Explained: ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది.. సక్సెస్ రేటు ఎంత?
శత్రువుతో పోరాటం చేయడం ఒక విషయం,కానీ ఆ పోరాటంలో వచ్చే దెబ్బలను ఎదుర్కొనడం మరో విషయం.ఇది ఎంతో కీలకమైనది. యుద్ధంలో దాడులు చేయడం ఎంత ముఖ్యమో, శత్రువు కొట్టే దెబ్బలను నివారించడం కూడా అంతే ముఖ్యం.ఇదే యుద్ధ వ్యూహం. ఇజ్రాయెల్ ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంది.యుద్ధాలను చూసి,పోరాటాలను నిర్వహించి, స్వయం రక్షణ(సెల్ఫ్ డిఫెన్స్)అనే ముఖ్యమైన సూత్రాన్ని బాగా నేర్చుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.ఆ వ్యవస్థ పేరే 'ఐరన్ డోమ్(Iron Dome)'. ఐరన్ డోమ్ అనేది కేవలం ఇనుప కట్టడం కాదు; ఇది ఒక అధునాతన రక్షణ వ్యవస్థ. ఇది శత్రువు గాలిలో ప్రయోగించే రాకెట్లను గాలిలోనే పేల్చేయడానికి డిజైన్ చేయబడిన అద్భుతమైన డిఫెన్స్ సిస్టమ్.
ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది..
ఐరన్ డోమ్‌ను స్థానికంగా కిప్పాట్ బర్జెల్‌గా పిలుస్తారు. ఇది స్వల్పశ్రేణి ఆయుధాలను అడ్డుకునేందుకు రూపొందించబడింది. ఇందులో రాడార్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీలు ఉన్నాయి. రాడార్ ముందుగా వస్తున్న ముప్పును గుర్తించి, అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనావేస్తుంది. ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు లేకపోతే, రాకెట్‌ను వదిలిస్తుంది; కానీ అది జనావాసాలపై పడ్డప్పుడు, అది రాకెట్‌ను ప్రయోగించి దాన్ని ధ్వంసం చేస్తుంది. ఈ వ్యవస్థను తయారీలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్టా, ఎంప్రెస్ట్ సిస్టమ్, రఫెల్ సంస్థలు ముఖ్య పాత్ర పోషించాయి.
ఎప్పుడు అభివృద్ధి చేశారు.. సక్సెస్ రేటు ఎంత
2006లో హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. అప్పట్లో హెజ్‌బొల్లా వేల రాకెట్లను టెల్‌అవీవ్ పై దిశగా ప్రయోగించింది. ఈ దాడి తీవ్ర ప్రాణ నష్టానికి దారితీసింది. దాంతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ అభివృద్ధిలో అమెరికా పూర్తి మద్దతు అందించింది. 2008లో, టమిర్ క్షిపణులను పరీక్షించడం ప్రారంభమైంది. 2009లో ప్రాథమిక ప్రయోగాలను పూర్తి చేశారు. 2011లో, ఐరన్ డోమ్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.
ఎప్పుడు అభివృద్ధి చేశారు.. సక్సెస్ రేటు ఎంత
ఈ వ్యవస్థ సక్సెస్ రేటు 90శాతానికి పైగా ఉంది.ఇది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలలో ఒక అద్భుతం. అక్టోబర్ 7న హమాస్ దాడిలో,ఐరన్ డోమ్ వేల రాకెట్లను అడ్డుకుంది. అయితే కొన్ని దీని బారి నుంచి తప్పించుకొని ఇజ్రాయెల్‌లో ప్రాణ నష్టానికి కారణమయ్యింది.ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి సుమారు 50,000 డాలర్లు ఖర్చవుతాయని అంచనా. దూసుకొచ్చే ప్రతి ముప్పును నిష్క్రియం చేయడానికి ఐరన్ డోమ్ రెండు క్షిపణులను ప్రయోగిస్తుంది. ప్రస్తుతానికి,ఇజ్రాయెల్ వద్ద 10ఐరన్ డోమ్ బ్యాటరీలు ఉన్నాయని రేథియాన్ అంచనావేసింది. ఇవి వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్పిడి చేయవచ్చు. 2020లో,అమెరికాకు రెండు బ్యాటరీలను ఎగుమతి చేశారు. మారుతున్న పరిస్థితులు,శత్రుదేశాల సామర్థ్యం పెరుగుతున్న నేపథ్యంలో,ఇజ్రాయిల్ ఎప్పటికప్పుడు ఐరన్ డోం వ్యవస్థను నవీకరించుకుంటూ వస్తోంది.
రెండు భాగాల ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ
ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థలో రెండు ప్రధాన రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. డేవిడ్ స్లింగ్ క్షిపణి వ్యవస్థ, 'ఆరో' వ్యవస్థ. డేవిడ్ స్లింగ్ క్షిపణి వ్యవస్థను పూర్వంలో 'మ్యాజిక్ వాండ్' అని కూడా పిలిచేవారు. ఇది తక్కువ ఎత్తులో వచ్చే బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి రూపొందించబడింది. 'ఆరో' వ్యవస్థ కూడా ఆంటి బాలిస్టిక్ మిసైల్ వ్యవస్థగా ఉంది, ఇది హైపర్ సోనిక్ ఆరో ఆంటి మిసైల్ ఇంటర్ సెప్టర్లను కలిగి ఉంది.
ఆరో వ్యవస్థలో ముఖ్యమైన విభాగాలు
క్షిపణుల ఇంటర్ సెప్టర్ వ్యవస్థ: ఎల్టా ఈఎల్/ఎం-2080 గ్రీన్ పైన్. హెచ్చరిక వ్యవస్థ: శత్రుదేశాల క్షిపణులను పసిగట్టి ముందుగా అప్రమత్తం చేసే 'ఏఈఎస్ఏ రాడార్'. గోల్డెన్ సిట్రాన్ కమాండ్ సెంటర్: అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాల సమాహారం బ్రౌన్ హేజిల్ నట్ లాంచ్ కంట్రోల్ కేంద్రం: ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌కు చెందింది. ఈ వ్యవస్థను ఒక ప్రదేశం నుంచి ముందుగా సిద్ధం చేసిన మరో ప్రదేశానికి తరలించడం కూడా సాధ్యమవుతుంది.
ఆరో వ్యవస్థలో ముఖ్యమైన విభాగాలు
ఇజ్రాయిల్ ఈ వ్యవస్థను ఆరో 1, 2, 3 లుగా అభివృద్ధి చేసింది, అందులో ఆరో-3 అత్యాధునికమైనది. ఇది విస్తృత పరిధి, అత్యంత ఎత్తుల్లో రక్షణను అందించగల ఆంటి సాటిలైట్ ఆయుధ వ్యవస్థను కలిగి ఉంది. డేవిడ్ స్లింగ్, ఆరో వ్యవస్థలతో కూడిన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ శత్రుదేశాలకు చెందిన మధ్య, దీర్ఘ శ్రేణి క్షిపణి దాడులు, రాకెట్లు, డ్రోన్లు, విమానాలు, ఉపగ్రహాలను నిరోధించి నిర్మూలిస్తుంది.