ఫుట్ బాల్: వార్తలు

29 Mar 2023

ప్రపంచం

అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ హ్యాట్రిక్ గొల్స్‌తో రికార్డు

అర్జెంటీన్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ కురాకోతో జరిగిన ఫెండ్లీ మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన మెస్సీ అర్జెంటీనా తరుపున వంద అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

28 Mar 2023

ప్రపంచం

ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి అరుదైన గౌరవం

లియోనల్ మెస్సీ.. ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజాల్లో కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. ఎందకంటే అతడు సాధించిన ఘనతలకే అందుకు కారణం.

టోటెన్‌హామ్ హాట్స్‌పుర్ నుండి వైదొలిగిన ఆంటోనియో కాంటే

ఉన్నత స్థాయి నిర్వాహకులలో ఒకరైన హెడ్ కోచ్ ఆంటోనియో కాంటే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. టోటెన్ హామ్ హాట్స్‌పుర్ నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. సోమవారం ఈ విషయాన్ని క్లబ్ అధికారిక ప్రకటన చేసింది.

24 Mar 2023

ప్రపంచం

మరో అరుదైన ఫీట్ సాధించిన లియోనెల్ మెస్సీ

ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మరో అరుదైన ఫీట్‌ను సాధించాడు. గురువారం పనామాపై అర్జెంటీన్ 2-0 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ ఈ మైలురాయిని సాధించాడు.

24 Mar 2023

ప్రపంచం

అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సరికొత్త రికార్డును నెలకొల్పిన క్రిస్టియానో ​​రొనాల్డో

అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. UEFA యూరో 2024 క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో 4-0తో లీచ్‌టెన్‌స్టెయిన్‌ను ఓడించడంతో క్రిస్టియానో ​​రొనాల్డో ఈ అరుదైన ఫీట్ ను సాధించాడు.

24 Mar 2023

ప్రపంచం

ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు తరుపున హ్యారీకేన్ ఆల్‌టైమ్ రికార్డు

ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యారికేన్ ఆల్ టైమ్ రికార్డును సృష్టించాడు. ఇటలీలో జరిగిన UEFA యూరో 2024 క్వాలిఫయర్స్‌లోని ఇంగ్లాండ్ ప్రారంభ గ్రూప్ సీ మ్యాచ్‌లో అతను అరుదైన ఫీట్ ను సాధించాడు.

20 Mar 2023

ప్రపంచం

బార్సిలోనా చేతిలో రియల్ మాడ్రిడ్ చిత్తు

సొంతగడ్డపై రియల్ మాడ్రిడ్‌ను బార్సిలోనా ఓడించింది. లా లిగా 2022-23 ఎల్ క్లాసిక్ పోరులో రియల్ మాడ్రిడ్‌ను 2-1 తేడాతో బార్సినాలో చిత్తు చేసింది. 9వ నిమిషంలో రొనాల్డ్ అరౌజో రియల్ మాడ్రిడ్‌కు అధిక్యాన్ని అందించారు.

20 Mar 2023

ప్రపంచం

ఇంటర్ మిలాన్‌ను ఓడించిన జువెంటస్

సెరీ A 2022-23 సీజన్‌లో 27వ మ్యాచ్‌లో ఇంటర్‌ మిలాన్‌పై జువెంటస్ 1-0 తేడాతో విజయం సాధించింది. 23వ నిమిషలో జువెంటస్ తరుపున ఫిలిప్ కోస్టిక్ గోల్ చేసి విజృంభించాడు.

18 Mar 2023

ప్రపంచం

FA కప్ సెమీ-ఫైనల్స్ ఎప్పుడంటే..?

FA కప్ 2022-23 సెమీ-ఫైనల్స్ మార్చి 19 జరగనుంది. ఇప్పటికే ఎనిమిది ఇంగ్లీష్ ఫుట్ బాల్ జట్లు క్వాలిఫై అయ్యాయి. ప్రస్తుతం ట్రోఫీ కోసం ఆ జట్లు పోటీ పడనున్నాయి.

రికార్డు బద్దలు కొట్టిన ఎర్లింగ్ హాలాండ్

ఎతిహాద్‌లో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్ రౌండ్ 16 సెకండ్-లెగ్ టైలో మాంచెస్టర్ సిటీ సత్తా చాటింది. లీప్‌జిగ్‌ను 7-0తేడాతో మాంచెస్టర్ సిటీ చిత్తు చేసింది. దీంతో సిటీ క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించింది.

10 Mar 2023

ప్రపంచం

యూరోపా లీగ్‌లో రియల్ బెటిస్‌ను మట్టికరిపించిన మాంచెస్టర్ యునైటెడ్

యూరోపా లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ సత్తా చాటింది. రియల్ బెటిస్‌ను 4-1తో మాంచెస్టర్ యునైటెడ్ మట్టికరిపించింది. లివర్‌పూల్ చేతిలో 7-0తో ఓడిపోయిన తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ పుంజుకొని విజృంభించింది.

బేయర్స్ మ్యానిచ్ చేతిలో పారిస్ సెయింట్-జర్తైన్ పరాజయం

అలియాంజ్ ఎరీనాలో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్‌లో పారిస్ సెయింట్-జర్మైన్‌ను బేయర్న్ మ్యునిచ్ ఓడించింది. 2-0తేడాతో బేయర్న్ మ్యునిచ్ చేతిలో పారిస్ సెయింట్-జర్మైన్‌ ఓటమి పాలైంది.

06 Mar 2023

ప్రపంచం

ప్రీమియర్ లీగ్‌లో మొహమ్మద్ సలా అరుదైన రికార్డు

ప్రీమియర్ లీగ్‌లో లివర్‌పూల్ తరుపున మొహమ్మద్ సలా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. మాంచెస్టర్ యూనైటడ్ 7-0 తేడాతో లివర్ పూల్ ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొహమ్మద్ సలా ఓ రికార్డును సృష్టించాడు.

ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ పరాజయం

ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ చెత్త ప్రదర్శనతో ఓటమిపాలైంది. 7-0 తేడాతో మాంచెస్టర్ యునైటెడ్ ని లివర్ పూల్ చిత్తు చేసింది. ప్రీమియర్ లీగ్‌లో టాప్ 4 ఆశలను లివర్ పూల్ సజీవంగా ఉంచుకుంది. కోడి గక్పో, డార్విన్ నునెజ్, మొహమ్మద్ సలా అద్భుత ప్రదర్శనతో సత్తా చాటారు.

ISL: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో ఛెత్రి ఫ్రీకిక్‌పై దుమారం

ఇండియన్ సూపర్ లీగ్‌లో కేరళ బ్లాస్టర్‌పై బెంగళూర్ ఎఫ్‌సి విజయం సాధించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 1-0 తేడాతో కేరళ బ్లాస్టర్‌ను బెంగళూర్ ఎఫ్‌సి చిత్తు చేసింది. బెంగళూర్ ఎఫ్‌సీ ఆటగాడు సునీల్ ఛెత్రి చేసిన గోల్ తీవ్ర వివాదానికి దారి తీసింది. దీంతో కేరళ బ్లాస్టర్స్ మైదానం నుంచి వాకౌట్ చేశారు.

03 Mar 2023

ప్రపంచం

బార్సిలోనా చేతిలో రియల్ మాడ్రిడ్ పరాజయం

శాంటియాగో బెర్నాబ్యూలో గురువారం జరిగిన కోపా డెల్ రీ సెమీ ఫైనల్‌లో రియల్ మాడ్రిడ్ పరాజయం పాలైంది. 1-0 తేడాతో రియల్ మాడ్రిడ్‌పై బార్సిలోనా విజయం సాధించింది. పెడ్రీ, ఉస్మానే డెంబెలే, రాబర్ట్ లెవాండోస్కీ లేకుండానే బార్సిలోనా మైదానంలో దిగి విజయం సాధించడం విశేషం.

FA Cup 2022-23: క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న మాంచెస్టర్ యునైటెడ్

FA Cup 2022-23లో మాంచెస్టర్ యునైటెడ్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. వెస్ట్ హామ్ యునైటెడ్‌ను మాంచెస్టర్ సిటీ 3-1తేడాతో చిత్తు చేసింది. లీగ్ కప్ గెలిచిన కొన్ని రోజుల తర్వాత, ఎరిక్ టెన్ హాగ్ మాంచెస్టర్ యునైటెడ్‌కు 54వ నిమిషంలో సెడ్ బెన్రాహ్మా గోల్ చేయడంతో వెస్ట్ హామ్ వెనుకబడింది.

01 Mar 2023

ప్రపంచం

ఫిఫా అవార్డులలో రోనాల్డ్ ఓటు వేయకపోవడానికి కారణం ఇదేనా..?

ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డ్ సౌదీ ప్రొ లీగ్‌లో ఆడుతున్నాడు. గతేడాది ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్‌కి నాయకత్వం వహించాడు. మాంచెస్టర్ యునైటెడ్‌ తెగదెంపులు చేసుకున్న అనంతరం.. రొనాల్డ్ దుబాయ్‌కు చెందిన అల్‌నజర్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

28 Feb 2023

ప్రపంచం

Best FIFA Football Awards: ఉత్తమ ఆటగాడిగా లియోనెల్ మెస్సీ

పారిస్ వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్వహించిన బెస్ట్ ఫిఫా ఫుట్ బాల్ అవార్డ్స్ వేడుక వైభవంగా జరిగింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ కి బెస్ట్ మెన్స్ ప్లేయర్ కిరీటం వరించింది.

24 Feb 2023

ప్రపంచం

క్లబ్ గోల్స్‌తో రికార్డు సృష్టించిన లెవాండోస్కీ

యూరోపియన్ క్లబ్ ఫుట్‌బాల్‌లో రాబర్ట్ లెవాండోస్కీ అరుదైన రికార్డును సృష్టించాడు. 2022-23లో UEFA యూరోపా లీగ్ ప్లేఆఫ్ 2వ-లెగ్ టైలో మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా తరపున 25వ గోల్ చేసి రికార్డుకెక్కాడు.

అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించిన సెర్గియో రామోస్

స్పానిష్ స్టార్ ఆటగాడు సెర్గియో రామోస్ గురువారం తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రామోస్ 2010 FIFA ప్రపంచ కప్, 2008, 2012లో యూరోపియన్ ఛాంపియన్ షిప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2005లో అరంగేట్రం చేసిన సెర్గియో రామోస్ అత్యధిక క్యాప్‌లు సాధించిన ఆటగాడి చరిత్రకెక్కాడు.

బార్సిలోనాను ఓడించిన మాంచెస్టర్ యునైటెడ్

UEFA యూరోపా లీగ్ ప్లే ఆప్ టై లో బార్సిలోనాపై మాంచెస్టర్ యునైటెడ్ విజయం సాధించింది. 2-1 తేడాతో బోర్సాలోనాను మంచెస్టర్ యునైటెడ్ ఓడించింది. మొదటి లెగ్‌లో 2-2తో డ్రా అయిన తర్వాత, రాబర్ట్ లెవాండోస్కీ పెనాల్టీ గోల్ చేయడంతో బార్సిలోనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

ఛాంపియన్స్ లీగ్‌లో ఓడిన మాంచెస్టర్ సిటీ

UEFA ఛాంపియన్స్ లీగ్‌లో మాంచెస్టర్ ఓటమిపాలైంది. లిప్ జిగ్ చేతిలో మాంచెస్టర్ సిటీ ఓడిపోయింది. మాంచెస్టర్ సిటీ తరుపున రియాద్ మహ్రెజ్ మొదటి గోల్ చేసి సిటీకి ఆధిక్యాన్ని అందించింది. లీప్‌జిగ్ డిఫెండర్ జోస్కో గ్వార్డియోల్ 70వ నిమిషంలో ఈక్వెలైజర్ గోల్ చేశాడు. సిటీ వారి చివరి రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.

రియల్ మాడ్రిడ్ చేతిలో లివర్‌పూల్‌పై ఓటమి

UEFA ఛాంపియన్స్ లీగ్ 2022-23 రౌండ్‌లో లివర్‌పూల్‌ ఓటమిపాలైంది. రియల్ మాడ్రిడ్ చేతిలో 5-2తేడాతో లివర్‌పూల్ ఓడిపోయింది.

ప్రతిష్టాత్మక అవార్డు రేసులో మెస్సీ, నాదల్

క్రీడల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా పరిగణించే లారస్ స్పోర్ట్స్ అవార్డు రేసులో పుట్‌బాల్ సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీ, టెన్నిస్ స్టార్ నాదల్ ఉన్నారు. గతేడాది డిసెంబర్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో లియోనల్ మెస్సీ అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపి, గోల్డెన్ బాల్ అవార్డును దక్కించుకున్నాడు.

20 Feb 2023

ప్రపంచం

వెస్ట్ హామ్‌పై 2-0 తేడాతో స్పర్స్ విజయం

ప్రీమియర్ లీగ్ 2022-23 సీజన్‌లో వెస్ట్ హామ్‌పై స్పర్స్ 2-0 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్ హ్యూంగ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 2వ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ డ్రా

క్యాంప్ నౌలో జరిగిన UEFA యూరోపా లీగ్ 2022-23 నాకౌట్ రౌండ్ ఫ్లేఆప్‌ల మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మొదటి ఫస్ట్‌-లెగ్ టైంలో బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్ తలపడ్డాయి. అయితే మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది.

చెల్సియాను చిత్తు చేసిన డార్ట్మండ్

జర్మనీలో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్ 2022-23 రౌండ్ లో డార్ట్మండ్ విజయం సాధించింది. చెల్సియాను 1-0తో తేడాతో ఓడించింది. మొదటి అర్ధభాగం వరకు ఇరువురు గోల్స్ సాధించడంలో విఫలమయ్యారు. అయితే 63వ నిమిషంలో కరీమ్ అడెయెమి ఆతిథ్య డార్ట్మండ్ జట్టుకు గోల్ చేశాడు. 78వ నిమిషంలో చెల్సియా గోల్ చేయడానికి దగ్గరికి వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ప్రీమియర్ లీగ్‌లో ఆర్సెనల్‌ను ఓడించిన మాంచెస్టర్ సిటీ

ప్రీమియర్ లీగ్ 2023లో మాంచెస్టర్ సిటీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. మాంచెస్టర్ సిటీ చేతిలో ఆర్సెనల్ ఓటమిపాలైంది. 3-1తో తేడాతో ఆర్సెనల్‌పై మాంచెస్టర్ సిటీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్డీ న్కేటియాతో ఎడెర్సన్ గొడవపడటంతో ఆర్సెనల్‌కు పెనాల్టీ లభించింది. అయితే సిటీకి వీఏఆర్ ద్వారా పెనాల్టీ లభించింది.

14 Feb 2023

ప్రపంచం

ప్రీమియర్ లీగ్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసిన లివర్‌పూల్

ప్రీమియర్ లీగ్ 2022-23లో లివర్‌పూల్ మొదటిసారిగా విజయాన్ని నమోదు చేసింది. 2-0తో ఎవర్టన్‌ను ఓడించి లివర్ పూల్ సత్తా చాటింది. మొహమ్మద్ సలా, కోడి గక్పో గోల్స్ చేసి లివర్ పూల్‌కు అద్భుతమైన విజయాన్ని అందించారు. ముఖ్యంగా 2023లో లివర్‌పూల్‌కు ఇది తొలి విజయం కావడం విశేషం.

సంచలన నిజాన్ని బయటపెట్టిన జాకుబ్ జాంక్టో

చెక్ ఇంటర్నేషనల్ మిడ్ ఫీల్డర్, ఫుట్‌బాల్ ఆటగాడు జాకుబ్ జాంక్టో ఓ సంచనల నిజాన్నిబయటపెట్టారు . తనపై వస్తున్న ఆరోపణలపై తాజా ఓ కీలక విషయాన్ని బయటపడ్డారు.

13 Feb 2023

ప్రపంచం

నాపోలి చేతిలో క్రెమోనీస్ ఓటమి

2022-23 మ్యాచ్ లో నాపోలి సంచలన విజయాన్ని నమోదు చేసింది. 3-0తో క్రీమోనీస్‌ను ఓడించి సత్తా చాటింది. ఖ్విచా క్వారత్ స్టెలియా, విక్టర్ ఒసిమ్ హెన్, ఎల్జిఫ్ ఎల్మాన్ గోల్స్ చేసి ఈ సీజన్లో నాపోలికి 19వ విజయాన్ని అందించాడు.

13 Feb 2023

ప్రపంచం

విల్లారియల్‌ను 1-0తో ఓడించిన బార్సిలోనా

లాలిగా 2022-23 మ్యాచ్‌లో బార్సిలోనా సత్తా చాటింది. విల్లారియల్‌ను 1-0తో బార్సిలోనా చిత్తు చేసింది. పెడ్రీ 18వ నిమిషంలో గోల్ చేసి బార్సిలోనాకు విజయాన్ని అందించాడు. ముఖ్యంగా బార్సిలోనా ఈ లీగ్‌లో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసి సత్తా చాటింది.

మాంచెస్టర్ సిటీ చేతిలో ఆస్టన్ విల్లా ఓటమి

ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఆదివారం మాంచెస్టర్ సిటీ, ఆస్టన్ విల్లా తలపడ్డాయి. ఈ పోరులో మాంచెస్టర్ సిటీ, ఆస్టన్ విల్లాను 3-1తో తేడాతో ఓడించింది. రోడ్రి, ఐకే గుండోగన్, రియాద్ మహ్రెజ్ హాఫ్ టైమ్‌లో సిటీకి 3-0 ఆధిక్యాన్ని అందించారు. దీంతో రెండో అర్ధభాగంలో విల్లా తరఫున ఓలీ వాట్కిన్స్ ఒక గోల్ మాత్రమే చేశాడు.

09 Feb 2023

ప్రపంచం

ఫైనల్‌కు దూసుకెళ్లిన రియల్ మాడ్రిడ్

ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ కు రియల్ మాడ్రిడ్ దూసుకెళ్లాడు. ఈజిప్టుకు చెందిన ఆల్ అహ్లీని 4-1తో ఓడించి రియల్ మాడ్రిడ్ సత్తా చాటాడు. అనంతరం సౌదీ అరేబియా జట్టుకు చెందిన అల్ హిలాల్‌తో తలపడనున్నారు. రియల్ తరఫున వినిసియస్, ఫెడెరికో వాల్వెర్డే, రోడ్రిగో, సెర్గియో అర్రిబాస్ గోల్స్ చేశారు. అంతకుముందు, అల్ హిలాల్ బ్రెజిల్ దిగ్గజం ఫ్లెమెంగోపై 3-2 తేడాతో అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే.

09 Feb 2023

ప్రపంచం

డ్రాగా ముగిసిన ముంచెస్టర్ యునైటెడ్, లీడ్స్ యునైటెడ్ మ్యాచ్

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన కీలకమైన ప్రీమియర్ లీగ్ 2022-23 ఎన్‌కౌంటర్‌లో మేనేజర్‌లెస్ లీడ్స్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

08 Feb 2023

ప్రపంచం

ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా లెబ్రాన్ జేమ్స్

NBAలో లెబ్రాన్ జేమ్స్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. కరీమ్ అబ్దుల్-జబ్బాను అధిగమించి ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా లెబ్రాన్ జేమ్స్ సరికొత్త రికార్డును సృష్టించాడు. బుధవారం ఓక్లహోమా సిటీ థండర్‌తో జరిగిన లాస్ ఏంజెల్స్ లేకర్స్ గేమ్‌లో కరీమ్ అబ్దుల్-జబ్బార్ రికార్డును బద్దలు కొట్టి సత్తా చాటాడు.

08 Feb 2023

ప్రపంచం

ఫ్లెమెంగో‌ను ఓడించిన సౌదీ అరేబియా జట్టు

మొరాకోలోని టాంజియర్‌లో జరుగుతున్న ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో సౌదీ అరేబియా క్లబ్ అద్భుతాన్ని సృష్టించింది. అల్ హిలాల్ బ్రెజిల్ దిగ్గజం ఫ్లెమెంగోపై 3-2 తేడాతో విజయం సాధించింది. కబ్ల్ వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా సౌదీ అరేబియా క్లబ్ చరిత్రలో నిలిచింది.

08 Feb 2023

ప్రపంచం

FA కప్ 2022-23లో షెఫీల్డ్ యునైటెడ్ విజయం

FA కప్ 2022-23 రీప్లేలో రెక్స్‌హామ్ ఓటమి పాలైంది. షెఫీల్డ్ యునైటెడ్ రెక్సహామ్ పై 3-1తేడాతో విజయాన్ని నమోదు చేసింది. యునైటెడ్ టోటెన్‌హామ్ హాట్‌స్‌పుర్‌తో 5వ రౌండ్ క్లాష్‌ను ఏర్పాటు చేయడానికి రెండు ఆలస్య గోల్‌లను సాధించడం గమనార్హం.

08 Feb 2023

ప్రపంచం

సెలెర్నిటానాపై 3-0తో జువెంటస్ సంచలన విజయం

సీరీ A 2022-23 సీజన్‌లో 21వ మ్యాచ్‌డేలో భాగంగా జువెంటస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. సలెర్నిటానాపై 3-0తో విజయఢంకా మోగించింది. మధ్యలో ఫిలిప్ కోస్టిక్ ఒకరిని జోడించగా.. దుసాన్ వ్లహోవిచ్ బ్రేస్ గోల్ చేశాడు. ప్రస్తుతం సీరీ A 2022-23 స్టాండింగ్స్‌లో 10వ స్థానానికి జువెంటస్ చేరుకుంది.

మునుపటి
1
తరువాత