బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
28 Apr 2023
అదానీ గ్రూప్అదానీ గ్రూప్‌లో గతంలో కంటే ఎక్కువ మంది రుణదాతలు
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదక తర్వాత గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ పరిస్థితి దారుణంగా తయారైంది. అదానీ గ్రూప్ షేర్ల విలువ అమాంతం పడిపోయింది.
27 Apr 2023
ఉద్యోగుల తొలగింపుజనవరి-మార్చి త్రైమాసికంలో 9,400మంది ఉద్యోగులను తొలగించిన భారతీయ స్టార్టప్‌లు
గత ఏడాది నుంచి నెలకొన్ని ఆర్థిక అనిశ్చితి ఐటీ రంగానికి శరాఘాతంగా మారింది. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపును చేపడుతున్నాయి.
26 Apr 2023
ఆదాయపు పన్నుశాఖ/ఐటీ2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల
ఆదాయపు పన్ను శాఖ ఇంకా ఆన్‌లైన్ ఐటీఆర్ ఫారమ్‌లను విడుదల చేయనప్పటికీ, 2023-24 లేదా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి ఆఫ్‌లైన్ ఐటీఆర్-1, 4 ఫామ్స్‌ను విడుదల చేసింది.
25 Apr 2023
వ్యాపారంకారణం లేకుండానే బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈఓగా తొలగించిన కాగ్నిజెంట్
బ్రియాన్ హంఫ్రీస్‌ను ఎటువంటి కారణం లేకుండానే అసంకల్పితంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి జనవరిలో కాగ్నిజెంట్ తొలగించింది.
25 Apr 2023
ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియాలో డిజిటల్ సిస్టమ్స్ అప్‌గ్రేడ్; చాట్‌జీపీటీ కోసం రూ.1600కోట్ల పెట్టుబడి
టాటాలకు చెందిన ఎయిర్ ఇండియా తన ఎయిర్‌లైన్ డిజిటల్ సిస్టమ్‌లను ఆధునీకరిచాలని నిర్ణయించింది. అందులో భాగంగా చాట్‌జీపీటీ-ఆధారిత చాట్‌బాట్, ఇతర అనేక సాంకేతికతలను ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఇప్పటికే 200 మిలియన్ల డాలర్ల(రూ.1600కోట్లు) పెట్టుబడిని ఎయిర్ ఇండియా పెట్టింది.
24 Apr 2023
భారతదేశంమహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా
ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకురాలు అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు.
21 Apr 2023
ఉద్యోగుల తొలగింపుటీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్‌లో ఉద్యోగుల సంఖ్య, నియామకాలను తెలుసుకుందాం
గత ఏడాది నుంచి ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవడానికి గ్లోబల్ టెక్ కంపెనీలు చాలా వరకు ఉద్యోగుల తొలగింపులను ప్రకటిస్తున్నాయి.
20 Apr 2023
సోషల్ మీడియాKoo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'
ట్విట్టర్‌కు పోటీగా భారత్‌లో పురుడుపోసుకున్న దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కూ(Koo) తాజాగా 200 మంది ఉద్యోగులను తొలగించింది.
19 Apr 2023
మెటాఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో 4వేల ఉద్యోగాల కోతకు 'మెటా' సన్నద్ధం
సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' బుధవారం నుంచి కంపెనీ వ్యాప్తంగా మరో దఫా ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమవుతోంది.
19 Apr 2023
ఎయిర్ ఇండియామార్చి త్రైమాసికంలో పెరిగిన విమాన ప్రయాణాలు; ఫుల్‌జోష్‌లో ఇండిగో ఎయిర్ లైన్స్
కోవిడ్‌తో కుదేలైన దేశీయ విమానయాన పరిశ్రమ కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది.
18 Apr 2023
ముంబైభారత్లో మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్; కస్టమర్లకు స్వాగతం
భారతదేశంలో మొట్టమొదటి యాపిల్ స్టోర్‌ను సీఈఓ టిమ్ కుక్ మంగళవారం ప్రారంభించారు. తొలి రిటైల్ స్టోర్‌ను ముంబైలో ఏర్పాటు చేశారు.
17 Apr 2023
భారతదేశంUPI: 2022లో భారత్‌లో 88బిలియన్ల యూపీఐ లావాదేవీలు; విలువ రూ.150 ట్రిలియన్లు
2022లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు భారతదేశంలో రికార్డుస్థాయిలో పెరిగిపోయాయి.
17 Apr 2023
స్టాక్ మార్కెట్ఇన్ఫోసిస్ షేర్లు 12శాతం ఎందుకు పడిపోయినట్లు?
దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో దాదాపు 12 శాతం పడిపోయాయి.
14 Apr 2023
రిలయెన్స్వయోకామ్18 రిలయన్స్, బోధి ట్రీ సిస్టమ్స్, పారామౌంట్ గ్లోబల్ వ్యూహాత్మక డీల్ పూర్తి
రిలయన్స్ స్టోరేజ్ లిమిటెడ్, బోధి ట్రీ సిస్టమ్స్, పారామౌంట్ గ్లోబల్ (గతంలో వయాకామ్‌సిబిఎస్‌గా పిలువబడేది)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పూర్తి చేసినట్లు వయోకామ్18(Viacom18) ప్రకటించింది.
13 Apr 2023
గూగుల్మరింత మంది ఉద్యోగులను తొలగించే యోచనలో గూగుల్
కొన్ని నెలలుగా ఉద్యోగుల తొలగింపు అనేది సర్వసాధారంగా మారాయి. అమెజాన్, మెటాతో సహా కొన్ని దిగ్గ టెక్ కంపెనీలు ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలో గూగుల్ కూడా చేరినట్లు కనిపిస్తోంది.
12 Apr 2023
అమెరికాసిలికాన్ వ్యాలీ బ్యాంక్: ఎస్వీబీ పతనం భారత క్యాపిటల్ మార్కెట్, స్టార్టప్‌లపై ప్రభావమెంత?
స్టార్టప్‌లు, టెక్నాలజీ కంపెనీలకు సేవలందించే ప్రముఖ అమెరికా బ్యాంక్ 'సిలికాన్ వ్యాలీ బ్యాంక్'(ఎస్వీబీ) పతనం ప్రపంచ మార్కెట్లను షేక్ చేసింది. అయితే భారత్‌లో బలమైన పునాదులను కలిగి ఉన్న ఎస్‍వీబీ పతనం మన దేశ క్యాపిటల్ మార్కెట్‌పై ప్రభావం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
11 Apr 2023
రిలయెన్స్ఐస్క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్; అమూల్, మదర్ డెయిరీకి గట్టి పోటీ తప్పదా?
భారతదేశ శీతల పానీయాల మార్కెట్‌లోకి ఐకానిక్ కూల్ డ్రింక్ కాంపా-కోలాను తీసుకొచ్చిన ముకేష్ అంబానీ చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌ను శాసిస్తున్న కోకోకోలా, పెప్సీలకు పోటీగా నిలిచింది.
11 Apr 2023
ట్విట్టర్ట్విట్టర్పై దావా వేసిన మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, అధికారులు; ఎందుకో తెలుసా?
ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు ఎలోన్ మస్క్‌పై దావా వేశారు.
11 Apr 2023
విమానంవిమానాల్లో వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులపై చర్యలకు 'డీజీసీఏ' కీలక సూచనలు
ఇటీవల విమానాల్లో కొందరు ప్రయాణికుల వికృత చేష్టలు పెరిగిపోతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక సూచనలను జారీ చేసింది.
10 Apr 2023
గూగుల్గూగుల్ పే వినియోగదారుల ఖాతాలోకి రూ.88వేలు జమ; మీరూ చెక్ చేసుకోండి
గూగుల్ పే(Google Pay) వినియోగదారులు రివార్డ్‌ల కోసం వర్చువల్ కూపన్‌లను స్క్రాచ్ చేయడం అలవాటుగా మారింది. ఆ కూపన్ల వల్ల డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు, ఇతర ప్రయోజనాలను పొందుతుంటారు.
08 Apr 2023
సీబీఐICICI-Videocon scam case: కొచ్చర్ దంపతులు, ధూత్‌లపై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల మోసం కేసుకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, ఛైర్మన్ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చార్జ్ షీట్ దాఖలు చేసింది.
08 Apr 2023
గ్యాస్నేటి నుంచి అమల్లోకి వచ్చిన తగ్గిన గ్యాస్ ధరలు; సీఎన్‌జీ వినియోగదారులకు 40% ఎక్కువ ఆదా
గ్యాస్ ధరలపై కొత్త మార్గదర్శకాలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే సవరించిన మార్గదర్శకాలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో దేశంలో సహజ వాయువు ధరలను ప్రపంచ క్రూడ్ ధరలతో అనుసంధానించడానికి మార్గం సుగమమైంది. దీని వల్ల గ్యాస్ ధరలు తగ్గాయి.
07 Apr 2023
ఎలాన్ మస్క్మస్క్ ట్విట్టర్ ఖాతాలో మళ్లీ వచ్చిన చేరిన 'పిట్ట'; డోజికాయిన్ లోగో తొలగింపు
తన మాటలు, చేష్టలతో ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకునే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. మూడు రోజుల క్రితం తన ట్విట్టర్ లోగోని బర్డ్‌ను తొలగించి డోజికాయిన్ సింబర్‌ను పెట్టి అందరనీ ఆశ్యర్యానికి గురిచేశారు.
07 Apr 2023
ముకేష్ అంబానీ'ఫోర్బ్స్ 2023' జాబితాలో రికార్డుస్థాయిలో భారతీయ బిలియనీర్లు; కొత్తగా 16 మందికి చోటు
వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా- 2023ను ఫోర్బ్స్ విడుదల చేసింది. అయితే తాజా జాబితాలో భారతీయుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. 'ఫోర్బ్స్ 2023' జాబితాలో భారతీయ బిలియనీర్లు 169 మందికి చోటు దక్కింది. 2022లో 166 మంది భారతీయ బిలియనీర్లు ఉన్నారు.
07 Apr 2023
ఐఎంఎఫ్2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్
గత ఏడాది మాదిరిగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర మందగమనం 2023లో కూడా కొనసాగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు.
06 Apr 2023
ఆర్ బి ఐఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచడానికి రేట్ల పెంపుని నిలిపివేసినట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు.
05 Apr 2023
వ్యాపారంఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్
ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి పండుగ అని గ్రేటర్ నోయిడాలో వరల్డ్ స్టార్టప్ కన్వెన్షన్ కి చాలా మంది ప్రజా ప్రముఖులు వస్తున్నారని ప్రచారం చేశారు.
05 Apr 2023
వ్యాపారంటాల్క్ క్యాన్సర్ క్లెయిమ్‌ల కోసం $8.9 బిల్లియన్స్ ప్రతిపాదించిన జాన్సన్ & జాన్సన్
US ఫార్మాస్యూటికల్ దిగ్గజం జాన్సన్ & జాన్సన్ (J&J) తన టాల్కమ్ పౌడర్ ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణమవుతాయని పేర్కొంటూ ఏళ్ల తరబడి ఉన్న పిటిషన్స్ పరిష్కరించడానికి $8.9 బిలియన్ల పరిష్కారాన్ని ప్రతిపాదించింది.
05 Apr 2023
అమెజాన్అమెజాన్ గేమింగ్ విభాగంలో 100 ఉద్యోగుల తొలగింపు
అమెజాన్ దాని వీడియో-గేమ్ విభాగాలలో దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించింది, ఇది ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, అమెజాన్ శాన్ డియాగో స్టూడియోలోని ఉద్యోగులపై ప్రభావం చూపించింది.
04 Apr 2023
వ్యాపారంWalmart మద్దతుతో ఈ-కామర్స్ లో పిన్‌కోడ్ యాప్‌ను ప్రారంభించిన ఫోన్ పే
భారతదేశంలోని Walmart మద్దతుతో ప్రముఖ UPI చెల్లింపు యాప్ ఫోన్ పే, ఈ-కామర్స్ లో . కంపెనీ పిన్‌కోడ్ అనే హైపర్‌లోకల్ యాప్‌ను ప్రారంభించింది.
04 Apr 2023
హైదరాబాద్హైదరాబాద్ లో 19% పెరిగిన ఇళ్ల అమ్మకాలు
వైట్ ప్రాంక్ నివేదికలో ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో స్థిరాస్తి రంగం స్థిరంగా సాగిందని పేర్కొంది. ఈ 3 నెలల్లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాలు 1 శాతం పెరిగి 79,126కు చేరాయి. లీజింగ్ లావాదేవీలలో 5శాతం వృద్ధి జరిగినట్లు సంస్థ తెలిపింది.
04 Apr 2023
బ్యాంక్2024 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 6.3%కి తగ్గించిన ప్రపంచ బ్యాంక్
కొత్త ఆర్థిక సంవత్సరంలో వినియోగంలో నియంత్రణ కారణంగా భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3%కి పరిమితం కావచ్చని ప్రపంచ బ్యాంక్ మంగళవారం ఒక నివేదికలో పేర్కొంది.
04 Apr 2023
ప్రభుత్వంముడిచమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకి తగ్గించిన కేంద్రం
భారతదేశం ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు 3,500 రూపాయల ($42.56) నుండి సున్నాకి తగ్గించింది. డీజిల్‌పై లీటరుకు 0.5 రూపాయలకు పన్నును సగానికి తగ్గించినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది.
04 Apr 2023
ఆపిల్కొన్ని టీమ్‌లలోని చిన్న సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తున్న ఆపిల్
ఆపిల్ తన కార్పొరేట్ రిటైల్ టీమ్‌లలో తక్కువ సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తుందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ సోమవారం నివేదించింది. ఈ తొలగింపులు ఆపిల్ అభివృద్ధి సంరక్షణ బృందాలపై ప్రభావం చూపుతాయని నివేదిక తెలిపింది.
04 Apr 2023
ఆర్ధిక వ్యవస్థ20% వృద్ధి చెంది, ₹20 లక్షల కోట్ల మార్కుకు చేరుకున్న ఆదాయపు పన్ను వసూళ్లు
మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల పన్నులో 22% వార్షిక వృద్ధిని ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత, స్థూల ప్రత్యక్ష పన్ను ఆదాయంలో సంవత్సరానికి 20% పెరిగి Rs.19.68 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం నివేదికను అందించింది.
03 Apr 2023
బ్యాంక్SBI బ్యాంక్ UPI, నెట్ బ్యాంకింగ్ సేవలలో సర్వర్ అంతరాయంతో నష్టపోతున్న వినియోగదారులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) UPI, నెట్ బ్యాంకింగ్ సేవలకు బ్యాంక్ సర్వర్‌లో అంతరాయం ఏర్పడింది.
03 Apr 2023
వ్యాపారంఅవుట్పుట్ తగ్గింపుతో పెరిగిన చమురు ధరలు
సౌదీ అరేబియాతో పాటు ఇతర OPEC + చమురు ఉత్పత్తిదారులు అవుట్‌పుట్ కోతలను ప్రకటించిన తర్వాత సోమవారం చమురు ధరలు పెరిగాయి.
03 Apr 2023
ఉద్యోగుల తొలగింపుUS కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్న మెక్‌డొనాల్డ్స్
ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్‌ఫుడ్ చైన్‌లలో ఒకటైన మెక్‌డొనాల్డ్స్, ఈ వారంలో అమెరికాలోని అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తోంది, ఎందుకంటే తాజా రౌండ్ తొలగింపుల గురించి తన కార్పొరేట్ ఉద్యోగులకు తెలియజేయడానికి సిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
01 Apr 2023
మహిళ1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం
మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకం. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేయడంతో ఇది అమల్లోకి వచ్చింది.
01 Apr 2023
వ్యాపారంప్రమాదవశాత్తూ కోటి విలువైన NFTని కాల్చివేసి, సంపదలో మూడో వంతును పోగొట్టుకున్న వ్యక్తి
బ్రాండన్ రిలే అనే వ్యక్తి మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రాక్సీ వాలెట్‌ని సృష్టించే ప్రయత్నంలో ఏదో తప్పు జరిగిందంటూ ట్వీట్ చేశారు.