
India Pak War: ఆపరేషన్ సిందూర్ ప్రభావం.. బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై అలజడి
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్‌లో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడికి స్పందనగా భారత్ పెద్ద స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంది.
'ఆపరేషన్ సిందూర్' పేరిట భారత సైన్యం, ఉగ్రవాద స్థావరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యాలయాలు, శిక్షణా శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఈదాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. గురువారం పాకిస్తాన్ భారత్‌పై దాడికి పాల్పడింది. వెంటనే స్పందించిన భారత్, తమ శక్తిని మరోసారి ప్రపంచానికి చూపింది.
లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ వంటి పాక్ ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్ల మోతలు వినిపించాయి. ఈ ఘాటైన ప్రతీకార దాడులతో పాకిస్తాన్ వణికిపోతోంది.
ఇక ఈ పరిణామాలు పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Details
భారత్ దెబ్బతో వణికిపోతున్న పాక్
మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ను తన పెద్దన్నగా భావిస్తూ భారత్‌కు వ్యతిరేకంగా మళ్లింది.
పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అధికారులను బంగ్లాదేశ్‌కు ఆహ్వానిస్తూ, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేసింది.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. భారత్ దెబ్బతో వణికిపోతున్న పాక్ పరిస్థితిని గమనించిన బంగ్లాదేశ్, భారత్‌తో విరోధం పెంచితే తాము ఏమవుతామో అన్న ఆందోళనలో ఉంది.
గతేడాది ఆగస్టులో షేక్ హసీనా భారత్‌కి ఆశ్రయం తీసుకున్న తర్వాత, బంగ్లాదేశ్‌లో హిందువులపై మతోన్మాద దాడులు పెరిగాయి. ఇళ్లు, ఆలయాలు, వ్యాపారాలే లక్ష్యంగా దాడులు జరిగాయి.
భారత్ ఎన్నిసార్లు హెచ్చరించినా యూనస్ ప్రభుత్వం హిందువులపై జరిగే దాడులను నిర్లక్ష్యం చేసింది.
Details
హిందువులపై ప్రభావం చూపే అవకాశం
అయితే ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత బంగ్లాదేశ్ హిందువులపై ప్రభావం చూపుతుందని యూనస్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయం (PHQ) బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా మైనారిటీలకు, ముఖ్యంగా హిందువులకు భద్రత కల్పించాల్సిందిగా పోలీసు శాఖలను ఆదేశించింది.
అల్లర్లను నివారించేందుకు ముందస్తు చర్యలుగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింతగా కట్టుదిట్టం చేయాలని సూచనలు ఇచ్చారు. హింసాత్మక ప్రేరణలు లేకుండా ఉండేందుకు సోషల్ మీడియాపై నిఘా పెట్టారు.
మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ కార్యకలాపాలపైనా నిఘా పెంచారు. హిందువుల భద్రత కోసం పోలీస్ విభాగాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారికంగా ఆదేశాలు ఇచ్చారు.