బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

OYO వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహానికి హాజరైన సాఫ్ట్‌బ్యాంక్ CEO, Paytm బాస్

ఓయో హోటళ్ల సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌ వివాహం గీతాన్షా సూద్‌తో దిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో మంగళవారం ఘనంగా జరిగింది.

ఎడ్‌టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం

ఎడ్‌టెక్ సంస్థ upGrad దాని అనుబంధ సంస్థ 'క్యాంపస్'లో 30% మంది ఉద్యోగులను తొలగించింది. upGrad ఈ ఏడాది ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి.

7,000 కోట్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించిన అదానీ గ్రూప్

US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ 10 లిస్టెడ్ కంపెనీలలో మార్కెట్ నష్టాలకు దారితీసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు రుణాన్ని తగ్గించడంపై దృష్టి సారించడం ప్రారంభించింది.

07 Mar 2023

మెటా

ఆర్థిక లక్ష్యాల కోసం ఉద్యోగ కోతలు ప్రారంభించిన మెటా

ఫేస్ బుక్-పేరెంట్ సంస్థ మెటా ఈ వారంలో మరిన్ని ఉద్యోగ కోతలు గురించి కంపెనీ ఆలోచిస్తుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. నవంబర్‌లో 11,000 ఉద్యోగులను అంటే సిబ్బందిలో 13% మందిని తొలగించారు. మెటా 2022 ఆర్థిక అనిశ్చితి, పడిపోతున్న ప్రకటన ఆదాయంతో టిక్‌టాక్‌తో పోటీ పడుతుంది.

ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు

అధిక ఇన్‌పుట్ ఖర్చుల నుండి తమ మార్జిన్‌లను కాపాడుకోవడానికి పరిశ్రమలు పెంచుతున్న ధరలను భారతీయులను ఇబ్బంది పెడుతున్నాయి. తక్కువ-మధ్య ఆదాయ జనాభా మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది, వినియోగం తీవ్ర తగ్గుదలను చూస్తోంది, గృహా పొదుపులు మూడు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.

ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్

ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్ జూమ్ ఒక నెల క్రితం సిబ్బందిలో 15% మందిని తొలగించింది. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించినట్లు సమాచారం.

మనవడికి స్వాగతం పలికిన బిల్ గేట్స్ మెలిండా దంపతులు

బిల్ గేట్స్, మెలిండా గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. గత ఏడాది నవంబర్‌లో ఈ జంట గర్భం దాల్చినట్లు ప్రకటించారు. డిసెంబర్‌లో మెలిండా జెన్నిఫర్‌కు బేబీ షవర్‌ చేశారు.

మరింత లాభపడిన భారతీయ రూపాయి

విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీలకు తిరిగి రావడంతో రూపాయి గత వారం దాదాపు 1% పెరిగి డాలర్‌కు 81.9650 వద్ద ముగిసింది. ప్రస్తుత వారంలో, ఇది 81.60-82.50 మధ్య కదులుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎయిర్ టెల్ అందిస్తున్న ఉత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు

విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లయితే పర్యటనకు తగిన అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌. ఎయిర్ టెల్ అందిస్తున్న వాయిస్ కాల్ అలవెన్స్, డేటాను అందించే ప్లాన్ గురించి తెలుసుకుందాం.

అదానీ బ్లాక్ డీల్‌లో రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టిన స్టార్ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్

అమెరికాకు చెందిన గ్లోబల్ ఈక్విటీ-ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, GQG పార్టనర్స్‌కు బ్లాక్ డీల్‌లో దాని ప్రమోటర్లు రూ. 15,446 కోట్ల విలువైన వాటాలను అమ్మిన తర్వాత అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లు శుక్రవారం పెరిగాయి. ఈ సందర్భంగా పెట్టుబడిదారు, GQG పార్టనర్స్, దాని ఛైర్మన్ రాజీవ్ జైన్ గురించి మార్కెట్లో చర్చ మొదలైంది.

04 Mar 2023

ఆపిల్

బెంగళూరులో 100,000 ఉద్యోగాలను సృష్టించనున్న Foxconn ఐఫోన్ ప్లాంట్

అమెరికా చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ప్రధాన తయారీదారుగా చైనా స్థానాన్ని సవాలు చేస్తున్నాయి. ఆపిల్ వంటి కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చాలాకాలం నుండి వెతుకుతున్నాయి అయితే అటువంటి సంస్థలకు ఎక్కువగా కనిపిస్తున్న మార్గం భారతదేశం. ఇప్పుడు, తైవానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్, ఆపిల్ కు అతిపెద్ద సరఫరాదారు, బెంగళూరులో ఫ్యాక్టరీని నిర్మించడానికి $700 మిలియన్లను పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంది.

క్రిప్టో మార్కెట్‌ను తగ్గిస్తున్న సిల్వర్‌గేట్ గురించి తెలుసుకుందాం

2022లో పతనం తర్వాత క్రిప్టో ప్రపంచం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తుంది. అయితే, ఆ స్థితి కొంతకాలమే ఉండచ్చు.

మైక్రోసాఫ్ట్ $69బిలియన్లకు కొనుగోలు చేసిన యాక్టివిజన్‌ ప్రత్యేకత ఏంటి

మైక్రోసాఫ్ట్ $69 బిలియన్ల కొనుగోలు చేసిన యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలు గురించి అందరికీ తెలిసినా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఆ ఒప్పందం చివరకు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు

వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ఉద్యోగ కోతలు ప్రారంభించాయి. 2022 సంవత్సరంలో మొదలైన ఉద్యోగుల తొలగింపుల సీజన్ 2023లో కూడా కొనసాగుతుంది. ఇంకా సంవత్సరంలో మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

కరెన్సీ విలువ గురించి చెప్పే బిగ్ మాక్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం

బిగ్ మాక్ ఇండెక్స్‌ను 1986లో ది ఎకనామిస్ట్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల కొనుగోలు శక్తిని కొలవడానికి సులభంగా అర్దమయ్యే విధంగా ఉంటుందని రూపొందించింది.

అందుబాటు ధరకు జీన్ టెస్టింగ్ కిట్‌ను విడుదల చేయనున్న రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారతదేశ వినియోగదారుల సరసమైన ధరకు అందించే ప్రయత్నంలో జన్యు టెస్టింగ్ మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది.

FTX వివాదంలో చిక్కుకున్న భారతీయ సంతతికి చెందిన టెక్కీ నిషాద్ సింగ్

FTXలో ఇంజనీరింగ్ మాజీ డైరెక్టర్ నిషాద్ సింగ్ ఆరు మోసం ఆరోపణలకు నేరాన్ని అంగీకరించాడు. క్రిప్టో ఎక్స్ఛేంజ్ పతనంపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వానికి సహాయం చేయడానికి కూడా అతను అంగీకరించాడు.

హిండెన్‌బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని స్వాగతించిన గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీ స్టాక్ రూట్‌కు కారణమైన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై కొనసాగుతున్న విచారణపై సుప్రీం కోర్టు ఆదేశాలను వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ గురువారం స్వాగతించారు.

GDP క్షీణించినప్పటికీ భారతదేశం వృద్ధిపై నీళ్ళు చల్లుతున్న మూడీస్

ఆర్ధిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో GDP వృద్ధి మందగించినప్పటికీ, మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ 2023లో భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను పెంచింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇప్పుడు 2023 లో భారతదేశం నిజమైన GDP 5.5% వద్ద పెరుగుతుందని అంచనా వేసింది. ఇది అంతకుముందు వృద్ధి రేటును 4.8% వద్ద పెంచింది.

అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా

ఈ ఏడాది జనవరిలో, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వలన అదానీ గ్రూప్ స్టాక్‌లు ఘోరంగా పతనమయ్యాయి. ఒక నెలకు పైగా పతనమయ్యాక ఈ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు చివరకు రికవరీ సంకేతాలను చూపిస్తున్నాయి.

మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి

మనలో చాలా మంది నికర విలువ గురించి పట్టించుకోరు కారణం ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం. కారణం ఏదైనా కావచ్చు, వ్యక్తిగత ఫైనాన్స్‌ను సమర్ధవంతంగా నిర్వహించడానికి నికర విలువను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో GDP వృద్ధి మందగించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం, GDP వృద్ధి రెండవ త్రైమాసికంలో 6.3%తో పోలిస్తే 4.4%కి వచ్చింది.

01 Mar 2023

బ్యాంక్

వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఐదు రోజుల పని వారానికి డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆరోజు పని గంటలను భర్తీ చేయడానికి ప్రతిరోజూ 50 నిమిషాలు పెంచే అవకాశం ఉంది.

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశం జిడిపి వృద్ధి 4.4 శాతం తగ్గుదల

అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికంలో భారతదేశం స్థూల దేశీయోత్పత్తి (GDP) 4.4 శాతం వృద్ధి చెందిందని మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించింది. ప్రభుత్వ డేటా ప్రకారం 2022-23లో GDP వృద్ధి 2021-22లో 9.1 శాతంతో పోలిస్తే 7.0 శాతంగా అంచనా వేయబడింది.

28 Feb 2023

పెన్షన్

అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO

ఇప్పటి వరకు అధిక పెన్షన్‌లను ఎంపిక చేసుకోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO గడువును మే 3 వరకు పొడిగించింది. 2022లో సుప్రీం కోర్ట్ ఆర్డర్ మార్చి 3న చివరి తేదీ అని నిర్ణయించింది.

28 Feb 2023

ఆర్ బి ఐ

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్‌తో సమావేశమై విస్తృత విషయాలపై చర్చలు జరిపారు.

జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి

కేవలం రెండు నెలల్లోనే 417 కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 1.2 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ Layoffs.fyi డేటా ప్రకారం, 2022లో 1,046 టెక్ కంపెనీలు అంటే పెద్ద సంస్థల నుండి స్టార్టప్‌ల వరకు 1,61 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఒక్క జనవరిలోనే, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తో పాటు ఇతర సంస్థలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు.

ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసిన CRED సిఈఓ కునాల్ షా జీతం

ఫిన్‌టెక్ కంపెనీ CRED చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కునాల్ షా, ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌ లో తన జీతాన్ని వెల్లడించారు. షా తన నెలవారీ జీతం Rs. 15,000 అని పేర్కొనడమే దానికి కారణాన్ని కూడా చెప్పాడు.

అదానీతో పాటు కష్టాల్లో ఉన్న భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్

కొంతమంది భారతీయ వ్యాపారవేత్తలు ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నారు. గౌతమ్ అదానీ $236 బిలియన్ల సంపద ఒక నెలలో మూడు వంతుల కంటే ఎక్కువ తగ్గిపోయింది. ఆ కోవలోకే వస్తారు అనిల్ అగర్వాల్ లండన్-లిస్టెడ్ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ జనవరిలో చెల్లించాల్సిన $1 బిలియన్ బాండ్‌తో సహా మరెన్నో రుణాలతో సతమతమవుతుంది.

8,500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఎరిక్సన్ సంస్థ

టెక్ పరిశ్రమ తరువాత, టెలికాం తయారీ రంగం కూడా ఉద్యోగ కోతలను మొదలుపెట్టింది. . స్వీడన్ 5 జి నెట్‌వర్క్స్ తయారీ సంస్థ ఎరిక్సన్ ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో 8,500 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. దీనివలన సంస్థలో సుమారు 8% మంది ప్రభావితమవుతారు.

25 Feb 2023

గూగుల్

మనుషులే కాదు రోబోలను కూడా వదలని ఉద్యోగ కోతలు

గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ రహస్య X మూన్‌షాట్ ల్యాబ్ నుండి గ్రాడ్యుయేట్ అయిన ఒక సంవత్సరం తర్వాత దాని అతి చిన్న అనుబంధ సంస్థల్లో ఒకటైన ఎవ్రీడే రోబోట్‌లను తొలగించాలని నిర్ణయించుకుంది. డిపార్ట్‌మెంట్‌లో అనేక ప్రయోజనాత్మక ప్రాజెక్టులలో పనిచేసే 200 మందికి పైగా సభ్యులు ఉన్నారు.

జోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం

ప్రముఖ ఆభరణాల గొలుసు జోయ్ అలుక్కాస్కు చెందిన Rs. 305.84 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నాడు జప్తు చేసింది. ఆ సంస్థ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది.

పెట్టుబడిదారుల కోసం ఆసియాలో రోడ్‌షో నిర్వహించనున్న అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తరవాత అదానీ గ్రూప్ స్టాక్‌లు, బాండ్లపై పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లింది. నివేదిక ప్రతికూల ప్రభావాలపై పోరాడే ప్రయత్నంలో వచ్చే వారం ఆసియాలో అదానీ గ్రూప్ స్థిర-ఆదాయ రోడ్‌షోను నిర్వహిస్తుంది.

24 Feb 2023

బ్యాంక్

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా

ప్రపంచబ్యాంక్‌లో భారతీయ-అమెరికన్‌ నాయకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మాస్టర్ కార్డ్ సీఈఓ వ్యాపారవేత్త అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా US నామినేట్ చేసింది. బ్యాంక్ ప్రస్తుత చీఫ్ డేవిడ్ మాల్పాస్ ఈ నెల ప్రారంభంలో పదవీవిరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం బంగా నామినేషన్‌ను ప్రకటించారు.

BYJU సంస్థకు చెందిన కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jr మూసివేత

Edtech దిగ్గజ సంస్థ BYJU'S కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jrని కొనుగోలు చేసినప్పుడు, అది అప్పట్లో సరైన నిర్ణయం. ఆ తర్వాత ఎన్నో విమర్శలు ఈ రెండు సంస్థలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు, BYJU'S నష్టాలను తగ్గించుకోవడానికి కోడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మూసేయాలని ఆలోచిస్తోంది.

2023లో ద్రవ్య విధానం వలన భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం

గ్లోబల్ డిమాండ్‌ దెబ్బతినడం ప్రారంభమయ్యాక కఠినమైన ద్రవ్య విధానం కారణంగా ఏప్రిల్ 1, 2023 నుండి వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలవారీ ఆర్థిక నివేదికలో 2022లో ప్రపంచ వాణిజ్య వృద్ధి పడిపోయిందని, 2023లో ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని, వాణిజ్య విలువ మరింత తగ్గుతుందని పేర్కొంది.

23 Feb 2023

మెటా

మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం

వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, మెటాలో నాన్-ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఈసారి ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. గత సంవత్సరం, మెటా తన ఖర్చులను తగ్గించుకోవడానికి,ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి 13% మంది ఉద్యోగులను అంటే దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది.

ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ

ఫోర్బ్స్ బ్లూమ్‌బెర్గ్ సూచీల ప్రకారం, గౌతమ్ అదానీ వ్యాపార దిగ్గజం సంపద బుధవారం $44 బిలియన్ల దిగువకు పడిపోయింది. అమెరికన్ షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ గురించి నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ సంపదలో తగ్గుదల కనిపిస్తుంది.

అదానీ స్టాక్స్‌లో పెట్టి నష్టపోయినవారు ITR ఫైలింగ్ సమయంలో ఇలా చేయండి

గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత దారుణమైన పతనానికి గురైంది. 100 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ కోల్పోవడంతో పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు.

ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

నిన్న విమానాశ్రయం నుండి వచ్చాక చాలా కార్లు, మోటారుబైక్‌లు రెడ్ లైట్ సిగ్నల్‌ను దాటి వెళ్లాయని, డబ్బు ఉంటే గాని ఒక నిమిషం ఉండటానికి కూడా ఇక్కడ ప్రజల దగ్గర సమయం లేదని అన్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్తాపకుడు నారాయణ మూర్తి.