సినిమా వార్తలు | పేజీ 4

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

ఆర్ఆర్ఆర్: ఆఖరుసారిగా 200 థియేటర్లలో రీ రిలీజ్ కు రెడీ

ఆర్ఆర్ఆర్ మూవీని అమెరికా జనాలు నెత్తిన పెట్టేసుకున్నారు. ఆల్రెడీ ఎన్ కోర్ ల రూపంలో ఎన్నోసార్లు థియేటర్లలోకి ఆర్ఆర్ఆర్ ను తీసుకొచ్చారు. ఎన్ కోర్ ల ద్వారానే అమెరికా జనాలకు ఎక్కువగా రీచ్ అయ్యింది ఆర్ఆర్ఆర్.

ఆర్ఆర్ఆర్ హీరోల హవా: బెస్ట్ యాక్టర్ నామినేషన్లలో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ సరసన చోటు

ఆర్ఆర్ఆర్ హవా ఇంకా తగ్గలేదనడానికి నిదర్శనంగా ప్రతీరోజూ వస్తున్న ప్రశంసలు ఒక కారణమైతే, అవార్డ్ నామినేషన్లలో దూసుకుపోవడం రెండవ కారణం.

దసరా ప్రమోషన్లు: చరిత్రలో మొదటిసారిగా 39సెంటర్లలో కౌండ్ డౌన్ బోర్డ్స్

నేచురల్ స్టార్ నాని, దసరా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పరిచయం కావాలని చూస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్లు మొదలు పెడుతున్నాడు నాని.

22 Feb 2023

సినిమా

100వ సినిమాకు అదిరిపోయే ప్లాన్ తో నాగార్జున, గాడ్ ఫాదర్ డైరెక్టర్ కు ఛాన్స్?

ధమాకా రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడకు దర్శకుడిగా అవకాశమిస్తున్నాడని నాగార్జున గురించి వార్తలు వచ్చాయి. ప్రసన్న కుమార్ చెప్పిన పాయింట్ నాగార్జునకు నచ్చిందనీ, పూర్తి కథను సిద్ధం చేయమని నాగార్జున చెప్పాడని అన్నారు.

22 Feb 2023

సినిమా

డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా చేసిన ప్రభు కు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

చంద్రముఖి, శక్తి, డార్లింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ నటుడు ప్రభు, గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు కొడంబక్కల్ లోని మెడ్ వే హాస్పిటల్ కు చేర్చారు.

ఉగ్రం టీజర్ టాక్: పవర్ పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఉగ్రం టీజర్ ఈరోజే విడుదలైంది. అక్కినేని నాగ చైతన్య అతిధిగా టీజర్ లాంచ్ కార్యక్రమం సాగింది.

హాలీవుడ్ లో రామ్ చరణ్ క్రేజ్: అమెరికా టాక్ షోలో అతిథిగా రామ్ చరణ్

రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. 6వ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అతిథిగా, అవార్డు ప్రెజెంట్ చేయడానికి వెళ్లారు.

22 Feb 2023

సినిమా

స్టార్ అయినా ప్రభాస్ మారలేదని చెప్పడానికి నిదర్శనమే సాచి ట్రైలర్ లాంచ్

పెద్ద హీరోలకు పెద్దగా సమయం ఉండదు. ఇది వందశాతం నిజం, ఆ పెద్ద హీరో చేతిలో ఐదారు సినిమాలుంటే ఆ హీరో పరిస్థితి ఎలా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్లకు అటెండ్ కాలేరు.

నందమూరి తారకరత్న బర్త్ డే: మరణించిన నాలుగు రోజులకే పుట్టుక

నందమూరి తారకరత్న మరణం సినిమా అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురై, ఆ తర్వాత 20రోజులకు పైగా మృత్యువుతో పోరాడి చివరకు మృత్యువు చేతిలో ఓడిపోయారు తారకరత్న.

పరేషాన్ టీజర్ టాక్: మనిషికి నీళ్ళు, అన్నం ఎట్లనో మందు కూడా గట్లనే

మసూద సినిమాతో మాంచి హిట్ అందుకున్న హీరో తిరువీర్, ఈసారి పరేషాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పరేషాన్ టీజర్ ఈరోజే విడుదలైంది.

ఆస్కార్ కంటే ముందుగానే అమెరికా వెళ్ళిన రామ్ చరణ్, కారణమేంటంటే,

మెగా పవర్ స్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం అమెరికా పయనమయ్యారు. ఆస్కార్స్ అవార్డుల ప్రధానోత్సవానికి ఇంకా చాలా సమయం ఉండగా ఇప్పుడు ఎందుకు వెళ్ళారని అందరూ ఆలోచిస్తున్నారు.

నేనెప్పుడూ చేయనిది, మీరెప్పుడూ చూడనిది కనిపించే సమయం వచ్చేసిందంటున్న అల్లరి నరేష్

తన పాత పంథాను పక్కనపెట్టి కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు అల్లరి నరేష్. ఆ క్రమంలోనే నాంది సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.

21 Feb 2023

సినిమా

అన్నీ అనుకున్నట్లు జరిగితే చరిత్ర పేజీల్లో ప్రభాస్ పేరు మారుమోగిపోవడమే

ప్రభాస్.. ఈ ఒక్క పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

శంకరాభరణం సినిమాకు ఎడిటర్ గా చేసిన జిజి కృష్ణారావు కన్నుమూత

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తారకరత్న నిష్క్రమణం దిగమింగముందే మరో ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు జిజి కృష్ణారావు కన్నుమూశారు.

21 Feb 2023

సినిమా

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ 2023: ఆర్ఆర్ఆర్ కి ఆ విభాగంలో చోటు

భారతదేశ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా పిలవబడే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను నిన్న ప్రకటించారు. 2023 సంవత్సరానికి ఏయే సినిమాలు, ఎవరెవరు నటులు ఈ అవార్డు అందుకున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

తారకరత్న అంత్యక్రియల్లో అజ్ఞాతవ్యక్తి: బాలకృష్ణతో మాట్లాడుతుంటే పక్కకు తీసుకెళ్ళిన పోలీసులు

20రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న, చివరగా మహాశివరాత్రి రోజున శివైక్యం అయ్యారు. ఈరోజు తారకరత్న అంత్యక్రియలు జరిగాయి. ఐతే నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం తెలుగు ఫిలిమ్ ఛాంబర్ లో ఉంచారు.

అనుష్క లుక్ చూసి అయోమయంలో అభిమానులు

అనుష్క శెట్టి.. టాలీవుడ్ కి పరిచయమై 15ఏళ్ళకు పైనే అయ్యింది. అయినా కూడా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. సాధారణంగా హీరోయిన్లకు అంత పెద్ద కెరీర్ ఉండదు.

సార్ మూవీ: హృతిక్ రోషన్ సూపర్ 30తో పోలికపై దర్శకుడు క్లారిటీ

తమిళ హీరో ధనుష్ నటించిన తెలుగు చిత్రం సార్, తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విడుదలైన అన్ని చోట్ల నుండి సార్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

కేలరీల కొరత: బరువు తగ్గడానికి పనికొచ్చే అద్భుతమైన టెక్నిక్

కేలరీల కొరత అంటే ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఆగండి అక్కడికే వస్తున్నాం. సాధారణంగా మన తిన్న ఆహారం నుండి వచ్చే ఎనర్జీని కొలిచే ప్రమాణమే కేలరీ.

ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ప్రకటన: ఆ సినిమాల పరిస్థితి ఏంటి?

బాహుబలి స్టార్ ప్రభాస్, నటిస్తున్న ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 12వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం ప్రకటించేసింది.

సైంధవ్: వెంకటేష్ కోసం వస్తున్న తమిళ హీరో?

హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ చిత్రాలతో విజయాలు సొంతం చేసుకున్న దర్శకుడు శైలేష్ కొలను, ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ్ సినిమాను మొదలుపెట్టాడు. ఈ చిత్ర గ్లింప్స్ ఆల్రెడీ విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

బాలకృష్ణ 108: అనిల్ రావిపూడికి అప్పుడే వద్దని చెప్పిన బాలకృష్ణ

వీరసింహారెడ్డి విజయం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా మొదలెట్టాడు బాలకృష్ణ. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. బాలకృష్ణ కెరీర్ లో 108వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.

నందమూరి తారకరత్న మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం

సినీనటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ వార్తతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దఃఖసాగరంలో మునిగిపోయింది. తారకరత్న మృతి పట్ల సినీ ప్రముఖుల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రేక్షకుల మనసు దోచని 'శ్రీదేవి శోభన్ బాబు'

యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ సంక్రాంతికి విడుదలైన కళ్యాణం కమనీయం సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం శివరాత్రి కానుకగా సంతోష్ శోభన్ బాబు నటించిన 'శ్రీదేవి శోభన్ బాబు' చిత్రం విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల మనసు దోచుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం.

18 Feb 2023

ఓటిటి

ఓటీటీలోకి త్వరలో శ్రీదేవి శోభన్ బాబు సినిమా

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, ఆమె భర్త విష్ణు ప్రసాద్ తక్కువ బడ్జెట్ తో శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాను నిర్మించారు. ఈరోజు ఈ సినిమా వెండితెరపైకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది.

రామ్‌ చరణ్‌పై జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు.. గర్వపడ్డ చిరంజీవి

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ మరోసారి ఆర్ఆర్ఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా పీరియాడికల్ మూవీలో రామ్ చరణ్ పాత్ర అమోఘమంటూ కితాబు ఇచ్చారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

వినరో భాగ్యము విష్ణుకథ వర్సెస్ శ్రీదేవి శోభన్ బాబు: చిన్న హీరోలు, పెద్ద నిర్మాతలు, కానీ తేడా అదే

మహాశివరాత్రి సందర్భంగా తెలుగు బాక్సాఫీసు వద్ద సినిమాల సందడి ఎక్కువగానే ఉంది. ఈరోజు ధనుష్ నటించిన సార్ మూవీ రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

17 Feb 2023

సినిమా

తంగలాన్: భవిష్యత్తులోకి ప్రయాణం అంటూ కన్ఫ్యూజన్ లో పడేసిన విక్రమ్

తమిళ దర్శకుడు పా రంజిత్, వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తాడని అందరికీ తెలిసిందే. సమాజాన్ని అద్దంపట్టి చూపే సినిమాలను తెరకెక్కించడంలో పా రంజిత్ ముందుంటారు.

17 Feb 2023

సినిమా

ఇన్ కార్ ట్రైలర్: థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రితికా సింగ్ పాన్ ఇండియా మూవీ

గురు సినిమాలో బాక్సర్ పాత్రలో మెప్పించిన రితికా సింగ్, తెలుగు ప్రేక్షకులను పలకరించక చాలా రోజులైపోయింది. అప్పుడప్పుడు వచ్చిన అనువాద చిత్రాలు రితికా సింగ్ ని గుర్తుంచుకునేలా చేయలేకపోయాయి.

బెల్లంకొండ గణేష్ రెండవ మూవీ నేను స్టూడెంట్ సార్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే

స్వాతిముత్యం సినిమాతో పరిచయమైన బెల్లంకొండ గణేష్, తన రెండవ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు. నేను స్టూడెంట్ సార్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

17 Feb 2023

ఓటిటి

సంక్రాంతి సినిమాలతో పాటు ఓటీటీలోకి వస్తున్న మరికొన్ని సినిమాలు

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు సందడి చేశాయి. అటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, ఇటు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపాయి.

సార్ మూవీ ట్విట్టర్ రివ్యూ: యెస్ సార్ అనేస్తున్నారు

హీరో ధనుష్, సార్ సినిమాతో తెలుగులోకి వచ్చేసాడు. సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలతో పలకరించాడు. ఈ ప్రీమియర్ షోస్ కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

17 Feb 2023

సినిమా

ఎన్టీఆర్ 30: ద్విపాత్రాభినయంలో ఎన్టీఆర్, విలన్ గాసైఫ్ ఆలీఖాన్?

ఎన్టీఆర్ 30 సినిమా గురించి అధికారిక అప్డేట్లు ఇప్పటివరకు రాలేదు కానీ అనధికారికంగా అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి.

16 Feb 2023

ఓటిటి

అందాల రాక్షసి కోసం వస్తున్న మెగా హీరో రామ్ చరణ్

అందాల రాక్షసి సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ప్రవేశించిన లావణ్య త్రిపాఠి, ఆ తర్వాత చేసిన సినిమాల ద్వారా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అవకాశాలు వచ్చినా కూడా సినిమాలు వర్కౌట్ కాలేదు.

సలార్, ప్రాజెక్ట్ కె అప్డేట్లపై ప్రభాస్ పెట్టిన కండీషన్స్?

ఈ మధ్య అభిమానుల నుంచి అప్డేట్ల గోల చాలా ఎక్కువగా వినిపిస్తోంది. అప్డేట్ కావాలంటూ నిర్మాతల మీద ఒత్తిడి పెంచుతున్నారు. సాక్షాత్తు సినిమా హీరోలే దిగివచ్చి అప్డేట్ల విషయంలో ఆత్రపడద్దని అభిమానులకు చెప్పాల్సి వస్తోంది.

16 Feb 2023

సినిమా

ఇండియన్ 2 కోసం నెలరోజులు షూటింగ్, కమల్ హాసన్ రెడీ

తమిళ బిగ్ బాస్ సీజన్ 6 పనులు పూర్తి చేసుకున్న కమలహాసన్, ఇండియన్ 2 సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. తిరుపతిలో షూటింగ్ షెడ్యూల్ ముగించుకున్న తర్వాత ఇప్పటివరకు ఇండియన్ 2 షూటింగ్ పై ఎలాంటి అప్డేట్ రాలేదు.

వినరో భాగ్యము విష్ణుకథ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు ప్రకటించిన నిర్మాతలు

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న వినరో భాగ్యము విష్ణుకథ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

పెరుగుతున్న సార్ సినిమా ప్రీమియర్ షోస్: ఒకరోజు ముందుగానే థియేటర్లోకి వస్తున్న ధనుష్

హీరో ధనుష్, సార్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఫిబ్రవరి 17వ తేదీన సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

రామ్ చరణ్ 15వ సినిమా: షూటింగ్ సెట్ లోంచి మళ్ళీ లీకైన ఫోటోలు

రామ్ చరణ్ 15 సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

16 Feb 2023

సినిమా

బాలీవుడ్: సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేలపై కురుస్తున్న ట్రోల్స్ వర్షం

ఇటు తెలుగులోనూ అటు హిందీలోనూ బిజీగా ఉంటున్న పూజా హెగ్డే, ఈ మధ్య కాలంలో సరైన విజయాన్ని అందుకోలేక పోయింది. ఇటీవలి కాలంలో ఆమె చేసిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి.