Infinix: మొబైల్ టెక్నోలజీలో కొత్త ట్రెండ్.. మినీ ట్రై-ఫోల్డబుల్ ఫోన్‌తో ఇన్ఫినిక్స్ సెన్సేషన్!
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ మార్కెట్లో ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్ల ట్రెండ్ జోరుగా సాగుతోంది.
పలు కంపెనీలు ఫ్లిప్, ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేస్తున్న వేళ, చైనా టెక్ దిగ్గజం 'హువావే' ట్రై-ఫోల్డబుల్ (మూడు మడతల) ఫోన్‌ను తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది.
అంతేకాదు ఈ ఫోన్‌ను గ్లోబల్‌గా కూడా విడుదల చేసింది. ఇదే తరుణంలో మరో చైనా మొబైల్ తయారీ సంస్థ 'ఇన్ఫినిక్స్' మరో అడుగు ముందుకేసింది.
ఈ కంపెనీ మినీ ట్రై-ఫోల్డబుల్ కాన్సెప్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది.
ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. త్వరలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025 ఈవెంట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఫోన్ లుక్‌ను రివీల్ చేసింది.
Details
ఫీచర్ల గురించి వెల్లడించని సంస్థ
అయితే, దీని ఫీచర్ల వివరాలను వెల్లడించలేదు. ఈ ఫోన్‌ను అవుట్‌వర్డ్ ఫోల్డింగ్ డిజైన్‌తో రూపొందించనుంది.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 'హువావే మేట్ ఎక్స్ట్రీ' ట్రిపుల్-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే, ఇది కొంత భిన్నంగా ఉండనుంది.
హువావే ఫోన్‌ను అడ్డంగా మూడు మడతలు పెట్టే విధంగా డిజైన్ చేశారు. ఫోల్డ్ చేసిన తర్వాత అది సాధారణ మొబైల్ ఆకారంలోకి మారుతుంది.
అదేవిధంగా ఇన్ఫినిక్స్ తీసుకురానున్న కొత్త ట్రై-ఫోల్డబుల్ మొబైల్‌ను నిలువుగా మడతపెట్టేలా రూపొందిస్తున్నారు. ఈ మినీ ఫోల్డబుల్ ఫోన్ క్యారీ చేసేందుకు సులభంగా ఉండనుంది.
దీనిని హ్యాండ్స్‌ఫ్రీ డిస్ప్లేలా లేదా కాంపాక్ట్ కెమెరాగా వాడుకునే అవకాశముంది. ఈ సరికొత్త ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025లో వెల్లడి కావచ్చని భావిస్తున్నారు.