NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌ఓ; కొత్త సిఫార్సులు ఇలా ఉన్నాయి!
    తదుపరి వార్తా కథనం
    కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌ఓ; కొత్త సిఫార్సులు ఇలా ఉన్నాయి!
    కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌ఓ; కొత్త సిఫార్సులు ఇలా ఉన్నాయి!

    కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌ఓ; కొత్త సిఫార్సులు ఇలా ఉన్నాయి!

    వ్రాసిన వారు Stalin
    Mar 29, 2023
    12:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌తో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కోవిడ్-19 వ్యాక్సిన్ సిఫార్సులను సవరించింది. కరోనా కొత్త దశను అరికట్టడంతో పాటు అధిక జనాభాలో రోగనిరోధక శక్తిని పెంపొందేలా ఈ సవరణలను ప్రతిపాదించింది.

    ఆరోగ్యవంతమైన పిల్లలు, యువకులకు తప్పనిసరిగా బూస్టర్ డోస్ అవసరం లేదని, అయితే అధిక రిస్క్ ఉన్నవారు చివరి టీకా తర్వాత 6 నుంచి 12నెలల మధ్య బూస్టర్‌ను పొందాలని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

    కోవిడ్-19 నుంచి మరణ ముప్పు ఉన్నవారు, ఇతర వ్యాధులతో బాధపడుతూ ప్రమాద తీవ్ర ఎక్కువ ఉన్న వారికి బూస్టర్ డోస్ విషయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌ఓ కొత్త సిఫార్సులు చెబుతున్నాయి.

    డబ్ల్యూహెచ్‌ఓ

    కరోనా టీకా అవసరమైన జనాభాను మూడు స్థాయిలుగా విభజించిన డబ్ల్యూహెచ్‌ఓ

    కొత్త సిఫార్సుల ప్రకారం, కరోనా టీకా అవసరమైన జనాభాను మూడు(అధిక, మధ్యస్థ, తక్కువ) స్థాయిలుగా డబ్ల్యూహెచ్‌ఓ విభజించింది.

    వృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఇమ్యునో కాంప్రమైజింగ్ పరిస్థితులు ఉన్న యువకులు అధిక ప్రాధాన్యత కలిగిన సమూహంలో ఉన్నారు. వీరు చివరి డోస్ తర్వాత 6 లేదా 12 నెలల తర్వాత అదనపు బూస్టర్ డోసును డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసింది.

    ఆరోగ్యవంతమైన పెద్దలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు మధ్యస్థ ప్రాధాన్యత సమూహంలోకి వస్తారు. వీరికి అదనపు బూస్టర్ డోసు సురక్షితమే అయినప్పటికీ, తప్పనిసరి కాదు.

    6 నెలల నుంచి 17 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన పిల్లలు, యువకులు తక్కువ ప్రాధాన్యత కలిగిన సమూహంలో ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచ ఆరోగ్య సంస్థ
    కోవిడ్
    కరోనా కొత్త మార్గదర్శకాలు
    తాజా వార్తలు

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    ప్రపంచ ఆరోగ్య సంస్థ

    హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం కోవిడ్
    చైనాపై పెరుగుతున్న ఆంక్షలు.. మరణాలపై తాజా డేటా ఇవ్వాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ చైనా
    నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ ఉజ్బెకిస్తాన్
    చికెన్‌పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం జబ్బు

    కోవిడ్

    కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు భారతదేశం
    81కోట్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అదేంటంటే? భారతదేశం
    2023లో కూడా ఇంటి నుండి పనిచేసే సౌకర్యం కొనసాగుతుందా? టెక్నాలజీ
    కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం భారతదేశం

    కరోనా కొత్త మార్గదర్శకాలు

    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం కోవిడ్
    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి చైనా
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ పశ్చిమ బెంగాల్

    తాజా వార్తలు

    Karnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ కాంగ్రెస్
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం అమెరికా
    దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు; 146రోజుల గరిష్ఠానికి వైరస్ బాధితులు కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025