సినిమా వార్తలు | పేజీ 2

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

రామ్ చరణ్ 15: టైటిల్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలిసిపోయింది

ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా తొందరగానే తన తర్వాతి సినిమాను మొదలెట్టాడు రామ్ చరణ్. తన కెరీర్ లో 15వ చిత్రంగా వస్తున్న ఈ మూవీని తమిళ చిత్రాల దర్శకుడు శంకర్, డైరెక్ట్ చేస్తున్నారు.

అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది

అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అవును, ఈ మేరకు ప్రకటన కూడా వచ్చేసింది.

03 Mar 2023

ఓటిటి

ట్రోల్స్ కు బలైన లెజెండ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే

సాధారణంగా సినిమా వాళ్ళమీద పుకార్లు, ట్రోల్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. సినిమాలో పొరపాటున ఏదైనా చిన్నది దొరికితే చాలు, ట్రోలర్స్ కి పంట పండినట్లే.

02 Mar 2023

టీజర్

విరూపాక్ష టీజర్: గ్రామంలోని రహస్యం వెనుక నిజాలు చెప్పే కథ

సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న విరూపాక్ష టీజర్, ఇంతకుముందే విడుదలైంది. ఒకానొక గ్రామంలో ఎప్పుడూ లేనట్టుగా ఏదో ఒక వింత జరుగుతుంది.

ఒక్కరోజు యాడ్ షూటింగ్ కి లక్షలు తీసుకుంటున్న చిన్న హీరో తేజ సజ్జా

సినిమా ఇండస్ట్రీలో లెక్కలన్నీ వేరేగా ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఎలా ఎదుగుతారో ఎవ్వరూ ఊహించలేరు. కొన్నిసార్లు కేవలం సినిమా టీజర్లు కూడా పాపులారిటీని తెచ్చిపెడతాయి.

విరూపాక్ష టీజర్: ఈరోజు సాయంత్రమే విడుదల

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష టీజర్ ఈరోజు సాయంత్రం 5గంటలకు విడుదల కానుందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రకటించింది.

02 Mar 2023

సినిమా

రజనీకాంత్ 170: జై భీమ్ దర్శకుడితో సినిమా మొదలు

హీరో రజనీకాంత్ 170వ మూవీ ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతానికి తలైవర్ 170 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నారు.

రవితేజ రావణాసుర ప్రమోషన్స్ మొదలు: టీజర్ రిలీజ్ ఎప్పుడంటే

వరుస హిట్లతో దూసుకుపోతున్న మాస్ మహారాజ రవితేజ, ఈసారి రావణాసుర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఏప్రిల్ 7వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇంటి పేర్లనే సినిమా టైటిల్ గా మార్చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కలిసి నటిస్తున్న సినిమా నుండి అప్డేట్లు రాక అభిమానులు ఆగమయ్యారు. ఈ అప్డేట్ల విషయమై నవీన్ పొలిశెట్టి ఒక చిన్న వీడియో కూడా చేసాడు.

01 Mar 2023

టీజర్

అన్నీ మంచి శకునములే టీజర్ రిలీజ్ డేట్: ఈసారైనా సంతోష్ శోభన్ కు శకునం కలిసొస్తుందా?

సంతోష్ శోభన్, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా రూపొందిన అన్నీ మంచి శకునములే చిత్ర టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో ప్రకటించారు. ఈ మేరకు ఆ సినిమాలో నటిస్తున్న గౌతమి గారి పాత్ర మీనాక్షి ని పరిచయం చేస్తూ మార్చ్ 4వ తేదీన టీజర్ రిలీజ్ ఉంటుందని చెప్పేసారు. '

ప్రాజెక్ట్ కె: మహావిష్ణు అవతారంలో ప్రభాస్?

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సైన్స్ ఫిక్షన్, ప్రాజెక్ట్ కె మూవీకి సంబంధించి ఇప్పటి వరకు రెండు మూడు పోస్టర్లు విడుదలయ్యాయి.

సిక్స్ ప్యాక్ పోయి ఫ్యామిలీ ప్యాక్ తో సందడి చేస్తున్న సుధీర్ బాబు

పాత్ర కోసం బరువు తగ్గడం, బరువు పెరగడం, సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ చేయడం మామూలే. పాత్రలో ఒదిగిపోవడానికి హీరోలు రకరకాలుగా కష్టపడుతుంటారు.

01 Mar 2023

సినిమా

అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్ళలో బాంబ్ భయం

బాలీవుడ్ సీనియర్ హీరోలైన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్ళలో బాంబ్ ఉందని మహారాష్ట్ర లోని నాగ్ పూర్ పోలీసులకు కాల్ వచ్చింది. దాంతో వెంటనే ముంబై పోలీసులను అలెర్ట్ చేసారు.

01 Mar 2023

సినిమా

SSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు 28వ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. హైదరాబాద్ లోని స్టూడియోలో వేసిన సెట్ లో వేగంగా షూటింగ్ కావస్తోంది.

ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్: ఎన్టీఆర్ అమెరికా ప్రయాణం ఎప్పుడు ఉంటుందంటే?

హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ ఫంక్షన్ కి ఎన్టీఆర్ వెళ్ళకపోవడంతో ఆయన అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ఆర్ఆర్ఆర్ బృందానికి దక్కిన గౌరవంలో ఎన్టీఆర్ లేకపోయాడే అని అందరూ ఫీలయ్యారు.

ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాట లైవ్

ఆర్ఆర్ఆర్ మూవీ సృష్టిస్తున్న ప్రభంజనాలు ఇన్నీ అన్నీ కావు. ప్రపంచ వ్యాప్తంగా అందరి అభిమానాన్ని అందిపుచ్చుకుంటోంది ఆర్ఆర్ఆర్. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుని సత్తా చాటింది.

28 Feb 2023

ఓటిటి

ఓటీటీ: మార్చ్ లో రిలీజ్ అవుతున్న వెంకటేష్ రానా నాయుడు, తరుణ్ భాస్కర్ యాంగర్ టేల్స్

మార్చ్ లో బాక్సాఫీసు వద్ద సందడి చేయడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. అదే మాదిరిగా ఓటీటీలో వినోదం పంచడానికి కొన్ని సిరీస్ లు వచ్చేస్తున్నాయి.

యాక్షన్ ఇచ్చిన బహుమతులంటూ గాయాలను చూపుతున్న సమంత

స్టార్ హీరోయిన్ సమంత, సినిమాల షూటింగుల్లో పాల్గొనడానికి వచ్చేసింది. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం సిటాడెల్ అనే సిరీస్ లో నటిస్తోంది.

#PKSDT మూవీలో నటించే వాళ్ళ లిస్ట్ వచ్చేసింది

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా వారం రోజుల క్రితమే ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా, తమిళ చిత్రమైన వినోదయ సీతమ్ కి రీమేక్ గా రూపొందుతోంది.

28 Feb 2023

టీజర్

సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు

యాక్టర్ శ్రీ విష్ణు, రెబ్బా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా వస్తున్న చిత్రం సామజవరగమన. వివాహ భోజనంబు సినిమాతో మెప్పించిన రామ్ అబ్బరాజు, ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ ఆహ్వానం ఎన్టీఆర్ కి అందలేదా? నిజమేంటంటే?

హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ తన సత్తాను చాటింది. నాలుగు విభాగాల్లో పురస్కారాలు అందుకుని అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది.

పవన్ కళ్యాణ్ సరసన ధమాకా బ్యూటీకి ఛాన్స్?

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిందని, కొత్త సినిమాలు రావాలనీ, అన్నీ కొత్తగా ఉండాలనీ, వింత పోకడలకు పోతున్న సమయంలో వచ్చిన ధమాకా, అందరి నోళ్ళను మూయించిందని చెప్పాలి.

27 Feb 2023

సినిమా

రేపు విడుదల కానున్న సామజవరగమన ఫస్ట్ లుక్

నటుడు శ్రీ విష్ణు గత చిత్రం అల్లూరి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు సామజవరగమన అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల

ఈమధ్య హీరోల పుట్టినరోజు సంధర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలు విడుదల చేయడం ట్రెండ్ గా మారింది. అలాగే ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు.

27 Feb 2023

సినిమా

దర్శకుడు కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత

తెలుగు దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ మరణించి నెల కూడా కాకముందే ఆయన సతీమణి జయలక్ష్మి ఆదివారం తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. అయితే ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. జయలక్ష్మి మరణించే నాటికి ఆమె వయసు 86 ఏళ్లు. విశ్వనాథ్ మరణించిన 24 రోజులకే జయలక్ష్మి మృతి చెందడం కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

25 Feb 2023

సినిమా

'సార్' సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 75 కోట్లు వసూలు చేసింది

ధనుష్ తాజా సినిమా సార్ (తమిళంలో వాతి) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతుంది. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలపై తీసిన సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాతి/సార్, రూ. 75కోట్లు కలెక్షన్స్ సాధించి విజయవంతంగా విదేశాలలో కూడా ఆడుతుంది.

25 Feb 2023

ఓటిటి

"నిజం విత్ స్మిత " షో లో నాని వారసత్వంపై చేసిన కామెంట్స్ వైరల్

నేచురల్ స్టార్ నాని, హీరో రానా దగ్గుబాటితో నిజం విత్ స్మిత షో పాల్గొన్నారు. ఈ మధ్యే నటుడి ఎపిసోడ్ ప్రోమోను ఓటీటీ ప్లాట్‌ఫాం సోనిలివ్ లో విడుదల చేశారు. ఆ షోలో, నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, వీటిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు.

25 Feb 2023

ప్రభాస్

సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు

తెలుగు ప్రేక్షకులు అందులోనూ ముఖ్యంగా రెబెల్ స్టార్ ప్రభాస్ ఫాన్స్ ఎక్కువగా ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా "సాలార్". సినిమా బృందం కూడా ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉండడం అభిమానుల్లో ఇంకొంచెం ఆతృత పెంచుతుంది.

25 Feb 2023

సినిమా

ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

తెలుగు ప్రేక్షకులను తన ప్రేమ కథలతో మాయ చేసి, మైమరిపించిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ రోజు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మాతృబాష మలయాళం అయినా "మిన్నల్" అనే తమిళ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు గౌతమ్ మీనన్.

ఏజెంట్ సినిమాకు పాజిటివ్ గా పరిస్థితులు: అత్యధిక ధరకు అమ్ముడైన థియేట్రికల్ రైట్స్

అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ మూవీ, విడుదలకు సిద్ధం అవుతోంది. ఎన్నోరోజులుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం, పాన్ ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా రిలీజ్ కావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

24 Feb 2023

ఓటిటి

న్యూసెన్స్ టీజర్ రిలీజ్: రాజకీయాలే టార్గెట్ గా నవదీప్ కొత్త చిత్రం

ఓటీటీ వచ్చాక థియేటర్లకు దెబ్బపడిందన్నది నిజమే అయినా, చాలా కొత్త కంటెంట్ ఓటీటీ ద్వారా విడుదల అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహపడాల్సిన పనిలేదు.

ఇండియాలో హాలీవుడ్ సృష్టిస్తానంటున్న రానా

సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న నిజం విత్ స్మిత టాక్ షో ప్రోగ్రామ్ కి అతిధిగా వచ్చిన రానా దగ్గుబాటి, భారతీయ సినిమా గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. సింగర్ స్మిత వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న షోలోకి నాని తో పాటు వచ్చారు రానా.

24 Feb 2023

ఓటిటి

ఓటీటీలో వీరసింహారెడ్డి ఊచకోత: నిమిషంలోనే లక్షా 50వేలకు పైగా వ్యూస్

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం నిన్న సాయంత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం రికార్డులను ఊచకోత కోసేసింది. అదే మాదిరిగా ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

నాని బర్త్ డే: కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాలు

నాని.. ఇంట్లో కుర్రాడిలా ఉంటాడు, అందుకే ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. నాని.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగాడు, అందుకే కుర్రాళ్ళకు ఆయనంటే అభిమానం ఎక్కువ.

మహేష్ బాబు 28వ సినిమా తప్పుకుంటే రవితేజ సినిమాకు లాభం?

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు 28వ సినిమా రూపుదిద్దుకుంటుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో జరుగుతుందని వార్తలు వచ్చాయి.

గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్: ఈసారి కొత్త డేట్ తో వచ్చారు

టాలీవుడ్ లో రిలీజ్ లో సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీరిలీజ్ లకు మంచి కలెక్షన్లు వస్తుండడంతో చిత్ర నిర్మాతలు అప్పట్లో సంచలనం సృష్టించిన సినిమాలను థియేటర్లలోకి మళ్ళీ తీసుకొస్తున్నారు.

23 Feb 2023

ఓటిటి

మైఖేల్ మూవీ, పులి మేక సిరీస్ లతో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కంటెంట్

థియేటర్లలోకి శుక్రవారం కొత్త సినిమాలు రెడీ రావడానికి రెడీ అవుతుంటే, ఇటు ఓటీటీలో సందడి చేయడానికి కంటెంట్ రెడీ ఐపోయింది. సినిమాలు, సిరీస్ లతో ఈ వీకెండ్ ని హాయిగా ఎంజాయ్ చేయండి.

టెలివిజన్ ప్రీమియర్ గా వస్తున్న కార్తీ నటించిన సర్దార్

హీరో కార్తీ, డబుల్​ రోల్​లో మెప్పించిన యాక్షన్​ ఎంటర్​టైనర్​ సర్దార్​.. ఫిబ్రవరి 26, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

23 Feb 2023

సినిమా

ఫీఛర్ ఫిలిమ్ తో రాని గుర్తింపు షార్ట్ ఫిలిమ్ తో పొందిన షఫి, కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కు నామినేట్

సినిమా ఇండస్ట్రీ విచిత్రంగా ఉంటుంది. ఏ సినిమా ఎప్పుడు సక్సెస్ అవుతుందో, ఏ ఆర్టిస్టుకు ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి ఆ ఆర్టిస్టు పనైపోయిందనుకుంటే అనూహ్యంగా అద్భుత విజయాలతో ఆకాశంలోకి వెళ్ళిపోతారు.

రామ్ చరణ్ పుట్టినరోజు కానుక: మగధీర మళ్లీ విడుదల

రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. తాము ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం ఈసారి రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మగధీర థియేటర్లలోకి మళ్ళీ వచ్చేస్తోంది.