కార్: వార్తలు
భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ లాంటి ఇతర ఇంధన సమర్థవంతమైన కార్లు
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈ నెలాఖరులో భారతదేశంలో విడుదల కానుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 21.79 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుంది.
ఏప్రిల్‌లో భారతదేశంలో కార్ల ధరలను పెంచిన కంపెనీలు
BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా, భారతదేశంలోని వాహన తయారీదారులు అప్డేట్ అయిన మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. వాహనాలు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను భర్తీ చేయడానికి ధరలను పెంచుతున్నాయి.
2023 ఆర్థిక సంవత్సరంలో 3.6 మిలియన్ కార్లను కొనుగోలు చేసిన భారతీయులు
2023 ఆర్ధిక సంవత్సరంలో భారతీయ ప్యాసింజర్ వాహన (PV) పరిశ్రమ మార్కెట్‌లో 36 మిలియన్ కార్లు అమ్ముడయ్యాయి, ఇది ఒక కొత్త రికార్డు, ఇది మహమ్మారి ముందు FY 19లో నమోదైన 11.2 మిలియన్ల రికార్డులను దాటేసింది.
భారతదేశంలోనే అత్యంత ఖరీదైన సూపర్‌కార్‌ను కొనుగోలు చేసిన హైదరాబాదీ
లంబోర్ఘిని, ఆస్టన్ మార్టిన్, ఫెరారీ వంటి బ్రాండ్‌లు దేశంలో అధికారికంగా తమ కార్లను అందిస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా, భారతీయ మార్కెట్ అధిక-పనితీరు గల ఇతర దేశ కార్లపై ఆసక్తిని పెంచుతోంది.
గుజరాత్‌లో టాటా పంచ్ వాహనానికి అగ్ని ప్రమాదం
గుజరాత్‌లో నెలరోజుల ముందు కొన్న టాటా పంచ్ AMT అకాంప్లిష్డ్ మోడల్ మంటల్లో చిక్కుకుంది. హైవేపై కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు కారు యజమాని, అతని కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు.
2023 ఆర్ధిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలు
మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా, కియా ఇండియా వంటి కార్ల తయారీ సంస్థలు 2023 ఆర్ధిక సంవత్సరంలో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేశాయి.
మారుతి, హ్యుందాయ్, టాటా నుండి 2023లో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ కార్లు
భారతదేశంలోని చిన్న కార్ల మార్కెట్ అమ్మకాల పెరుగుదలను ఎదుర్కొంటుంది. ఏప్రిల్-డిసెంబర్ 2022 మధ్య, దేశంలో మొత్తం 994,000 యూనిట్ల చిన్న కార్లు అమ్ముడయ్యాయి.
అన్నీ వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష; ఆఖరు తేదీ పొడగింపు
దేశవ్యాప్తంగా ఉన్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ల సంసిద్ధత ప్రస్తుత స్థితిని దృష్టిలో ఉంచుకుని, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH) ఆ స్టేషన్‌ల ద్వారా తప్పనిసరి పరీక్ష తేదీని అక్టోబర్ 1, 2024 వరకు పొడిగించాలని నిర్ణయించింది.
ఏప్రిల్ నుంచి భారతదేశం అంతటా 7 శాతం పెరగనున్న టోల్ ఫీజులు
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా 7 శాతం వరకు టోల్ ఫీజు పెంపును అమలు చేయనుంది.
కొత్త హ్యుందాయ్ సొనాటా ఫీచర్ల గురించి తెలుసుకుందాం
హ్యుందాయ్ ఇటీవల భారత మార్కెట్లో కొత్త 2023 వెర్నాను విడుదల చేసింది, ఇది కంపెనీ కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ను కూడా పరిచయం చేసింది. హ్యుందాయ్ సాధారణంగా దాని సిరీస్ కు ఒకే విధమైన డిజైన్ ను రూపొందిస్తుంది.
మార్కెట్లోకి రానున్న మహీంద్రా థార్ కొత్త 4x4 ఎంట్రీ-లెవల్ వేరియంట్
మహీంద్రా థార్ ప్రస్తుతం AX(O), LX రెండు విస్తృత ట్రిమ్ సిరీస్ లో అందుబాటులో ఉంది. అవి రెండు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులోకి రానున్నాయి.
బి ఎం డబ్ల్యూ i5 ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ 5 సిరీస్ సెడాన్ జీరో-ఎమిషన్ డెరివేటివ్‌పై పని చేస్తోంది, దీనిని i5 అంటారు. బి ఎం డబ్ల్యూ ఎక్కువగా దాని సిరీస్ లో ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తుంది ఈ 5 సిరీస్ అందులో భాగమే.
కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ తన EV9 SUVని ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
కియా కేరెన్స్‌కి Vs సిట్రోయెన్ C3 ప్లస్ ఏది సరైన ఎంపిక
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ తన C3-ఆధారిత SUVని ఏప్రిల్ 27న విడుదల చేయనుంది. ఈ కారు డిజైన్ పూర్తిగా భారతదేశంలోనే రూపొందించారు. మార్కెట్లో ఇది కియా కేరెన్స్‌తో పోటీ పడుతుంది.
2023లో భారతీయ కొనుగోలుదారుల కోసం బి ఎం డబ్ల్యూ అందిస్తున్న కొత్త మోడల్స్
బి ఎం డబ్ల్యూకి 2021తో పోల్చితే 2022 భారతదేశంలో 35% కార్ల అమ్మకాలు పెరిగాయి. సంస్థ ఈ సంవత్సరం కూడా అదే రెండంకెల వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది.
భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం
ఈ ఏప్రిల్‌లో భారతదేశంలో BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలు అమలులోకి రావడంతో, వాహన తయారీదారులు అప్డేట్ చేసిన మోడళ్లను పరిచయం చేస్తున్నారు. కాబట్టి, ఫిట్‌నెస్ లేని వాహనాలు ఇకపై రోడ్ల మీదకు రావు. 2021లో ప్రవేశపెట్టిన వెహికల్ స్క్రాపేజ్ పాలసీ తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్షల నుండి పాత వాహన యజమానులకు ప్రోత్సాహకాల వరకు, అనేక అంశాలను కవర్ చేస్తుంది.
భారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ఈమధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ టెక్నాలజీలో అభివృద్ధి, కేంద్రం అందిస్తున్న ప్రయోజనాలతో, చాలా మంది ప్రజలు నగరాల్లో తమ ప్రాథమిక రవాణా మార్గంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను (BEVs) ఎంచుకోవడం ప్రారంభించారు.
త్వరలో మార్కెట్లోకి 2024 వోక్స్‌వ్యాగన్ టైగన్
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, జర్మన్ మార్క్ వోక్స్‌వ్యాగన్ టైగన్‌ను MY-2024 అప్‌గ్రేడ్‌లతో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. 2021లో లాంచ్ అయిన వోక్స్‌వ్యాగన్ టైగన్ భారతదేశం-నిర్దిష్ట MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ద్వారా అందించబడిన మొదటి కారు.
ఎలక్ట్రిక్ వాహనాల కోసం షోరూమ్‌లను ప్రారంభించనున్న టాటా మోటార్స్
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ త్వరలో భారతదేశంలోని 10 టైర్-2 నగరాల్లో తన ఎలక్ట్రిక్ వాహనాల సిరీస్ కోసం ప్రత్యేకమైన షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం దాని Nexon EV సిరీస్, Tiago EV కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగలదు.
భారతదేశంలో 23,500 బుకింగ్‌లను దాటిన మారుతీ-సుజుకి Jimny
ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించినప్పటి నుండి మారుతి సుజుకి Jimnyకు 23,500 బుకింగ్‌లు వచ్చాయి, అయితే ఈ భారీ బుకింగ్స్ తో రాబోయే SUV ఈ సెగ్మెంట్ లో తనతో పోటీ పడుతున్న మహీంద్రా థార్‌ను దాటేలా ఉంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలని పెంచే ఆలోచనలో మెర్సిడెస్-బెంజ్
లగ్జరీ సెగ్మెంట్‌లో భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్, భారతదేశంలో తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను రెట్టింపు చేయాలని ఆలోచిస్తుంది. వచ్చే 12 నెలల్లో మరో నాలుగు ఎలక్ట్రిక్ కార్లు భారతీయ రోడ్లపైకి రానున్నాయని తెలిపింది. పది కొత్త మోడళ్లలో ఇవి కూడా భాగం కానున్నాయి.
మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది
ఏప్రిల్‌లో తమ మోడల్ సిరీస్ ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది. అయితే వచ్చే నెల నుండి అమలు చేయాలనుకుంటున్న ధరల పెంపు వివరాలు ప్రకటించలేదు. మొత్తం ద్రవ్యోల్బణం, నియంత్రణ అవసరాల కారణంగా పెరిగిన ధరలతో కంపెనీ వినియోగదారుపై భారాన్ని మోపింది.
ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచనున్న హీరో మోటోకార్ప్
ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, ఏప్రిల్ 1 నుండి కొన్ని మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను సుమారు 2% పెంచనున్నట్లు ప్రకటించింది.
2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక
హ్యుందాయ్ 2023 వెర్నాతో భారతదేశంలో మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లోకి మళ్ళీ ప్రవేశించింది. ఈ వెర్షన్ ఇప్పుడు దాని ముందు మోడల్స్ కంటే పెద్దది, అదనపు భద్రత కోసం ADAS ఫంక్షన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఇది మార్కెట్లో 2023 హోండా సిటీతో పోటీ పడుతుంది.
రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా
లగ్జరీ వాహన తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన బ్లాక్ బ్యాడ్జ్ వ్రైత్ బ్లాక్ యారో మోడల్‌ను విడుదల చేసింది. ఈ కారు ఒక రెగల్ డిజైన్ తో బెస్పోక్ 'స్టార్‌లైట్ హెడ్‌లైనర్'తో ఉన్న క్యాబిన్ ఉంటుంది. కారు గ్లాస్-ఇన్ఫ్యూజ్డ్ టాప్‌కోట్‌తో పెయింట్‌వర్క్‌తో వస్తుంది.
భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ
అధిక పన్నులు, పేలవమైన రహదారి మౌలిక సదుపాయాలు భారతదేశంలో సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధిని పరిమితం చేస్తున్నాయని లంబోర్ఘిని గ్లోబల్ సిఈఓ, స్టీఫన్ వింకెల్‌మాన్ అభిప్రాయాన్ని వ్యాకటం చేశారు. దేశంలోని మౌలిక సదుపాయాలు అభివృద్ది ఇంకా వేగంగా జరగాలని అన్నారు.
మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ వెర్నా 2023 కారు మార్చి 21న భారతదేశంలోలాంచ్ కానుంది. హ్యుందాయ్ వెర్నా 2023 వెర్షన్ కారును లాంచ్ చేయడానికి హ్యుందాయ్ మోటార్స్ సిద్ధమైంది.
భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా
టయోటా కిర్లోస్కర్ మోటార్ టయోటా ఇన్నోవా క్రిస్టా 2023ని రూ.19.13 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)కు విడుదల చేసింది.
2024 మెర్సిడెస్-బెంజ్ GLA v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనడం మంచిది
మెర్సిడెస్-బెంజ్ తన ఎంట్రీ-లెవల్ SUV GLAని MY-2024 అప్‌డేట్‌లతో గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల చేయనుంది. మార్కెట్లో ఈ సెగ్మెంట్ లో బి ఎం డబ్ల్యూ X1తో పోటీ పడుతుంది. SUV బాడీ స్టైల్ కు ఈమధ్య డిమాండ్ బాగా పెరిగింది.
టయోటా హిలక్స్ ధరల తగ్గింపు, కొత్త ధరల వివరాలు
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల తన హిలక్స్ పిక్-అప్ ట్రక్ ధరలను సవరించింది. స్టాండర్డ్, హై అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్
గతంలో భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన తెల్లటి రంగు ఆడి R8, మహారాష్ట్రలోని ఒక పోలీసు స్టేషన్ వెలుపల పాడుబడిన స్థితిలో గుర్తించారు. 2012లో ఈ R8 మోడల్ సూపర్‌కార్ ను కోహ్లి కొనుగోలు చేశారు.
ఫెరారీ సరికొత్త ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ కారు రోమా స్పైడర్ ఫీచర్స్
ఐకానిక్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ ప్రపంచ మార్కెట్ల కోసం సరికొత్త రోమా స్పైడర్‌ను విడుదల చేసింది. రోడ్‌స్టర్ మోడల్ గురించి ఇటీవల తయారీసంస్థ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు.
ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ తన మిడ్-సైజ్ SUV, సెల్టోస్‌ను MY-2023 అప్‌గ్రేడ్‌లతో అప్‌డేట్ చేసింది. ఇందులో స్టాప్ సిస్టమ్ ఉంది. 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ మిల్లు స్థానంలో కొత్త 1.5-లీటర్ T-GDi ఇంజన్ తో నడుస్తుంది. మార్కెట్లో ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్‌తో పోటీపడుతుంది.
అత్యంత సరసమైన వోక్స్‌వ్యాగన్ EV టాప్ ఫీచర్లు తెలుసుకుందాం
జర్మన్ తయారీసంస్థ వోక్స్‌వ్యాగన్ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనం ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న వెర్షన్ ID.2allను ప్రపంచ మార్కెట్ల కోసం ప్రదర్శించింది. ఎలక్ట్రిక్ వాహనం బ్రాండ్ కొత్త MEB ఎంట్రీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ID వాహనాలలో డిజైన్ ఫిలాసఫీ ఉంటుంది.
Citroen C3 2023లో రెండవసారి పెరిగిన ధర
ఈ జనవరిలో పెరిగిన తర్వాత, Citroen C3 ధర మరోసారి భారతదేశంలో పెరిగింది. ఈసారి అది రూ. 18,000 పెరిగింది. ఇప్పుడు ప్రారంభ ధర రూ. 6.16 లక్షలు. తరచుగా ధరలు పెరగడంతో కస్టమర్‌లు ఈ వాహనం వైపు ఆకర్షణ తగ్గే అవకాశం ఉంది.
త్వరలో లాంచ్ కానున్న కియా EV9 స్టైలిష్ ఎలక్ట్రిక్ SUV
దక్షిణ కొరియా తయారీసంస్థ కియా మోటార్స్ తన EV9 SUV వెర్షన్‌ను ప్రకటించింది. ఇది 2024 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుంది. కారు ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో, మూడు వరుసల సీట్లతో ఉన్న విశాలమైన క్యాబిన్ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది.
మెరుగైన స్టైలింగ్ తో మార్కెట్లోకి వచ్చిన 2024 మెర్సిడెస్-బెంజ్ GLC కూపే
జర్మన్ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన GLC కూపే 2024 వెర్షన్‌ను ప్రపంచ మార్కెట్లలో ప్రకటించింది. ఇది భారతదేశానికి త్వరలోనే వస్తుంది. ప్రీమియం వాహనం డిజైన్‌తో టెక్-ఆధారిత సౌకర్యాలతో ఉన్న సంపన్నమైన క్యాబిన్, గరిష్టంగా 255hp శక్తిని ఉత్పత్తి చేసే తేలికపాటి-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది.
టాప్-ఎండ్ కియా కేరెన్స్ కంటే ఎంట్రీ-లెవల్ టయోటా ఇన్నోవా క్రిస్టా మెరుగ్గా ఉంటుందా
2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఈ జనవరిలో భారతదేశంలో లాంచ్ అయింది, త్వరలో విడుదల కానుంది. మార్కెట్‌లో, ఎంట్రీ-లెవల్, సెవెన్-సీటర్ G మోడల్ కియా కేరెన్స్ రేంజ్-టాపింగ్ లగ్జరీ ప్లస్ సెవెన్-సీటర్ వేరియంట్ తో పోటీ పడుతుంది.
టాటా పంచ్ కు పోటీగా మైక్రో SUVను లాంచ్ చేయనున్న హ్యుందాయ్ ఇండియా
హ్యుందాయ్ 2024 ప్రారంభంలో భారతదేశంలో టాటా పంచ్ (Ai3 అనే సంకేతనామం)కి ప్రత్యర్థిని విడుదల చేయనుంది. కారు పైకప్పు పట్టాలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు ఉన్నాయని ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.
LED హెడ్‌లైట్‌లకు అప్‌గ్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా ఇది తెలుసుకోండి
దాదాపు అన్ని వాహన తయారీదారులు తమ దృష్టిని LED హెడ్‌లైట్‌ల వైపు మార్చడంతో, అనేక OEMలు, విడిభాగాల తయారీదారులు భారతీయ మార్కెట్‌లో LED యూనిట్‌లను ప్రవేశపెడుతున్నారు. భారతదేశంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో LED రీప్లేస్‌మెంట్ బల్బులు రూ.1,000కే అందుబాటులో ఉన్నాయి. హాలోజన్ బల్బ్ పేలవమైన పనితీరుతో ఇబ్బందీపడలేక, చాలా మంది ఆఫ్టర్మార్కెట్ HID (హై-ఇంటెన్సిటీ డిశ్చార్జ్) లేదా LED (లైట్-ఎమిటింగ్ డయోడ్) యూనిట్లను ఎంచుకుంటున్నారు.