బడ్జెట్ 2023: వార్తలు

07 Jul 2023

కర్ణాటక

కర్ణాటకలో బీభత్సంగా మ‌ద్యం ధరలు..ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచిన సర్కార్

కర్ణాటకలో మద్యం ధరల మోత మోగనుంది. విస్కీ, రమ్ము, జిన్, రెడ్ వైన్ సహా బీర్ ధరలు మరింత పెరగనున్నాయి. ఈ మేరకు ధరల సవరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రతిపాదించారు.

01 Apr 2023

మహిళ

1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం

మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకం. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేయడంతో ఇది అమల్లోకి వచ్చింది.

27 Mar 2023

ప్రకటన

7.5% వడ్డీ లభించే మహిళా సమ్మాన్ పొదుపు పథకం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2023ని సమర్పిస్తున్నప్పుడు, ఇప్పటికే ఉన్న కొన్ని పొదుపు పథకాలలో కీలకమైన మార్పులతో పాటు, కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్‌లను మార్చడానికి ప్రకటనలు చేశారు. ఆర్థిక మంత్రి మహిళల కోసం మహిళా సమ్మాన్ పొదుపు పథకం కూడా ప్రకటించారు.

09 Feb 2023

రాజ్యసభ

కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను దేశం సీరియస్‌గా తీసుకుంటోందని, ఈ క్రమలో కొంతమంది ఎంపీల ప్రవర్తన ప్రజలను నిరాశకు గురి చేసిందని ప్రధాని మోదీ అన్నారు.

రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఆమె అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు.

02 Feb 2023

లోక్‌సభ

అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గౌతమ్ అదానీపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టిన నేపథ్యంలో ఉభయ సభల్లో గందరగోళ ఏర్పడింది.

బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు

మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా, మెర్సిడెస్-బెంజ్ ఇండియా, హీరో మోటోకార్ప్, TVS మోటార్ కంపెనీ, అశోక్ లేలాండ్‌తో సహా దేశంలోని అగ్రశ్రేణి ఒరిజినల్ పరికరాల తయారీదారులు (OEMలు) ఆర్థిక మంత్రి సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2023ని ప్రశంసించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను వృద్ధి ఆధారిత, ప్రగతిశీల బడ్జెట్ అని కొనియాడారు.

01 Feb 2023

కర్ణాటక

Budget 2023: కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు, బడ్టెట్‌లో భారీగా కేటాయింపులు

2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దేశం 'ఆజాదీ కా అమృత మహోత్సవం' జరుపుకుంటున్న వేళ, ఈ బడ్డెట్‌ను వందేళ్ల స్వతంత్య్ర భారతానికి బ్లూప్రింట్‌గా సీతారామన్ అభివర్ణించారు.

బడ్జెట్ 2023-24 భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమకు పనికొచ్చే అంశాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో బడ్జెట్ 2023ని సమర్పించారు ఇందులో ఆటోమొబైల్ పరిశ్రమకు అనేక రాయితీలను ప్రస్తావించారు. గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టడం, ప్రభుత్వ వాహనాలను రద్దు చేయడం, ఎలక్ట్రిక్ వాహనాలను చౌకగా తయారు చేయడం వరకు ఆటోమొబైల్ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నారు.

బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్

బడ్జెట్ విడుదల తర్వాత, దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు మిశ్రమంగా ముగిసింది. ముగింపు సమయానికి, నిఫ్టీ 45.85 పాయింట్లు లేదా 0.26 శాతం క్షీణించి 17,616.30 వద్ద, సెన్సెక్స్ 158.18 పాయింట్లు లేదా 0.27 శాతం పెరిగి 59,708.08 వద్ద ఉన్నాయి.

Msme Budget 2023: ఎంఎస్ఎంఈలకు పెద్ద ఊరట, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌కు రూ.9వేల కోట్లు

బడ్జెట్ 2023లో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు భారీ ఊరట లభించింది. కరోనాతో కుదేలైన సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు క్రెడిట్ గ్యారెంటీ పథకానికి రూ. 9,000కోట్లను కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Education Budget 2023: విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ఫోకస్, బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు ఇవే

2023-2024 బడ్జెట్‌లో విద్యా‌రంగంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. కరోనా కారణంగా దాదాపు మూడు సంవత్సరాల పాటు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విద్యారంగంలో నూతనోత్సాహాన్ని నింపేందుకు బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేశారు.

బడ్జెట్ 2023: వ్యాపారస్థులకు గుడ్‌న్యూస్, ఇక మీదట పాన్ కార్డుతోనే అన్ని అనుమతులు

వ్యాపార అనుమతులు, లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు బడ్జెట్ 2023లో కేంద్రం కీలక సవరణలు చేసింది. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు పాన్‌కార్డును సింగిల్ బిజినెస్ ఐడీ కార్డుగా చట్టబద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యాపార అనుమతులు, లావాదేవీలు ఏవైనా పాన్ ఆధారంగా నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

బడ్జెట్ 2023: మహిళల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన కేంద్రం

బడ్జెట్ 2023లో మహిళల కోసం కేంద్రం కొత్త పథకాన్ని ప్రకటించింది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్(Mahila Samman Saving Certificate)పేరుతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

Union Budget 2023-24: మౌలిక రంగానికి పెద్దపీట, కేంద్ర బడ్జెట్‌‌లో హైలెట్స్ ఇవే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టారు.

బడ్జెట్ 2023: పన్ను విధానంలో మార్పులు, రూ.7 లక్షల వరకు ఆదాయ పన్నులేదు

'బడ్జెట్ 2023'లో ఆదాయపు పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానంలో భాగంగా రూ.7 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని ప్రకటించారు.

ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా

ఆర్ధిక అభివృద్ది దిశగా దేశం దూసుకుపోవాలంటే విద్యారంగంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అటువంటప్పుడు బడ్జెట్ లో ఆ రంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది.

బడ్జెట్ 2023: పాత పన్ను విధానంలో మినహాయింపులు, 80సీ కింద మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయా?

వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న అంచనాల నేపథ్యంలో భారతదేశ వృద్ధిని కొనసాగించే చర్యలను 2023 బడ్జెట్‌లో ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

బడ్జెట్ 2023లో పన్ను తగ్గింపులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ 2023పై వేతన జీవులు, చిన్న, మధ్య, భారీ పారిశ్రామిక వర్గాలతో పాటు పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఆర్థిక సర్వే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వృద్ధి నమోదు

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధిరేటు 6.5శాతం నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం 7శాతం నమోదు అవుతుందని, 2021-22లో 8.7శాతం నమోదైనట్లు ఆర్థిక సర్వే పేర్కొంది.

31 Jan 2023

బడ్జెట్

ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి

కేంద్ర బడ్జెట్-2023 సమావేశాలు మంగళవారం ప్రారంభయ్యమాయి. ఈ క్రమంలో 'ఆర్థిక సర్వే 2023'ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థిక సర్వేను నిర్మల లోక్‌సభ ముందుంచారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక సర్వే ప్రముఖ్యత, చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.