ఉల్కాపాతాలు, ఉష్ణోగ్రత మార్పుల వల్లే చంద్ర కంపనాలకు కారణం
చంద్రయాన్-3 మిషన్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్ర కంపనాలపై ఆసక్తికరమైన తెలిపింది. గతంలో జరిగిన ఉల్కాపాతాలు, చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రతల్లో విపరీతమైన తేడాలు చంద్ర గర్భంలో ప్రకంపనలకు కారణమని ఇస్రో స్పష్టం చేసింది. చంద్రయాన్-3 తీసుకెళ్లిన ఇల్సా (ILSA) అనే పరికరం సేకరించిన సైస్మిక్ సమాచారాన్ని విశ్లేషించడంతో ఈ విషయాలు బయటికొచ్చాయి. 2023 ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగింది. అక్కడ ఇల్సా సైస్మిక్ సమాచారాన్ని సేకరించడం ప్రారంభించింది.
లోతుగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు
ఇలా ఇచ్చిన ఈ సమాచారంతో నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా నిర్వహించిన అపోలో మిషన్ అనంతరం మళ్లీ చంద్ర ఉపరితల ప్రకంపనాల గురించి లోతుగా అధ్యయనం జరగనుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో పాటు ఇల్సా పరికరం చంద్రునిపై 218 గంటలపాటు పని చేసి 190 గంటల సైస్మిక్ సమాచారాన్ని సేకరించింది. చంద్రునిపై ఉన్న ఉష్ణోగ్రత మార్పులు (మైనస్ 20°C నుంచి ప్లస్ 60°C వరకు) ఈ ప్రకంపనలకు కారణమని ధ్రువీకరించారు.