హకీ ప్రపంచ కప్: వార్తలు

31 Jan 2023

హకీ

వరల్డ్ కప్ టీమిండియా ఓటమి కారణంగా టీమ్ కోచ్ రాజీనామా

భారత హాకీ జట్టు కోచ్ గ్రహం రీడ్ రాజీనామా చేశారు. ఇటీవల ఒడిశాలో జరిగిన హాకీ ప్రపంచ కప్ లో టీమిండియా వైఫల్యం కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రీడ్‌తో పాటు కోచ్ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్ డేవిడ్ పెంబర్టన్ సైతం తమ పదవులకు రాజీనామా చేశారు.

30 Jan 2023

హకీ

జర్మనీదే హాకీ ప్రపంచ కప్

పురుషుల హాకీ ప్రపంచకప్ 2023 విజేతగా జర్మనీ నిలిచింది. ఆదివారం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో బెల్జియంను జర్మనీ ఓడించింది. జర్మనీ 5-4 తేడాతో బెల్జియంను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

28 Jan 2023

ప్రపంచం

ఫైనల్‌లో తలపడనున్న బెల్జియం, జర్మనీ

పురుషుల హాకీ వరల్డ్‌కప్ ఫైనల్స్ లో బెల్జియం, జర్మనీ ప్రవేశించాయి. సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై జర్మనీ విజయం సాధించి, ఫైనల్స్ కి చేరకుంది.

25 Jan 2023

ప్రపంచం

2-0 తేడాతో న్యూజిలాండ్‌పై బెల్జియం విజయం

ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్‌లో మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం విజయం సాధించింది. భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ పై 2-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు బెల్జియం దూసుకెళ్లింది.

హాకీ వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ

హాకీ వరల్డ్ కప్ టీమిండియా పోరాటం ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా వరల్డ్‌కప్ నుంచి ఇంటిదారి పట్టింది.

20 Jan 2023

ప్రపంచం

4-2 తేడాతో వేల్స్‌పై భారత్ ఘన విజయం

కళింగ స్టేడియంలో గురువారం జరిగిన హాకీ ప్రపంచకప్ 2023 ఫైనల్స్ లో భారత పురుషుల జట్టు 4-2తో వేల్స్‌ను ఓడించింది. భారత్ తరఫున షంషేర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ చేయగా, వేల్స్‌కు చెందిన ఫర్లాంగ్ గారెత్, డ్రేపర్ జాకబ్ గోల్స్ చేశారు.