
DS 2 : కుబేర తర్వాత మరో సర్ప్రైజ్.. మరోసారి జతకట్టనున్న శేఖర్-ధనుష్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'కుబేర'కు మంచి బజ్ ఏర్పడింది.
ఈ చిత్రంలో కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కథానాయకుడు ధనుష్ తన కెరీర్లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నాడు.
శేఖర్ కమ్ముల స్టైల్‌కి ధనుష్ నేచురల్ యాక్టింగ్ తోడైతే.. ఆ కాంబో నుంచి అద్భుతం రానుందని అంచనాలు ఏర్పడ్డాయి.
'కుబేర' చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Details
జూన్ 20న కుబేర రిలీజ్
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 20న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా విడుదలకు ముందే ధనుష్ మరోసారి శేఖర్ కమ్ములతో జత కట్టనున్నాడు. 'కుబేర' షూటింగ్ సమయంలో శేఖర్ వినిపించిన మరో కథకు ధనుష్ ఓకే చెప్పాడట.
ఇదే బ్యానర్ అయిన ఏషియన్ సినిమాస్‌లోనే ఈ ప్రాజెక్ట్ కూడా రాబోతోందని సమాచారం.
ఒక సినిమా విడుదల కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమంటే.. శేఖర్ కమ్ముల మీద ధనుష్‌కి ఉన్న నమ్మకం, ఆయన వర్క్ మీద ఉన్న గౌరవం అర్థమవుతోంది.
టాలీవుడ్ వర్గాల్లో ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.