LOADING...
Bihar: బిహార్ ఎన్నికల ఓటరు జాబితాలో ఇద్దరు పాకిస్థానీలు.. కేంద్ర హోంమంత్రి చర్యలు
బిహార్ ఎన్నికల ఓటరు జాబితాలో ఇద్దరు పాకిస్థానీలు.. కేంద్ర హోంమంత్రి చర్యలు

Bihar: బిహార్ ఎన్నికల ఓటరు జాబితాలో ఇద్దరు పాకిస్థానీలు.. కేంద్ర హోంమంత్రి చర్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2025
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజకీయ వేదికపై బిహార్‌ ఎన్నికలు తాజాగా ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నట్టు కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించినప్పటికీ, ఎన్నికల సంఘం ప్రతీది సవ్యంగా ఉన్నాయని స్పష్టంచేసింది. అయితే బిహార్‌లో ఇద్దరు పాకిస్థానీ మహిళలకు ఓటరు కార్డులు జారీ అయిన ఘటన కొత్త చర్చకు దారితీసింది. కేంద్ర హోంశాఖ వెంటనే యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసి, వీరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని చర్యలు చేపట్టింది. ఇమ్రానా ఖానమ్‌ అలియాస్‌ ఇమ్రానా ఖాటూన్‌, ఫిర్దోషియా ఖానమ్‌ అనే మహిళలకు ఈ ఓటరు కార్డులు ఇటీవల జారీ అయ్యాయి.

Details

ఆ ఇద్దరి మహిళలకు నోటీసులు

వివరణల ప్రకారం, ఫిర్దోషియా ఖానమ్‌ 1956లో మూడు నెలల వీసాతో, ఇమ్రానా ఖానమ్‌ మూడు సంవత్సరాల వీసాతో భారత్‌లోకి వచ్చి భాగల్పూర్‌ జిల్లా భికన్‌పూర్‌లో స్థిరపడ్డారు. వీరి ఓటరు కార్డుల జారీ గుర్తించిన కేంద్రం వెంటనే విచారణ ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్‌ నావల్‌ కిశోర్‌ చౌదరీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇద్దరు మహిళలకు నోటీసులు పంపి సమస్య పరిష్కరించనున్నట్లు అధికారులు ప్రకటించారు