Green crackers: గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి? సాధారణ క్రాకర్స్‌కు వాటికి తేడా ఏంటి?
దీపావళికి దేశంలోని కొన్ని ప్రధాన నగరాలు వాయు కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో దిల్లీతో పాటు వివిధ రాష్ట్రాలు దీపావళి నాడు బాణాసంచా పేల్చడంపై నిషేదం విధించాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో గ్రీన్ ఫైర్ క్రాకర్లను కాల్చడానికి అనుమతి ఉంది. అసలు గ్రీన్ ఫైర్ క్రాకర్స్ అంటే ఏంటి? వీటికి సాధారణ క్రాకర్స్‌కు తేడా ఏంటో తెలుసుకుదాం. గ్రీన్ ఫైర్ క్రాకర్స్ ఐదేళ్ల క్రితమే భారత మార్కెట్లోకి ప్రవేశించాయి. 2018 సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) మార్గదర్శకత్వంలో నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(NEERI) ఈ బాణాసంచా తొలిసారిగా రూపొందించబడింది. అయితే రెండు రకాల క్రాకర్స్ కాల్చడం వల్ల కాలుష్యం ఏర్పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
గ్రీన్ ఫైర్ క్రాకర్స్ - సాధారణ క్రాకర్స్ మధ్య తేడాలు ఇవే..
కానీ గ్రీన్ క్రాకర్స్ కాల్చడం వల్ల 30%తక్కువ కాలుష్యం వస్తుంది. గ్రీన్ క్రాకర్స్ చాలా వరకు ఉద్గారాలను తగ్గిస్తాయి. దుమ్మును పీల్చుకుంటాయి. ఇందులో బేరియం నైట్రేట్ వంటి ప్రమాదకరమైన మూలకాలు ఉండవు. సాధారణ క్రాకర్లు 160-200 డెసిబుల్స్ ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. గ్రీన్ క్రాకర్లు దాదాపు 100-130 డెసిబుల్స్ ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిని దాటని నగరాల్లో మాత్రమే గ్రీన్ క్రాకర్లను కాల్చడానికి అనుమతి ఉంది. గ్రీన్ క్రాకర్స్ SWAS, SAFAL, STARకేటగిరీల క్రాకర్లను మాత్రమే కొనుగోలు చేయాలి. SWASక్రాకర్స్ చిన్న నీటి బిందువులను కలిగి ఉంటాయి. ఇవి పగిలిన తర్వాత గాలిలో ఆవిరిని విడుదల చేస్తాయి. అవి కాలిన తర్వాత వెలువడే ధూళిని నీటి బింధువులు అణిచివేస్తాయి