బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
30 Jan 2023
వ్యాపారంయూనిలీవర్ కొత్త సీఈఓగా హీన్ షూమేకర్ నియామకం
కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం యూనిలీవర్ సంస్థ సోమవారం తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా హీన్ షూమేకర్‌ను ప్రకటించింది. జూలై 1 నుండి అలాన్ జోప్ స్థానంలో హీన్ షూమేకర్ కొనసాగుతారు.
30 Jan 2023
గౌతమ్ అదానీజాతీయవాదం ద్వారా చేసిన మోసాన్నిఅదానీ కప్పిపుచ్చలేరంటున్న హిండెన్‌బర్గ్
హిండెన్‌బర్గ్ చేసిన స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాల ఆరోపణల నివేదికపై స్పందిస్తూ ఇది భారతదేశంపై దాడిగా అదానీ గ్రూప్ పేర్కొంది.
28 Jan 2023
వ్యాపారండీటీహెచ్, కేబుల్ టీవీ వినియోగదార్లకు షాక్- ఫిబ్రవరి 1నుంచి 30శాతం టారిఫ్ పెంపు
ఫిబ్రవరి 1 నుంచి డీటీహెచ్, కేబుల్ వినియోగదారుల జేబులకు చిల్లులు పడనున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఆదేశాల మేరకు ప్రముఖ బ్రాడ్ కాస్టర్లు తమ టీవీ ఛానళ్ల ధరలను భారీగా పెంచనున్నాయి. 30శాతం టారిఫ్ పెరగనుండటంతో టీవీ ఛానళ్లు మరింత ప్రియం కానున్నాయి.
28 Jan 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్త్వరలో గూగుల్ ను మించిపోనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT
OpenAI ChatGPTకు పెరుగుతున్న ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో గుబులు పుట్టిస్తుంది. Gmail సృష్టికర్త పాల్ బుచ్‌హీట్ ఈ ChatGPT మరో సంవత్సరం లేదా రెండు సంవత్సరాలలో గూగుల్ సెర్చ్ ఇంజన్ ను మించిపోవచ్చని పేర్కొన్నారు. Yellow Pagesకు గూగుల్ ఎలా చెక్ పెట్టిందో అలాగే సెర్చ్ ఇంజన్‌లకు ఈ AI చెక్ పెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
28 Jan 2023
వ్యాపారంవ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు 2022 ఆర్ధిక సంవత్సరంలో BharatPe 1.7కోట్లు చెల్లించింది
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC)కి దాఖలు చేసిన ప్రకటన ప్రకారం, BharatPe వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కు రూ.1.69 కోట్లు,అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్‌లకు రూ.63 లక్షలు చెల్లించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సంస్థ గత ఏడాది వీరిద్దరిని BharatPe తొలగించింది. అతని వ్యవస్థాపకుడి పదవిని కూడా తొలగించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు రూ.88 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని అతనిపై దావా వేసింది.
28 Jan 2023
గౌతమ్ అదానీఅదానీ గ్రూప్ షేర్ 22% పడిపోవడంతో నష్టాన్ని చవిచూసిన LIC
అదానీ గ్రూప్ షేర్లు శుక్రవారం ఒక్క రోజులో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 3.37 లక్షల కోట్లు నష్టపోయాయి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఐదు అతిపెద్ద అదానీ గ్రూప్ కంపెనీలలో ఏకైక అతిపెద్ద నాన్-ప్రమోటర్ దేశీయ వాటాదారైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC). అదానీ గ్రూప్ కంపెనీలలో తన హోల్డింగ్స్ విలువ క్షీణించిన కారణంగా రూ.16,627 కోట్లు కోల్పోయింది.
28 Jan 2023
గూగుల్ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన
ఈ నెల ప్రారంభంలో, ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో సిబ్బందిని తొలగించిన కంపెనీల లిస్ట్ లో గూగుల్ చేరింది. గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని తీసుకున్న నిర్ణయం చాలామంది జీవితాలను తలకిందులు చేసింది. ఇది బాధిత ఉద్యోగుల నుండి వ్యతిరేకతకు దారితీసింది.
27 Jan 2023
ఉద్యోగుల తొలగింపుఉద్యోగ కోతల లిస్ట్ లో చేరిన మరో సాఫ్ట్వేర్ దిగ్గజం SAP, 3,000 మంది తొలగింపు
జర్మన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం SAP కూడా ఉద్యోగులను తొలగించే టెక్ కంపెనీల లిస్ట్ లో చేరింది. సంస్థ 3,000 మందిని అంటే ప్రపంచవ్యాప్తంగా 2.5%మంది సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది.
27 Jan 2023
గౌతమ్ అదానీహిండెన్‌బర్గ్ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ
అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించడంతో ఇప్పుడు అదానీ గ్రూప్ దానిపై చట్టపరమైన చర్యల తీసుకోవడానికి సిద్దమైంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత, బుధవారం మార్కెట్ విలువలో అదానీ గ్రూప్ కంపెనీలు రూ. రూ.85,761 కోట్లు కోల్పోయాయి.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఒక రోజులో సుమారు $6 బిలియన్లను ఆ సంస్థ కోల్పోయింది.
27 Jan 2023
టెక్నాలజీఉద్యోగ కోతలు మొదలుపెట్టిన మరో కంపెనీ, 3,900 ఉద్యోగులను తొలగించనున్న IBM
ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (IBM)కూడా ఉద్యోగులను తొలగించే టెక్ దిగ్గజాల జాబితాలో చేరింది. 3,900 మంది సిబ్బందిని అంటే ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో 1.5% మందిని తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ తొలగింపులు asset divestmentలో అంటే కొన్ని రంగాల్లో తమ వ్యాపారాన్ని నిలిపివేయడంలో భాగమని అంతేకాని పనితీరు అంచనాల ఆధారంగా కాదని సృష్టం చేసింది.
25 Jan 2023
గూగుల్గూగుల్ డిజిటల్ ప్రకటనల గుత్తాధిపత్యంపై యూఎస్ఏ ప్రభుత్వం సీరియస్
యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ), ఎనిమిది రాష్ట్రాలు గూగుల్‌పై యాంటీట్రస్ట్ దావాను దాఖలు చేశాయి. కంపెనీ డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ మార్కెట్‌లో గుత్తాధిపత్యం చేస్తోందని ఆరోపించింది.ఈ దావాలో DOJతో చేరిన రాష్ట్రాలలో న్యూయార్క్, కాలిఫోర్నియా, కొలరాడో, వర్జీనియా ఉన్నాయి.
25 Jan 2023
మైక్రోసాఫ్ట్నాల్గవ త్రైమాసికంలో 12% తగ్గిన మైక్రో సాఫ్ట్ లాభం, ఆర్ధిక అనిశ్చితే కారణం
మైక్రోసాఫ్ట్ 2022 చివరి మూడు నెలల ఆదాయాల నివేదికను ప్రకటించింది. ఈ త్రైమాసిక ఆదాయం గత 6 సంవత్సరాల కాలంలో అత్యల్ప వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంలో ఆర్థిక అనిశ్చితి కారణంగా ఖర్చులను తగ్గించడానికి భారీగా ఉద్యోగులను తొలగించింది.
24 Jan 2023
మైక్రోసాఫ్ట్10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ ChatGPT యజమాని OpenAIతో తన భాగస్వామ్యాన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా విస్తరించాలని నిర్ణయించుకుంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ లో OpenAI టెక్నాలజీను విస్తృతంగా ఉపయోగించుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజన్‌లో ChatGPT పెట్టాలని అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో గూగుల్ వంటి వాటికి గట్టి పోటీనివ్వచ్చు.
24 Jan 2023
వ్యాపారంగూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు
మ్యూజిక్-స్ట్రీమింగ్ సంస్థ Spotify మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకోవడం కోసం 6% సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ డేనియల్ ఏక్ బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపారు.
23 Jan 2023
అమెజాన్భారతదేశంలో డెలివరీలు త్వరగా అందించడానికి ఎయిర్ కార్గో ఫ్లీట్ ప్రారంభించనున్న అమెజాన్
డెలివరీలను వేగవంతం చేసే ప్రయత్నంలో అమెజాన్ భారతదేశంలో అమెజాన్ ఎయిర్ అని ప్రత్యేక ఎయిర్ కార్గో ఫ్లీట్‌ను ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ బెంగళూరుకు చెందిన క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఇక్కడ ఎయిర్ ఫ్రైట్ సేవలను ప్రారంభించింది. ఈ సదుపాయం తొలుత బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై మెట్రో నగరాల్లో అందుబాటులో ఉంటుంది.
23 Jan 2023
బడ్జెట్బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు
భారత ప్రభుత్వం మార్చి 2024 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 16 ట్రిలియన్ రూపాయలు ($198 బిలియన్లు) అప్పుగా తీసుకుంటుంది.
23 Jan 2023
సంస్థఇంటర్నల్ అస్సెస్ మెంట్ లో పనితీరు బాగోలేదంటూ 452 మందిని ఇంటికి పంపిన విప్రో సంస్థ
భారతదేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ విప్రో కార్పొరేట్ పేలవమైన పనితీరును పేర్కొంటూ 452 మంది కొత్త ఉద్యోగులను తొలగించింది. ఇటీవల జరిపిన ఇంటర్నల్ అస్సెస్ మెంట్ లో తక్కువ స్కోర్లు ఉన్న ఉద్యోగులను తీసేస్తున్నట్లు విప్రో తెలియజేసింది. మొదట విప్రో 800 మందిని తొలగించాలని అనుకున్నా, ఇప్పుడు తొలగించిన ఉద్యోగుల సంఖ్య అంతకంటే తక్కువే అని బిజినెస్ టుడే పేర్కొంది.
21 Jan 2023
మెటామరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్
మెటాపై జరిమానాల వర్షం కొనసాగుతూనే ఉంది. యూరప్ ప్రైవసీ చట్టాలను ఉల్లంఘించినందుకు మెటాపై భారీ €390 మిలియన్ పెనాల్టీని విధించిన రెండు వారాల తర్వాత, ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) మెటాకు అదనంగా €5.5 మిలియన్ జరిమానా విధించింది. అయితే ఈసారి, వాట్సాప్ EU డేటా రక్షణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించింది.
21 Jan 2023
ట్విట్టర్ఫర్నిచర్ వేలం నుండి తగ్గుతున్న ఆదాయం వరకు అసలు ట్విట్టర్ లో ఏం జరుగుతుంది
శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలో మిగులు వస్తువులను వేలం వేసి కొంత డబ్బును సేకరించే పనిలో ఉంది ట్విట్టర్. మిగులు కార్యాలయ వస్తువులను విక్రయించడం వలన ట్విట్టర్ ఆదాయం పెరగొచ్చు.
21 Jan 2023
గూగుల్గూగుల్ లో 12,000 ఉద్యోగుల తొలగింపు, క్షమాపణ కోరిన సుందర్ పిచాయ్
టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపు సీజన్ నడుస్తుంది. గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ ఇంక్. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరింది. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ సుమారు 12,000 మంది సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించారు. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది.
20 Jan 2023
నెట్ ఫ్లిక్స్రీడ్ హేస్టింగ్స్ పదవీ విరమణతో కొత్త సిఈఓ ను నియమించిన నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సహ-వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ సిఈఓ పదవి విరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. కంపెనీ అద్దె ద్వారా మెయిల్ DVD సేవ నుండి ఎంటర్టైన్మెంట్ వేదికగా ఎదిగేవరకు అతను రెండు దశాబ్దాలుగా ఈ పదవిలో కొనసాగారు.
20 Jan 2023
భారతదేశంఇక స్విగ్గీ వంతు, 380 మంది ఉద్యోగుల తొలగింపు
భారతదేశపు స్టార్టప్‌లలో ఒకటైన స్విగ్గీ ఉద్యోగ కోతలు మొదలుపెట్టింది. దాదాపు 380 మంది సిబ్బందిని తొలగించింది. దేశంలోని స్టార్టప్ వ్యవస్థను మరింతగా కుదిపేసే నిర్ణయం ఇది. ఈరోజు టౌన్ హాల్‌లో ఉద్యోగులకు ఈ తొలగింపుల గురించి సంస్థ తెలిపింది.
20 Jan 2023
రిలయెన్స్వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రాధికా మర్చంట్‌తో గురువారం నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని వర్లీలోని యాంటిలియాలోని అంబానీల ప్రైవేట్ నివాసంలో ఘనంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు వ్యాపార, రాజకీయ, సినిమా రంగానికి చెందినవారు అతిధులుగా హాజరయ్యరు.
19 Jan 2023
వ్యాపారంటెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని చెప్పిన ఆదాని గ్రూప్
టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ తెలిపింది. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ ఓడరేవుల నుండి ఇంధనం వరకు వ్యాపారాన్ని విస్తరించి ఇప్పుడు మీడియా కంపెనీని కూడా కొనుగోలు చేసారు. కానీ టెలికాం రంగానికి మాత్రం దూరంగా ఉండిపోయారు.
19 Jan 2023
ట్విట్టర్ట్విట్టర్ కు తగ్గుతున్న ప్రకటన ఆదాయం మస్క్ విధానాలే కారణం
ట్విట్టర్ ఆర్థికంగా కష్టాల్లో పడింది. దాని కొత్త సిఈఓ ఎలోన్ మస్క్ కంపెనీ ఆ కష్టాలను తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, అందులో విజయం సాధించలేకపోతున్నారు. ట్విట్టర్ రీలింగ్ ప్రకటన వ్యాపార ప్రభావం ఆ సంస్థ ఆర్ధిక స్థితి మీద పడుతోంది. ఈ సంస్థను మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి 500 మంది ప్రకటనదారులు ట్విట్టర్‌లో ఖర్చు పెట్టడం మానేశారు.
19 Jan 2023
వ్యాపారంరానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది
2023లో భారతదేశంలో 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లాభాల్లోకి వెళ్ళేటట్లు కనిపిస్తోంది. సైబర్‌మీడియా రీసెర్చ్ (CMR) నివేదిక ప్రకారం, 2023 చివరి నాటికి మార్కెట్ 70% విస్తరిస్తుందని అంచనా.
18 Jan 2023
ఫైనాన్స్415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు
FTX కష్టాలు త్వరలో ముగిసేలా కనిపించడం లేదు. దానికి కారణం ఇప్పటికే దివాళా తీసిన FTX US ప్లాట్‌ఫారమ్ నుండి $90 మిలియన్లు, గ్లోబల్ ఎక్స్ఛేంజ్ నుండి $323 మిలియన్లతో సహా దాదాపు $415 మిలియన్ల విలువైన క్రిప్టోను హ్యాకర్లు దొంగిలించారని సిఈఓ జాన్ J. రే III తెలిపారు.
18 Jan 2023
గూగుల్సొంత UPI సౌండ్‌బాక్స్‌ను లాంచ్ చేసిన గూగుల్
UPI చెల్లింపులు ఎక్కువగా చేసేది భారతీయులే. ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం ఒక్కోసారి వ్యాపారులకు కష్టంగా మారుతుంది. సౌండ్‌బాక్స్, వాయిస్ అలర్ట్ ద్వారా పూర్తయిన చెల్లింపు గురించి వ్యాపారులకు తెలియజేసే ఈ డివైజ్ లావాదేవీలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.
18 Jan 2023
ఫైనాన్స్కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం
కొత్త ప్రత్యక్ష పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిని ఫిబ్రవరి 1న రానున్న కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ విషయంలో తుది నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తీసుకుంటుంది.
16 Jan 2023
ఎయిర్ టెల్ఎయిర్టెల్ 5G ప్లస్ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం
భారతి ఎయిర్‌టెల్ ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, మీరట్, గోరఖ్‌పూర్, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌తో సహా ఐదు ప్రధాన నగరాల్లో 5G ప్లస్‌ను ప్రారంభించింది. ఈ కవరేజీని వినియోగదారుల నుండి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా హై-స్పీడ్ 5G కనెక్టివిటీ సేవను అందిస్తుంది ఎయిర్ టెల్. ప్రస్తుత 4G నెట్‌వర్క్ కంటే వ్యక్తులు 5G ప్లస్‌లో 20-30 రెట్లు వేగాన్నివినియోగదారులు చూస్తారు.
16 Jan 2023
వ్యాపారంటెక్ దిగ్గజ సంస్థల బాటలో షేర్ చాట్, 20% ఉద్యోగుల తొలగింపు
100 మంది ఉద్యోగులను తొలగించిన ఒక నెల తర్వాత, స్వదేశీ సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ ఇప్పుడు 20% మంది ఉద్యోగులను తొలగించింది. ఈ స్టార్టప్ తన ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం గురించి ఇమెయిల్ ద్వారా తెలియజేసింది.
16 Jan 2023
అమెజాన్అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత
అమెజాన్ మరోమారు ఉద్యోగ కోతలు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఈ నెలలో భారతదేశంలోని సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ సంస్థ ఇప్పటికే ఆ ప్రక్రియను ప్రారంభించిందని అక్కడి ఉద్యోగి తెలిపారు.
16 Jan 2023
నిర్మలా సీతారామన్బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పత్రిక పాంచజన్య నిర్వహించిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మధ్యతరగితికి చెందిన వ్యక్తినని, వారి ఆర్థిక బాధలను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు నిర్మలా సీతారామన్.
13 Jan 2023
వ్యాపారంపునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ
బెంగుళూరుకు చెందిన రైడ్-షేరింగ్ కంపెనీ ఓలా ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. కంపెనీ కొన్ని విభాగాల నుండి దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే సిబ్బంది సంఖ్యను ఓలా ఇంకా నిర్ధారించలేదు.
13 Jan 2023
వ్యాపారంమూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఇన్ఫోసిస్ ప్రకటించింది. కంపెనీ నికర లాభం 12.68% పెరిగి డిసెంబర్ 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ.6,586 కోట్లు వచ్చాయి. కంపెనీ ఆదాయం మూడో త్రైమాసికంలో రూ.39,087 కోట్లు. ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయం రూ. 39,087 కోట్లు, ఇందులో రూ. 38,318 కోట్ల నికర అమ్మకాలు, రూ. 769 కోట్లు ఇతర ఆదాయాల ద్వారా వచ్చాయి.
13 Jan 2023
ట్విట్టర్సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్
ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో ఖర్చు తగ్గించే చర్యలను కొనసాగిస్తున్నారు. సింగపూర్‌లోని ఈ కంపెనీ ఆసియా-పసిఫిక్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలోని సిబ్బందిని వారి డెస్క్‌లను క్లియర్ చేసి, ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని సంస్థ కోరింది.
12 Jan 2023
టెలికాం సంస్థజియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి
రిలయన్స్ జియో తన 5G సేవలను ఉత్తరాఖండ్‌కు అందుబాటులోకి తెచ్చింది. అర్హత ఉన్న వినియోగదారులు జియో వెల్‌కమ్ ఆఫర్ ద్వారా ఆహ్వానించబడటంతో పాటు ఉచితంగా 1Gbps వేగంతో అపరిమిత డేటాను పొందుతారు.
11 Jan 2023
వ్యాపారంఫిబ్రవరి 1 నుండి యూట్యూబ్ Shorts క్రియేటర్లకు కూడా ఆదాయం
గత సెప్టెంబరులో, Shorts కోసం మానిటైజేషన్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని YouTube హామీ ఇచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుండి, యూట్యూబ్ Shorts క్రియేటర్లు తమ కంటెంట్ పై రాబడిని పొందగలరు. యూట్యూబ్ భాగస్వామి ప్రోగ్రామ్ (YPP) అప్డేట్ లో భాగంగా ఈ మార్పును ప్రవేశపెట్టింది యూట్యూబ్.
10 Jan 2023
జియోరూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో
రిలయన్స్ జియో కొత్త '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ. 61కు అందిస్తుంది. ఈ కొత్త ప్యాక్ 6GB హై-స్పీడ్ 4G డేటాను అందించడంతో పాటు అర్హత ఉన్న వినియోగదారులకు అంటే జియో 5G సేవకు సపోర్ట్ చేసే ఫోన్ తో పాటు జియో వెల్‌కమ్ ఆఫర్ ద్వారా ఆహ్వానించబడినట్లయితే అపరిమిత 5G డేటా యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
09 Jan 2023
భారతదేశం5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో
ఎయిర్ టెల్, జియో 2022లో తమ 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాయి. మొదట, 5G నెట్‌వర్క్ ఎంపిక చేసిన నగరాలకు మాత్రమే పరిమితం చేసాయి. ప్రస్తుతానికి, భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ రెండూ సంస్థలు తమ 5G నెట్‌వర్క్ కవరేజీని విస్తరిస్తున్నాయి.