LOADING...
Bajaj Chetak 3503: ఓలా, టీవీఎస్‌కు గట్టి పోటీగా బజాజ్‌ చేతక్‌ 3503.. ధర, ఫీచర్లు ఇవే!
ఓలా, టీవీఎస్‌కు గట్టి పోటీగా బజాజ్‌ చేతక్‌ 3503.. ధర, ఫీచర్లు ఇవే!

Bajaj Chetak 3503: ఓలా, టీవీఎస్‌కు గట్టి పోటీగా బజాజ్‌ చేతక్‌ 3503.. ధర, ఫీచర్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 29, 2025
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల శ్రేణిలో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. చేతక్‌ 35 సిరీస్‌లో 3503 పేరుతో ఈ కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. దీని ధరను ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.1.10 లక్షలుగా నిర్ణయించింది. ఇది ఇప్పటి వరకూ 35 సిరీస్‌లో అత్యంత అందుబాటులో ఉన్న మోడల్‌గా నిలిచింది. ఇప్పటికే బజాజ్‌ 35 సిరీస్‌లో 3501 (టాప్ మోడల్‌)ను రూ.1.30 లక్షలకు, 3502 మోడల్‌ను రూ.1.22 లక్షలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వాటి సరసన తాజాగా 3503ను లాంచ్ చేయడం గమనార్హం.

Details

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్లు

ఈ కొత్త మోడల్‌ ప్రధానంగా టీవీఎస్‌ ఐక్యూబ్‌ 3.4, ఓలా ఎస్‌1ఎక్స్‌+, ఏథర్‌ రిజ్తా ఎస్‌ వంటి మోడళ్లకు బలమైన పోటీగా నిలవనుంది. చేతక్‌ 3503 లో అదే సిరీస్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే ఆకర్షణీయమైన డిజైన్‌ను కొనసాగించారు. ఇందులో 3.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇక టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు. 35 లీటర్ల సీట్ స్టోరేజ్ కెపాసిటీ ఉండడం వినియోగదారులకు మరింత అనుకూలతను అందిస్తుంది. ఈస్కూటర్‌లో హిల్ హోల్డ్ అసిస్ట్, కలర్ LCD క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, కాల్స్ మేనేజ్‌మెంట్, రైడ్ మోడ్స్(ఎకో, స్పోర్ట్స్), ఎల్ఈడి హెడ్‌లైట్స్, మెటల్ బాడీ వంటి ఫీచర్లను అందించారు.