NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర పాలసీలతో నూతనోత్తేజం.. విడుదలకు సిద్ధంగా ఐటీ, టెక్స్‌టైల్, డ్రోన్‌ పాలసీలు
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర పాలసీలతో నూతనోత్తేజం.. విడుదలకు సిద్ధంగా ఐటీ, టెక్స్‌టైల్, డ్రోన్‌ పాలసీలు
    రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర పాలసీలతో నూతనోత్తేజం.. విడుదలకు సిద్ధంగా ఐటీ, టెక్స్‌టైల్, డ్రోన్‌ పాలసీలు

    Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర పాలసీలతో నూతనోత్తేజం.. విడుదలకు సిద్ధంగా ఐటీ, టెక్స్‌టైల్, డ్రోన్‌ పాలసీలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 28, 2024
    09:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్'లో ఎన్డీయే ప్రభుత్వానికి ముందున్న ప్రధాన సవాళ్లు పారిశ్రామికీకరణ, లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం.

    వీటిని అధిగమించడం అంత సులభం కాదు, అయినా రాష్ట్రప్రభుత్వం ఈ సవాళ్లను స్వీకరించింది.

    అధికారంలోకి వచ్చిన 120 రోజుల్లోనే పక్కా రోడ్‌మ్యాప్‌తో ముందుకు సాగింది. 2014-19 మధ్య విభజన సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా పారిశ్రామికరంగానికి పురోగతి కల్పించి, కియా వంటి పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు మలివిడతలో ఒకే రోజున ఆరు పాలసీలను ప్రకటించి దేశ-విదేశాల్లోని పెట్టుబడిదారుల దృష్టిని రాష్ట్రంపై కేంద్రీకరించింది.

    వివరాలు 

    ఉద్యోగాలు కల్పించిన వారికి అదనపు ప్రోత్సాహకాలు

    పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రకటించిన ఆరు పాలసీలతో పాటు, ఐటీ, టెక్స్‌టైల్, డ్రోన్ రంగాలకు సిద్ధం చేసిన ముసాయిదా పాలసీలు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తమమైనవి అని ప్రశంసలు పొందుతున్నాయి.

    పరిశ్రమలకు రాయితీలు ఎస్క్రో ఖాతాల్లో జమ చేయడం,సాధారణ ప్రజలు,రైతులను భాగస్వాములుగా చేస్తూ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయడం,ఇంటికో పారిశ్రామికవేత్త తయారు చేసేలా సూక్ష్మ,చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, ప్రారంభం చేసిన పరిశ్రమలకు పెద్ద రాయితీలు, ఉద్యోగాలు కల్పించిన వారికి అదనపు 10% ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి చర్యలు రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి.

    రాష్ట్రాన్ని టెక్స్‌టైల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు,మూలధన పెట్టుబడిలో గరిష్ఠంగా 75%రాయితీ వంటి విధానాలు పరిశ్రమవర్గాల్లో పెద్ద ముందడుగుగా భావించబడుతున్నాయి.

    వివరాలు 

    పరిశ్రమలకు మెరుగైన ప్రోత్సాహకాలు 

    కొత్త విధానాన్ని అనుసరించి, ఏపీ ప్రభుత్వం స్థిర మూలధన పెట్టుబడి (ఎఫ్‌సీఐ) లో సగటున 32%, గరిష్ఠంగా 72% వరకు ప్రోత్సాహకాలు అందిస్తోంది.ఉత్తర ప్రదేశ్‌లో ఎఫ్‌సీఐలో గరిష్ఠంగా 100% ప్రోత్సాహకాలు ఇవ్వబడుతున్నప్పటికీ, అక్కడ పరిశ్రమలకు అనుకూలంగా ఉండే వాతావరణం ఏపీలో ఉన్నట్టుగా లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

    ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు అత్యధిక నెట్ ప్రెజెంట్ వాల్యూ (ఎన్‌పీవీ) ప్రకారం సగటున 31% ప్రోత్సాహకాలు అందిస్తుండగా, ఏపీ పాలసీ లో అది 32% కి పెంచబడింది. తెలంగాణలో క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ అందుబాటులో లేదు. అందువల్ల, ఎన్‌పీవీ నెంబర్స్ ప్రకారం, ఏపీ తెలంగాణ కంటే సుమారు 20% ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.

    వివరాలు 

    కర్ణాటకలో 38% వరకు ప్రోత్సాహకాలు

    కర్ణాటకలో ఎన్‌పీవీ నెంబర్స్ ప్రకారం 38% వరకు ప్రోత్సాహకాలు అందిస్తుండగా, వార్షిక టర్నోవర్ లక్ష్యాలను చేరుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి, దీంతో అనేక పరిశ్రమలకు ఈ ప్రోత్సాహం ఆచరణలో అందుబాటులో ఉండడం లేదు.

    ఏపీలో పెట్టుబడి పెట్టిన వారి కోసం, ఎఫ్‌సీఐలో ప్రోత్సాహకాల కింద ప్రతి సంవత్సరం రూ.4,873 కోట్ల చొప్పున 12 ఏళ్లలో రూ.58,478 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధి కల్పన ఆధారంగా ప్రతి సంవత్సరం రూ.1,101 కోట్ల చొప్పున 11 ఏళ్లలో రూ.12,111 కోట్ల రాయితీ అందించనున్నారు.

    ఇక 'ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు' కింద, ప్రతి సంవత్సరం సగటున రూ.28 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.140 కోట్ల ప్రోత్సాహకాలు అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది.

    వివరాలు 

    పరిశ్రమలకు సర్కారు రాయితీలు: ఎస్క్రో ఖాతా ద్వారా విశ్వసనీయత 

    సాధారణంగా ప్రభుత్వాలు పరిశ్రమలకు రాయితీలను ప్రకటిస్తాయి కానీ, వాటి అమలు మీద సంపూర్ణ గ్యారంటీ ఉండదు. ఇది పారిశ్రామికవేత్తలకు చాలా సాధారణ అనుభవం.

    ఇలాంటి అనుమానాల నుంచి రక్షణగా, కొత్త పారిశ్రామిక విధానంలో ప్రభుత్వం ఎస్క్రో ఖాతా విధానాన్ని ప్రవేశపెట్టింది.

    ఈ విధానం ప్రకారం, రాయితీ మొత్తం ఎస్క్రో ఖాతాలో ఉంటుందనే విశ్వాసం కల్పిస్తుంది.

    పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి, షరతులను నెరవేర్చిన వెంటనే రాయితీ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా అందుకుంటాయి.

    వివరాలు 

    దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానం

    ఈ విధానం రాష్ట్ర పారిశ్రామిక రంగంలో గేమ్‌ఛేంజర్‌గా మారుతుందని పరిశ్రమలు భావిస్తున్నాయి.

    ఈ కొత్త పారిశ్రామిక విధానం ద్వారా, రాబోయే ఐదేళ్లలో తయారీ రంగంలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల మందికి ఉపాధి, రూ.83 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) లక్ష్యాలను నిర్దేశించుకుంది.

    ఈ విధానం దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానంగా నిలుస్తుందని పరిశ్రమల యాజమాన్యాలు చెబుతున్నాయి.

    ఇది ఎంత సులభంగా అమలవుతుందంటే, పరిశ్రమలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే షెడ్యూల్ ప్రకారం ప్రోత్సాహకాలు విడుదల అవుతాయి.

    పరిశ్రమలు ప్రభుత్వానికి చెల్లించే పన్నులలోని ఆదాయానికి ఈ ఎస్క్రో ఖాతా నిధులను అందిస్తుంది.

    వివరాలు 

    సత్ఫలితాలనిచ్చిన పెట్టుబడుల ఆకర్షణ

    ఒక పరిశ్రమ రూ.100 పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తే, దానిలో రూ.75 ప్రోత్సాహకాలుగా తిరిగి వస్తుందని అధికారుల అంచనా.

    ఇలా గరిష్ఠంగా పదేళ్ల వరకు ఈ ప్రోత్సాహకాలు కొనసాగిన తర్వాత, ఆ పరిశ్రమ ప్రభుత్వానికి పూర్తిగా పన్నుల రూపంలో ఆదాయాన్ని అందిస్తుంది.

    విభజన తర్వాత వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన ప్రయత్నాలు అనేక సత్ఫలితాలను అందించాయి.

    అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులకు హాజరవ్వడం, విదేశాలలో పర్యటించడం, రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలతో భాగస్వామ్య సదస్సులు నిర్వహించడం వంటి అనేక చర్యలు చేపట్టారు.

    వివరాలు 

    పారిశ్రామిక పురోగతికి 4.0 వెర్షన్‌కు చంద్రబాబు శ్రీకారం

    పెట్టుబడులను ఆకర్షించడంలో చేసిన ప్రయత్నాల సమాహారంలో కియా, అపోలో టైర్స్, ఏషియన్ పెయింట్స్, మెడ్‌టెక్ పార్క్, తిరుపతిలోని ఎలక్ట్రానిక్ క్లస్టర్‌లో సెల్‌ఫోన్ తయారీ యూనిట్లు స్థాపించబడ్డాయి.

    ఇక రిలయన్స్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను భయపెట్టి రాష్ట్రాన్ని తిరోగమనానికి గురి చేసింది.

    ఇది తాజా పరిశ్రమలు నెలకొల్పడమే కాక, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం విడిచి పారిపోతున్న పరిస్థుతులను ఏర్పరచింది.

    ఈ ప్రతికూల పరిస్థితులలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పారిశ్రామిక పురోగతికి 4.0 వెర్షన్‌కు శ్రీకారం చుట్టారు.

    వివరాలు 

    ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ ద్వారా ప్రోత్సాహకం 

    మొదటి రోజే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల నమ్మకాన్ని పెంచడం, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

    విశాఖలో 10,000 మందికి ఉపాధి కల్పించే టీసీఎస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి టాటా గ్రూప్‌ను ఒప్పించారు.

    'ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌' కింద తొలి దశలో వచ్చే పరిశ్రమలకు ఎఫ్‌సీఐలో 60% వరకు ప్రోత్సాహకం ప్రకటించడం పెట్టుబడిదారులకు ప్రేరణ కలిగించనున్నది.

    ఉపాధి కల్పన ఆధారంగా 10% అదనపు ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రకటించడం, పెట్టుబడుల ఆకర్షణలో కీలక పాత్ర పోషించనుంది.

    వివరాలు 

    ఆహారశుద్ధి పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకం 

    పెట్టుబడుల వర్గీకరణ ప్రకారం,రెండు సంవత్సరాలలో రూ.50 కోట్లు నుంచి రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు చేసిన పరిశ్రమలను 'సబ్‌లార్జ్‌', మూడు సంవత్సరాలలో రూ.501 కోట్లు నుంచి రూ.1,000 కోట్లు పెట్టే పరిశ్రమలను 'లార్జ్‌', మూడు సంవత్సరాలలో రూ.1,001 కోట్లు నుంచి రూ.5,000 కోట్లు పెట్టే పరిశ్రమలను 'మెగా', నాలుగేళ్లలో రూ.5,001 కోట్లు పైగా పెట్టుబడులు చేసే పరిశ్రమలను 'అల్ట్రా మెగా' గా వర్గీకరించారు.

    రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో రూ.30,000 కోట్లు పెట్టుబడులను ఆకర్షించడం మరియు 3 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఆహారశుద్ధి పరిశ్రమల విధానాన్ని ప్రకటించారు.

    రైతులు సొంత భూముల్లో ఆహారశుద్ధి పార్కులు ఏర్పాటు చేస్తే, ప్రతి ఎకరాకు రూ.5 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్

    ఆంధ్రప్రదేశ్

    Bunny festival: దేవరగట్టు బన్నీ ఉత్సవం.. వందమంది భక్తులకు గాయాలు కర్నూలు
    Finance Commission: ఏపీకి కేంద్రం నుంచి డబుల్ ధమాకా..గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988 కోట్లు భారతదేశం
    CM Chandrababu: రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి నాంది.. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ చంద్రబాబు నాయుడు
    Telangana: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల సవాల్.. డీవోపీటీ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని అభ్యర్థన తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025