కార్: వార్తలు

25 Jan 2023

జపాన్

జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన

జపనీస్ వాహన తయారీ సంస్థ Nissan తన స్వదేశంలో కిక్స్ 327 ఎడిషన్ క్రాసోవర్‌ను ఆవిష్కరించింది. ఇది ఫిబ్రవరి 28 వరకు ప్రదర్శనలో ఉంటుంది. న్యూ బ్యాలెన్స్ 327 Sneakers నుండి ప్రేరణ పొందిన ఈ వాహనం లేస్‌లు, ప్రత్యేక డీకాల్స్‌తో షూ లాంటి డిజైన్‌ తో ఉంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది.

24 Jan 2023

ధర

భారతదేశంలో మార్చిలో విడుదల కానున్న హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్)

జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్చి 2023 నాటికి భారతదేశంలో విడుదల చేయనుంది.సరికొత్త సాంకేతిక-ఆధారిత ఫీచర్లతో కొన్ని మార్పులతో అందుబాటులోకి వస్తుంది. డీజిల్ ఇంజిన్ నిలిపివేసి పెట్రోల్, పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ల ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

భారతదేశంలో విడుదలైన హ్యుందాయ్ 2023 AURA సెడాన్‌

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ సంస్థ 2023 AURA సెడాన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది E, S, SX, SX(O) వేరియంట్లలో లభిస్తుంది. విశాలమైన టెక్-లోడెడ్ క్యాబిన్‌ తో పాటు స్టైలిష్ డిజైన్ తో వస్తుంది. ఇది పెట్రోల్, CNG రెండిటిలో 1.2-లీటర్ ఇంజన్ తో నడుస్తుంది. ఇది ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది.

23 Jan 2023

ఫీచర్

జనవరి 26న రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi జనవరి 26న సరికొత్త యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్ కారును విడుదల చేయనుంది. "సెలబ్రేషన్ ఆఫ్ ప్రోగ్రెస్" ఈవెంట్‌లో భాగంగా ప్రదర్శించబడుతుంది. ఇది గ్రాండ్‌స్పియర్, అర్బన్‌స్పియర్ మోడల్‌ లాగానే PPE ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.

23 Jan 2023

ప్రకటన

కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW

పాల్ లెఫెవ్రే అనే ఫ్రెంచ్ సర్ఫ్‌బోర్డ్ షేపర్, బిల్డర్ చేతితో చెక్కిన కార్బన్ ఫైబర్ బాడీ ప్యానెల్‌లతో ఒక రకమైన రెస్టో-మోడెడ్ 1969 BMW 1602 కారును ప్రదర్శించారు. తేలికైన పదార్ధాల ఉపయోగం క్లాసిక్ సెడాన్ మొత్తం బరువును 816kgలకు తగ్గించింది. అదే సమయంలో వాహనం నిర్మాణ కూడా ధృడంగా ఉంది.

భారతదేశంలో విడుదలైన Bentley Bentayga EWB Azure, పూర్తి వివరాలు తెలుసుకుందాం

లగ్జరీ కార్ల తయారీ సంస్థ Bentley భారతదేశంలో Bentayga EWB Azure మోడల్‌ను విడుదల చేసింది. అల్ట్రా-విలాసవంతమైన ఈ Azure వేరియంట్‌లో వెనుక ఎయిర్‌లైన్ సీట్లు, ఆటోమేటిక్ సాఫ్ట్-క్లోజింగ్ డోర్లు, మొత్తం ఫ్లోర్‌ను కవర్ చేసే 'డీప్ పైల్ ఓవర్' మ్యాట్‌లు, ప్రీమియం నైమ్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ SUV 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, V8 పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది.

ఆటోమొబైల్ రంగం భవిష్యత్తును నిర్దేశించనున్న Qualcomm Snapdragon Digital Chassis

టెక్నాలజీ దిగ్గజం Qualcomm USలోని లాస్ వెగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో Snapdragon Digital Chassis కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్ కారుతో ఆటోమేకర్లు దాని టెక్నాలజీ, సర్వీస్ ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రదర్శించింది. ఇది మొదటి ఆటోమోటివ్ సూపర్-కంప్యూట్ క్లాస్ సొల్యూషన్ గా ప్రచారం అవుతుంది.

భారతదేశంలో విడుదలైన 2023 హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS

హ్యుందాయ్ భారతదేశంలో గ్రాండ్ i10 NIOS 2023 అప్డేట్ ను లాంచ్ చేసింది. 2019లో ప్రవేశపెట్టిన హ్యుందాయ్‌ గ్రాండ్ i10 NIOS భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా మారింది.

DBS 770 అల్టిమేట్ కార్ లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ స్టన్-మార్టిన్

బ్రిటిష్ వాహన తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తన DBS 770 అల్టిమేట్ కారును లాంచ్ చేసింది. దీని ఉత్పత్తి 499 యూనిట్లకు పరిమితం అయింది. ఈ కారులో వివిధ టెక్నాలజీ ఆధారిత సౌకర్యాలతో ఉన్న సంపన్నమైన క్యాబిన్‌ ఉంది. ఇది 5.2-లీటర్ V12 ఇంజన్‌తో నడుస్తుంది.

18 Jan 2023

టాటా

ఆటో ఎక్స్‌పో 2023లో 10-సీట్ల టాటా మ్యాజిక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించిన టాటా మోటార్స్

స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త మ్యాజిక్ EVని ప్రదర్శించింది. భారతదేశంలో ప్రధానంగా పాఠశాలలు, స్టేజ్ క్యారేజ్, అంబులెన్స్‌లు వంటి డెలివరీ సేవలను లక్ష్యంగా చేసుకుంది.

X7 SUV 2023వెర్షన్ ను 1.2కోట్లకు లాంచ్ చేసిన BMW సంస్థ

జర్మన్ వాహన తయారీ సంస్థ BMW X7 SUVని భారతదేశంలో విడుదల చేసింది. ఇది xDrive40i M Sport, xDrive40d M Sport వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు కంపెనీ యొక్క కొత్త డిజైన్ తో పాటు సరికొత్త టెక్నాలజీతో ఉన్న ట్వీక్డ్ క్యాబిన్‌ తో వస్తుంది. రెండూ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో 3.0-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది.

XUV400 ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో లాంచ్ చేసిన మహీంద్రా

మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ వాహానాన్ని భారతదేశంలో విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. సరికొత్త కార్ టెక్నాలజీతో విశాలమైన క్యాబిన్‌ తో వస్తుంది. మహీంద్రా XUV400 గురించి గత సంవత్సరం సెప్టెంబరులో ప్రకటించారు. ఈ బ్రాండ్ కు ఇదే మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ SUV. మార్కెట్‌లో, MG ZS EV, టాటా నెక్సాన్ EV వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతుంది.

స్వదేశంలో మొట్టమొదటిసారి రూపొందిన సూపర్‌కార్ మాడా 9ను ఆవిష్కరించిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో మొట్టమొదటి తయారుచేసిన మాడా 9 అనే సూపర్‌కార్‌ను ఆవిష్కరించింది తాలిబాన్. ENTOP అనే సంస్థ ఈ వాహనాన్ని ఐదు సంవత్సరాలు రూపొందించింది. అద్భుతమైన పనితీరుతో పాటు స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ కార్ టయోటా కరోలా ఇంజిన్ తో నడుస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ కూడా వచ్చే అవకాశముంది.

ఆటో ఎక్స్‌పో 2023లో ప్రవైగ్ వీర్ EVను లాంచ్ చేసిన ప్రవైగ్ డైనమిక్స్

స్వదేశీ స్టార్టప్ ప్రవైగ్ డైనమిక్స్ ఆటో ఎక్స్‌పో 2023లో వీర్ EVని ప్రదర్శించింది. ఆఫ్-రోడ్ ఎలక్ట్రిక్ కారు ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ కోసం రూపొందించబడింది.

ఆటో ఎక్స్‌పో 2023లో హైడ్రోజన్-శక్తితో పనిచేసే Euniq 7ను ఆవిష్కరించిన MG మోటార్

బ్రిటిష్ సంస్థ MG మోటార్ దాని పూర్తి-పరిమాణ MPV Euniq 7ను ఆటో ఎక్స్‌పో 2023లో విడుదల చేసింది. ఇది వివిధ గ్లోబల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉన్న హైడ్రోజన్-శక్తితో పనిచేసే Maxus Euniq 7 వ్యాన్ రీ-బ్యాడ్జ్ వెర్షన్. ఇది పర్యావరణ అనుకూల వాహనం. MG 2019లో భారతీయ మార్కెట్లో హెక్టర్‌తో ప్రారంభించింది. ఇది ఫీచర్-ప్యాక్డ్ మిడ్-సైజ్ SUV ఆఫర్ కోసం చూస్తున్న కొనుగోలుదారులను బాగా ఆకర్షించింది.

మారుతీ సుజుకి సంస్థ నుండి వస్తున్న NEXA సిరీస్ లో మరో SUV

మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త కూపే SUV ఫ్రాంక్స్‌ను విడుదల చేసింది. ఇందులో బాలెనో RS మోడల్‌లో చివరిగా కనిపించిన అత్యంత ప్రశంసలు పొందిన 1.0-లీటర్ బూస్టర్ జెట్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. ఇది సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా రకాల్లో అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS v/s మారుతి-సుజుకి స్విఫ్ట్ ఏది మంచిది

హ్యుందాయ్ తన ఎంట్రీ-లెవల్ వాహనం గ్రాండ్ i10 NIOS 2023 వెర్షన్ లాంచ్ చేసింది. ప్రస్తుతం బుకింగ్స్ తెరిచారు. అప్‌డేట్ చేసిన ఈ మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్‌కి పోటీగా ఉంటుంది.

ఆటో ఎక్స్‌పో 2023లో EV9తో పాటు ఇతర కార్లని ప్రదర్శించిన కియా సంస్థ

ఆటో ఎక్స్‌పో 2023లో భారతదేశంలో వివిధ మోడళ్లను కియా మోటార్స్ ప్రదర్శించింది. బ్రాండ్ EV9 కాన్సెప్ట్, KA4 (కార్నివాల్)తో పాటుగా భారతదేశంలో ఇప్పటికే ఉన్న EV6, సెల్టోస్, సోనెట్ వంటి కొన్ని కార్లను విడుదల చేసింది. కియా మోటార్స్ తన సెల్టోస్ SUV 2019లో 44,000 కంటే ఎక్కువ అమ్మకాలతో భారతీయ మార్కెట్లో ప్రభంజనం సృష్టించింది.

ఆటో ఎక్స్‌పో 2023లో హ్యుందాయ్ సంస్థ విడుదల చేసిన IONIQ 5

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం IONIQ 5 ను భారతీయ మార్కెట్ కోసం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో ఈ బ్రాండ్ జనవరి 13నుండి 18 వరకు సాధారణ ప్రజలకు కోసం ప్రదర్శిస్తోంది. దీనికి ప్రత్యేకమైన డిజైన్ తో పాటు ఫీచర్-రిచ్ క్యాబిన్‌ ఉంది.

BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను నిషేధించింది. నిషేధం జనవరి 12 వరకు అమలులో ఉంటుంది, కాలుష్య స్థాయిలు తగ్గకపోతే పొడిగించే అవకాశం ఉంది.

భారతదేశంలో 2023 BMW 3 సిరీస్ గ్రాన్-లిమౌసిన్ ధర రూ. 58 లక్షలు

జర్మన్ వాహన తయారీ సంస్థ BMW తన 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ కారు 2023 వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది: 330Li M స్పోర్ట్, 320Ld M స్పోర్ట్. అప్‌డేట్ చేయబడిన డిజైన్, విలాసవంతమైన క్యాబిన్ టెక్-ఆధారిత ఫీచర్లతో వస్తుంది. ఇది 2.0-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ల ఆప్షన్ తో అందుబాటులో ఉంది.

2023 వేసవిలో తన ఇండియా వెర్షన్ SUVని లాంచ్ చేయనున్న హొండా

హోండా తన SUVని మే 2023 నాటికి భారతదేశంలో లాంచ్ పండుగ సీజన్‌లో అమ్మకాలు మొదలుపెట్టే అవకాశముంది. తాజా అప్డేట్ లో , ఈ బ్రాండ్ వాహనం టీజర్ చిత్రాన్ని విడుదల చేసింది. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ తో వస్తుంది.

మార్కెట్లో విడుదలైన మహీంద్రా Thar 2WD రూ. 10 లక్షలు

మహీంద్రా తన Thar SUV 2WD వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. మహీంద్రా ఇండియా లైనప్‌లో Thar ఒక సమర్థవంతమైన ఆఫ్-రోడర్. దీన్ని మరింత సరసమైనదిగా చేయడానికి, బ్రాండ్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 2WD వెర్షన్‌ను పరిచయం చేసింది.

భారతదేశం మార్కెట్లో డిసెంబర్ విడుదల కాబోతున్న 2023మెర్సిడెస్-బెంజ్ GLC

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారతీయ మార్కెట్ కోసం మిడ్-సైజ్ ప్రీమియం SUV, 2023 GLCను డిసెంబర్ లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ వెర్షన్ లో SUVలో ఫ్రంట్ ఫాసియా ఉంది. వీల్‌బేస్‌ప్రస్తుత మోడల్ కంటే పొడవుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా, ఫోర్-వీలర్ మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది.

మారుతీ సుజుకి గ్రాండ్ విటారా S-CNG ధర రూ. 12.85 లక్షలు

స్వదేశీ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి SUV సరికొత్త S-CNG వెర్షన్ గ్రాండ్ విటారాను భారతదేశంలో విడుదల చేసింది, దీని ప్రారంభ ధర రూ. 12.85 లక్షలు (ఎక్స్-షోరూమ్). టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఆధారంగా, CNG-శక్తితో పనిచేసే SUV డెల్టా, జీటా వేరియంట్‌లలో ఇది లభిస్తుంది. ఈ ప్రీమియం మిడ్-సైజ్ SUVకి 26.6km/kg ఇంధన సామర్ధ్యం ఉందని పేర్కొంది.

లాస్ వెగాస్ CES 2023లో సరికొత్త ఆకర్షణ Peugeot ఇన్సెప్షన్ కాన్సెప్ట్

లాస్ వెగాస్‌లోని CES 2023లో Peugeot ఇన్‌సెప్షన్ కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శించింది దాని తయారీసంస్థ. ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనం ఫాస్ట్ ఇండక్షన్ ఛార్జింగ్ సిస్టమ్‌తో కేవలం ఐదు నిమిషాల్లో 150కిమీల వరకు వెళ్లగలదు. ఇందులో వీడియో గేమ్స్ లో ఉన్నట్టు దీర్ఘచతురస్రాకార స్టీరింగ్ వీల్‌ను ఉపయోగించే హైపర్‌స్క్వేర్ స్టీర్-బై-వైర్ కంట్రోల్ సిస్టమ్‌తో వచ్చే ఐ-కాక్‌పిట్‌ కూడా ఉంది.

ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కు సిద్దమైన MG 4 EV

బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MG మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం 2023 MG 4ని ఈ నెలలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో భారతదేశంలో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.MG 4 గత ఏడాది జూలైలో గ్లోబల్ మార్కెట్‌ లో లాంచ్ అయింది.

Hyundai మోటార్ ఇండియాకు కొత్త COOగా తరుణ్ గార్గ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా సోమవారం తన సీనియర్ మేనేజ్‌మెంట్ లీడర్‌షిప్‌లో జరిగిన మార్పును ప్రకటించింది. ఇది జనవరి 1, 2023 నుండి అమలులోకి వచ్చింది.

ఇకపై ప్రమాదకరమైన రోడ్ల గురించి అప్డేట్ చేసే Waze యాప్

Waze యాప్ పేరెంట్ సంస్థ అయిన గూగుల్ ట్రాఫిక్ డేటా ఆధారంగా ప్రమాదకరమైన సమీపంలోని రోడ్‌ల గురించి వినియోగదారులకు హెచ్చరిక చేసే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

భారతదేశంలో జనవరిలో లాంచ్ కాబోతున్న టాప్ 5 కార్లు

కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు వాహన తయారీదారులు అనేక కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. జనవరి 2023లో భారతదేశంలో ప్రారంభించబోయే టాప్ 5 వాహనాల గురించి తెలుసుకుందాం.

డిసెంబర్ లో రికార్డు స్థాయిలో వాహన అమ్మకాలు: తగ్గింపులే కారణం

భారతదేశంలో ప్రయాణీకుల వాహనాల (PVS) రిటైల్ విక్రయాలు డిసెంబరులో రికార్డును తాకనున్నాయి. సంవత్సరాంతపు తగ్గింపులు వలన భారీగా అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్‌లో ప్రయాణీకుల వాహనాల రిటైలింగ్ భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో 400,000 మార్కును తాకే అవకాశం ఉంది.

2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి

భారతదేశం 2021లో 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తాజా డేటా ప్రకారం ఈ ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించగా, 3,84,448 మంది వ్యక్తులు గాయపడ్డారు. 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6% పెరిగాయి. ఏడాదిలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు 16.9%, గాయాలు 10.39%గా నమోదు అయ్యాయి.

అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తున్న రవాణా శాఖ

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డీలర్ ప్రామాణికతను గుర్తించడానికి రిజిస్టర్డ్ వాహనాల డీలర్‌ల కోసం అధికార ధృవీకరణ పత్రాలను ప్రవేశపెట్టింది. ఈ చర్య వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు పారదర్శకతను ప్రోత్సహిస్తుంది.

2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ

భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమ 2024 చివరి నాటికి రూ. 15 లక్షల కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఈ రంగంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాలలో ఒకటిగా మారుతుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

2022లో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ను వీడిన టాప్ 5 మోడల్స్

2022 సంవత్సరం భారతీయ ఆటోమోటివ్ మార్కెట్‌లో చాలా కార్లు, బ్రాండ్‌లు వచ్చి చేరాయి. అయితే అమ్మకాలు తగ్గడం, కఠినమైన నిబంధనలకు అనుగుణంగా ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్న కారణంగా కొన్ని మోడల్‌ల నిష్క్రమణ కూడా 2022లో జరిగింది.

2023లో సరికొత్త డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో రాబోతున్న టాటా సఫారి

టాటా ఫ్లాగ్‌షిప్ SUV, సఫారి, 2023లో అప్‌డేట్ వస్తుంది. SUV గత సంవత్సరం అప్డేట్ లాంచ్ అయినప్పటి నుండి మంచి అమ్మకాలను సాధిస్తోంది. అయితే, మహీంద్రా XUV700, స్కార్పియో N రాక 7-సీటర్ SUV సెగ్మెంట్‌లో పోటీ పెరిగింది. ఈ రెండు మోడల్స్ సఫారి కంటే మెరుగైన ఫీచర్స్ ను అందిస్తున్నాయి.

మరో 5 వేరియంట్లను విడుదల చేయనున్న మహీంద్రా స్కార్పియో-ఎన్

స్వదేశీ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా & మహీంద్రా స్కార్పియో-ఎన్ లైనప్‌లో ఎంట్రీ లెవల్ నుండి మిడ్-స్పెక్ వరకు ఐదు కొత్త వేరియంట్‌లను విడుదల చేయనుంది. SUVలో ఇప్పుడు ఇంజిన్ (పెట్రోల్/డీజిల్), ట్రాన్స్‌మిషన్ (మాన్యువల్/ఆటోమేటిక్), సీటింగ్ (ఆరు/ఏడు) ఆప్షన్స్ బట్టి 30 రకాల వేరియంట్‌లు ఉన్నాయి.

27 Dec 2022

ధర

టాటా హారియర్ సర్ప్రైజ్.. లాంచ్ కాబోతున్న సరికొత్త స్పెషల్ ఎడిషన్

టాటా హారియర్ SUV ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ కోసం ప్రపంచం ఎదురుచూస్తుండగా, టాటా మోటార్స్ దానికి బదులుగా SUVలో మరొక ఎడిషన్ వెర్షన్‌ను తీసుకురావడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇటీవల టాటా హారియర్ డార్క్ ఎడిషన్ కొన్ని చిత్రాలు బయటికి వచ్చాయి. ఇందులో రెడ్-థీమ్ హైలైట్‌

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కన్నా లీజు లాభం అంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు

టాక్సీ, లాజిస్టిక్స్ కంపెనీలు వంటి ఫ్లీట్ ఆపరేటర్లు ఎలక్ట్రిక్ వాహనాల్ని ఎక్కువగా లీజుకి తీసుకుంటున్నారు. టాప్ బ్యాంకులు ఎలక్ట్రిక్ వాహనాలకు ఫైనాన్స్ ఇవ్వడానికి విముఖత చూపడంతో లీజుకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

7 సిరీస్‌లతో పాటు BMW i7 జనవరి 7న లాంచ్

BMW జనవరి 7న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జరిగే "జాయ్‌టౌన్" ఈవెంట్‌లో 7 సిరీస్, సరికొత్త i7ను భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2022 ఏప్రిల్‌లో వివిధ గ్లోబల్ మార్కెట్లలో ఈ సంస్థ ప్రీమియం కార్లను విడుదల చేసింది.

మునుపటి
తరువాత