బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

వారంలో నాలుగు రోజులు పనిచేయడమే మంచిదంటున్న ట్రయల్

జూన్-డిసెంబర్ 2022 మధ్య UK లో 61 కంపెనీలు పాల్గొన్న నాలుగు రోజుల వర్క్‌వీక్ ట్రయల్ లో,తగ్గిన గంటలతో చాలా సంస్థలు సంతృప్తికరంమైన ఫలితాలను అందుకున్నాయని తేలింది.

22 Feb 2023

జియో

20 నగరాల్లో జియో, హరిద్వార్‌లో ఎయిర్ టెల్ 5G సేవలు ప్రారంభించాయి

రిలయన్స్ జియో తన 5G సేవలను టిన్సుకియా, భాగల్పూర్, మోర్ముగావ్, రాయచూర్, ఫిరోజాబాద్, చంద్రపూర్‌తో సహా మరో 20 నగరాల్లో ప్రారంభించింది. ఎయిర్ టెల్ తన 5G నెట్‌వర్క్‌ను హరిద్వార్‌తో సహా మరిన్ని ప్రాంతాలలో విడుదల చేసింది.

2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన దిగ్గజ కంపెనీ 'మెకిన్సీ'

మరో అంతర్జాతీయ సంస్థ తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. దిగ్గజ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే & కో తన కంపెనీలోని దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ తొలగింపు జాబితాలో క్లయింట్లతో ప్రత్యేక్షంగా సంబంధం లేని వారు మాత్రమే ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

#NewsBytesప్రత్యేకం: 2022లో తమ అదృష్టాన్ని కోల్పోయిన ప్రపంచ బిలియనీర్లు

కొంతమందికి 2022 పెద్దగా కలిసిరాలేదు, అత్యంత ధనవంతులు 2022లో తమ స్థానాన్ని కొనసాగించలేకపోయారు. స్థానాన్ని కోల్పోయిన కొంతమంది బిలియనీర్లను చూద్దాం.

IMF ప్రకారం 2023లో గ్లోబల్ గ్రోత్‌లో 50%కి పైగా భారత్, చైనాల సహకారం

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్త అభివృద్దిలో 50% సహకారం అందించేది భారతదేశం, చైనా.

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారా, అయితే ఈ తప్పులు చేయకండి

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు పొరపాట్లు చేయడం సర్వసాధారణం. అయితే తరుచుగా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అయితే, అవగాహన ద్వారా వాటిని చాలా వరకు నివారించి ఆర్థిక లక్ష్యాలను సాధించచ్చు.

ట్రావెల్: ఫ్రాన్స్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని కొన్ని పనులు తెలుసుకోండి

ప్రతీ దేశంలో బ్రతకడానికి కొన్ని నియమాలు, కట్టుబాట్లు ఉంటాయి. ఆ దేశంలో ఉన్నప్పుడు అక్కడి నియమాలను, కట్టుబాట్లను, వ్యవహారాలను ఖచ్చితంగా పాటించాలి. పర్యాటకానికి వెళ్ళినా కూడా ఆయా దేశాల పద్దతులను ఫాలో కావాల్సి ఉంటుంది. లేదంటే అక్కడి స్థానికుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.

సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI

ఇకపైన భారతదేశం, సింగపూర్ మధ్య చెల్లింపులు సులభతరం కానున్నాయి. భారతదేశంకు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సింగపూర్ కు చెందిన PayNow భాగస్వామ్యంతో వేగంగా సరిహద్దు చెల్లింపులు చెయ్యచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ హ్సీన్ లూంగ్ ఈ రోజు వర్చువల్ గా క్రాస్-బోర్డర్ కనెక్టివిటీని ప్రారంభిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.

21 Feb 2023

మెటా

మరిన్ని ఉద్యోగ కోతలకు ప్రణాళిక వేస్తున్న మెటా 7,000 మంది ఉద్యోగులకు తక్కువ రేటింగ్స్

మెటాలో ఉద్యోగ కోతల సీజన్ ఇంకా పూర్తి కాలేదు. ఇటీవల ముగిసిన పనితీరు సమీక్షలలో సుమారు 7,000 మంది ఉద్యోగులకు తక్కువ రేటింగ్‌లు ఇవ్వడం ద్వారా కంపెనీ ఇటువంటి సంకేతాలను అందించింది. గత ఏడాది నవంబర్‌లో మెటా దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది.

పశ్చిమ బెంగాల్‌లోని 15 కొత్త నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G

భారతి ఎయిర్‌టెల్ పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్, దుర్గాపూర్, దిన్హటా, అసన్సోల్, జల్పైగురి, డార్జిలింగ్‌తో సహా మరో 15 నగరాల్లో తన 5G సేవలను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ తన 5G సేవలను అక్టోబర్ 2022లో ప్రారంభించింది.

20 Feb 2023

విమానం

ఈ ఆర్ధిక సంవత్సరంలో విదేశీ పర్యటనల కోసం భారతీయులు పెట్టిన ఖర్చు $10బిలియన్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో భారతీయులు విదేశీ ప్రయాణాలకు దాదాపు $10 బిలియన్లు ఖర్చు పెట్టారు.రికార్డు స్థాయి ట్రావెల్ సీజన్ ఈ త్రైమాసికంలో కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు.

20 Feb 2023

జియో

వినియోగదారుల కోసం అందుబాటులో ఉండే రీఛార్జ్ ప్లాన్‌లు అమలుచేస్తున్న రిలయన్స్ జియో

రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ. ఇది 2016లో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి వినియోగదారులకు అనుకూలంగా ఉండే రీఛార్జి ప్లాన్స్ అమలుచేస్తూ వస్తుంది. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు ఇంటర్నెట్ డేటాను అందించే ఆల్ ఇన్ వన్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం

$50 బిలియన్ల దిగువకు పడిపోయిన గౌతమ్ అదానీ నికర విలువ

బిలియనీర్ గౌతమ్ అదానీ నికర విలువ సోమవారం $50 బిలియన్ల దిగువకు పడిపోయింది, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అప్డేట్ చేసిన డేటా ప్రకారం అతని మొత్తం సంపద ఇప్పుడు 49.1 బిలియన్ డాలర్లు.

20 Feb 2023

జీఎస్టీ

ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్

జీఎస్టీ కౌన్సిల్ శనివారం ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్లు , కొన్ని ట్రాకింగ్ పరికరాలపై వస్తు, సేవా పన్నును తగ్గించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

18 Feb 2023

బిహార్

బిహార్, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం

బిహార్, ఒడిశాలోని బెగుసరాయ్, కిషన్‌గంజ్, పూర్నియా, గోపాల్‌గంజ్, సోనేపూర్, భవానీపట్నా, పరదీప్‌తో సహా మరిన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ తన 5జీ సేవలను ప్రారంభించింది. అర్హత కలిగిన ఎయిర్‌టెల్ వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా 5జీ సేవలను పొందవచ్చు. కంపెనీ తన 5జీ డేటా ప్లాన్‌ను ఇంకా వెల్లడించలేదు.

భారతదేశంలో 2 ట్విట్టర్ కార్యాలయాలను మూసేసిన తర్వాత, ముగ్గురు ఉద్యోగులు మిగిలారు

ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ఉద్యోగులను తొలగించడం, కార్యాలయ వస్తువులను విక్రయించడం, కార్యాలయాల మూసివేత వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ట్విట్టర్ శుక్రవారం ఉదయం భారతదేశంలోని దాని మూడు కార్యాలయాలలో రెండింటిని మూసివేసింది, ఆ కార్యాలయాల్లోని ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని కోరింది.

యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్

ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ లో తొమ్మిదేళ్ల అధికారం తర్వాత తానూ వైదొలుగుతున్నట్లు యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుసాన్ వోజికి ప్రకటించారు. ఒక బ్లాగ్ పోస్ట్‌లో, కుటుంబం, ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించాలనుకుంటున్నట్లు తెలిపారు.

భారతదేశంలో గత ఏడాది 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి

భారతదేశంలో 2022 సంవత్సరంలో 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభం అయ్యాయి, మొత్తం టెక్ స్టార్టప్‌ల సంఖ్య 25,000-27,000కి చేరుకుందని Nasscom and Zinnov కొత్త నివేదిక పేర్కొంది.

ఆధార్‌ని పాన్ నంబర్‌తో లింక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇవి పాటించండి

ఈ ఏడాది మార్చి 31లోపు పాన్‌ నంబర్లకు ఆధార్‌ను లింక్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2022తో ముగిసింది, కానీ ప్రభుత్వం దానిని రూ.1000 అపరాధ రుసుముతో పొడిగించింది.

అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు

భారతి ఎయిర్‌టెల్ తన 5G సేవలను భారతదేశంలోని కోహిమా, ఐజ్వాల్, గ్యాంగ్‌టాక్, టిన్సుకితో సహా మరిన్ని ఈశాన్య నగరాల్లో ప్రారంభించింది.

16 Feb 2023

పేటియం

UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్

తక్కువ-విలువ UPI లావాదేవీలను వేగంగా, మరింత సురక్షితంగా ఆటంకం లేకుండా, పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) భారతదేశంలో UPI LITEని ప్రవేశపెట్టింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా ఈ ఫీచర్‌ను అందించే దేశంలోనే మొదటి పేమెంట్స్ బ్యాంక్ పేటియం.

వార్షిక ప్లాన్ తో ఉచిత ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ని అందిస్తున్న ఎయిర్‌టెల్

భారతి ఎయిర్‌టెల్ అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ అందిస్తోంది, దానితో పాటు ఉచిత కాలింగ్, ఒక సంవత్సరం వ్యాలిడిటీ రోజుకు 2.5GB డేటా వంటి ప్రయోజనాలు కేవలం రూ. 3,359కే అందిస్తుంది.

15 Feb 2023

విమానం

IT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి

జర్మనీకి చెందిన Lufthansa సంస్థ విమానాలు బుధవారం IT అంతరాయం కారణంగా ఆలస్యం లేదా రద్దు అయ్యాయి.

ఐరోపాలో 3,800 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫోర్డ్

వచ్చే మూడేళ్లలో యూరప్‌లో 3,800 ఉద్యోగాలను తగ్గించాలని అమెరికా వాహన తయారీ సంస్థ ఫోర్డ్ నిర్ణయాన్ని ప్రకటించింది. పెట్రోలు, డీజిల్ ఇంజన్‌ల నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారుతుండడంతో ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి. ఫోర్డ్ లో ప్రస్తుతం ఐరోపాలో 34,000 ఉద్యోగులు ఉన్నారు. 2035 నాటికి ఐరోపాలో తన విమానాలను పూర్తిగా విద్యుదీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిపై $50 బిలియన్లను ఖర్చు చేస్తోంది.

మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse

స్విట్జర్లాండ్‌లోని రెండవ అతిపెద్ద బ్యాంకు Credit Suisseలో ఒక మాజీ ఉద్యోగి జీతాలు, బోనస్‌లకు సంబంధించిన వేలాది మంది ఉద్యోగుల వ్యక్తిగత డేటాను దొంగిలించాడని సంస్థ ప్రకటించింది. డేటా చోరీ సమస్యను బ్యాంక్ మొదటిసారిగా మార్చి 2021లో గుర్తించింది. సంబంధిత డేటా రక్షణ అధికారులకు తెలియజేసింది.

ఇంటర్నెట్ సంచలనం ChatGPT వెనుక ఉన్న సామ్ ఆల్ట్‌మాన్ గురించి తెలుసుకుందాం

గత కొన్ని నెలలుగా ChatGPT ఎన్నో చర్చలకు దారితీసింది. అయితే అందరూ ఈ చాట్ బాట్ గురించి మాట్లాడారు గాని OpenAI సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ గురించి ఎవరూ మాట్లాడలేదు. 37 సంవత్సరాల ఆల్ట్‌మాన్, చికాగో, ఇల్లినాయిస్‌లో 1985లో జన్మించాడు. అతను మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో పెరిగాడు.

జనవరిలో 4.7 శాతంకు తగ్గిన హోల్ సేల్ ద్రవ్యోల్బణం

ఆల్-ఇండియా హోల్ సేల్ ధరల సూచిక (WPI) ఆధారంగా దేశ వార్షిక ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్ 2022లో నమోదైన 4.95% నుండి జనవరి 2023 (జనవరి 2022 కంటే) నెలలో 24 నెలల కనిష్ట స్థాయి 4.73%కి తగ్గింది, తాత్కాలిక డేటా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం షేర్ చేసింది.

14 Feb 2023

మెటా

ఫిబ్రవరి 21న మెటా సంస్థ నుండి బయటకి వెళ్లనున్న చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్

మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్, 13 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఏడాది చివర్లో కంపెనీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని నెలలుగా కంపెనీ నుండి వైదొలిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఆమె కూడా ఒకరు.

అమ్మకందారుల ఆదాయంలో 50% కోత వేస్తున్న అమెజాన్

అమెజాన్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ లో అందించే వివిధ రకాల ఉత్పత్తులు అందించే డిస్కౌంట్‌ల కారణంగా కొనుగోలుదారులకు చాలా ఇష్టమైన ఈ-కామర్స్ వేదిక. ఇందులో మిలియన్ల కొద్ది అమ్మేవారు ఉన్నారు. మార్కెట్‌ప్లేస్ పల్స్ అధ్యయనం ఆధారంగా, 2022లో మొదటిసారిగా అమెజాన్ ప్రతి సేల్‌లో కోత 50% దాటింది.

14 Feb 2023

జియో

ప్రేమికుల రోజు కోసం జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్లు

జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్ ను అందిస్తుంది. ఇది ఫిబ్రవరి 10 ఆ తర్వాత రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

13 Feb 2023

జియో

రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం

రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ. 2016లో కార్యకలాపాలను ప్రారంభించి సరికొత్త ఆఫర్లతో భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని పూర్తిగా మార్చింది. ఇది వచ్చినప్పటి నుండి ఆపరేటర్ రీఛార్జ్ ఆప్షన్ సిరీస్ ని పరిచయం చేసింది. ప్రస్తుతం భారతదేశంలోని వినియోగదారులకు అందుబాటులో ఉన్న అన్ని వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకోండి.

ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించింది మరియు మూలధన వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని ఆలోచిస్తుందని ఒక నివేదిక పేర్కొంది.

40,000కోట్ల రుణాల రీఫైనాన్స్ కోసం రుణదాతలతో చర్చలు జరుపుతున్న వోడాఫోన్ ఐడియా

వోడాఫోన్ ఐడియా సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), HDFC బ్యాంక్‌లతో సహా రూ. 30,000-40,000 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ప్రధాన బ్యాంకులతో చర్చలు ప్రారంభించినట్లు ఒక నివేదిక పేర్కొంది.

అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు

US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక తర్వాత ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూప్‌కు ఇది కీలకమైన వారం. దానికి కారణం మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బోర్డు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, అదానీ గ్రూప్ ఉపసంహరించుకున్న సెకండరీ షేర్ అమ్మకంపై జరిపిన దర్యాప్తు గురించి సమాచారాన్ని అందజేస్తుంది.

13 Feb 2023

మెటా

మరిన్ని ఉద్యోగ కోతలను సంస్థ పునర్నిర్మాణంలో భాగమని సమర్ధించుకుంటున్న మెటా

మరింత మందిని ఉద్యోగాల్లోంచి తొలగించే ఆలోచనలో ఉన్న మెటా సంస్థ. ఫేస్‌బుక్ పేరెంట్ సంస్థ మెటా వచ్చే నెలలో సిబ్బంది పనితీరు సమీక్షలను పూర్తి చేసిన తర్వాత సంస్థను పునర్నిర్మించనున్నట్లు తెలిపింది.

తయారీ లోపాలతో అమెరికాలో 34వేల జనరిక్ ఔషధాల బాటిళ్లను వెనక్కి రప్పించిన సన్ ఫార్మా

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ US-ఆధారిత విభాగం ఆంజినా, అధిక రక్తపోటు కొన్ని రకాల గుండె చికిత్సలకు ఉపయోగించే Diltiazem హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను వెనక్కి రప్పిస్తుంది.

11 Feb 2023

విమానం

ఎయిర్‌బస్, బోయింగ్‌ల సంస్థల నుంచి 500 జెట్‌లను ఆర్డర్‌ చేసిన ఎయిర్‌ ఇండియా

ఎయిరిండియా $100 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన 500 కొత్త విమానాల కోసం ఒక భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక ఎయిర్‌లైన్ నుండి ఒకేసారి వచ్చిన అతిపెద్ద ఆర్డర్‌ అని, పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఉద్యోగ తొలగింపులు మొదలుపెట్టిన మైక్రోసాఫ్ట్ HoloLens, Surface, Xboxలో ఉద్యోగ కోతలు

మైక్రోసాఫ్ట్ గత నెలలో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దానిలో భాగంగా, ఇప్పుడు HoloLens మిక్స్డ్ రియాలిటీ హార్డ్‌వేర్, Surface డివైజ్‌ తో పాటు Xbox గేమింగ్ డివిజన్‌ యూనిట్లలో ఉద్యోగాలను తగ్గించింది.

భారతదేశంలో పూర్తిగా సిబ్బందిని తొలగించి కార్యాలయాన్ని మూసేసిన టిక్ టాక్

2020లో భారతదేశంలో నిషేదించిన షార్ట్ వీడియో ప్లాట్ఫాం టిక్‌టాక్ దేశంలోని తన కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకుంది. సంస్థలో మిగిలిన 40 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసింది.

మళ్ళీ నష్టాల బాట పట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్

ఇండెక్స్ ప్రొవైడర్ MSCI (మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్) కొన్ని అదానీ గ్రూప్ స్టాక్‌ల ఫ్రీ-ఫ్లోట్ స్టేటస్‌ను సమీక్షిస్తామని చెప్పిన తర్వాత అదానీ విల్మార్ మినహా గ్రూప్‌లోని అన్ని లిస్టెడ్ కంపెనీలు గురువారం నష్టాల్లో ముగిశాయి.