టెక్నాలజీ: వార్తలు
VIDA V1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించిన హీరో మోటోకార్ప్
హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ VIDA V1 కస్టమర్ డెలివరీలను ప్రారంభించినట్లు తెలిపింది. బ్రాండ్ నుండి మొదటి ఎలక్ట్రిక్ వాహనం బెంగళూరులో డెలివరీ చేశారు. జైపూర్, ఢిల్లీలో డెలివరీలు జరుగుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
2023 లో ఇస్రో చేయబోతున్న ప్రయోగాలు
2023 లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, భూమిని పరిశోధించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అక్టోబర్ 2022 నాటికి USA, జర్మనీ, కెనడా, స్వీడన్‌తో సహా 34 దేశాల కోసం దాదాపు 385 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పుడు 2023 లో జరపబోయే మిషన్ల గురించి తెలుసుకుందాం.
2023లో 5G సేవతో OTA అప్‌డేట్‌ను విడుదల చేయనున్న గూగుల్
గూగుల్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న OTA (Over-The-Air) అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది మొదటి 2023 త్రైమాసికంలో పిక్సెల్ ఫోన్‌లలో 5G సేవలకు మద్దతు ఇస్తుంది.
ఇప్పుడు స్పామ్ కాల్స్ గూర్చి హెచ్చరించే గూగుల్ వాయిస్
గూగుల్ వాయిస్ కాల్‌లకు "అనుమానాస్పద స్పామ్ కాలర్" హెచ్చరికను జోడిస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇది అనవసరమైన, అప్రధానమైన కాల్స్ ను ఫిల్టర్ చేస్తుంది. అయితే ఇన్‌కమింగ్ కాల్ స్పామ్ అని వినియోగదారులు ధృవీకరించాలి.
టెస్లా షార్ట్ సెల్లర్లకు $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం
కంపెనీలోని షార్ట్ సెల్లర్లు-లేదా ఒక ఆస్తి ధర పడిపోయినప్పుడు లాభపడే బేరిష్ పెట్టుబడిదారులు దాదాపు $17 బిలియన్ల మార్కెట్ లాభాలను పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. S3 పార్టనర్స్ డేటా ప్రకారం టెస్లా సంవత్సరంలో అత్యంత లాభదాయకమైన స్వల్ప వాణిజ్యంగా మారింది.
డిసెంబర్ 30న ఉచిత Fire MAX కోడ్‌లు: ఎలా రీడీమ్ చేయాలి
Garena Free Fire MAXలో ఉచిత కోడ్‌లను రీడీమ్ చేయడానికి వినియోగదారులు కొన్ని నియమాలను పాటించాలి.
పూర్తిగా అమ్ముడుపోయిన Ducati Panigale V4 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా బైక్‌లు
ఈ నెల ప్రారంభంలో ఆవిష్కరించబడిన నెంబర్ తో ఉన్న పరిమిత ఎడిషన్ పనిగేల్ V4 బగ్నాయా 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా, పానిగేల్ V4 బౌటిస్టా 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా అమ్ముడయ్యాయని Ducati సంస్థ ప్రకటించింది. ఈ సీజన్‌లో MotoGP, WorldSBKలో డుకాటీ విజయాన్ని పురస్కరించుకుని ఈ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది.
వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి
పాన్ కార్డు ఉన్నవారు తమ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తుది హెచ్చరిక జారీ చేసింది. మార్చి 31, 2023లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకుంటే, పాన్ పనిచేయదు. PANకి లింక్ చేయబడిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను పెండింగ్ రిటర్న్స్ ప్రాసెసింగ్ నుండి నిలిపివేయబడతాయి.
2022లో మనం వస్తాయని అనుకున్న Vs వచ్చిన ఆవిష్కరణలు
టెక్నాలజీ కంపెనీలు 2022 లో ఎప్పటిలాగే ఎన్నో ఆవిష్కరణల గురించి హామీ ఇచ్చారు కానీ వాస్తవానికి, హామీకి చాలా దూరంలో ఆగిపోయారు.
జనవరి 3న లాంచ్ కాబోతున్న బడ్జెట్ ఫోన్ POCO C50 గురించి తెలుసుకోండి
భారతదేశంలో POCO C50 అనే కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ జనవరి 3న విడుదల కాబోతుంది. ఇందులో MediaTek లేదా JLQ నుండి ఎంట్రీ-లెవల్ చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. JLQ మార్కెట్లో కొత్త, Android ఆధారిత హ్యాండ్‌సెట్‌లు మరియు టాబ్లెట్‌ల కోసం SoCల తయారీపై దృష్టి పెడుతుంది.
వెబ్ నుండి సైన్ ఇన్ కావడంలో సమస్యను ఎదుర్కొన్న ట్విట్టర్ యూజర్లు
ఎలోన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ట్విట్టర్ వినియోగదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఎదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. మొన్నటి వరకు ఖాతాలు నిలుపుదల, ఇతర సమస్యలను ఎదుర్కొన్న వినియోగదారులు... ఇప్పుడు వెబ్ నుండి సైన్ ఇన్ చేయడంలో సమస్యను ఎదుర్కుంటున్నారు. కొందరు వారి ట్విట్టర్ నోటిఫికేషన్‌లు కూడా పని చేయడం లేదని ఫిర్యాదు చేశారు.
చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్
Redmi K60 సిరీస్ చైనాలో అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో Redmi K60 స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలు ప్రస్తుతం తెలియదు కానీ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో Redmi K60, Redmi K60 Pro, Redmi K60E మోడల్స్ ఉన్నాయి.
వేగంగా ఛార్జింగ్ అయ్యే GT Neo 5ను జనవరి 5న విడుదల చేయనున్నRealme
240W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మొట్టమొదటి ఫోన్ రాబోతుంది. అదే Realme సంస్థ విడుదల చేయనున్న GT Neo 5. టెక్నాలజీ కమ్యూనికేషన్ సమావేశంలో జనవరి 5, 2023న తన ఫ్లాష్-చార్జింగ్ ఆవిష్కరణను ఆవిష్కరించబోతుంది.
టాటా హారియర్ సర్ప్రైజ్.. లాంచ్ కాబోతున్న సరికొత్త స్పెషల్ ఎడిషన్
టాటా హారియర్ SUV ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ కోసం ప్రపంచం ఎదురుచూస్తుండగా, టాటా మోటార్స్ దానికి బదులుగా SUVలో మరొక ఎడిషన్ వెర్షన్‌ను తీసుకురావడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇటీవల టాటా హారియర్ డార్క్ ఎడిషన్ కొన్ని చిత్రాలు బయటికి వచ్చాయి. ఇందులో రెడ్-థీమ్ హైలైట్
HONOR సంస్థ విడుదల చేసిన 80 GT, Pad V8 Pro ఫీచర్లు, ధర
HONOR తన తాజా స్మార్ట్‌ఫోన్ HONOR 80 GTని, కొత్త టాబ్లెట్ Pad V8 Proని విడుదల చేసింది. ఆసియా మార్కెట్లలో Honor జోరందుకుంది. మాతృ సంస్థ నుండి విడిపోయిన తరువాత తన ఖ్యాతిని తిరిగి పొందేందుకు కృషి చేస్తోంది.
అంటార్కిటికా మంచు ఫలకలు కరగడం వెనక ఉన్న నిజాన్ని గుర్తించిన పరిశోధకులు
ఒక బహుళజాతి శాస్త్రవేత్తల బృందం ఒక మంచు ఫలకం అస్థిరత, దిగువన ఉన్నమిగతావాటిని ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు.
NEO ప్రాజెక్ట్ తో భూమికి ఉల్క నుండి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న NASA
US అంతరిక్ష సంస్థ NASA ఎట్టకేలకు గ్రహశకలాల నుండి రక్షణకు ప్రాధాన్యతనిస్తోంది. ప్లానెటరీ సొసైటీ NEO సర్వేయర్ ప్రాజెక్ట్‌ను 2028లో ప్రారంభించాలని ప్రణాళికలు వేస్తుంది. NEO సర్వేయర్ అనేది భూమితో ఢీకొనే అవకాశం ఉన్న సమీపంలో ఉన్న గ్రహశకలాలు, ఇతర చిన్న వస్తువుల కోసం వెతికే ఉపగ్రహం.
వాట్సాప్ లో త్వరలో స్టేటస్ రిపోర్ట్ చేసే ఆప్షన్
వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది, దీని ద్వారా వినియోగదారులు వెబ్‌లో స్టేటస్ అప్డేట్స్ రిపోర్ట్ చేయచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇప్పటికే బీటా వినియోగదారులకు అందుబాటులో ఉంది, త్వరలో ఇతర వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. వినియోగదారులు స్టేటస్ విభాగంలో కొత్త మెనుకి వెళ్లడం ద్వారా వారి స్టేటస్ రిపోర్ట్ చేయగలరు.
Redmi Note 12 5G ధర ఎంతో తెలుసా?
Redmi Note 12 సిరీస్ వచ్చే నెల జనవరి 5న భారతదేశంలో లాంచ్ అవుతోంది. ఈసారి Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ సహా మూడు కొత్త మోడళ్లను కంపెనీ విడుదల చేస్తోంది. Redmi Note 12 ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది, కానీ చైనా మోడల్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ మూడు కెమెరాలతో వస్తుంది.
2022లో అతిపెద్ద విలీనాల గురించి తెలుసుకుందాం
సాధారణంగా కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఒక కంపెనీ మరొక దానిని స్వాధీనం చేసుకుంటుంది. కొనుగోలు చేసిన కంపెనీ దాని పేరు, బ్రాండ్ విలువ సిబ్బందిని ఉంచుకోవచ్చు లేదా ఉంచకపోవచ్చు.
2023లో కూడా ఇంటి నుండి పనిచేసే సౌకర్యం కొనసాగుతుందా?
వచ్చే ఏడాది US జాబ్ మార్కెట్ బలహీనంగా కొనసాగితే, కంపెనీలు రిమోట్‌గా పని చేయడానికి ఉద్యోగులను అనుమతించకుండా వెనక్కి తీసుకోవచ్చు. ఉద్యోగులు సాధారణంగా ఇంటి నుండి పని చేయడంపై రెండు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహమ్మారి సమయంలో ఇంటి నుండి పనిచేస్తూ ఎంతో సమయాన్ని ఆదా చేయడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కొందరు చెప్తే, మరికొందరు కంపెనీ సంస్కృతి కార్యాలయంలో సరైన విధంగా ఉంటుందని చెప్పారు.
మీకోసం 2022లో విడుదలైన ఉత్తమ వాట్సాప్ ఫీచర్‌లు!
2022లో, వాట్సాప్ లో కొత్త ఫీచర్లను విడుదల చేసింది పేరెంట్ సంస్థ మెటా. ఆ టాప్ ఫీచర్‌ల జాబితా ఇక్కడ ఉంది.
అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు
2022లో మెరుగైన, ఉపయోగకరమైన ఫీచర్స్ తో వినియోగదారులను మెప్పించిన టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే
2022లో టాప్ ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వివరాలు తెలుసుకోండి
స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ల పరంగా 2022 ప్రత్యేకమైన సంవత్సరం. జనవరి 2022 నెలలోనే దాదాపు 5 పెద్ద లాంచ్ లు జరిగాయి. ఆపిల్, సామ్ సంగ్, గూగుల్, OnePlus, Vivo, Xiaomi, Oppo సంస్థలు ఆకర్షిణీయమైన ఫోన్‌లను విడుదల చేశారు.
Pixel 7a, Pixel Fold ధర ఎంతో తెలుసా?
Pixel 7a, Pixel Fold లాంచ్ కు నెలలు గడువు ఉండగానే ధర, స్పెసిఫికేషన్, డిజైన్ గురించి ఆన్లైన్ లో లీక్ అయింది. ఈమధ్యనే ఐఫోన్ 15 Ultra ధర కూడా ప్రకటించారు. ఇది 2023 చివరి నాటికి లాంచ్ కాబోతుంది.
సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్
ప్రముఖ బ్రాండ్ boAT మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. స్మార్ట్‌వాచ్ అనుకూలమైన ధరతో లాంచ్ అయినప్పటికీ, ఇది బ్లూటూత్ కాలింగ్‌తో సహా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. గతంలో ఇటువంటి ఫీచర్ ఖరీదైన స్మార్ట్‌వాచ్‌లకు మాత్రమే పరిమితం అయ్యివుండేది.
ఐఫోన్ దగ్గర ఉన్నా సొంత GPS వాడుకోనున్న ఆపిల్ వాచ్ తాజా సిరీస్
ఆపిల్ వాచ్ సిరీస్ కు GPS కనెక్టివిటీకు ఇప్పుడు ఐఫోన్ అవసరం లేదు. 2022 నుండి ఆపిల్ వాచ్ ఒక ప్రధాన అప్‌డేట్‌ను పొందింది. ఇప్పుడు ఐఫోన్ దగ్గర ఉన్నా సరే ఆపిల్ వాచ్ తన సొంత GPS ను వాడుతుంది. ఇంతకు ముందు ఆపిల్ వాచ్ ప్రాసెసింగ్ కోసం సమీపంలోని ఆపిల్ వాచ్ పై ఆధారపడేది.
ప్రకటన రహిత బేసిక్ ప్లాన్ ను దాచిపెడుతున్న నెట్ ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్ లో బేసిక్ ప్రకటన-రహిత ప్లాన్ కనిపించడం లేదు. ప్రస్తుతం యూజర్లకు బేసిక్ యాడ్స్ ప్లాన్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి.
రూ.12 లక్షల కోట్లు ఆవిరి, వరుస నష్టాలతో మార్కెట్ అతలాకుతలం
దేశీయ స్టాక్‌లు శుక్రవారం వరుసగా నాల్గవరోజు పడిపోయాయి, BSE సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు పడిపోయింది. NSE నిఫ్టీ మార్క్ 18,000 దిగువకు జారింది.
"ట్విట్టర్ CEOగా అవకాశం ఉందా?" అని అడుగుతున్న యూట్యూబర్ డోనాల్డ్ సన్
ఎలోన్ మస్క్ ప్రస్తుతం ట్విటర్ సీఈఓ పదవికి సరిపోయే వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఇటీవలి ట్వీట్‌లో, తన స్థానంలో మరొకరు వచ్చాక అధిపతిగా పదవీవిరమణ చేస్తానని ప్రకటించారు.
మైక్రో సాఫ్ట్ పై 60 మిలియన్ యూరోల జరిమానా విధించిన వాచ్ డాగ్
యూఎస్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పై 60 మిలియన్ల జరిమానా విధించినట్లు ఫ్రాన్స్ ప్రైవసీ సంస్థ వాచ్‌డాగ్ తెలిపింది.
3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్
జియో అనుబంధ సంస్థ ముంబై రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ మొబైల్ టవర్, ఫైబర్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎస్‌బిఐ ఎస్క్రో ఖాతాలో రూ. 3,720 కోట్లు జమ చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నవంబర్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ కొనుగోలుపై జియోకు ఆమోదం తెలిపింది.
మార్కెట్ లో లాభాలని తెచ్చిపెట్టే క్రిప్టో కరెన్సీలేంటో తెలుసుకుందామా?
2022 క్రిప్టో కరెన్సీకు పెద్దగా కలిసిరాలేదు, కాకపోతే క్రిప్టో చరిత్రలో నిలిచిపోయే LUNA క్రాష్, FTX పతనం పాటు మార్కెట్లో అనేక ఇతర నష్టాలు సంభవించాయి. అయితే సరైన నిర్ణయాలతో లాభం పొందే అవకాశాలు ఇంకా ఉన్నాయి.
4 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్న సంవత్సరాంతపు కార్ల ధర తగ్గింపులు
కొత్త కారు కొనాలని అనుకుంటే దానికి ఇదే సరైన సమయం. మెరుగైన ఉత్పత్తి నేపథ్యంలో పెండింగ్-అప్ డిమాండ్ తగ్గిపోవడం వలన కార్ల తయారీదారుల నుండి ఈ తగ్గింపులు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి పెరిగాయి. డీలర్‌షిప్‌లు 25,000 నుండి 1,00,000 వరకు ప్రయోజనాలతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
దేశంలో 37.16 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్లాక్
భారతదేశంలో నవంబర్‌లో 37.16 లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్లు ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ బుధవారం తెలిపింది. గత నెలలో నిషేధించిన ఖాతాల కంటే 60 శాతం ఎక్కువని సంస్థ తెలిపింది. దీంతో దేశంలో నిషేధించబడిన వాట్సాప్ ఖాతాలు 9.9 లక్షలకు చేరాయి.
ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వినియోగదారుల ఫోన్ చార్జీలు పెరుగుదలకు కంపెనీల రాబడిపై ఒత్తిడి పెరగడం కారణం. సెప్టెంబర్ త్రైమాసికంలో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, జియోలు ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయంలో లాభాలను పొందాయి.
2022 లో 5 టాప్ AI సాధనాలు గురించి తెలుసుకుందాం
2022 కృతిమ మేధస్సుకు ఒక మైలురాయి లాంటి సంవత్సరం. OpenAI, Meta, DeepMind, Google, Baidu వంటి సంస్థలు తమ ప్రత్యుర్ధులకు ధీటుగా సరికొత్తగా AI మోడల్స్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం టాప్ ఐదు AI మోడల్స్ గురించి తెలుసుకుందాం OpenAI సంస్థ వారి ChatGPT, అత్యంత శక్తివంతమైన లాంగ్వేజ్ ప్రొసెసింగ్ టూల్స్ లో ఒకటి. సాఫ్ట్‌వేర్‌ను సృష్టించడం, వ్యాసాలు రాయడం, వ్యాపార ఆలోచనలను రూపొందించడం అనేక అంశాలలో సహాయం చేయగలదు.ఇది సంభాషణ సమాధానాలను, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు.
'ఉద్యోగంలో ప్రభావం చూపలేకపోతున్నా' జార్జ్ హట్జ్
ఐఫోన్ ను క్యారియర్ అన్ లాక్ చేసి, PS3ని బ్రేక్ చేసిన మొదటి వ్యక్తి హట్జ్.. మంగళవారం ట్విట్టర్ ఇంటర్న్ షిప్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.
EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ
భారతదేశంలో వీడియో కంటెంట్ మార్కెట్ అభివృద్ధిచెందుతోంది. 2022లో OTT ఆదాయం $2 బిలియన్లు వచ్చాయి, రాబోయే మూడేళ్లలో $18 బిలియన్ల ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్, మీడియా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, OTT ప్రొడక్షన్ హౌస్‌ల పెరుగుదలకు ఇది కూడా కారణం అయింది. ఈ నేపథ్యంలో వీడియో పరికరాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు
గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ లో భాగంగా ఇండియాకి వచ్చిన సుందర్ పిచాయ్, టెక్నాలజీ పరంగా ఎన్నో అవకాశాలున్న దేశంగా ఇండియా ఉందని పేర్కొన్నాడు.