Page Loader
ICC Rankings : ఐసీసీ ర్యాకింగ్స్ జాబితా రిలీజ్.. నెంబర్ వన్ బ్యాటర్‌గా గిల్, బౌలర్‌గా మహారాజ్
ఐసీసీ ర్యాకింగ్స్ జాబితా రిలీజ్.. నెంబర్ వన్ బ్యాటర్‌గా గిల్, బౌలర్‌గా మహారాజ్

ICC Rankings : ఐసీసీ ర్యాకింగ్స్ జాబితా రిలీజ్.. నెంబర్ వన్ బ్యాటర్‌గా గిల్, బౌలర్‌గా మహారాజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2023
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డేల్లో క్రికెటర్ల తాజా ర్యాంకింగ్స్‌ను ఐసీసీ ఇవాళ ప్రకటించింది. వన్డేల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా టీమిండియా బ్యాటర్ శుభమన్ గిల్, బౌలర్‌గా సౌతాఫ్రికా స్పిన్నర్ మహారాజ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. గత కొన్ని వారాల నుంచి బౌలర్ల స్థానం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. నవంబర్ 1న షాహీన్ అఫ్రిది అగ్రస్థానంలో ఉండగా, నవంబర్ 8వ తేదీన ఆ స్థానాన్ని మహ్మద్ సిరాజ్ అక్రమించాడు. తాజాగా ఇవాళ రిలీజ్ చేసిన లిస్టులో మహారాజ్ టాప్ బౌలర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. మహారాజ్ గత మూడు మ్యాచుల్లో ఏడు వికెట్లు తీయగా, సిరాజ్ మూడు మ్యాచుల్లో ఆరు వికెట్లను పడగొట్టారు. ఇక ఇద్దరి మధ్య మూడు రేటింగ్ పాయింట్స్ మాత్రమే తేడా ఉంది.

Details

అల్ రౌండర్ల జాబితాలో షకీబ్ అల్ హసన్ అగ్రస్థానం

బౌలర్ల జాబితాలో టాప్-5లో జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ నిలిచాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో శుభమన్ గిల్ మొదటి స్థానంలో నిలిచాడు. బాబర్ ఆజమ్ ను వెనక్కి నెట్టి గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరసుగా నాలుగు, ఐదో స్థానంలో ఉన్నాడు. అల్ రౌండర్ల విభాగంలో బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. భారత తరుపున రవీంద్ర జడేజా 10వ స్థానాన్ని అక్రమించాడు.