ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
IMOTY అవార్డును గెలుచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 2023కి IMOTY లేదా ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ గెలుచుకుంది. ఈ మోటార్‌సైకిల్ తనతో పోటీ పడిన మరో తొమ్మిది బ్రాండ్లను ఓడించి కిరీటాన్ని గెలుచుకుంది. 15 మంది సీనియర్ మోటార్‌సైకిల్ జర్నలిస్టుల బృందం ఈ బైక్‌ను అగ్రస్థానానికి ఎంపిక చేసింది. TVS రోనిన్, సుజుకి V-Strom SX మొదటి, రెండవ రన్నరప్‌గా నిలిచాయి.
ఆటో ఎక్స్‌పో 2023లో హైడ్రోజన్-శక్తితో పనిచేసే Euniq 7ను ఆవిష్కరించిన MG మోటార్
బ్రిటిష్ సంస్థ MG మోటార్ దాని పూర్తి-పరిమాణ MPV Euniq 7ను ఆటో ఎక్స్‌పో 2023లో విడుదల చేసింది. ఇది వివిధ గ్లోబల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉన్న హైడ్రోజన్-శక్తితో పనిచేసే Maxus Euniq 7 వ్యాన్ రీ-బ్యాడ్జ్ వెర్షన్. ఇది పర్యావరణ అనుకూల వాహనం. MG 2019లో భారతీయ మార్కెట్లో హెక్టర్‌తో ప్రారంభించింది. ఇది ఫీచర్-ప్యాక్డ్ మిడ్-సైజ్ SUV ఆఫర్ కోసం చూస్తున్న కొనుగోలుదారులను బాగా ఆకర్షించింది.
మారుతీ సుజుకి సంస్థ నుండి వస్తున్న NEXA సిరీస్ లో మరో SUV
మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త కూపే SUV ఫ్రాంక్స్‌ను విడుదల చేసింది. ఇందులో బాలెనో RS మోడల్‌లో చివరిగా కనిపించిన అత్యంత ప్రశంసలు పొందిన 1.0-లీటర్ బూస్టర్ జెట్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా రకాల్లో అందుబాటులో ఉంది.
హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS v/s మారుతి-సుజుకి స్విఫ్ట్ ఏది మంచిది
హ్యుందాయ్ తన ఎంట్రీ-లెవల్ వాహనం గ్రాండ్ i10 NIOS 2023 వెర్షన్ లాంచ్ చేసింది. ప్రస్తుతం బుకింగ్స్ తెరిచారు. అప్‌డేట్ చేసిన ఈ మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్‌కి పోటీగా ఉంటుంది.
ఆటో ఎక్స్‌పో 2023లో EV9తో పాటు ఇతర కార్లని ప్రదర్శించిన కియా సంస్థ
ఆటో ఎక్స్‌పో 2023లో భారతదేశంలో వివిధ మోడళ్లను కియా మోటార్స్ ప్రదర్శించింది. బ్రాండ్ EV9 కాన్సెప్ట్, KA4 (కార్నివాల్)తో పాటుగా భారతదేశంలో ఇప్పటికే ఉన్న EV6, సెల్టోస్, సోనెట్ వంటి కొన్ని కార్లను విడుదల చేసింది. కియా మోటార్స్ తన సెల్టోస్ SUV 2019లో 44,000 కంటే ఎక్కువ అమ్మకాలతో భారతీయ మార్కెట్లో ప్రభంజనం సృష్టించింది.
ఆటో ఎక్స్‌పో 2023లో హ్యుందాయ్ సంస్థ విడుదల చేసిన IONIQ 5
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం IONIQ 5 ను భారతీయ మార్కెట్ కోసం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో ఈ బ్రాండ్ జనవరి 13నుండి 18 వరకు సాధారణ ప్రజలకు కోసం ప్రదర్శిస్తోంది. దీనికి ప్రత్యేకమైన డిజైన్ తో పాటు ఫీచర్-రిచ్ క్యాబిన్ ఉంది.
ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్
ముంబైకి చెందిన లిగర్ మొబిలిటీ తన స్కూటర్‌లను ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది. వాటి బుకింగ్‌లు 2023 మధ్యలో ప్రారంభమవుతాయి.
టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో తన Ace EV మినీ ట్రక్కు డెలివరీలను ప్రారంభించింది. ఇది మే 2022లో ఇక్కడ లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఒక బాక్స్ లాగా ఉంటుంది, 600 కిలోల వరకు పేలోడ్‌ను మోయగల తేలికపాటి కంటైనర్ ఉంటుంది. ఇది ఒక్కో ఛార్జీకి 154కిమీల వరకు నడుస్తుంది.
BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను నిషేధించింది. నిషేధం జనవరి 12 వరకు అమలులో ఉంటుంది, కాలుష్య స్థాయిలు తగ్గకపోతే పొడిగించే అవకాశం ఉంది.
భారతదేశంలో 2023 BMW 3 సిరీస్ గ్రాన్-లిమౌసిన్ ధర రూ. 58 లక్షలు
జర్మన్ వాహన తయారీ సంస్థ BMW తన 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ కారు 2023 వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది: 330Li M స్పోర్ట్, 320Ld M స్పోర్ట్. అప్‌డేట్ చేయబడిన డిజైన్, విలాసవంతమైన క్యాబిన్ టెక్-ఆధారిత ఫీచర్లతో వస్తుంది. ఇది 2.0-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ల ఆప్షన్ తో అందుబాటులో ఉంది.
2023 వేసవిలో తన ఇండియా వెర్షన్ SUVని లాంచ్ చేయనున్న హొండా
హోండా తన SUVని మే 2023 నాటికి భారతదేశంలో లాంచ్ పండుగ సీజన్‌లో అమ్మకాలు మొదలుపెట్టే అవకాశముంది. తాజా అప్డేట్ లో , ఈ బ్రాండ్ వాహనం టీజర్ చిత్రాన్ని విడుదల చేసింది. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ తో వస్తుంది.
మార్కెట్లో విడుదలైన మహీంద్రా Thar 2WD రూ. 10 లక్షలు
మహీంద్రా తన Thar SUV 2WD వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. మహీంద్రా ఇండియా లైనప్‌లో Thar ఒక సమర్థవంతమైన ఆఫ్-రోడర్. దీన్ని మరింత సరసమైనదిగా చేయడానికి, బ్రాండ్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 2WD వెర్షన్‌ను పరిచయం చేసింది.
భారతదేశం మార్కెట్లో డిసెంబర్ విడుదల కాబోతున్న 2023మెర్సిడెస్-బెంజ్ GLC
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారతీయ మార్కెట్ కోసం మిడ్-సైజ్ ప్రీమియం SUV, 2023 GLCను డిసెంబర్ లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ వెర్షన్ లో SUVలో ఫ్రంట్ ఫాసియా ఉంది. వీల్‌బేస్‌ప్రస్తుత మోడల్ కంటే పొడవుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా, ఫోర్-వీలర్ మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది.
మారుతీ సుజుకి గ్రాండ్ విటారా S-CNG ధర రూ. 12.85 లక్షలు
స్వదేశీ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి SUV సరికొత్త S-CNG వెర్షన్ గ్రాండ్ విటారాను భారతదేశంలో విడుదల చేసింది, దీని ప్రారంభ ధర రూ. 12.85 లక్షలు (ఎక్స్-షోరూమ్). టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఆధారంగా, CNG-శక్తితో పనిచేసే SUV డెల్టా, జీటా వేరియంట్‌లలో ఇది లభిస్తుంది. ఈ ప్రీమియం మిడ్-సైజ్ SUVకి 26.6km/kg ఇంధన సామర్ధ్యం ఉందని పేర్కొంది.
లాస్ వెగాస్ CES 2023లో సరికొత్త ఆకర్షణ Peugeot ఇన్సెప్షన్ కాన్సెప్ట్
లాస్ వెగాస్‌లోని CES 2023లో Peugeot ఇన్‌సెప్షన్ కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శించింది దాని తయారీసంస్థ. ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనం ఫాస్ట్ ఇండక్షన్ ఛార్జింగ్ సిస్టమ్‌తో కేవలం ఐదు నిమిషాల్లో 150కిమీల వరకు వెళ్లగలదు. ఇందులో వీడియో గేమ్స్ లో ఉన్నట్టు దీర్ఘచతురస్రాకార స్టీరింగ్ వీల్‌ను ఉపయోగించే హైపర్‌స్క్వేర్ స్టీర్-బై-వైర్ కంట్రోల్ సిస్టమ్‌తో వచ్చే ఐ-కాక్‌పిట్ కూడా ఉంది.
ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కాబోతున్న MBP C1002V క్రూయిజర్ మోటార్‌సైకిల్
Keeway సంస్థ Moto Bologna Passione (MBP) త్వరలో అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా (AARI) ద్వారా భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. క్రూయిజర్‌తో పాటు, వాహన తయారీ సంస్థ M502N స్ట్రీట్‌ఫైటర్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా భారతీయ మోటార్‌సైకిల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుంది, గ్లోబల్ తయారీ సంస్థలు ఇక్కడి మార్కెట్‌పై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు.
డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 15 శాతం పెరుగుదల
2022 డిసెంబర్ లో 15 శాతం వృద్ధిని నమోదు చేసి భారతదేశ దేశీయ విమాన ప్రయాణీకులు దాదాపు 129 లక్షలకు చేరుకున్నారు.
సబ్-బ్రాండ్ AFEELAని ప్రకటించిన సోనీ హోండా మొబిలిటీ
CES 2023లో టెక్నాలజీ దిగ్గజం సోనీ, జపనీస్ ఆటోమేకర్ హోండా మధ్య జాయింట్ వెంచర్ అయిన AFEELA అనే EV సబ్-బ్రాండ్‌ను ప్రకటించారు.
ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కు సిద్దమైన MG 4 EV
బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MG మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం 2023 MG 4ని ఈ నెలలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో భారతదేశంలో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.MG 4 గత ఏడాది జూలైలో గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయింది.
2022లో రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాల్లో రికార్డ్
రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ అమ్మకాలు 2022 సంవత్సరంలో భీభత్సంగా పెరిగాయి. కానీ అదే టైమ్ లో 2022 డిసెంబర్ లో మాత్రం తగ్గాయి. 2021 డిసెంబర్ లోని అమ్మకాలతో పోల్చితే 2022లో అమ్మకాలు తగ్గినట్లు కనిపిస్తోంది.
Hyundai మోటార్ ఇండియాకు కొత్త COOగా తరుణ్ గార్గ్
హ్యుందాయ్ మోటార్ ఇండియా సోమవారం తన సీనియర్ మేనేజ్‌మెంట్ లీడర్‌షిప్‌లో జరిగిన మార్పును ప్రకటించింది. ఇది జనవరి 1, 2023 నుండి అమలులోకి వచ్చింది.
భారతదేశంలో జనవరిలో లాంచ్ కాబోతున్న టాప్ 5 కార్లు
కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు వాహన తయారీదారులు అనేక కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. జనవరి 2023లో భారతదేశంలో ప్రారంభించబోయే టాప్ 5 వాహనాల గురించి తెలుసుకుందాం.
డిసెంబర్ లో రికార్డు స్థాయిలో వాహన అమ్మకాలు: తగ్గింపులే కారణం
భారతదేశంలో ప్రయాణీకుల వాహనాల (PVS) రిటైల్ విక్రయాలు డిసెంబరులో రికార్డును తాకనున్నాయి. సంవత్సరాంతపు తగ్గింపులు వలన భారీగా అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్‌లో ప్రయాణీకుల వాహనాల రిటైలింగ్ భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో 400,000 మార్కును తాకే అవకాశం ఉంది.
పూర్తిగా అమ్ముడుపోయిన Ducati Panigale V4 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా బైక్‌లు
ఈ నెల ప్రారంభంలో ఆవిష్కరించబడిన నెంబర్ తో ఉన్న పరిమిత ఎడిషన్ పనిగేల్ V4 బగ్నాయా 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా, పానిగేల్ V4 బౌటిస్టా 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా అమ్ముడయ్యాయని Ducati సంస్థ ప్రకటించింది. ఈ సీజన్‌లో MotoGP, WorldSBKలో డుకాటీ విజయాన్ని పురస్కరించుకుని ఈ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది.
అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తున్న రవాణా శాఖ
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డీలర్ ప్రామాణికతను గుర్తించడానికి రిజిస్టర్డ్ వాహనాల డీలర్‌ల కోసం అధికార ధృవీకరణ పత్రాలను ప్రవేశపెట్టింది. ఈ చర్య వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు పారదర్శకతను ప్రోత్సహిస్తుంది.
2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ
భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమ 2024 చివరి నాటికి రూ. 15 లక్షల కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఈ రంగంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాలలో ఒకటిగా మారుతుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
2022లో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ను వీడిన టాప్ 5 మోడల్స్
2022 సంవత్సరం భారతీయ ఆటోమోటివ్ మార్కెట్‌లో చాలా కార్లు, బ్రాండ్‌లు వచ్చి చేరాయి. అయితే అమ్మకాలు తగ్గడం, కఠినమైన నిబంధనలకు అనుగుణంగా ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్న కారణంగా కొన్ని మోడల్‌ల నిష్క్రమణ కూడా 2022లో జరిగింది.
జనవరి 3న లాంచ్ కాబోతున్న బడ్జెట్ ఫోన్ POCO C50 గురించి తెలుసుకోండి
భారతదేశంలో POCO C50 అనే కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ జనవరి 3న విడుదల కాబోతుంది. ఇందులో MediaTek లేదా JLQ నుండి ఎంట్రీ-లెవల్ చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. JLQ మార్కెట్లో కొత్త, Android ఆధారిత హ్యాండ్‌సెట్‌లు మరియు టాబ్లెట్‌ల కోసం SoCల తయారీపై దృష్టి పెడుతుంది.
2023లో సరికొత్త డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో రాబోతున్న టాటా సఫారి
టాటా ఫ్లాగ్‌షిప్ SUV, సఫారి, 2023లో అప్‌డేట్ వస్తుంది. SUV గత సంవత్సరం అప్డేట్ లాంచ్ అయినప్పటి నుండి మంచి అమ్మకాలను సాధిస్తోంది. అయితే, మహీంద్రా XUV700, స్కార్పియో N రాక 7-సీటర్ SUV సెగ్మెంట్‌లో పోటీ పెరిగింది. ఈ రెండు మోడల్స్ సఫారి కంటే మెరుగైన ఫీచర్స్ ను అందిస్తున్నాయి.
2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N
keeway యాజమాన్యం నుండి వస్తున్న Moto Bologna Passione లేదా MBP త్వరలో భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. జనవరిలో జరగబోయే ఆటో ఎక్స్‌పో 2023లో తన మొదటి M502Nని ప్రదర్శించాలని నిర్ణయించుకుంది ఈ సంస్థ.
మరో 5 వేరియంట్లను విడుదల చేయనున్న మహీంద్రా స్కార్పియో-ఎన్
స్వదేశీ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా & మహీంద్రా స్కార్పియో-ఎన్ లైనప్‌లో ఎంట్రీ లెవల్ నుండి మిడ్-స్పెక్ వరకు ఐదు కొత్త వేరియంట్‌లను విడుదల చేయనుంది. SUVలో ఇప్పుడు ఇంజిన్ (పెట్రోల్/డీజిల్), ట్రాన్స్‌మిషన్ (మాన్యువల్/ఆటోమేటిక్), సీటింగ్ (ఆరు/ఏడు) ఆప్షన్స్ బట్టి 30 రకాల వేరియంట్‌లు ఉన్నాయి.
శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్
చైనీస్ బ్రాండ్ MBP C650V క్రూయిజర్ బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. 2023 ప్రారంభం నుండి అందుబాటులో ఉంటుంది. అయితే ధర గురించి తయారీ సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.
త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ లూనా
మార్గదర్శకంగా నిలిచిన లైఫ్ ఫర్ కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి మోపెడ్ "లూనా" సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం అవతారంలో సోదర సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ & పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ద్వారా లాంచ్ కాబోతుంది.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కన్నా లీజు లాభం అంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు
టాక్సీ, లాజిస్టిక్స్ కంపెనీలు వంటి ఫ్లీట్ ఆపరేటర్లు ఎలక్ట్రిక్ వాహనాల్ని ఎక్కువగా లీజుకి తీసుకుంటున్నారు. టాప్ బ్యాంకులు ఎలక్ట్రిక్ వాహనాలకు ఫైనాన్స్ ఇవ్వడానికి విముఖత చూపడంతో లీజుకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
వాణిజ్య వాహనాలను లాంచ్ చేయనున్న OLA ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ సంస్థ OLA ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, మోటార్‌బైక్‌లు, స్కూటర్‌లు, వంటి వాణిజ్య వాహనాలను కూడా తయారు చేయనుందని రాబోయే 12 నెలల్లో ఈ ఉత్పత్తులపై మరిన్ని ప్రకటనలను వింటారని ఆ సంస్థ సహా వ్యవస్థాపకులు భవిష్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
7 సిరీస్‌లతో పాటు BMW i7 జనవరి 7న లాంచ్
BMW జనవరి 7న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జరిగే "జాయ్‌టౌన్" ఈవెంట్‌లో 7 సిరీస్, సరికొత్త i7ను భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2022 ఏప్రిల్‌లో వివిధ గ్లోబల్ మార్కెట్లలో ఈ సంస్థ ప్రీమియం కార్లను విడుదల చేసింది.
4 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్న సంవత్సరాంతపు కార్ల ధర తగ్గింపులు
కొత్త కారు కొనాలని అనుకుంటే దానికి ఇదే సరైన సమయం. మెరుగైన ఉత్పత్తి నేపథ్యంలో పెండింగ్-అప్ డిమాండ్ తగ్గిపోవడం వలన కార్ల తయారీదారుల నుండి ఈ తగ్గింపులు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి పెరిగాయి. డీలర్‌షిప్‌లు 25,000 నుండి 1,00,000 వరకు ప్రయోజనాలతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ
భారతదేశంలో వీడియో కంటెంట్ మార్కెట్ అభివృద్ధిచెందుతోంది. 2022లో OTT ఆదాయం $2 బిలియన్లు వచ్చాయి, రాబోయే మూడేళ్లలో $18 బిలియన్ల ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్, మీడియా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, OTT ప్రొడక్షన్ హౌస్‌ల పెరుగుదలకు ఇది కూడా కారణం అయింది. ఈ నేపథ్యంలో వీడియో పరికరాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
హ్యాకింగ్‌కు గురైన చైనీస్ ఆటోమొబైల్ దిగ్గజం 'నియో'
చైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం నియో కంపెనీ సాఫ్ట్‌వేర్ హ్యాకింగ్ బారిన పడింది. తమ సంస్థకు చెందిన కంప్యూటర్లలోని వినియోగదారులు, వాహనాల అమ్మకాల డేటాను హ్యాకర్లు చోరీ చేసినట్లు నియో యాజమాన్యం ప్రకటించింది.
కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోతున్న మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV
మహీంద్రా తన మొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV XUV400 గురించి ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో వెల్లడించింది. తయారీదారు e-SUV స్పెసిఫికేషన్‌ల గురించి చెప్పినప్పటికీ, ధరను ఇంకా వెల్లడించలేదు.