
Delhi: ఫ్యూయెల్ వాహనాలకు ఢిల్లీ గుడ్‌బై చెబుతుందా? త్వరలోనే బ్యాన్ మోడ్ ఆన్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీ తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో త్వరలోనే 'ఈవీ పాలసీ 2.0'ను అమలు చేయడానికి సిద్ధమవుతోంది.
ఈ కొత్త పాలసీకి కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాహనాలపై పూర్తిస్థాయి నిషేధం విధించే దిశగా అడుగులు వేయనున్నట్లు సమాచారం.
ఈవీ పాలసీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత, 2025 నుంచి దశల వారీగా ఫ్యూయెల్ ఆధారిత వాహనాలను తొలగించేందుకు చర్యలు తీసుకోనున్నారు. వచ్చే ఏడాదిలో నుంచే ఈ నిషేధం ప్రారంభమయ్యే అవకాశముంది.
Details
ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే రెన్యువల్ అనుమతి
2027 డిసెంబర్ 31 నాటికి ఢిల్లీలో నడిచే వాహనాల్లో 100% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలన్నది ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.
ఈ దిశగా సీఎన్జీ బైకులు, ఆటోలను కూడా నిషేధించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక కీలక ప్రకటనను ఢిల్లీ ప్రభుత్వం చేసింది.
2025 ఆగస్టు 15 నుంచి కొత్త సీఎన్జీ ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్లను, రెన్యువల్స్‌ను అనుమతించమని స్పష్టంగా తెలిపింది.
ఇకపై కేవలం ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే రిజిస్ట్రేషన్, రెన్యువల్ అవకాశముంటుంది. తరువాతి దశలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాహనాలను పూర్తిగా తొలగించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
Details
త్వరలో 'ఈవీ పాలసీ 2.0' విధానం
ఈ విధంగా ఆటోలు, బైకులతో పాటు, చెత్త సేకరణ వాహనాలు, నగర బస్సులు తదితర రవాణా సాధనాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలన్నదే అధికారుల ఉద్దేశ్యం.
మార్చి 31తో ముగిసిన ఇప్పటికే అమల్లో ఉన్న ఈవీ పాలసీని మరో 15 రోజుల పాటు పొడిగించారు.
అనంతరం 'ఈవీ పాలసీ 2.0'ను అధికారికంగా అమలులోకి తీసుకురానున్నారు.
ఈ కొత్త పాలసీ ప్రధాన లక్ష్యం కాలుష్యకర ఫ్యూయెల్ వాహనాలను పూర్తిగా తొలగించి, వాటిని పర్యావరణ హితం కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయడమని ప్రభుత్వం స్పష్టం చేసింది