మంచెస్టర్ సిటీ: వార్తలు

మేనేజర్ ఆఫ్ ది సీజన్‌ అవార్డును గెలుచుకున్న పెప్ గార్డియోలా

మాంచెస్టర్ సిటీ మేనేజర్ పెప్ గార్డియోలా అరుదైన ఘనతను సాధించాడు. ప్రీమియర్ లీగ్ 2022-23 మేనేజర్ ఆఫ్ ది సీజన్ ను అవార్డును పెప్ గార్డియోలా గెలుచుకున్నాడు.

సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన మాంచెస్టర్ సిటీ

ఛాంపియన్ లీగ్‌లో మాంచెస్టర్ సిటీ సత్తా చాటింది. సెమీఫైనల్‌లో బేయర్న్ మ్యూనిచ్‌పై 4-1తేడాతో మాంచెస్టర్ సిటీ గెలుపొందింది. మరో మ్యాచ్‌లో బెన్‌ఫికాపై 5-3తో ఇంటర్ విజయం సాధించింది. సెమీ ఫైనల్ లో 25వ టైటిల్ కోసం రియల్ మాడ్రిడ్ తో మాంచెస్టర్ సిటీ తలపడనుంది.

మాంచెస్టర్ సిటీ చేతిలో బేయర్న్ మ్యూనిచ్ చిత్తు

UEFA ఛాంపియన్స్ లీగ్ 2022-23 సీజన్ క్వార్టర్-ఫైనల్‌లో మాంచెస్టర్ సిటీ, బేయర్న్ మ్యూనిచ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బేయర్న్ మ్యూనిచ్ ను 3-0తో మాంచెస్టర్ సిటీ చిత్తు చేసింది. రోడ్రి, బెర్నార్డో, సిల్వా, ఎర్లింగ్ హాలాండ్ సిటీ తరుపున గోల్స్ చేసి సత్తా చాటాడు.

రికార్డు బద్దలు కొట్టిన ఎర్లింగ్ హాలాండ్

ఎతిహాద్‌లో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్ రౌండ్ 16 సెకండ్-లెగ్ టైలో మాంచెస్టర్ సిటీ సత్తా చాటింది. లీప్‌జిగ్‌ను 7-0తేడాతో మాంచెస్టర్ సిటీ చిత్తు చేసింది. దీంతో సిటీ క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించింది.

బార్సిలోనాను ఓడించిన మాంచెస్టర్ యునైటెడ్

UEFA యూరోపా లీగ్ ప్లే ఆప్ టై లో బార్సిలోనాపై మాంచెస్టర్ యునైటెడ్ విజయం సాధించింది. 2-1 తేడాతో బోర్సాలోనాను మంచెస్టర్ యునైటెడ్ ఓడించింది. మొదటి లెగ్‌లో 2-2తో డ్రా అయిన తర్వాత, రాబర్ట్ లెవాండోస్కీ పెనాల్టీ గోల్ చేయడంతో బార్సిలోనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

ఛాంపియన్స్ లీగ్‌లో ఓడిన మాంచెస్టర్ సిటీ

UEFA ఛాంపియన్స్ లీగ్‌లో మాంచెస్టర్ ఓటమిపాలైంది. లిప్ జిగ్ చేతిలో మాంచెస్టర్ సిటీ ఓడిపోయింది. మాంచెస్టర్ సిటీ తరుపున రియాద్ మహ్రెజ్ మొదటి గోల్ చేసి సిటీకి ఆధిక్యాన్ని అందించింది. లీప్‌జిగ్ డిఫెండర్ జోస్కో గ్వార్డియోల్ 70వ నిమిషంలో ఈక్వెలైజర్ గోల్ చేశాడు. సిటీ వారి చివరి రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.

బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ డ్రా

క్యాంప్ నౌలో జరిగిన UEFA యూరోపా లీగ్ 2022-23 నాకౌట్ రౌండ్ ఫ్లేఆప్‌ల మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మొదటి ఫస్ట్‌-లెగ్ టైంలో బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్ తలపడ్డాయి. అయితే మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది.

ప్రీమియర్ లీగ్‌లో ఆర్సెనల్‌ను ఓడించిన మాంచెస్టర్ సిటీ

ప్రీమియర్ లీగ్ 2023లో మాంచెస్టర్ సిటీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. మాంచెస్టర్ సిటీ చేతిలో ఆర్సెనల్ ఓటమిపాలైంది. 3-1తో తేడాతో ఆర్సెనల్‌పై మాంచెస్టర్ సిటీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్డీ న్కేటియాతో ఎడెర్సన్ గొడవపడటంతో ఆర్సెనల్‌కు పెనాల్టీ లభించింది. అయితే సిటీకి వీఏఆర్ ద్వారా పెనాల్టీ లభించింది.

మాంచెస్టర్ సిటీ చేతిలో ఆస్టన్ విల్లా ఓటమి

ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఆదివారం మాంచెస్టర్ సిటీ, ఆస్టన్ విల్లా తలపడ్డాయి. ఈ పోరులో మాంచెస్టర్ సిటీ, ఆస్టన్ విల్లాను 3-1తో తేడాతో ఓడించింది. రోడ్రి, ఐకే గుండోగన్, రియాద్ మహ్రెజ్ హాఫ్ టైమ్‌లో సిటీకి 3-0 ఆధిక్యాన్ని అందించారు. దీంతో రెండో అర్ధభాగంలో విల్లా తరఫున ఓలీ వాట్కిన్స్ ఒక గోల్ మాత్రమే చేశాడు.

మాంచెస్టర్ సిటీని 1-0తో ఓడించిన టోటెన్‌హామ్

ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఆదివారం మంచెస్టర్ సిటీ, టోటెన్ హామ్ తలపడ్డాయి. ఈ కీలక పోరులో మంచెస్టర్ సిటీని టోటెన్ హామ్ 1-0తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో హ్యారికేన్ అరుదైన ఘనతను సాధించాడు.

న్యూకాజిల్‌తో పోరుకు సిద్ధమైన మాంచెస్టర్ యునైటెడ్

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన కారబావో కప్ సెమీ-ఫైనల్ సెకండ్ మ్యాచ్ లో నాటింగ్ హామ్ పై 2-0 తేడాతో మాంచెస్టర్ యునైటెడ్ గెలుపొందిన విషయం తెలిసిందే. రెడ్ డెవిల్స్ 5-0తేడాతో గెలుపొందడంతో న్యూకాజిల్‌తో యునైటెడ్‌ తలపడనుంది.

బేయర్న్ తరుపున బరిలోకి దిగనున్న సైన్ జోవో

బేయర్న్ తరుపున బరిలోకి సైన్ జోవో క్యాన్సెలో దిగనున్నారు. దీని కోసం ఆయన కీలక ఒప్పందంపై సంతకం చేశారు. మాంచెస్టర్ సిటీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. బేయర్న్ తరుపున ఎంతోమంది గొప్ప ఆటగాళ్లు బరిలోకి దిగారు.

క్రిస్టియన్ ఎరిక్సన్ గాయం కారణంగా టోర్నికి దూరం

మిడ్ ఫీల్డర్ క్రిస్టియన్ ఎరిక్సన్ గాయంపై మాంచెస్టర్ యునైటెడ్ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ చివరి వరకు లేదా మే టోర్నికి దూరంగా ఉంటాడని తెలిపింది. యునైటెడ్ FA కప్ వర్సెస్ రీడింగ్ మ్యాచ్ సందర్భంగా ఎరిక్సన్ చీలమండ గాయంతో బాధపడిన విషయం తెలిసిందే.

డ్రాగా ముగిసిన FA కప్ 5వ రౌండ్

FA కప్ 2022-23 5వ రౌండ్‌ డ్రాగా ముగియడంతో ఛాంపియన్‌షిప్ జట్టు అయిన మాంచెస్టర్ సిటీ, బ్రిస్టల్ సిటీతో తలపడనుంది. మాంచెస్టర్ యునైటెడ్, సోమవారం జరిగిన 4వ రౌండ్ పోరులో డెర్బీ కౌంటీని 2-0తో ఓడించింది. దీంతో వెస్ట్ హామ్ యునైటెడ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. సౌతాంప్టన్, బ్రైటన్, స్పర్స్, లీడ్స్, లీసెస్టర్ సిటీ ఇంకా రేసులో ఉన్నాయి.

ఆర్సెనల్‌ను ఓడించిన మాంచెస్టర్ సిటీ

మాంచెస్టర్ సిటీ చేతిలో ఆర్సెనల్ జట్టు పరాజయం పాలైంది. నాల్గవ రౌండ్ లో 1-0తో ఆర్సెనల్ ను మాంచెస్టర్ సిటీ ఓడించింది. సిటీ తరుపున నాథన్ అకే ఒకే ఒక గోల్ చేయడం గమనార్హం.

మాంచెస్టర్ యునైటెడ్‌పై ఆర్సెనల్ విజయం

ప్రీమియర్ లీగ్ 2022-23లో ఆదివారం ఎమిరేట్స్‌లో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్‌ను ఆర్సెనల్ అధిగమించింది. మాంచెస్టర్ యునైటెడ్ పై 3-2 తేడాతో ఆర్సెనల్ విజయం సాధించింది.