టెక్నాలజీ: వార్తలు

అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు

అశోక్ లేలాండ్ తో కలిసి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (H2-ICE)తో నడిచే భారతదేశపు మొట్టమొదటి హెవీ డ్యూటీ ట్రక్కును ఆవిష్కరించాయి. బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దీనిని జెండా ఊపి ప్రారంభించారు. 2022 ఆగస్టు నుంచి ఇది టెస్టింగ్‌లో ఉంది. దానితో, అశోక్ లేలాండ్ 'ఆత్మనిర్భర్ భారత్' ప్రచారంలో భాగం కావాలనుకుంటుంది.

07 Feb 2023

ప్రపంచం

సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సంధర్భంగా భద్రతా ఫీచర్లను ప్రారంభించిన Tinder

సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం (SID) గుర్తుగా, ప్రముఖ ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫారమ్ Tinder వినియోగదారులు సులభంగా నియంత్రించడానికి అనేక భద్రతా ఫీచర్‌లను విడుదల చేస్తోంది. వినియోగదారులకు అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్లలో 'Incognito Mode', 'Block Profile' వంటి భద్రతా ఫీచర్లను అప్‌డేట్ చేసింది.

అసెస్‌మెంట్ పరీక్షలో ఫెయిలైన 600 ఫ్రెషర్స్ ను తొలగించిన ఇన్ఫోసిస్ సంస్థ

ఇంటర్నల్ ఫ్రెషర్స్ అసెస్‌మెంట్ (FA) పరీక్షలో ఫెయిలైన కారణంగా ఇన్ఫోసిస్ 600 మంది ఫ్రెషర్లను తొలగించింది. గత నెలలో, దేశంలోని మరో ప్రముఖ ఐటీ సంస్థ విప్రో కూడా ఇలానే 450 మంది ఫ్రెషర్లను తొలగించింది.

భారతీయ మార్కెట్ కోసం కొత్త మోడళ్లను రూపొందిస్తున్న Renault, Nissan

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Renault, జపాన్ తయారీ సంస్థ Nissan భారతీయ మార్కెట్ కోసం మూడు మోడళ్లపై పని చేస్తున్నాయి. ఇందులో 3 rd gen Renault Duster, Renault Triber ఆధారంగా ఒక నిస్సాన్ MPV, ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వాహనం ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ ప్లాన్‌ను విజయవంతం చేసేందుకు రెండు కంపెనీలు దాదాపు రూ. 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి.

ఫిబ్రవరి 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ సురక్షిత దినోత్సవం రోజున వాట్సాప్ ఉపయోగించడానికి ఉత్తమ చిట్కాలు

ఫిబ్రవరి 7న సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవంగా ప్రకటించారు. InSafe సంస్థ, ప్రతి సంవత్సరం సేఫ్ ఇంటర్నెట్ డే ను సెలెబ్రేట్ చేస్తుంది. సైబర్ బెదిరింపు, సోషల్ నెట్‌వర్కింగ్, డిజిటల్ గుర్తింపు వంటి ఆన్‌లైన్ సమస్యలతో పాటు మరెన్నో ప్రస్తుత ఆందోళనలపై అవగాహన పెంచడం దీని లక్ష్యం.

భారతదేశంలో Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం

జర్మన్ వాహన తయారీ సంస్థ Audi త్వరలో భారతదేశంలో తన Q3 స్పోర్ట్‌బ్యాక్ ను విడుదల చేయనుంది. రూ.2 లక్షలు టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్లో ఇది బి ఎం డబ్ల్యూ X1, వోల్వో XC40, మెర్సిడెజ్-బెంజ్ GLA తో పోటీ పడుతుంది.

07 Feb 2023

ఇస్రో

భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో

IIT మద్రాస్, ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC) ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ (IHSP) కోసం వ్యోమగామి శిక్షణా మాడ్యూల్‌పై పని చేయడానికి సహకరించనున్నాయి. ప్రోగ్రామ్‌ను రూపొందించడానికి ఆగ్మెంటెడ్, వర్చువల్, మిక్స్‌డ్ రియాలిటీ టెక్నాలజీలను ఉపయోగించబోతుంది.

07 Feb 2023

గూగుల్

AI రంగంలో Bard AI అనే మరో అద్భుతాన్ని ఆవిష్కరించనున్న గూగుల్

గూగుల్ ఒక ప్రయోగాత్మక Bard AI సేవను ప్రారంభించనుంది. ఇప్పటికే గూగుల్ కు గట్టి పోటీనిచ్చే మైక్రోసాఫ్ట్ సంస్థ పెట్టుబడి పెట్టిన Open AI చాట్‌బాట్ ChatGPT సంచలనం సృష్టించింది.

06 Feb 2023

స్కూటర్

హీరో Xoom vs హోండా Dio ఏది కొనుక్కోవడం మంచిది

హీరో MotoCorp భారతదేశంలో సరికొత్త Xoom మోడల్‌ను ప్రారంభించింది. స్పోర్టీ స్కూటర్ భారతదేశంలో 110సీసీ విభాగంలో హోండా Dioతో పోటీపడుతుంది. హీరో Xoom సెగ్మెంట్-ఫస్ట్ 'కార్నర్ బెండింగ్ లైట్స్'తో వస్తే, హోండా Dio 109.5cc ఇంజిన్‌ పై నడుస్తుంది.

ఫిబ్రవరి 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

06 Feb 2023

గూగుల్

ఆండ్రాయిడ్‌ chromeలో సెర్చ్ హిస్టరీని త్వరగా తొలగించే ఫీచర్ ను ప్రవేశపెట్టనున్న గూగుల్

ఆండ్రాయిడ్ chromeలో 'quick delete' ఫీచర్‌ను ప్రారంభించే పనిలో గూగుల్ ఉంది. వెబ్ బ్రౌజింగ్ యాప్‌లో చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ 2021లో ఐఫోన్ అప్డేట్ లో విడుదల చేసారు. ఈ సంవత్సరం, గూగుల్ ఈ ఫీచర్ ను బ్రౌజర్ ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం విడుదల చేయబోతుంది.

ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విట్టర్ ప్రకటన ఆదాయాన్ని క్రియేటర్లకు షేర్ చేస్తుందని ప్రకటించారు. అయితే, ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్‌ ఉన్న క్రియేటర్లతో మాత్రమే కంపెనీ ప్రకటనల నుండి వచ్చే ఆదాయాన్ని పంచుకుంటుంది.ఈ విధానం ఈరోజు నుండే ప్రారంభమవుతుంది.

భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్

Infinix భారతదేశంలో ZERO 5G 2023 సిరీస్ ను ప్రవేశపెట్టింది, ఇందులో స్టాండర్డ్, టర్బో మోడల్‌లు ఉన్నాయి. స్టాండర్డ్ మరియు టర్బో మోడల్‌లు డైమెన్సిటీ 920, డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌లతో వస్తాయి.ఈ ఫోన్లు ఫిబ్రవరి 11 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. Infinix బ్రాండ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ది చెందింది. ఇప్పుడు ఈ బ్రాండ్ ZERO 5G 2022తో 5G విభాగంలోకి ప్రవేశించింది.

ఫిబ్రవరి 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

04 Feb 2023

ఆపిల్

రికార్డు ఆదాయాన్ని రాబట్టిన ఆపిల్, భారత్‌పై అతినమ్మకాన్ని పెంచుకుంటున్న టిమ్ కుక్

ఆపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌పై చాలా నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. దానికి కారణం భారతదేశంలో 2022 చివరి త్రైమాసికంలో కంపెనీ రికార్డ్-సెట్టింగ్ పనితీరును చూపించింది.

ఇకపై యూట్యూబ్ లో 'Go Live Together'ను ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేసే అవకాశం

గత ఏడాది నవంబర్‌లో, ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేయడానికి వీలు కల్పించే 'Go Live Together' ఫీచర్‌ను యూట్యూబ్ ప్రకటించింది. ఇప్పుడు, ఈ ఫీచర్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులో వచ్చింది.

03 Feb 2023

ఫోన్

సామ్ సంగ్ Galaxy S23 vs ఆపిల్ ఐఫోన్ 14 ఏది మంచిది

దక్షిణ కొరియా సంస్థ సామ్ సంగ్ Galaxy S23 సిరీస్‌ని కొన్ని హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో ప్రకటించింది, అయితే ఇది S22 మోడల్ లాగానే ఉంది. మార్కెట్ లో Galaxy S23 స్టాండర్డ్ మోడల్ ఆపిల్ ఐఫోన్ 14 తో పోటీ పడుతుంది.

ఫిబ్రవరి 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ ఎడిషన్

Realme ఫిబ్రవరి 10న భారతదేశంలో కోకా-కోలా-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ Realme మిడిల్ సిరీస్ 10 Pro 5G లాగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

సులభంగా కాల్స్ చేసుకునే షార్ట్ కట్ ఫీచర్ పై పనిచేస్తున్న వాట్సాప్

వాట్సాప్‌లో కాల్‌లు చేయడం మరింత సులభంగా మారబోతోంది. WABetaInfo ప్రకారం, కాలింగ్ షార్ట్‌కట్‌ ఫీచర్‌పై కంపెనీ పనిచేస్తోంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంకా అభివృద్ధిలో ఉంది. యాప్ తర్వాతి అప్డేట్ ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన 2023 హ్యుందాయ్ VENUE

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ భారతదేశంలో VENUE 2023 అప్‌డేట్ ను లాంచ్ చేసింది. ఈ వెర్షన్ ఇప్పుడు RDE-కంప్లైంట్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో పాటు నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. ఇది ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది: E, S, S(O), SX, SX(O).

02 Feb 2023

మెటా

అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా

మెటా 2023లో ఆదాయాన్ని మరింత మెరుగ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికను సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. 2022 ఆర్ధిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ఊహించిన దానికంటే మెరుగైన పనితీరుతో దాని పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. 2023లో పొదుపుపై దృష్టి పెట్టాలని కంపెనీ ప్రణాళిక వేస్తుంది.

ఫిబ్రవరి 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

నాల్గవ త్రైమాసికంలో 12 మిలియన్లతో 375 మిలియన్ల యూజర్లకు చేరుకున్న స్నాప్‌చాట్‌

స్నాప్ చాట్ నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికను విడుదల చేసింది.వినియోగదారుల సంఖ్య పెరగినా. ఆదాయం, లాభాలకు సంబంధించిన సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి.

ఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్న ఇంటెల్ సీఈఓ వేతనంలో 25 శాతం కోత

కాలిఫోర్నియాలోని ఫోల్సమ్ క్యాంపస్‌లో సుమారు 340 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, వేతన కోతలను అమలు చేసినట్లు ఇంటెల్ సంస్థ తెలిపింది. ఈ తగ్గింపులు మిడ్-లెవల్ ఉద్యోగుల నుండి ఎగ్జిక్యూటివ్ వరకు ఉంటాయి. కంపెనీ ఆదాయం వేగంగా పడిపోవడంతో, సంస్థ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

ఫిబ్రవరి 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

భారతదేశంలో విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Venue

హ్యుందాయ్ తన VENUE SUV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రాబోయే నెలల్లో భారతదేశంలో విడుదల చేయనుంది. ఇది E, S, S+, S(O), SX, SX(O) ఆరు వేరియంట్లలో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

సరికొత్త OPPO Find X6 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం

OPPO ఫిబ్రవరిలో Find X6 సిరీస్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. Find X6 సిరీస్‌లో Find X6 pro మోడల్‌లతో సహా మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయి. OPPO Find X6 సిరీస్ గురించి గత ఏడాది చివర్లో వార్తలు వినిపించాయి అయితే ఆ తర్వాత Find N2, N2 ఫ్లిప్ మోడల్‌ల వైపు అందరి దృష్టి మారిపోయింది.

అన్నిటికి ఉపయోగపడే యాప్ కోసం పేమెంట్ టూల్స్ పై పని చేస్తున్న ట్విట్టర్

ఎలోన్ మస్క్ ట్విటర్‌ని పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌గా తయారుచేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, ఈ సోషల్ మీడియా సంస్థ పేమెంట్ టూల్స్ పై పనిచేయడం ప్రారంభించింది.

జనవరి 31న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

31 Jan 2023

మెటా

మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం

మెటా గత సంవత్సరం, 11,000 మంది ఉద్యోగులను అంటే సిబ్బందిలో 13% మంది ఉద్యోగులను తొలగించింది. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంస్థ ప్రస్తుతం మెటా సంస్థాగత నిర్మాణంపై అసంతృప్తిగా ఉన్నారు. దానికి కారణం మానేజ్మెంట్ లో వివిధ టీంలు ఉండడం. ఖర్చులను తగ్గించే ఆలోచనలో ఉన్న జుకర్‌బర్గ్ మరికొన్ని తొలగింపులను దృష్టిలో ఉంచుకున్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.

భారతదేశంలో AMD సపోర్టెడ్ Aspire 3 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన Acer

Acer భారతదేశంలో అనేక అప్‌గ్రేడ్‌లతో Aspire 3 ల్యాప్‌టాప్ రిఫ్రెష్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ Acer Aspire 3 భారతదేశంలో Ryzen 5 7000 సిరీస్ ప్రాసెసర్‌తో వచ్చిన మొదటి ల్యాప్‌టాప్‌.

మరో 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫిలిప్స్ సంస్థ

డచ్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ ఫిలిప్స్ 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. స్లీప్ అప్నియా ట్రీట్‌మెంట్ డివైజ్‌లను వెనక్కి రప్పించడంతో కంపెనీ నష్టాల బారిన పడింది. దీని కారణంగా ఫిలిప్స్ తన మార్కెట్ వాల్యుయేషన్‌లో 70% కోల్పోయింది. గత ఏడాది అక్టోబర్‌లో సంస్థ ప్రకటించిన 4,000 మంది ఉద్యోగుల తొలగింపుకు అదనంగా మరో 6,000 మందిని తొలగించబోతుంది.

యూనిలీవర్ కొత్త సీఈఓగా హీన్ షూమేకర్‌ నియామకం

కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం యూనిలీవర్ సంస్థ సోమవారం తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా హీన్ షూమేకర్‌ను ప్రకటించింది. జూలై 1 నుండి అలాన్ జోప్ స్థానంలో హీన్ షూమేకర్‌ కొనసాగుతారు.

30 Jan 2023

జర్మనీ

ఆగ్మెంటెడ్ రియాలిటీతో పాటు అదిరిపోయే డిజైన్ తో రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi బెర్లిన్‌లో జరిగిన "సెలబ్రేషన్ ఆఫ్ ప్రోగ్రెస్" ఈవెంట్‌లో యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. EV లాంటి క్రాస్‌ఓవర్ డిజైన్‌ తో పాటు వర్చువల్ ఇంటర్‌ఫేస్ కోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్‌లు, ట్రాన్స్‌ఫార్మింగ్ రియర్ సెక్షన్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

జనవరి 30న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

భారతదేశంలో అమ్మకానికి సిద్దమైన Fire-Bolt Ninja-Fit

Fire-Bolt కొత్తగా ప్రారంభించిన స్మార్ట్‌వాచ్, Ninja-Fit, ఇప్పుడు భారతదేశంలో ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఫిట్‌నెస్-సపోర్ట్ మోడ్‌లతో పాటు "అప్‌గ్రేడెడ్ హెల్త్ సూట్" ఇందులో వస్తుంది. దీనికి 1.69-అంగుళాల స్క్రీన్, IP67-రేటెడ్ సేఫ్టీ, బ్లూటూత్ కాలింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

త్వరలో గూగుల్ ను మించిపోనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT

OpenAI ChatGPTకు పెరుగుతున్న ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో గుబులు పుట్టిస్తుంది. Gmail సృష్టికర్త పాల్ బుచ్‌హీట్ ఈ ChatGPT మరో సంవత్సరం లేదా రెండు సంవత్సరాలలో గూగుల్ సెర్చ్ ఇంజన్ ను మించిపోవచ్చని పేర్కొన్నారు. Yellow Pagesకు గూగుల్ ఎలా చెక్ పెట్టిందో అలాగే సెర్చ్ ఇంజన్‌లకు ఈ AI చెక్ పెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు 2022 ఆర్ధిక సంవత్సరంలో BharatPe 1.7కోట్లు చెల్లించింది

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC)కి దాఖలు చేసిన ప్రకటన ప్రకారం, BharatPe వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కు రూ.1.69 కోట్లు,అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్‌లకు రూ.63 లక్షలు చెల్లించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సంస్థ గత ఏడాది వీరిద్దరిని BharatPe తొలగించింది. అతని వ్యవస్థాపకుడి పదవిని కూడా తొలగించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు రూ.88 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని అతనిపై దావా వేసింది.