పాన్ కార్డ్: వార్తలు

నేటితో ముగియనున్న ఆధార్‌ పాన్‌ లింక్ గడువు.. మరోసారి పొడిగింపుపై స్పందించని ఐటీశాఖ

ఆధార్‌ కార్డుతో పాన్‌ను అనుసంధానించేందుకు గడువు నేటితో ముగియనుంది. శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 మేరకు ఆధార్‌ సంఖ్యను అనుసంధానించాల్సిదే.

ఆధార్‌ని పాన్ నంబర్‌తో లింక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇవి పాటించండి

ఈ ఏడాది మార్చి 31లోపు పాన్‌ నంబర్లకు ఆధార్‌ను లింక్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2022తో ముగిసింది, కానీ ప్రభుత్వం దానిని రూ.1000 అపరాధ రుసుముతో పొడిగించింది.

బడ్జెట్ 2023: వ్యాపారస్థులకు గుడ్‌న్యూస్, ఇక మీదట పాన్ కార్డుతోనే అన్ని అనుమతులు

వ్యాపార అనుమతులు, లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు బడ్జెట్ 2023లో కేంద్రం కీలక సవరణలు చేసింది. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు పాన్‌కార్డును సింగిల్ బిజినెస్ ఐడీ కార్డుగా చట్టబద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యాపార అనుమతులు, లావాదేవీలు ఏవైనా పాన్ ఆధారంగా నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.