ఉమెన్ టీ20 సిరీస్: వార్తలు

Asian Games 2023: షెఫాలీ వర్మ సన్సేషనల్ హాఫ్ సెంచరీ.. వరుణుడు అడ్డుకున్నా సెమీస్‌లోకి టీమిండియా

ఆసియా గేమ్స్‌లో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఆసియా గేమ్స్ క్వార్టర్ ఫైనల్‌లో మలేషియాతో భారత మహిళల జట్టు తలపడింది.

మహిళల టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ.. లాస్ట్ ఓవర్లో 4 వికెట్లు పడగొట్టిన షఫాలీ 

భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది.బ్యాటింగ్‌లో విఫలమైన భారత మహిళలు, బౌలింగ్‌లో మెరిశారు. ఫలితంగా బంగ్లాదేశ్‌ను 87 పరుగులకే కట్టడి చేయగలిగారు.

నేడు బంగ్లాదేశ్‌తో భారత్‌ మహిళల రెండో టీ20.. సిరీస్​పై కన్నేసిన టీమిండియా

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా మహిళల జట్టు మీర్‌పూర్‌ వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. తొలి టీ20లో అదరగొట్టిన భారత మహిళలు రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కనబర్చాలని ఉవ్విళ్లూరుతున్నారు.

హాంకాంగ్‌ను ఓడించిన భారత మహిళల జట్టు

ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ లో భారత మహిళల ఏ జట్టుకు శుభాంరభం లభించింది. తొలి మ్యాచులలో పసికూన హాంకాంగ్ పై భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

27 Feb 2023

మహిళ

మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే; ఆరోసారి కప్పు కైవసం

కేప్‌టౌన్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా విజయ దుందుభిని మోగించింది. దక్షిణాఫ్రికాను 19పరుగుల తేడాతో ఓడించి ఏకంగా ఆరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Women's T20 World Cup Final:టైటిల్ పోరులో రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఢీ

మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కేప్‌టౌన్‌ వేదికగా ఆదివారం జరగనుంది. నిర్ణయాత్మక పోరులో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మహిళల జట్లు తలపడనున్నాయి.

South Africa World Cup Final: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి

కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20ప్రపంచ కప్ 2023లో దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. న్యూలాండ్స్‌లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సఫారీ టీమ్ ఇంగ్లండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Womens T20 World Cup 2023 Semisలో భారత్ పరాజయం

మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీస్ పోరులో టీమిండియా పరాజయం పాలైంది. లక్ష్య చేధనలో టీమిండియా బ్యాటర్స్ రాణించనప్పటికీ.. ఉత్కంఠ పోరులో కేవలం 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఓటమిపాలైంది.

నేడు సెమీస్‌లో ఆసీస్‌తో తలపడనున్న ఇండియా

మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో నేడు కీలక పోరు జరగనుంది. టీమిండియా మహిళలు సెమీస్‌లో ఆస్ట్రేలియా మహిళలతో తలపడనున్నారు.

టీ20ల్లో పాకిస్తాన్ మహిళా ప్లేయర్ అదరిపోయే రికార్డు

పాకిస్తాన్ మహిళా స్టార్ ప్లేయర్ నిదాదార్ అరుదైన రికార్డును సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిదాదార్ చరిత్రకెక్కింది. మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ఓ వికెట్ నిదాదార్ పడగొట్టి.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

ఐసీసీ ఉమెన్స్ టీ20 ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన రిచా ఘోష్

భారత క్రీడాకారిణి రిచా ఘోష్ కెరీర్లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించింది. ఐసీసీ ఉమెన్స్ టీ20 బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో టీమిండియా మహిళా ప్లేయర్ రిచా ఘోస్ సత్తా చాటింది.

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా

ఐర్లాండ్‌పై ఇండియా ఉమెన్స్ టీమ్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఇండియా గెలిచింది. టీ20 వరల్డ్ కప్‌లలో వరుసగా మూడోసారి ఇండియా సెమీస్ చేరడం విశేషం.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సుజీబేట్స్ ఫార్మామెన్స్ అదుర్స్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సుజీబేట్స్ అద్భుత ఫర్మామెన్స్ అదరగొడుతోంది. 102 పరుగులతో తేడాతో శ్రీలంకను న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సుజీబేట్స్ 49 బంతుల్లో 56 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఎనిమిది సార్లు అర్ధసెంచరీలు చేసిన ప్లేయర్‌గా సుజీబేట్స్ నిలిచింది.

ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమైన భారత్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ మహిళలు అదరగొడుతున్నారు. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ ను, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సత్తా చాటింది. ప్రస్తుతం రేపు ఇంగ్లండ్ జరుగనున్న టీ20 పోరుకు సిద్ధమైంది.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్న అలిస్సా హీలీ

ప్రస్తుతం జరగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2023లో ఆస్ట్రేలియా ప్లేయర్ అలిస్సా హీలీ సూపర్ ఫామ్‌లో ఉంది. బంగ్లాదేశ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో అలిస్సా హీలీ 36 బంతుల్లో 37 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో హీలీ మహిళల T20Iలలో అత్యధిక పరుగులు చేసిన 10వ ప్లేయర్ గా రికార్డుకెక్కింది.

ICC మహిళల T20 ప్రపంచ కప్: బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా దుమ్ములేపుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి సత్తా చాటుతోంది. బంగ్లాదేశ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది.

Womens T20 World Cup 2023లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు బోణీ చేసింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది. రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో రాణించగా షెఫాలీ వర్మ, రిచా ఘోస్ పర్వాలేదనిపించారు.

సూపర్ రికార్డుకు చేరువలో హర్మన్ ప్రీత్ కౌర్

భారత మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో గొప్ప రికార్డుకు చేరువలో ఉంది. ఫిబ్రవరి 10న ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఆ ఫీట్‌ను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. కేవలం 60 పరుగులు సాధిస్తే ఆ మైలురాయిని అందుకొనే అవకాశం ప్రస్తుతం ఉంది.

టీ20 ఉమెన్స్ ప్రపంచ కప్‌లో ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు

ఇటీవల ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో ఈనెల 10న ప్రారంభ కానుంది.

ఫిబ్రవరి 12న భారత్-పాకిస్తాన్ మ్యాచ్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 8వ ఎడిషన్ ఫిబ్రవరి 10న ధక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభం కానుంది. ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మళ్లీ టైటిల్ పై కన్నేసింది.

ఫైనల్లో భారత్ మహిళలు ఓటమి

సౌతాఫ్రికా మహిళలతో జరిగిన టీ20 ట్రై సిరీస్ ఫైనల్లో టీమిండియా మహిళలు దారుణంగా విఫలమయ్యారు. లీగ్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన భారత మహిళలు పేలవ ప్రదర్శనతో ఫైనల్లో చతికిలపడ్డాడరు. ఫలితంగా ముక్కోణపు టోర్నీలో సౌతాఫ్రికా మహిళలు విజేతగా నిలిచారు.

8వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం

ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్‌లో జరిగిన టీ20 ట్రై-సిరీస్‌ ఆరో మ్యాచ్‌లో సోమవారం వెస్టిండీస్ మహిళలపై భారత్ మహిళలు 8 వికెట్ల తేడాతో గెలుపొందారు. దీప్తిశర్మ (3/11)తో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో విండీస్ 6వికెట్ల నష్టానికి 94 పరుగులే చేయగలిగింది.