సినిమా వార్తలు | పేజీ 1

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

కేజీఎఫ్ కాంట్రవర్సీ: వెంకటేష్ మహాకు క్లాస్ తీసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్

కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా, కేజీఎఫ్ సినిమాపై మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియాలో అతని మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.

ఆస్కార్ అవార్డ్స్: ప్రియాంకా చోప్రా పార్టీలో రాహుల్ సిప్లిగంజ్

ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చ్ 13వ తేదీన ఉదయం నుండి మొదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం అమెరికాకు చేరుకుంది.

10 Mar 2023

ఓటిటి

రానా దగ్గుబాటి, వెంకటేష్ నటించిన రానా నాయుడు రివ్యూ

అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కి రీమేక్ గా వచ్చిన రానా నాయుడు సిరీస్, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.

వైరల్ అవుతోన్న నరేష్ పవిత్రల పెళ్ళి వీడియో

యాక్టర్ నరేష్, పవిత్రల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నాళ్ళుగా వాళ్ళిద్దరి పేర్లు సోషల్ మీడీయాలో విపరీతంగా వినిపించాయి. వాళ్ళ మధ్య బంధం గురించి అనేక వార్తలు వచ్చాయి.

పారితోషికంలో ప్రభాస్ ని మించిపోయిన అల్లు అర్జున్, ఏకంగా వంద కోట్లకు పైనే

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్, తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన తర్వాతి చిత్రానికి 120కోట్లు అల్లు అర్జున్ డిమాండ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

కేజీఎఫ్ కాంట్రవర్సీ: నవ్విన దర్శకులందరికీ తన మాటలతో పంచ్ ఇచ్చిన నాని

కేజీఎఫ్ సినిమా మీద అనేక కామెంట్లు చేసిన వెంకటేష్ మహా మీద సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ సినిమాలోని క్యారెక్టర్ గురించి వెంకటేష్ మహా మాట్లాడుతుంటే పక్కన కూర్చున్న ఇంద్రగంటి మోహనకృష్ణ, నందినీ రెడ్డి, వివేక్ ఆత్రేయ విరగబడి నవ్వారు.

డబ్బు చుట్టూ ముడిపడిన దోచేవారెవరురా చిత్రాన్ని తీసుకొస్తున్న గీతా ఆర్ట్స్

దోచేవారెవరురా అనే చిత్రాన్ని రేపు థియేటర్లలోకి తీసుకొస్తుంది గీతా ఆర్ట్స్ సంస్థ. డిస్ట్రిబ్యూటర్ గా తెలంగాణ, రాయ్ చూర్, కొప్పాల్, గోదావరి జిల్లా ప్రాంతాల్లో దోచేవారెవరురా చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది గీతా ఆర్ట్స్.

10 Mar 2023

ఓటిటి

ఓటీటీ: యాంగర్ టేల్స్ రివ్యూ

వెంకటేష్ మహా, సుహాస్, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్, బిందు మాధవి నటించిన యాంగర్ టేల్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మార్చ్ 9వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాపై తమ్మారెడ్డి భరధ్వాజ్ వ్యాఖ్యలకు రాఘవేంద్రరావు కౌంటర్

రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రపంచమే దాసోహమైపోతోంది. కాకపోతే కొంతమంది సీనియర్ దర్శకులు మాత్రం, ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ పెడుతున్న ఖర్చుతో 8సినిమాలు తీయొచ్చంటూ ఉపదేశాలు చేస్తున్నారు.

అటు ఒక సినిమా రిలీజ్ పెట్టుకుని ఇటు సినిమా లాంఛ్ చేసిన కిరణ్ అబ్బవరం

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ప్రేక్షకుల మీద దండయాత్ర చేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఇటీవల వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో యావరేజ్ విజయం అందుకున్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు మీటర్ అంటూ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఆస్కార్ అవార్డ్స్: ఆ ఘనత సాధించిన తొలి తమిళ నటుడిగా హీరో సూర్య రికార్డ్

95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఇంకో మూడు రోజుల్లో మొదలు కానుంది. ఈ అవార్డుల కోసం ప్రపంచ సినిమా అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్, మరికొద్ది రోజుల్లో ప్రకటన

ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్, సెన్సేషనల్ న్యూస్ తో వచ్చాడు. గత కొన్ని రోజులుగా అమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీని ఆస్కార్ కోసం నాటు నాటు పాటను ప్రమోట్ చేస్తున్న రామ్ చరణ్, పాడ్ కాస్టర్ సామ్ ప్రాగాసోతో ముచ్చటిస్తూ తన హాలీవుడ్ ప్రవేశం గురించి చెప్పుకొచ్చాడు.

ఇంట్రెస్టింగ్ టైటిల్ తో హీరోగా వస్తున్న వరుణ్ సందేశ్

హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ఆ తర్వాత కొత్త బంగారు లోకం మూవీతో హిట్ కొట్టిన వరుణ్ సందేశ్, తన పాపులారిటీని ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయాడు.

RC15 : పాటకు పదికోట్లు ఖర్చు పెడుతున్న శంకర్ ?

శంకర్ సినిమాల్లో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుందన్న సంగతి తెలిసిందే. పాటలను అందంగా చిత్రీకరించడం కోసం ఎంతగానో ఖర్చు చేస్తుంటారు. అందుకే శంకర్ సినిమాల పాటలు ప్రత్యేకంగా ఉంటాయి.

ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత

యాక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా, దర్శకుడిగా బాలీవుడ్ సినిమాకు విశేష సేవలందించిన సతీష్ కౌషిక్, 66ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్, ట్విట్టర్ వేదికగా వెల్లడి చేసారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: తెలుగు సినిమా దశను మార్చిన హీరోయిన్స్

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా తెలుగు సినిమాలో మహిళల పాత్రను, తెలుగు సినిమాను మార్చిన మహిళల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి

రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీకి అంతర్జాతీయంగా ఎన్ని ప్రశంసలు అందుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్లో కూడా ఉంది.

అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియస్ సినిమాస్ థియేటర్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఏఏఏ పేరుతో అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ ను ప్రారంభించనున్నారు.

07 Mar 2023

టీజర్

పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ నటించిన సత్తిగాని రెండెకరాలు టీజర్ రిలీజ్

పుష్ప సినిమాల్లో అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్, ఆ సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు మల్లేశం సినిమాలో కనిపించినా పెద్దగా పేరు రాలేదు.

కేజీఎఫ్ వివాదం: వెంకటేష్ మహా మాటలకు నవ్విన డైరెక్టర్ సారీతో వచ్చాడు

సినిమాల్లో మహిళా పాత్రల గురించి సాగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, బీవీ నందినీ రెడ్డి, శివ నిర్వాణ, వెంకటేష్ మహా, వివేక్ ఆత్రేయ పాల్గొన్నారు.

కేజీఎఫ్ - వెంకటేష్ మహా కాంట్రవర్సీ: సారీ అంటూ వీడియో

ఒకానొక ఇంటర్వ్యూలో కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ, కేజీఎఫ్ సినిమా మీద చాలా కామెంట్లు చేసారు. ఆ సినిమాలోని రాఖీ భాయ్ పాత్ర మీదా, అమ్మ పాత్ర మీదా అనరాని మాటలు అన్నాడు.

"ఇవాలే కలిశారు తొలిసారిగా…" అంటున్న "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి"

ఈ నెల 17 న రానున్న సినిమా "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి" టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ నాగ శౌర్య, మాళవిక నాయర్ మధ్య జరిగే సరదా సన్నివేశాలు, ముద్దు ముచ్చట్లతో సాగే ఈ పాటను యూట్యూబ్ లో సినిమా యూనిట్ రిలీజ్ చేశారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ పాటలో ఆయన నూతన మోహన్ తో కలిసి ఆలపించారు. భాస్కర భట్ల ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు.

06 Mar 2023

ఓటిటి

ఓటీటీ: ఈ వారం ఇంట్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు

ఈ వారంలో ఓటీటీలో మంచి కంటెంట్ విడుదల అవుతోంది. సినిమాలతో పాటు సిరీస్ లు కూడా రానున్నాయి. అవేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

నాగశౌర్య మూవీ ఫఫ నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ పై అప్డేట్

నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.

06 Mar 2023

టీజర్

రావణాసుర టీజర్: విలన్ గా మారిన రవితేజ

రవితేజ అంటే మాస్.. మాస్ సినిమాలకు రవితేజ పెట్టింది పేరు. అందుకే మాస్ మహారాజ అంటారు. అయితే రావణాసుర టీజర్ చూసిన తర్వాత రవితేజ లోని మరో కోణం బయటపడుతుంది.

ఎన్టీఆర్ 30: హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్, అదిరిపోయిన ఫస్ట్ లుక్

ఎన్టీఆర్ 30 నుండి అప్డేట్ వచ్చేసింది. ఎప్పటి నుండో అందరూ ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోందని అధికారిక ప్రకటన ఈ రోజే వెలువడింది.

ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు ప్రాజెక్ట్ కె షూటింగ్ లో యాక్సిడెంట్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు జరిగిన్ ప్రమాదంలో గాయాలు కావడంతో కుడివైపు పక్కటెముకలకు గాయాలయ్యాయి.

06 Mar 2023

సినిమా

మా నాన్న లైంగికంగా వేధించే వాడంటూ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సంచలనం

సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్, సంచలన విషయాలు బయట పెట్టారు. తన ఎనిమిదేళ్ళ వయసులో తన తండ్రి లైంగికంగా వేధించే వారని చెప్పుకొచ్చారు.

శర్వానంద్ బర్త్ డే: పాత్ర కన్నా సినిమా గొప్పదని నమ్మే నటుడి కెరీర్లోని వైవిధ్యమైన సినిమాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరు మాస్ సినిమాలతో జనాలకు దగ్గరైతే మరికొందరు క్లాస్ సినిమాలతో దగ్గర అవుతారు . కానీ కొందరు మాత్రమే తమ సినిమాలోని వైవిధ్యత వల్ల దగ్గర అవుతారు. ఆ వరుసలో శర్వానంద్ ముందుంటారు.

నాజర్ బర్త్ డే: దక్షిణాది సినిమాల్లో చెరగని ముద్రవేసిన నాజర్ జీవితంలో మీకు తెలియని విషయాలు

నాజర్... పాత్రేదైనా ఆ పాత్రకు కొత్తదనాన్ని తీసుకొచ్చే నటుడు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోకు సపోర్ట్ ఇస్తాడు. అలాగే విలన్ గా హీరోను ఎదిరిస్తాడు. అంతేకాదు, కమెడియన్ గా మారి ప్రేక్షకులను నవ్విస్తాడు కూడా.

వరుణ్ తేజ్ తో పెళ్ళి పుకార్ల పై స్పందించిన లావణ్య త్రిపాఠి

సినిమా తారల మీద పుకార్లు రావడం సహజమే. స్టార్ స్టేటస్ పెరిగే కొద్దీ ఈ పుకార్లు కూడా పెరుగుతుంటాయి. గత కొంత కాలంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్ళి గురించి చాలా పుకార్లు బయటకు వచ్చాయి.

నందినీ రెడ్డి బర్త్ డే: నువ్వు లేకపోతే నేనేం చేయలేనంటూ సమంత ఎమోషనల్

మార్చ్ 4వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న డైరెక్టర్ నందినీ రెడ్డి కి శుభాకాంక్షలు వస్తూనే ఉన్నాయి. ఐతే ఇన్ స్టాగ్రామ్ లో సమంత షేర్ చేసిన పోస్ట్ మాత్రం అందరినీ ఆకర్షించింది.

నాటు నాటు పాటను వింటూ సందడి చేసిన సౌత్ కొరియా సింగర్ జాంగ్ కూక్

ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు స్టెప్పులేయని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు నుండి మొదలెడితే అంతర్జాతీయ స్థాయిలో నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ చాలామంది కనిపించారు.

మామా మశ్చీంద్ర సెకండ్ లుక్: అప్పుడు లావుగా, ఇప్పుడు ముసలివాడిగా కనిపిస్తున్న సుధీర్ బాబు

హీరో సుధీర్ బాబు మామా మశ్చీంద్ర సినిమాతో కొత్తగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయం, ఈ సినిమా నుండి రిలీజ్ అవుతున్న లుక్ పోస్టర్స్ చూస్తే అర్థమైపోతోంది.

వైరల్ వీడియో: ఇండోర్ క్రికెట్ మైదానంలో తగ్గేదేలే అంటూ కనిపించిన ఆస్ట్రేలియా కుర్రాడు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. పుష్ప లోని తగ్గేదేలే డైలాగ్ ప్రపంచ మంతా పాకిపోయింది. బాలీవుడ్ సెలెబ్రిటీల నుండి మొదలుపెడితే అంతర్జాతీయ క్రికెటర్ల వరకూ తగ్గేదేలే మ్యానరిజాన్ని చూపించారు.

04 Mar 2023

ఓటిటి

ఓటీటీలోకి వస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

బింబిసార సినిమాతో కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్, తన తర్వాతి చిత్రంగా అమిగోస్ ని తీసుకొచ్చాడు. ఫిబ్రవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజైన అమిగోస్, డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

వచ్చే సంక్రాంతికి ప్రభాస్, రజనీ కాంత్ పోటాపోటీ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్, స్పిరిట్ మొదలగు సినిమాలున్నాయి. అందుకే ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం జూన్ నుండి ప్రభాస్ సినిమాలు ఒక్కోటి విడుదల కానున్నాయి.

03 Mar 2023

ఓటిటి

ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల లిస్టు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఎన్నో ఛానెల్స్ పుట్టుకొచ్చాయి. అన్నింట్లోనూ కొత్త కంటెంట్ ఉంటోంది. అలా అని అన్నింటినీ చూడలేము.

మంచు మనోజ్ మ్యారేజ్: పెళ్ళి కూతురును పరిచయం చేసిన హీరో

ఎట్టకేలకు మంచు మనోజ్ పెళ్ళికి సిద్ధమయ్యాడు. భూమా మౌనిక రెడ్డిని ఈరోజు వివాహం చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన అభిమానులకు పెళ్ళికూతురు భూమా మౌనికను పరిచయం చేసాడు మనోజ్.

ఆస్కార్ అవార్డ్స్: హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునేకు దక్కిన గౌరవం

ఈసారి భారతీయులకు ఆస్కార్ అవార్డ్స్ మంచి మంచి అనుభూతులను పంచేలా ఉన్నాయి. 95వ ఆస్కార్ అవార్డులను భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేనంతగా మారేలా కనిపిస్తున్నాయి.