NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే'
    తదుపరి వార్తా కథనం
    ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే'
    'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీ సెల్సియస్ దాటుతోంది, మేలుకోకుంటే ఉపద్రవమే'

    ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే'

    వ్రాసిన వారు Stalin
    Mar 21, 2023
    11:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్లోబల్ వార్మింగ్‌(ఉపరితల ఉష్ణోగ్రతలు)పై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) ప్రపంచదేశాలను హెచ్చరించింది. వాతావరణ మార్పులపై శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఐపీసీసీ పెంపొందిస్తుంది.

    2030ల ప్రారంభంలో ప్రపంచం 1.5డిగ్రీ సెల్సియస్ గ్లోబల్ వార్మింగ్ పరిమితిని దాటుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పులకు కారణమయ్యే వినాశక పరిణామాలు ఊహించిన దానికంటే వేగంగా జరుగుతున్నాయని హెచ్చరించింది.

    ఈ దశాబ్దాన్ని మానవ చరిత్రలో కీలకంగా చెప్పుకున్న నేపథ్యంలో ఉపరితల వేడిని తగ్గించే చర్యలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాలని ఐపీసీసీ కోరింది.

    వాతావరణ మార్పుల అంశం రాబోయే సంవత్సరాల్లో తీవ్రమైన రాజకీయ, ఆర్థిక చర్చలకు ఆధారం అవుతాయని ఐపీసీసీ చెప్పింది.

    గ్లోబల్ వార్మింగ్

    పరిస్థితి ఇంకా చేయి దాటిపోలేదు: ఐపీసీసీ

    వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నప్పటికీ ఇంకా పరిస్థితి చేయి దాటిపోలేదని ఐపీసీసీ చెప్పింది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు మేల్కొని ఉద్గారాలు తగ్గింపుపై ఉమ్మడిగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చింది. భవిష్యత్‌ను దృష్టింలో ఉంచుకొని అన్ని రంగాల్లో స్థిరమైన ఉద్గారాల తగ్గింపులను సాధించడానికి పాటుపడాలని ఐపీసీసీ వెల్లడించింది.

    వాతావరణ విపత్తును నిరోధించడానికి సాధనాలు ఉన్నప్పటికీ, వాటిని అనేక దేశాలు ఉపయోగించుకోవడం ఐపీసీసీ చెప్పుకొచ్చింది. దీన్ని క్రూరమైన చర్యగా అభివర్ణించింది. 2018నుంచి గ్లోబల్ వాతావరణ నివేదికలను పరిశీలించిన తర్వాత తాము ఈ అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పింది.

    1.5డిగ్రీ సెల్సియస్ గ్లోబల్ వార్మింగ్ పరిమితి దాటితే పంటలపై ప్రభావం పడుతుందని, జీవవైవిధ్యంలో మార్పులు వస్తాయని, మంచుకొండలు కరిగిపోతాయని, సముద్ర మట్టాలు పెరిగిపోతాయని, ఇలా అనేక చెడు పరిణామాలు జరుగుతాయని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐక్యరాజ్య సమితి
    ప్రపంచం

    తాజా

    Virushka: బృందావనాన్ని సందర్శించిన కోహ్లి దంపతులు.. అనుష్క శర్మ-కోహ్లి జంటను ఆశీర్వదించిన ప్రేమానంద్ జీ విరాట్ కోహ్లీ
    Sitaare Zameen Par: ఆమిర్‌ఖాన్ 'సితారే జమీన్ పర్‌' ట్రైల‌ర్ ఈరోజు రాత్రి విడుదల బాలీవుడ్
    CBSE Class 10 results: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకొండి ఇలా.. సీబీఎస్‌ఈ
    USA: అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు విధించాలని భారత్‌ నిర్ణయం అమెరికా

    ఐక్యరాజ్య సమితి

    భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు నిత్యానందను వేధించాయి: 'కైలాస' రాయబారి విజయప్రియ కైలాసం
    పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు; సమర్థించిన బైడెన్ వ్లాదిమిర్ పుతిన్

    ప్రపంచం

    Women's T20 World Cup Final:టైటిల్ పోరులో రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఢీ ఉమెన్ టీ20 సిరీస్
    బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023 టెక్నాలజీ
    మార్చి 15 నుంచి మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ బాక్సింగ్
    ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా స్థానాన్ని తిరిగి దక్కించుకున్న ఎలోన్ మస్క్ ఎలాన్ మస్క్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025