Page Loader
Coriander: కొత్తిమీరను ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగి లాభాలు ఇవే 
Coriander: కొత్తిమీరను ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగి లాభాలు ఇవే

Coriander: కొత్తిమీరను ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగి లాభాలు ఇవే 

వ్రాసిన వారు Stalin
Nov 13, 2023
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్తిమీరను వంటకాల్లో ఉపయోగించే ఆయుర్వేద మూలికగా చెప్పుకుంటారు. కొత్తమీర వంటకానికి రుచి ఇవ్వడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే ప్రతి రోజు కూరల్లో వినియోగించే కొత్తిమీరను మార్కెట్‌కు వెళ్లి తెచ్చుకోవడం కంటే ఇంట్లో పెంచకోవడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొత్తమీరను ఇంట్లో పెంచకోవడం వల్ల వంటలోకి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కట్ చేసి ఉపయోగించవచ్చు. దీని వల్ల వంటకానికి అదనపు రుచి వస్తుంది. ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర రుచికి, ఫ్రెష్‌గా కట్ చేసిన దానికి రుచిలో చాలా తేడా ఉంటుంది. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఫ్రెష్‌గా ఉండే కొత్తిమీరలోనే ఎక్కువ ఉంటాయి.

కొత్తిమీర

డబ్బులు, సమయం ఆదా

2. కొత్తమీర అనేది ప్రతి రోజు వంటల్లో వినియోగించే వస్తువు. కాబట్టి దీన్ని ఇంట్లోనే పెంచుకోవడం వల్ల డబ్బులు ఆదా అవడంతో పాటు, దీని ఒక్కదాని కోసమే మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది. 3. మార్కెట్‌లో కొన్న కొత్తమీరను కచ్చితంగా ఫెస్టిసైడ్స్ ఉపయోగించి పండించి ఉంటారు. మనం ఇంట్లోనే పెంచుకోవడం వల్ల నేచురల్‌గా పండించుకునే అవకాశం ఉంటుంది. 4. మార్కెట్‌లో కొత్తమీరను మనకు నచ్చింది కొనడానికి అవకాశం ఉండదు. అది సరిగా ఎదిగి ఉండకపోవచ్చు. దాన్ని కూరల్లో వేయడం వల్ల మన వంటకాలు అనుకున్నంత రుచిని పొందలేవు. అందుకే ఇంట్లోనే పెంచుకోవడం వల్ల.. మంచి సువాసనను వెదజల్లే, ఎదిగిన ఆకులను కోసి, కూరల్లో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.