ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఆవిష్కరణ; అది ఎలా పని చేస్తుందంటే?
ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అందుబాటులోకి వచ్చింది. నాలుగు మీటర్లు ఉండే దీన్ని ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఐఎల్ఎంటీ)గా పిలుస్తారు. ఉత్తరాఖండ్‌లోని దేవస్థాన్‌లో దీన్నిఏర్పాటు చేశారు. టెలిస్కోప్ గురుత్వాకర్షణ లెన్సింగ్ అధ్యయనాలకు, గ్రహశకలాలు, సూపర్ నోవా,అంతరిక్ష శిధిలాల వంటి ఖగోళ వస్తువులను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ఏఆర్ఐఈఎస్) ఆధ్వర్యంలో ఈ భారీ టెలిస్కోప్‌ను ఆపరేట్ చేయనున్నారు. 2,450 మీటర్ల ఎత్తులో దీన్ని ఏర్పాటు చేశారు.
తాత్కాలిక నక్షత్ర మూలాలను గుర్తించడానికి దోహదం
ఐఎల్ఎంటీ ఏర్పాటు అనేది భారత శాస్త్ర పరిశోధన రంగానికి మైలురాయి వంటిది. ఇదే దశంలో ఏర్పాటు చేసిన తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. ఖగోళ పరిశీలనల కోసం దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఐఎల్ఎంటీ ప్రతి రాత్రి ఓవర్ హెడ్ ప్రయాణిస్తున్న ఆకాశాన్ని సర్వే చేస్తుంది. ఇది అంతరిక్ష శిథిలాలు, గ్రహశకలాలు వంటి తాత్కాలిక నక్షత్ర మూలాలను గుర్తించడానికి సహాయ పడుతుంది. ప్రతిబింబించే ద్రవ లోహం (పాదరసం), గాలిని కలిగి ఉండే ఒక డిష్ లేదా ద్రవ అద్దం ఉంచబడిన మోటారు, ఒక డ్రైవ్ సిస్టమ్ ఈ మూడింటి సాయంతో ఐఎల్ఎంటీ అనేది లిక్విడ్ మిర్రర్ టెక్నాలజీ నడుస్తుంది.