Iran-Israel war: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారతీయ స్టాక్ మార్కెట్, బంగారం ధరలను ఎలా ప్రభావితం చేస్తుంది
ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే, అది భారతదేశానికి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఆసియాలో ఇజ్రాయెల్ కు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. పశ్చిమాసియా దేశాలకు భారత్ ఎగుమతి చేసే ముఖ్యమైన వస్తువులలో బాస్మతి, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, పత్తి, దుస్తులు ఉన్నాయి. అయితే, ద్వైపాక్షిక వాణిజ్యంలో ప్రధానంగా వజ్రాలు,పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ఘర్షణలు పెరిగితే, చమురు,ఎలక్ట్రానిక్స్,వ్యవసాయం వంటి రంగాల్లో వాణిజ్యానికి నష్టాలు తప్పకుండా ఉంటాయి. ఈ పరిస్థితి ఎగుమతిదారులకు అధిక లాజిస్టిక్స్ ఖర్చులుగా మారవచ్చు.యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనే దేశాలకు ఎగుమతుల కోసం బీమా వ్యయాలు కూడా పెరుగుతాయి. ఇది భారతీయ ఎగుమతిదారులను ప్రభావితం చేస్తుంది.ఈ ఘర్షణలు ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగలవు.
భారత్ ఇజ్రాయెల్ కు 639 మిలియన్ డాలర్ల ఎగుమతులు
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూలైలో భారత్ ఇరాన్ కు 538.57 మిలియన్ డాలర్ల ఎగుమతులు కలిగి ఉంది. 2023-24లో ఇది 1.22 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో ఇరాన్ నుంచి దిగుమతులు 140.69 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2023-24లో ఇది 625.14 మిలియన్ డాలర్లుగా ఉంటుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలైలో భారత్ ఇజ్రాయెల్ కు 639 మిలియన్ డాలర్ల ఎగుమతులు ఉన్నాయి. 2023-24లో ఇది 4.52 బిలియన్ డాలర్లను అందుకోగలదు. మొదటి నాలుగు నెలల్లో ఇజ్రాయెల్ నుంచి దిగుమతులు 469.44 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి, 2023-24లో ఇది 2 బిలియన్ డాలర్లకు చేరుకోగలదు.
ముడిచమురు బ్యారెల్ ధర 13 నుండి 28 డాలర్ల వరకు పెరిగే అవకాశం
ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలు విధిస్తే, ముడిచమురు బ్యారెల్ ధర 7 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో, ఇజ్రాయెల్ ఇరాన్ ఇంధన స్థావరాలపై దాడి చేస్తే, ముడిచమురు బ్యారెల్ ధర 13 డాలర్ల వరకు అధికం అవుతుంది. హోర్ముజ్ జలసంధి ద్వారా సరఫరాకు అంతరాయం ఏర్పడితే, ముడిచమురు బ్యారెల్ ధర 13 నుండి 28 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది.
రష్యా భారత్ కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారు
భారతదేశం 2018-19 వరకు ఇరాన్ నుండి మూడవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది. అయితే, 2019 జూన్ లో అమెరికా ఇరాన్ పై ఆంక్షలు విధించినప్పుడు, భారతదేశం ఇరాన్ నుండి చమురు దిగుమతిని మినహాయింపును రద్దు చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, రష్యా భారత్ కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా మారింది. ప్రస్తుతం 40 శాతం రష్యా నుండి 20 శాతం ఇరాక్ నుండి దిగుమతి చేసుకుంటోంది.