: స్టార్ క్రికెటర్లు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఈ బౌలర్ల పైనే అందరి దృష్టి!
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్ పేసర్లు వైదొలిగారు. గాయాలు, వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అందులో భారత్ నుంచి జస్‌ప్రీత్ బుమ్రా ఉండగా, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు.
అయితే, వీరు లేని పరిస్థితిలో అభిమానులు బాధపడాల్సిన అవసరం లేదు.
ఈసారి ట్రోఫీలోనూ అందరి దృష్టిని ఆకర్షించే స్టార్లూ లేకపోలేదు. మరి ఆ జాబితాలో టాప్ బౌలర్లు ఎవరో ఓసారి చూద్దాం..
వివరాలు
షమీ.. ఐసీసీ ట్రోఫీలంటే చాలు
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ఆ బాధ్యత ఇప్పుడు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై పడింది.
దాదాపు 400 రోజులకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నషమీ, ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆడి బౌలింగ్ లయను అందుకున్నాడు.
ఎక్కువగా వికెట్లు తీయనప్పటికీ, మునుపటిలా ఉత్సాహంగా ఉండటం అభిమానులను సంతోషపరిచింది.
ద్వైపాక్షిక సిరీస్‌లలో ఓ మాదిరిగా ప్రదర్శన చేస్తే షమీ,ఐసీసీ టోర్నీల్లో మాత్రం విజృంభించేస్తాడు.
అందుకు చక్కటి ఉదాహరణ గత వన్డే ప్రపంచకప్.
ఆ టోర్నీలో కేవలం 7 మ్యాచుల్లోనే 24 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
బుమ్రా కూడా 20 వికెట్లు తీసినప్పటికీ అన్ని మ్యాచులూ ఆడాడు.మరోసారి అతడి నుంచి అలాంటి ప్రదర్శననే అభిమానులు ఆశించడం సహజమే.
వివరాలు
పాక్ తురుపుముక్కగా షహీన్ షా
పాకిస్థాన్ ఆతిథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.స్వదేశంలో ఆ జట్టు అత్యంత ప్రమాదకరమని మాజీల మాట.
అందుకు తగినట్టుగానే స్టార్ పేసర్లు షహీన్ షా అఫ్రిది,హరీస్ రవూఫ్,నసీమ్ షా సిద్ధమయ్యారు.
వీరిలో షహీన్‌తో ప్రత్యర్థి జట్లకు మరింత డేంజర్. అతడి గణాంకాలు కూడా ఇవే చెబుతున్నాయి.
గత రెండేళ్ల నుంచి కేవలం 29 వన్డేల్లోనే 62 వికెట్లు పడగొట్టాడు.
కుడి, ఎడమ బ్యాటర్లను ఇబ్బందిపెట్టగల అరుదైన బౌలర్. ఆరంభ ఓవర్లలో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీయడం అతడి స్పెషాలిటీ.
ఇక డెత్ ఓవర్లలోనూ షహీన్‌ను ఎదుర్కోవడం కత్తిమీదసామే.
దుబాయ్ వేదికగా భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. తొలి ఓవర్లలో షహీన్ అడ్డుకుంటే సగం మ్యాచ్ టీమ్ఇండియా వశమైనట్లేనని విశ్లేషకుల మాట.
వివరాలు
ఆసీస్ ఆశల 'జంపా'
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.పేసర్లు కమిన్స్, హేజిల్‌వుడ్, స్టార్క్ దూరమయ్యారు.
దీంతో ఫాస్ట్ బౌలింగ్ విభాగం కొత్త కుర్రాళ్లతో నింపాల్సి వచ్చింది.అదే సమయంలో లెగ్‌స్పిన్నర్ ఆడమ్ జంపాపై అదనపు బాధ్యత పడింది.
ఆసీస్ గత వన్డే ప్రపంచ కప్‌ను నెగ్గడంలో జంపా కూడా కీలకపాత్ర పోషించాడు.
11 మ్యాచుల్లో 23 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌లోనూ జంపానే ఆసీస్ ప్రధాన ఆయుధమనడంలో అనుమానమే లేదు.
ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లలోని కుడి చేతివాటం బ్యాటర్లకు జంపా నుంచి ప్రమాదం తప్పదు.
ఎందుకంటే కెరీర్‌లో 181 వికెట్లు తీసిన జంపా, 133 వికెట్లు కుడిచేతివాటం బ్యాటర్లవే కావడం గమనార్హం.
వివరాలు
చైనామన్ బౌలర్ కుల్‌దీప్
గూగ్లీతో 51 మందిని ఔట్ చేసిన అతడు ఫ్లిప్పర్లతోనూ ప్రత్యర్థులను ఇబ్బందికి గురి చేయగలడు.
దుబాయ్ పిచ్‌లు ఫాస్ట్‌కు ఎంత అనుకూలంగా ఉంటాయో, స్పిన్నర్లకూ అంతే సహకారం లభిస్తుంది.
అందుకే, టీమ్ ఇండియా ఐదుగురు స్పిన్నర్లను స్క్వాడ్‌లో ఉంచిందనేది క్రీడా పండితుల విశ్లేషణ.
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులో తీసుకోవడానికి కూడా కారణమిదే. కానీ, దుబాయ్ పిచ్‌పై వరుణ్ కంటే చైనామన్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్‌తోనే ప్రత్యర్థులకు ఇబ్బంది.
నెమ్మదిగా బంతిని వేయడంతోపాటు ఎప్పుడు టర్న్ అవుతుందనేది త్వరగా అంచనాకు రావడం చాలా కష్టం.
2023 నుంచి 34 మ్యాచుల్లో 55 వికెట్లు తీశాడు. అత్యంత తక్కువ ఎకానమీతో బంతులేయడం అతడి స్పెషల్.
వివరాలు
మ్యాట్ హెన్రీతోనూ సవాలే
డెత్ ఓవర్లలో బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేయడంలోనూ కుల్‌దీప్ సిద్ధహస్తుడనే వాదనా ఉంది.
వరుణ్‌ను తీసుకున్నా, తుదిజట్టులో మాత్రం కుల్‌దీప్ యాదవ్‌కే అవకాశం ఇవ్వాలనేది చాలామంది సూచన.
ఈ న్యూజిలాండ్ పేసర్‌పై ఇప్పుడందరి దృష్టి ఉంది.భారత్‌కు సవాల్ విసిరే బౌలర్లలో ఇతడొకడు.
గత 22 మ్యాచుల్లో 39 వికెట్లు తీశాడు.కెరీర్‌లో 150+వికెట్లు తీసిన బౌలర్లలో అత్యుత్తమ సగటు కలిగిన ప్లేయర్.
నిలకడగా 145 కి.మీ. వేగం వేయడంతోపాటు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి ఉంటాడు.
ఈఏడాదే కేవలం ఐదు మ్యాచుల్లోనే 14 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
దక్షిణాఫ్రికా పేసర్ రబాడ, ఇంగ్లండ్ పేసర్లు మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చర్ కూడా ఈ జాబితాలో ఉన్నప్పటికీ, ఇటీవల వారి ప్రదర్శన గొప్పగా ఏమీలేదు.
వివరాలు
ఇంగ్లండ్‌కు ఒకే ఒక్కడు
ఇటీవల భారత పర్యటనలో ఇంగ్లండ్ బౌలర్లు ఇబ్బందిపడిన సంగతిని చూశాం.
కానీ, అదిల్ రషీద్ మాత్రం టీమ్ ఇండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కచ్చితమైన లెంగ్త్‌తోపాటు స్టంప్స్‌ని లక్ష్యం చేసుకొని బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత.
గూగ్లీలు సంధించడం అతడి స్పెషాలిటీ. అనూహ్యంగా బంతిని టర్న్ చేస్తూ వికెట్లు తీస్తాడు.
తన కెరీర్‌లో మొత్తం 212 వికెట్లు తీసిన అతడు, గూగ్లీతోనే తన కెరీర్‌లో 64 వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్ జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నప్పటికీ, స్పిన్ విభాగంలో మాత్రం రషీద్‌పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది.