
Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రసాదం అంటూ Amazonలో అమ్మకం.. కేంద్రం నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
'అయోధ్య రామమందిర ప్రసాదం' అంటూ భక్తులను తప్పుదారి పట్టించేలా స్వీట్లు విక్రయిస్తున్న ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసు జారీ చేసింది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఫిర్యాదు ఆధారంగా ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు అథారిటీ వెల్లడించింది.
ఈ మేరకు ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అమెజాన్‌ను అథారిటీ ఆదేశించింది.
నోటీసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 నిబంధనల ప్రకారం కంపెనీపై అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అయోధ్య
స్పందించిన అమెజాన్
ఈ వ్యవహారంపై ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ స్పందించింది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
అమెజాన్ ప్రతినిధి స్పందిస్తూ.. తమ ప్లాట్‌ఫారమ్‌లో కొంతమంది విక్రేతలు తమ ఉత్పత్తులను తప్పుదారి పట్టించేలా ప్రచారం చేస్తున్నందుకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నుంచి నోటీసులు అందినట్లు వెల్లడించింది.
తమ కంపెనీ పాలసీ ప్రకారం నకిలీ ప్రొడక్టులపై తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
శ్రీరామ మందిరం అయోధ్య ప్రసాదంగా చెప్పుకునే స్వీట్లను అమెజాన్‌లో అమ్ముతున్నట్లు తాము గుర్తించినట్లు చెప్పింది. అయితే వాటిని తొలగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.