బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు

హిమాచల్ ప్రదేశ్‌లోని అదానీ విల్మార్ పై రాష్ట్ర ఎక్సైజ్ పన్నుల శాఖ దాడులు నిర్వహించినట్లు అదానీ విల్మార్ గురువారం ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ ఉల్లంఘనల కారణంగానే ఈ దాడి జరిగిందని మీడియా నివేదించగా, ఎలాంటి అవకతవకలు జరగలేదని కంపెనీ పేర్కొంది.

పావోలా హార్డ్ తో ప్రేమలో పడిన బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఒరాకిల్ మాజీ సిఈఓ మార్క్ హార్డ్ మాజీ భార్య పౌలా హర్డ్‌తో ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో కనిపించారు.

అదానీ గ్రూప్ పతనం ప్రభావం దేశీయ రుణదాతలపై లేదంటున్న ఆర్ బి ఐ

స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ గ్రూప్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సంస్థ ఆకాశాన్నంటుతున్న అప్పులను కూడా నివేదిక ఎత్తి చూపింది. ఇప్పుడు, రెగ్యులేటర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు దేశీయ బ్యాంకులకు మద్దతుగా నిలిచాయి.

08 Feb 2023

ఆర్ బి ఐ

#NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 2022 నుండి రెపో రేటును ఆరవసారి పెంచింది. సామాన్యుడికి ఈ రెపో రేటుతో సంబంధం ఏంటి?

ఇంటెల్ సిఈఓ బాటలో జూమ్ సిఈఓ, తన వేతనంలో 98% కోత విధింపు

జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ మంగళవారం తన 15% అంటే దాదాపు 1,300 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. జూమ్ సిఈఓ ఎరిక్ యువాన్ తొలగింపులకు దారితీసిన పరిస్థితులకు తాను బాధ్యత వహిస్తానని, రాబోయే ఆర్థిక సంవత్సరానికి తన జీతం 98% తగ్గించడంతో పాటు కార్పొరేట్ బోనస్‌ను వదులుకుంటున్నానని చెప్పారు.

08 Feb 2023

ఆర్ బి ఐ

రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.

రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్‌లో 5G సేవలను ప్రారంభించిన ఎయిర్ టెల్

భారతీ ఎయిర్‌టెల్ తన 5G సేవలను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్. నగరాల్లో ప్రారంభించింది.

అసెస్‌మెంట్ పరీక్షలో ఫెయిలైన 600 ఫ్రెషర్స్ ను తొలగించిన ఇన్ఫోసిస్ సంస్థ

ఇంటర్నల్ ఫ్రెషర్స్ అసెస్‌మెంట్ (FA) పరీక్షలో ఫెయిలైన కారణంగా ఇన్ఫోసిస్ 600 మంది ఫ్రెషర్లను తొలగించింది. గత నెలలో, దేశంలోని మరో ప్రముఖ ఐటీ సంస్థ విప్రో కూడా ఇలానే 450 మంది ఫ్రెషర్లను తొలగించింది.

ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి

భారతీ ఎయిర్‌టెల్ తన 5G సేవలను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, గ్వాలియర్, భోపాల్ నగరాల్లో విడుదల చేసింది. రిలయన్స్ జియో తన 5G నెట్‌వర్క్‌ను హరిద్వార్‌లో ప్రారంభించింది..

రుణాలని ముందుగా చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువలో సగానికి పైగా నష్టపోయింది. ఆ నష్ట నివారణ చర్యల దిశగా అదానీ గ్రూప్ పనిచేస్తుంది. మల్టీ-ప్రోంగ్ విధానం ద్వారా పెట్టుబడిదారుల ఆందోళనలకు జవాబు ఇవ్వాలని ఆలోచిస్తుంది.

ట్విట్టర్ లో గోల్డ్ చెక్ మార్క్ వెరిఫికేషన్ కోసం వ్యాపారుల నుండి నెలకు $1,000 వసూలు

గతంలో బ్లూ ఫర్ బిజినెస్ అని పిలిచే "వెరిఫైడ్ ఫర్ ఆర్గనైజేషన్స్" ప్లాన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు గత నెలలో ట్విట్టర్ తెలిపింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ బ్రాండ్‌ల ఖాతాల పేరు పక్కన గోల్డ్ చెక్ గుర్తు కోసం నెలకు $1,000 వసూలు చేయాలని ఆలోచిస్తుంది. వ్యాపారులకు ట్విట్టర్ కొత్త చెల్లింపు ప్రణాళిక వివరాలను సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా వివరించారు.

సిబ్బంది, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4% పెంచనున్న కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం తన కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని ప్రస్తుతం ఉన్న 38 శాతం నుండి 42 శాతానికి నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది.

ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విట్టర్ ప్రకటన ఆదాయాన్ని క్రియేటర్లకు షేర్ చేస్తుందని ప్రకటించారు. అయితే, ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్‌ ఉన్న క్రియేటర్లతో మాత్రమే కంపెనీ ప్రకటనల నుండి వచ్చే ఆదాయాన్ని పంచుకుంటుంది.ఈ విధానం ఈరోజు నుండే ప్రారంభమవుతుంది.

కేరళలో మరో మూడు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు

భారతి ఎయిర్‌టెల్ తన 5G సేవలను కేరళలోని కోజికోడ్, త్రివేండ్రం, త్రిస్సూర్‌లో విడుదల నగరాల్లో ప్రారంభించింది. ఈ నగరాల్లో ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్రస్తుత 4G నెట్‌వర్క్ కంటే 20-30 రెట్లు వేగవంతమైన వేగంతో ఆనందించవచ్చు. ప్రస్తుతం ఎయిర్ టెల్ తన 5G డేటా ప్లాన్‌లను ఇంకా వెల్లడించలేదు.

04 Feb 2023

ఆపిల్

రికార్డు ఆదాయాన్ని రాబట్టిన ఆపిల్, భారత్‌పై అతినమ్మకాన్ని పెంచుకుంటున్న టిమ్ కుక్

ఆపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌పై చాలా నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. దానికి కారణం భారతదేశంలో 2022 చివరి త్రైమాసికంలో కంపెనీ రికార్డ్-సెట్టింగ్ పనితీరును చూపించింది.

ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ

ప్రపంచంలోని ఫోర్బ్స్ ప్రపంచ రియల్-టైమ్ బిలియనీర్ల జాబితాలో టాప్ 20 సంపన్నుల జాబితాలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన స్థానాన్ని కోల్పోయారు. US షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై చేసిన నివేదిక ఆ సంస్థ స్టాక్స్ ను దారుణంగా పడిపోయేలా చేసింది. శుక్రవారం 22వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ సంపద 21.77 శాతం అంటే 16.2 బిలియన్ డాలర్లు క్షీణించింది.

మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్

బొగ్గు ఉత్పత్తి చేసే విద్యుత్ ధర ఖరీదు ఎక్కువ కావడంతో అదానీ పవర్ లిమిటెడ్‌తో 2017 విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలని బంగ్లాదేశ్ కోరింది. ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ భారతీయ కంపెనీతో కమ్యూనికేట్ చేసామని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDC) అధికారి తెలిపారు.

అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి

పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడానికి భారతీయ బిలియనీర్ అదానీ చేసిన ప్రయత్నం విఫలమైంది గౌతమ్ అదానీ వ్యాపారాల షేర్లు గురువారం మరింత పడిపోయాయి. అతను తన సంపదలో $100 బిలియన్లను కోల్పోయారు.

224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ

సెన్సెక్స్ 59,932.24 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17,610.4 పాయింట్ల వద్ద స్థిరపడటంతో గురువారం స్టాక్ మార్కెట్ మందకొడిగా ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 0.3% పెరిగి 8,580.65 పాయింట్లకు చేరుకుంది.

02 Feb 2023

మెటా

అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా

మెటా 2023లో ఆదాయాన్ని మరింత మెరుగ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికను సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. 2022 ఆర్ధిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ఊహించిన దానికంటే మెరుగైన పనితీరుతో దాని పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. 2023లో పొదుపుపై దృష్టి పెట్టాలని కంపెనీ ప్రణాళిక వేస్తుంది.

FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్

అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఊహించని విధంగా జరిగిన పరిణామాల ప్రకారం రూ. 20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO)ను రద్దు చేయాలని డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్

బడ్జెట్ విడుదల తర్వాత, దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు మిశ్రమంగా ముగిసింది. ముగింపు సమయానికి, నిఫ్టీ 45.85 పాయింట్లు లేదా 0.26 శాతం క్షీణించి 17,616.30 వద్ద, సెన్సెక్స్ 158.18 పాయింట్లు లేదా 0.27 శాతం పెరిగి 59,708.08 వద్ద ఉన్నాయి.

Msme Budget 2023: ఎంఎస్ఎంఈలకు పెద్ద ఊరట, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌కు రూ.9వేల కోట్లు

బడ్జెట్ 2023లో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు భారీ ఊరట లభించింది. కరోనాతో కుదేలైన సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు క్రెడిట్ గ్యారెంటీ పథకానికి రూ. 9,000కోట్లను కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్న ఇంటెల్ సీఈఓ వేతనంలో 25 శాతం కోత

కాలిఫోర్నియాలోని ఫోల్సమ్ క్యాంపస్‌లో సుమారు 340 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, వేతన కోతలను అమలు చేసినట్లు ఇంటెల్ సంస్థ తెలిపింది. ఈ తగ్గింపులు మిడ్-లెవల్ ఉద్యోగుల నుండి ఎగ్జిక్యూటివ్ వరకు ఉంటాయి. కంపెనీ ఆదాయం వేగంగా పడిపోవడంతో, సంస్థ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

Education Budget 2023: విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ఫోకస్, బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు ఇవే

2023-2024 బడ్జెట్‌లో విద్యా‌రంగంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. కరోనా కారణంగా దాదాపు మూడు సంవత్సరాల పాటు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విద్యారంగంలో నూతనోత్సాహాన్ని నింపేందుకు బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేశారు.

బడ్జెట్ 2023: వ్యాపారస్థులకు గుడ్‌న్యూస్, ఇక మీదట పాన్ కార్డుతోనే అన్ని అనుమతులు

వ్యాపార అనుమతులు, లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు బడ్జెట్ 2023లో కేంద్రం కీలక సవరణలు చేసింది. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు పాన్‌కార్డును సింగిల్ బిజినెస్ ఐడీ కార్డుగా చట్టబద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యాపార అనుమతులు, లావాదేవీలు ఏవైనా పాన్ ఆధారంగా నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

బడ్జెట్ 2023: మహిళల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన కేంద్రం

బడ్జెట్ 2023లో మహిళల కోసం కేంద్రం కొత్త పథకాన్ని ప్రకటించింది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్(Mahila Samman Saving Certificate)పేరుతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

Union Budget 2023-24: మౌలిక రంగానికి పెద్దపీట, కేంద్ర బడ్జెట్‌‌లో హైలెట్స్ ఇవే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టారు.

బడ్జెట్ 2023: పన్ను విధానంలో మార్పులు, రూ.7 లక్షల వరకు ఆదాయ పన్నులేదు

'బడ్జెట్ 2023'లో ఆదాయపు పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానంలో భాగంగా రూ.7 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని ప్రకటించారు.

ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా

ఆర్ధిక అభివృద్ది దిశగా దేశం దూసుకుపోవాలంటే విద్యారంగంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అటువంటప్పుడు బడ్జెట్ లో ఆ రంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది.

బడ్జెట్ 2023: పాత పన్ను విధానంలో మినహాయింపులు, 80సీ కింద మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయా?

వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న అంచనాల నేపథ్యంలో భారతదేశ వృద్ధిని కొనసాగించే చర్యలను 2023 బడ్జెట్‌లో ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

బడ్జెట్ 2023లో పన్ను తగ్గింపులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ 2023పై వేతన జీవులు, చిన్న, మధ్య, భారీ పారిశ్రామిక వర్గాలతో పాటు పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

వరల్డ్ టాప్10 సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్

భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలో చోటు కోల్పోయారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థలకు సంబంధించిన షేర్లు పతనవుతూ వస్తున్నాయి.

అన్నిటికి ఉపయోగపడే యాప్ కోసం పేమెంట్ టూల్స్ పై పని చేస్తున్న ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విటర్‌ని పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌గా తయారుచేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, ఈ సోషల్ మీడియా సంస్థ పేమెంట్ టూల్స్ పై పనిచేయడం ప్రారంభించింది.

ఆర్థిక సర్వే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వృద్ధి నమోదు

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధిరేటు 6.5శాతం నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం 7శాతం నమోదు అవుతుందని, 2021-22లో 8.7శాతం నమోదైనట్లు ఆర్థిక సర్వే పేర్కొంది.

31 Jan 2023

బడ్జెట్

ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి

కేంద్ర బడ్జెట్-2023 సమావేశాలు మంగళవారం ప్రారంభయ్యమాయి. ఈ క్రమంలో 'ఆర్థిక సర్వే 2023'ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థిక సర్వేను నిర్మల లోక్‌సభ ముందుంచారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక సర్వే ప్రముఖ్యత, చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.

31 Jan 2023

మెటా

మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం

మెటా గత సంవత్సరం, 11,000 మంది ఉద్యోగులను అంటే సిబ్బందిలో 13% మంది ఉద్యోగులను తొలగించింది. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంస్థ ప్రస్తుతం మెటా సంస్థాగత నిర్మాణంపై అసంతృప్తిగా ఉన్నారు. దానికి కారణం మానేజ్మెంట్ లో వివిధ టీంలు ఉండడం. ఖర్చులను తగ్గించే ఆలోచనలో ఉన్న జుకర్‌బర్గ్ మరికొన్ని తొలగింపులను దృష్టిలో ఉంచుకున్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.

IMF: 2023లో భారత వృద్ధి 6.1శాతంగా అంచనా, 2022తో పోలిస్తే 0.7శాతం తక్కువ

2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంగళవారం జనవరికి సంబంధించిన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌ను విడుదల చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థలో కొంత మందగమనాన్ని నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.8శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ప్రకటించింది.

మరో 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫిలిప్స్ సంస్థ

డచ్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ ఫిలిప్స్ 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. స్లీప్ అప్నియా ట్రీట్‌మెంట్ డివైజ్‌లను వెనక్కి రప్పించడంతో కంపెనీ నష్టాల బారిన పడింది. దీని కారణంగా ఫిలిప్స్ తన మార్కెట్ వాల్యుయేషన్‌లో 70% కోల్పోయింది. గత ఏడాది అక్టోబర్‌లో సంస్థ ప్రకటించిన 4,000 మంది ఉద్యోగుల తొలగింపుకు అదనంగా మరో 6,000 మందిని తొలగించబోతుంది.