Ram Charan : దిల్లీ టూర్ ప్లాన్ చేసిన రామ్ చరణ్.. కారణమిదే?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది రామ్ చరణ్‌కు తగేమ్ ఛేంజర్ చిత్రం నిరాశపరిచినా, ఈసారి మాసివ్ హిట్ కొట్టాలని ఆయన దృఢంగా నిర్ణయించుకున్నారు. అందుకే తన తదుపరి చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో తెరకెక్కిస్తున్నారు.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ రూపొందుతోంది. రామ్ చరణ్‌కు జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ చిత్ర షూటింగ్ గతేడాది నవంబరులో కర్ణాటక మైసూరులో ప్రారంభమైంది. అనంతరం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్య సెకండ్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.
ప్రస్తుతం యూనిట్ బ్రేక్ తీసుకుని, తదుపరి షెడ్యూల్ కోసం సన్నద్ధమవుతోంది. త్వరలో దిల్లీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
Details
రామ్ చరణ్ బర్తడే సందర్బంగా టీజర్ విడుదల
ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ కూడా పాల్గొంటారు. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే మూడు పాటలు కంపోజ్ చేశారు, విన్నవారు అవి అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమా మ్యూజిక్ కూడా బిగ్ హిట్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా 'RC 16' టైటిల్ టీజర్ విడుదల చేసే అవకాశం ఉంది.
అంతేకాదు, అదేరోజు సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసే అవకాశముంది. అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.