NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / భూమిపై సూర్యుడి పుట్టుకకంటే ముందే నీరు ఆవిర్భావం
    తదుపరి వార్తా కథనం
    భూమిపై సూర్యుడి పుట్టుకకంటే ముందే నీరు ఆవిర్భావం
    భూమిపై సూర్యుడి పుట్టుకకంటే ముందే నీరు ఆవిర్భావం

    భూమిపై సూర్యుడి పుట్టుకకంటే ముందే నీరు ఆవిర్భావం

    వ్రాసిన వారు Stalin
    Mar 10, 2023
    03:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సౌర వ్యవస్థలో సూర్యుడు ఏర్పడక ముందు నుంచి నీటి మూలాలు ఉన్నట్లు అమెరికాలోని నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీలోని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

    భూమి నుంచి 1300కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 'వీ883 ఓరియోనిస్' నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక కొత్త గ్రహంపై వాయు నీటిని శాస్త్రవేత్తలు గుర్తించారు.

    నీటి ఆనవాళ్లను గుర్తించడం వల్ల భూమిపై సూర్యుడి పుట్టుకకు ముందే నీరు ఆవిర్భవిచి ఉండొచ్చని అంచనా వేశారు.

    అటాకామా లార్జ్ మిల్లీమీటర్ అనే అధునాతన టెలిస్కోప్ సాయంతో కొత్త గ్రహంపై పరిశోధనలు చేసినట్లు వెల్లడించారు.

    వీ883 ఓరియోనిస్ నక్షత్రం చుట్టూ ఉన్న గ్రహంపై ఏర్పడే డిస్క్‌లోని నీటి కూర్పును అధ్యయనం చేయడం ద్వారా ఈ ఆవిష్కరణ జరిగిందని వెల్లడించారు.

    ఖగోళ శాస్త్రవేత్తలు

    వీ883 ఓరియోనిస్ నక్షత్రంపై విస్తృత పరిశోధనలు

    వాయువు- ధూళి మేఘం కూలిపోయినప్పుడు దాని మధ్యలో ఒక నక్షత్రం ఏర్పడుతుంది. మేఘంలోని పదార్థం నక్షత్రం చుట్టూ డిస్క్‌ను ఏర్పరుస్తుంది. కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత డిస్క్‌లోని పదార్థం నుంచి తోకచుక్కలు, గ్రహశకలాలు, చివరికి గ్రహాలను ఏర్పడుతాయి.

    వాయువు- ధూళి మేఘం నుంచి నక్షత్రాలకు అక్కడి నుంచి తోక చుక్కలకు, వాటి నుంచి గ్రహాలకు వివిధ రూపాల్లో నీరు చేరుతున్న తీరును వీ883 ఓరియోనిస్ నక్షత్రంపై విస్తృత పరిశోధనలు చేయడం ద్వారా ద్వారా తెలుసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ఆధారంగానే భూమిపై సూర్యుడి కంటే ముందే నీటి ఆవిర్భావం జరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భూమి
    సూర్యుడు

    తాజా

    Shopian: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం జమ్ముకశ్మీర్
    DD Next level: వివాదంలో చిక్కుకున్న ప్రముఖ తమిళ హారర్ కామెడీ చిత్రం 'డీడీ నెక్స్ట్ లెవెల్'  కోలీవుడ్
    operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌లో మా సైనికులు 11 మంది చనిపోయారు: పాక్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Sunil Gavaskar: 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌, విరాట్‌ ఆడరు: సునీల్‌ గావస్కర్‌ సునీల్ గవాస్కర్

    భూమి

    భూమికి దగ్గరగా వస్తున్న వస్తున్న 50,000 సంవత్సరాల తోకచుక్క నాసా
    2022లో అంతరిక్షంలో మూడు ప్రమాదాలను నివారించిన ISS నాసా
    30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్ నాసా
    ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం చంద్రుడు

    సూర్యుడు

    ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చగలిగే అద్భుతమైన పదార్ధం పరిశోధన
    సూర్యుడు ఇచ్చే సంకేతాల ద్వారా శాస్త్రవేత్తలకు సౌర జ్వాల గురించి తెలిసే అవకాశం పరిశోధన
    సూర్యుని నుండి భారీ ముక్క విరగడంతో ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు గ్రహం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025