Page Loader
#deepfake: డీప్‌ఫేక్ వీడియోలు అంటే ఏమిటి? ఎలా తయారు చేస్తారు? నకిలీ వాటిని ఎలా గుర్తించాలి? 
#deepfake: డీప్‌ఫేక్ వీడియోలు అంటే ఏమిటి? ఎలా తయారు చేస్తారు? నకిలీ వాటిని ఎలా గుర్తించాలి?

#deepfake: డీప్‌ఫేక్ వీడియోలు అంటే ఏమిటి? ఎలా తయారు చేస్తారు? నకిలీ వాటిని ఎలా గుర్తించాలి? 

వ్రాసిన వారు Stalin
Nov 08, 2023
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

'Deep fake' అనే పదం గత రెండు రోజులుగా వినిపిస్తున్న పదం. ప్రముఖ నటి రష్మిక మందన్న'డీప్‌ఫేక్' వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ పదంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. వైరల్ అయిన వీడియోలో రష్మిక ఫొటోను మార్ఫింగ్ చేసి, ఆమె ఎక్సోపోజింగ్ చేసినట్లు క్రియేట్ చేశారు. ఫ్యాక్ట్ చెకింగ్ తర్వాత అది 'డీప్‌ఫేక్' వీడియో అని తేలింది. అసలు 'డీప్‌ఫేక్' అంటే ఏమిటి? దాన్ని గుర్తించడం ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం. డీప్‌ఫేక్ వీడియోలు కొత్తవి కావు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా డీప్‌ఫేక్ వీడియోలకు బలైన వారే కావడం గమనార్హం.

డీప్ ఫేక్

డీప్‌ఫేక్‌ అంటే ఏమిటి?

రియల్ వీడియోలో వేరొకరి ముఖాన్ని అమర్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాయంతో డీప్ లెర్నింగ్ అనే ప్రత్యేక మెషీన్ లెర్నింగ్ సాంకేతికతను ఉపయోగించడాన్నే డీప్‌ఫేక్ అంటారు. ఈ పద్ధతిని ఉపయోగించడం ద్వారా, వీడియో, ఫోటో, ఆడియోలో సులభంగా మార్పులు చేయవచ్చు. ఈ సాధనాన్ని ఉపయోగించడం వల్ల ఫేక్ ఏదో, రియల్ ఏదో తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. వాస్తవానికి డీప్‌ఫేక్‌లను ప్రారంభంలో తేలికగా తీసుకున్నారు. కానీ సోషల్ మీడియా విస్తురిస్తున్నా కొద్ది అది చూపించే ప్రభావం పెరిగింది. ఇప్పుడు రాజకీయాల్లో సోషల్ మీడియా కీ రోల్ పోషిస్తున్న నేఫథ్యంలో డీప్‌ఫేక్‌ వీడియో భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇవీ ప్రజలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

డీప్ ఫేక్

మొదటి డీప్‌ఫేక్ వీడియోను ఎవరు చేశారంటే?

వాస్తవానికి డీప్‌ఫేక్ కంటెంట్‌ను మొదటిసారిగా 2014లో సింథటిక్ మీడియా అని పిలిచేవారు. తరువాత, దానికి జనాదరణ పెరగడంతో 2017లో 'రెడ్డిట్' నిర్వహాకులు జెనరేటివ్ అడ్వర్సరియల్ నెట్‌వర్క్స్ (GANs)టెక్నిక్‌ని ఉపయోగించి మొదటిసారి డీప్‌ఫేక్ వీడియోని సృష్టించారు. ఈ క్రమంలో అశ్లీల వీడియోలకు సెలబ్రెటీల ముఖాలు పెట్టడంతో దానికి మంచి ఆదరణ దక్కింది. 2018నాటికి ఈ సాంకేతికత మరింత అభివృద్ధి చేశారు. దీనికి ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ తోడవడంతో మరింత పవర్ ఫుల్‌గా మారింది. డీప్‌ఫేక్ వీడియోలను ఎన్‌కోడర్, డీకోడర్ నెట్‌వర్క్‌ల కలయికను ఉపయోగించి తయారు చేస్తారు. నకిలీ వీడియోలోని ప్రతి ఫ్రేమ్‌ ఒరిజినల్ వీడియోలో ఉండేలా ఎన్‌కోడర్, డీకోడర్ నెట్‌వర్క్‌లు ఫిల్టర్ చేస్తాయి. అందుకే డీప్‌ఫేక్ వీడియోలు అంత స్పష్టంగా ఒరిజినల్ వీడియో మాదిరిగానే కనపడుతుంది.

డీప్ ఫేక్

ఫేక్, ఒరిజినల్ వీడియోలను ఎలా గుర్తించవచ్చు?

డీప్‌ఫేక్ వీడియోలను నిశితంగా పరిశీలించడం ద్వారా వాటిని గుర్తించవచ్చు అని చెబుతున్నారు ఏఐ నిపుణులు. టెక్నాలజీని ఉపయోగించి నకిలీ వీడియోలను సృష్టించడం చాలా తేలికైన పని. కానీ, ముఖ కవలికలు, చర్మం రంగు, లైటింగ్‌ను ఒరిజినల్ వీడియోలో ఉన్న మాదిరిగా డీప్‌ఫేక్ మేకర్స్ చేయలేరు. కంటి రెప్పల కదలికలను కూడా ద్వారా డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించవచ్చని నిపుణులు అంటున్నారు. డీప్‌ఫేక్ వీడియోలను ఏఐ సాయంతో చేస్తారు. ఈ క్రమంలో AIద్వారా చేసిన వీడియోల్లో లిప్ సింకింగ్ ఎర్రర్‌లు స్పష్టంగా కనిపిస్తాయి. వీడియోను ఎవరు షేర్ చేస్తున్నారా? పేరున్న వ్యక్తి చేస్తున్నారా? లేక అనామక ఖాతా నుంచి షేర్ చేశారా? అనేది గమనించాలి.