
Traffic Restrictions: నేడు సన్‌రైజర్స్ vs ముంబై.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇవాళ జరిగే ఐపీఎల్ మ్యాచ్ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు.
బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన వెల్లడించారు.
ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను ఏర్పాటు చేశారు.
Details
ట్రాఫిక్ నియమాలు పాటించాలి
చెంగిచర్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను హెచ్ఎండీఏ భగాయత్ నుంచి నాగోల్ వైపుగా మళ్లించనున్నారు.
అలాగే ఎల్బీనగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద నుంచి హెచ్ఎండీఏ లేఅవుట్ వైపుగా మళ్లిస్తారు.
తార్నాక నుంచి వచ్చే వాహనాలను హబ్సిగూడ నుంచి చర్లపల్లి వైపుగా మళ్లిస్తారు. రామంతాపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ నంబర్ 8 నుంచి హబ్సిగూడ వైపు మళ్లించనున్నాయని పోలీస్ కమిషనర్ వివరించారు.
వాహనదారులు ఈ మార్గాల్లో ప్రయాణించే సమయంలో ఆల్టర్నేటివ్ రూట్లను అనుసరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.