Pan Card 2.0: పాన్ 2.0 ప్రారంభం.. QR కోడ్‌తో కొత్త ఫీచర్లు!
పాన్ కార్డు 2.0ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం దీన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ పాన్ 2.0 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పాన్ కార్డు అన్ని ప్రభుత్వ ఏజెన్సీల డిజిటల్ సిస్టమ్‌లలో 'శాశ్వత ఖాతా సంఖ్య'ను 'కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్'గా ఉపయోగించేందుకు మార్పులు చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌కు అనుగుణంగా ఉండగా, పాన్ కార్డు సామర్థ్యాన్ని మరింత పెంచడానికి QR కోడ్ ద్వారా ఉచిత అప్‌గ్రేడ్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పేపర్‌లెస్ ప్రక్రియలను ప్రవేశపెట్టి, తక్షణ డేటా ప్రామాణీకరణను సులభతరం చేస్తుంది.
PAN 2.0 ప్రాజెక్ట్ ప్రయోజనాలు
1)పాన్, టాన్ సేవలను సమగ్రంగా ఏకీకృతం చేస్తుంది. 2) పాన్ డేటా వాల్ట్ ద్వారా వినియోగదారుల డేటా భద్రత పెరుగుతుంది. 3) పేపర్‌లెస్, పర్యావరణ అనుకూల ప్రక్రియలు, మాన్యువల్ తప్పులను తగ్గించడం. 4) పాన్ కార్డులో QR కోడ్ ఉంటే, అది స్కానింగ్ ద్వారా ఆన్లైన్ కార్యాచరణను ప్రారంభిస్తుంది. 5) ఈ మార్పు పూర్తిగా డిజిటల్, సురక్షితమైన ఆర్థిక వ్యవస్థ వైపు కీలక అడుగు. ఈ ప్రాజెక్ట్ భారతదేశాన్ని డిజిటల్‌గా శక్తివంతం చేస్తుంది, పన్ను చెల్లింపుదారుల కోసం మరింత సమర్థవంతమైన, సురక్షితమైన సేవలను అందించనుంది.