
Polling Update: మిజోరంలో 52.73శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 44.55 శాతం పోలింగ్ నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతోంది.
ఈ మేరకు మధ్యాహ్నం 1 గంట వరకు మిజోలో 52.73 శాతం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 44.55 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి లియాంజలా ప్రకటించారు.
మిజోరంలో 11 జిల్లాల వ్యాప్తంగా 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఈ మేరకు 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మధ్యాహ్నం 1 గంట వరకు 52.73 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే సమయంలో రికార్డు స్థాయిలో 60.37 శాతం పోలింగ్ సెర్చిప్ జిల్లాలో నమోదు అయ్యింది. లౌంగల్లాయ్ జిల్లాలో 59.31 శాతం పోలింగ్ రికార్డు అయ్యింది.
details
నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో గాయపడ్డ కమాండో
అధికార మిజో నేషనల్ ఫ్రంట్(MNF), ప్రతిపక్షం జోరం పీపుల్స్ మూమెంట్(ZPM), భాజపా 20, ఆప్ 4 స్థానాల్లో బరిలో నిలిచింది.
ఛత్తీస్‌గఢ్‌లో ఉద్రిక్తతలు :
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో ఉద్రిక్తతల నడుమ తొలి విడతలో 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 44.55 శాతం పోలింగ్ నమోదైంది.
సుక్మా జిల్లాలో నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో ఒక సీఆర్‌పీఎఫ్ కమాండో తీవ్ర గాయాలపాలయ్యారు.
ఇదే జిల్లాలోని బాండా ఠాణా సమీపంలో నక్సలైట్లకు, కమాండోలకు మధ్య కాల్పులు జరిగాయి. నారాయణ్‌పుర్ జిల్లాలోని ఓర్చా సర్కిల్ లో నక్సలైట్లు దాడులకు పాల్పడ్డారు.
తొలి విడతలో 20 స్థానాల్లో 223 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, మిగతా 70 స్థానాలకు ఈనెల 17న ఓటింగ్ జరగనుంది.