ఫైనాన్స్: వార్తలు

28 Jun 2023

డబ్బు

డబ్బును అర్థం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆశ మీకుంటే ఈ పుస్తకాలు చదవండి 

డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే దాన్ని సరిగా నిర్వహించడం మరొక ఎత్తు. నువ్వు సంపాదించినంతా ఖర్చు అవుతుంటే నీకు డబ్బు మీద సరైన అవగాహన లేదన్నమాట.

2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల

ఆదాయపు పన్ను శాఖ ఇంకా ఆన్‌లైన్ ఐటీఆర్ ఫారమ్‌లను విడుదల చేయనప్పటికీ, 2023-24 లేదా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి ఆఫ్‌లైన్ ఐటీఆర్-1, 4 ఫామ్స్‌ను విడుదల చేసింది.

హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు 

ప్రస్తుత కాలంలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అవసరంగా మారిపోయింది. పెరుగుతున్న ఖర్చులు, అనుకోని అనారోగ్యాల కారణంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు.

రష్యా చమురు భారతదేశం ద్వారా యూరప్‌లోకి బ్యాక్‌డోర్‌ ద్వారా ప్రవేశం

ప్రపంచ చమురు మార్కెట్లలో భారతదేశం మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది, రష్యా చమురును మరింత చౌకగా కొనుగోలు చేసి, ఐరోపా, యుఎస్‌లకు ఇంధనంగా శుద్ధి చేసి పంపిస్తుంది.

04 Apr 2023

బ్యాంక్

2024 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 6.3%కి తగ్గించిన ప్రపంచ బ్యాంక్

కొత్త ఆర్థిక సంవత్సరంలో వినియోగంలో నియంత్రణ కారణంగా భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3%కి పరిమితం కావచ్చని ప్రపంచ బ్యాంక్ మంగళవారం ఒక నివేదికలో పేర్కొంది.

01 Apr 2023

మహిళ

1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం

మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకం. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేయడంతో ఇది అమల్లోకి వచ్చింది.

డాలర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు రూపాయి వాణిజ్య ఎంపికను అందిస్తున్న భారతదేశం

యుఎస్ ఫెడరల్ రిజర్వ్ దశాబ్దాల ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసిన నేపథ్యంలో డాలర్ల కొరతను ఎదుర్కొంటున్న దేశాలకు వాణిజ్యానికి రూపాయి ప్రత్యామ్నాయంగా అందించనుంది భారతదేశం.

తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రస్తుత తాజా లక్ష్యం జాక్ డోర్సేస్ బ్లాక్. తాజా నివేదికలో, షార్ట్-సెల్లర్ బ్లాక్ మోసం గురించి, తన పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించిన విధానం గురించి ఆరోపించింది.

మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్

అదానీ గ్రూప్‌పై నివేదికను విడుదల చేసిన US-ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో కొత్త నివేదికను అందించనుంది. అయితే దాని గురించి ఎలాంటి వివరాలను ప్రకటించకుండా మరో పెద్ద నివేదిక అని మాత్రం పేర్కొంది.

విజయవంతమైన పెట్టుబడిదారులుగా మారిన నటీనటులు

టెలికాం దిగ్గజం టి-మొబైల్ 1.35 బిలియన్ డాలర్ల ఒప్పందంలో కంపెనీని కొనుగోలు చేసింది. మింట్ మొబైల్‌ను T-మొబైల్ కొనుగోలు తరవాత అందులో ఉన్న ర్యాన్ రేనాల్డ్స్ $300 మిలియన్లకు పైగా నగదు, స్టాక్‌లను అందుకోనున్నాడు.ఇదే కాకుండా రేనాల్డ్స్ వెల్ష్ ఫుట్‌బాల్ క్లబ్ రెక్స్‌హామ్ AFC సహ యజమాని. అతను 2021లో నటుడు రాబ్ మెక్‌ఎల్హెన్నీతో కలిసి క్లబ్‌ను స్థాపించాడు.

తోపుడు బండిపై సమోసాలతో రోజుకి 12 లక్షల సంపాదిస్తున్న దంపతులు

సమోసా సింగ్ అనే కంపెనీ వందల కోట్ల సమోసా వ్యాపారాన్ని అభివృద్ది చేసింది. నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్ దంపతులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు లక్షల టర్నోవర్ వ్యాపారంగా మార్చారు.

14 Mar 2023

బ్యాంక్

సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఇతర ఆస్తులలో ప్రారంభ-దశ, వృద్ధి సంస్థల రుణాలు, సంపన్న వ్యాపారవేత్తలు, వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లకు రుణాలు ఉన్నాయి.

ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు

అధిక ఇన్‌పుట్ ఖర్చుల నుండి తమ మార్జిన్‌లను కాపాడుకోవడానికి పరిశ్రమలు పెంచుతున్న ధరలను భారతీయులను ఇబ్బంది పెడుతున్నాయి. తక్కువ-మధ్య ఆదాయ జనాభా మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది, వినియోగం తీవ్ర తగ్గుదలను చూస్తోంది, గృహా పొదుపులు మూడు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.

క్రిప్టో మార్కెట్‌ను తగ్గిస్తున్న సిల్వర్‌గేట్ గురించి తెలుసుకుందాం

2022లో పతనం తర్వాత క్రిప్టో ప్రపంచం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తుంది. అయితే, ఆ స్థితి కొంతకాలమే ఉండచ్చు.

కరెన్సీ విలువ గురించి చెప్పే బిగ్ మాక్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం

బిగ్ మాక్ ఇండెక్స్‌ను 1986లో ది ఎకనామిస్ట్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల కొనుగోలు శక్తిని కొలవడానికి సులభంగా అర్దమయ్యే విధంగా ఉంటుందని రూపొందించింది.

GDP క్షీణించినప్పటికీ భారతదేశం వృద్ధిపై నీళ్ళు చల్లుతున్న మూడీస్

ఆర్ధిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో GDP వృద్ధి మందగించినప్పటికీ, మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ 2023లో భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను పెంచింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇప్పుడు 2023 లో భారతదేశం నిజమైన GDP 5.5% వద్ద పెరుగుతుందని అంచనా వేసింది. ఇది అంతకుముందు వృద్ధి రేటును 4.8% వద్ద పెంచింది.

అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో GDP వృద్ధి మందగించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం, GDP వృద్ధి రెండవ త్రైమాసికంలో 6.3%తో పోలిస్తే 4.4%కి వచ్చింది.

01 Mar 2023

బ్యాంక్

వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఐదు రోజుల పని వారానికి డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆరోజు పని గంటలను భర్తీ చేయడానికి ప్రతిరోజూ 50 నిమిషాలు పెంచే అవకాశం ఉంది.

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశం జిడిపి వృద్ధి 4.4 శాతం తగ్గుదల

అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికంలో భారతదేశం స్థూల దేశీయోత్పత్తి (GDP) 4.4 శాతం వృద్ధి చెందిందని మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించింది. ప్రభుత్వ డేటా ప్రకారం 2022-23లో GDP వృద్ధి 2021-22లో 9.1 శాతంతో పోలిస్తే 7.0 శాతంగా అంచనా వేయబడింది.

ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసిన CRED సిఈఓ కునాల్ షా జీతం

ఫిన్‌టెక్ కంపెనీ CRED చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కునాల్ షా, ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌ లో తన జీతాన్ని వెల్లడించారు. షా తన నెలవారీ జీతం Rs. 15,000 అని పేర్కొనడమే దానికి కారణాన్ని కూడా చెప్పాడు.

అదానీతో పాటు కష్టాల్లో ఉన్న భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్

కొంతమంది భారతీయ వ్యాపారవేత్తలు ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నారు. గౌతమ్ అదానీ $236 బిలియన్ల సంపద ఒక నెలలో మూడు వంతుల కంటే ఎక్కువ తగ్గిపోయింది. ఆ కోవలోకే వస్తారు అనిల్ అగర్వాల్ లండన్-లిస్టెడ్ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ జనవరిలో చెల్లించాల్సిన $1 బిలియన్ బాండ్‌తో సహా మరెన్నో రుణాలతో సతమతమవుతుంది.

జోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం

ప్రముఖ ఆభరణాల గొలుసు జోయ్ అలుక్కాస్కు చెందిన Rs. 305.84 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నాడు జప్తు చేసింది. ఆ సంస్థ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది.

జనవరిలో 4.7 శాతంకు తగ్గిన హోల్ సేల్ ద్రవ్యోల్బణం

ఆల్-ఇండియా హోల్ సేల్ ధరల సూచిక (WPI) ఆధారంగా దేశ వార్షిక ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్ 2022లో నమోదైన 4.95% నుండి జనవరి 2023 (జనవరి 2022 కంటే) నెలలో 24 నెలల కనిష్ట స్థాయి 4.73%కి తగ్గింది, తాత్కాలిక డేటా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం షేర్ చేసింది.

08 Feb 2023

ఆర్ బి ఐ

#NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 2022 నుండి రెపో రేటును ఆరవసారి పెంచింది. సామాన్యుడికి ఈ రెపో రేటుతో సంబంధం ఏంటి?

08 Feb 2023

ఆర్ బి ఐ

రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.

జాతీయవాదం ద్వారా చేసిన మోసాన్నిఅదానీ కప్పిపుచ్చలేరంటున్న హిండెన్‌బర్గ్

హిండెన్‌బర్గ్ చేసిన స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాల ఆరోపణల నివేదికపై స్పందిస్తూ ఇది భారతదేశంపై దాడిగా అదానీ గ్రూప్ పేర్కొంది.

అదానీ గ్రూప్ షేర్ 22% పడిపోవడంతో నష్టాన్ని చవిచూసిన LIC

అదానీ గ్రూప్ షేర్లు శుక్రవారం ఒక్క రోజులో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 3.37 లక్షల కోట్లు నష్టపోయాయి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఐదు అతిపెద్ద అదానీ గ్రూప్ కంపెనీలలో ఏకైక అతిపెద్ద నాన్-ప్రమోటర్ దేశీయ వాటాదారైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC). అదానీ గ్రూప్ కంపెనీలలో తన హోల్డింగ్స్ విలువ క్షీణించిన కారణంగా రూ.16,627 కోట్లు కోల్పోయింది.

415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు

FTX కష్టాలు త్వరలో ముగిసేలా కనిపించడం లేదు. దానికి కారణం ఇప్పటికే దివాళా తీసిన FTX US ప్లాట్‌ఫారమ్ నుండి $90 మిలియన్లు, గ్లోబల్ ఎక్స్ఛేంజ్ నుండి $323 మిలియన్లతో సహా దాదాపు $415 మిలియన్ల విలువైన క్రిప్టోను హ్యాకర్లు దొంగిలించారని సిఈఓ జాన్ J. రే III తెలిపారు.

కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం

కొత్త ప్రత్యక్ష పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిని ఫిబ్రవరి 1న రానున్న కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ విషయంలో తుది నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తీసుకుంటుంది.

మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఇన్ఫోసిస్ ప్రకటించింది. కంపెనీ నికర లాభం 12.68% పెరిగి డిసెంబర్ 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ.6,586 కోట్లు వచ్చాయి. కంపెనీ ఆదాయం మూడో త్రైమాసికంలో రూ.39,087 కోట్లు. ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయం రూ. 39,087 కోట్లు, ఇందులో రూ. 38,318 కోట్ల నికర అమ్మకాలు, రూ. 769 కోట్లు ఇతర ఆదాయాల ద్వారా వచ్చాయి.

డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 15 శాతం పెరుగుదల

2022 డిసెంబర్ లో 15 శాతం వృద్ధిని నమోదు చేసి భారతదేశ దేశీయ విమాన ప్రయాణీకులు దాదాపు 129 లక్షలకు చేరుకున్నారు.

సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్

క్రిప్టోకరెన్సీ ప్రధాన డెవలపర్‌లలో ఒకరైన బిట్‌కాయిన్ ల్యూక్ డాష్జర్ కు ఈ కొత్త సంవత్సరం అంతగా కలిసిరాలేదు. అతని క్రిప్టో వాలెట్ హ్యాక్ దాడికి గురైంది, అతని వ్యక్తిగత హోల్డింగ్స్ నుండి 216.93 బీట్ కాయిన్ల నష్టానికి దారితీసింది. ఒక్కో బీట్ కాయిన్ ధర $16,570 (దాదాపు రూ. 13.7 లక్షలు)గా ఉంది. అంటే, $3.6 మిలియన్లు (దాదాపు రూ. 30 కోట్లు) నష్టపోయారు.

31 Dec 2022

ఆర్ బి ఐ

బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం

కేంద్ర బడ్జెట్ 2023కి ముందు, నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచే సుంకాల గురించి తాను భయపడుతున్నానని, భారతదేశాన్ని ఇటువంటి చర్యలు అధిక ఖర్చుతో కూడిన దేశంగా మారుస్తుందని. చైనాకు ప్రత్యామ్నాయంగా మారడం మరింత సవాలుగా మారనుందని, టారిఫ్‌లను పెంచడం వలన భారతదేశంలోకి వచ్చే నిధులు ఆగిపోయే అవకాశం ఉందని మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

2022 లో IRDAI తీసుకున్న సానుకూల మార్పులు

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI), 2022లో పలు ప్రయోజనం చేకూర్చే సానుకూల నిర్ణయాలను తీసుకుంది. '2047 నాటికి అందరికీ బీమా' అనే దృక్పథంతో IRDAI అనేక సంస్కరణలు చేసింది.