ఆండ్రాయిడ్ ఫోన్: వార్తలు
20 Mar 2023
వాట్సాప్iOS, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కమ్యూనిటీల ఫీచర్‌ను అప్‌డేట్ చేసిన వాట్సాప్
వాట్సాప్ తన కమ్యూనిటీ ఫీచర్ కింద కొత్త అప్‌డేట్‌లను విడుదల చేస్తోంది. వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడానికి కమ్యూనిటీల ఇంటర్‌ఫేస్‌ను ఆండ్రాయిడ్, iOS వినియోగదారుల కోసం మారుస్తోంది.
11 Feb 2023
భారతదేశంమార్కెట్లో విడుదలైన లావా Blaze 5G కొత్త వేరియంట్
స్వదేశీ బ్రాండ్ లావా భారతదేశంలో తన Blaze 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM వేరియంట్‌ను విడుదల చేసింది. గతేడాది 4GB RAMతో మార్కెట్లోకి వచ్చింది.
11 Feb 2023
స్మార్ట్ ఫోన్ఫిబ్రవరి 14న Realme 10 Pro కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ విడుదల
Realme భారతదేశంలో కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి కోకా-కోలాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మౌత్‌ఫుల్ పేరుతో, Realme 10 Pro 5G కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ దీని ధర రూ. 20,999. Realme ఈ ఎడిషన్ లో కేవలం 1,000 ఫోన్లను మాత్రమే అమ్ముతుంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, Realme కోకా కోలా రెండింటికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది కానీ ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో మాత్రమే విడుదలైంది.
06 Feb 2023
గూగుల్భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్
సామ్ సంగ్ Galaxy S23 ప్రభావంతో గూగుల్ Pixel 7 Pro భారతదేశంలో అత్యధిక తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ పై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ డీల్‌ను కూడా అందిస్తోంది.
06 Feb 2023
గూగుల్ఆండ్రాయిడ్ chromeలో సెర్చ్ హిస్టరీని త్వరగా తొలగించే ఫీచర్ ను ప్రవేశపెట్టనున్న గూగుల్
ఆండ్రాయిడ్ chromeలో 'quick delete' ఫీచర్‌ను ప్రారంభించే పనిలో గూగుల్ ఉంది. వెబ్ బ్రౌజింగ్ యాప్‌లో చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ 2021లో ఐఫోన్ అప్డేట్ లో విడుదల చేసారు. ఈ సంవత్సరం, గూగుల్ ఈ ఫీచర్ ను బ్రౌజర్ ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం విడుదల చేయబోతుంది.
04 Feb 2023
యూట్యూబ్ఇకపై యూట్యూబ్ లో 'Go Live Together'ను ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేసే అవకాశం
గత ఏడాది నవంబర్‌లో, ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేయడానికి వీలు కల్పించే 'Go Live Together' ఫీచర్‌ను యూట్యూబ్ ప్రకటించింది. ఇప్పుడు, ఈ ఫీచర్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులో వచ్చింది.
03 Feb 2023
ఫోన్సామ్ సంగ్ Galaxy S23 vs ఆపిల్ ఐఫోన్ 14 ఏది మంచిది
దక్షిణ కొరియా సంస్థ సామ్ సంగ్ Galaxy S23 సిరీస్‌ని కొన్ని హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో ప్రకటించింది, అయితే ఇది S22 మోడల్ లాగానే ఉంది. మార్కెట్ లో Galaxy S23 స్టాండర్డ్ మోడల్ ఆపిల్ ఐఫోన్ 14 తో పోటీ పడుతుంది.
03 Feb 2023
స్మార్ట్ ఫోన్ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ ఎడిషన్
Realme ఫిబ్రవరి 10న భారతదేశంలో కోకా-కోలా-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ Realme మిడిల్ సిరీస్ 10 Pro 5G లాగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
02 Feb 2023
వాట్సాప్సులభంగా కాల్స్ చేసుకునే షార్ట్ కట్ ఫీచర్ పై పనిచేస్తున్న వాట్సాప్
వాట్సాప్‌లో కాల్‌లు చేయడం మరింత సులభంగా మారబోతోంది. WABetaInfo ప్రకారం, కాలింగ్ షార్ట్‌కట్ ఫీచర్‌పై కంపెనీ పనిచేస్తోంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంకా అభివృద్ధిలో ఉంది. యాప్ తర్వాతి అప్డేట్ ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
28 Jan 2023
భారతదేశంS23 అల్ట్రా నుండి కోకా-కోలా ఫోన్ వరకు భారతదేశంలో త్వరలో లాంచ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు
2023 సంవత్సరం మొదలుకాగానే భారతదేశంలో iQOO 11, TECNO PHANTOM X2 సిరీస్, Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యాయి. సామ్ సంగ్, OnePlus వంటి బ్రాండ్‌లు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, అయితే Realme ప్రత్యేకమైన Coca-Cola బ్రాండెడ్ ఫోన్ ని కూడా లాంచ్ చేస్తుంది.
27 Jan 2023
ఫ్రీ ఫైర్ మాక్స్జనవరి 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
27 Jan 2023
గూగుల్ఆండ్రాయిడ్ విభాగంలో తగ్గనున్న గూగుల్ ఆధిపత్యం
గత వారం ఆండ్రాయిడ్‌కు సంబంధించిన వ్యాపార విధానాలను మార్చాలని సంస్థను కోరుతూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆర్డర్‌కు వ్యతిరేకంగా గూగుల్ చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి భారత సుప్రీంకోర్టు నిరాకరించింది. అందుకే దేశంలో ఆండ్రాయిడ్ లైసెన్సింగ్‌కు సంబంధించిన కొన్ని మార్పులను గూగుల్ ప్రకటించింది.
19 Jan 2023
వ్యాపారంరానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది
2023లో భారతదేశంలో 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లాభాల్లోకి వెళ్ళేటట్లు కనిపిస్తోంది. సైబర్‌మీడియా రీసెర్చ్ (CMR) నివేదిక ప్రకారం, 2023 చివరి నాటికి మార్కెట్ 70% విస్తరిస్తుందని అంచనా.
16 Jan 2023
వాట్సాప్ఇకపై వాట్సాప్ లో నోటిఫికేషన్స్ నుండి కాంటాక్ట్స్ బ్లాక్ చేయచ్చు
నోటిఫికేషన్‌ల నుండి కాంటాక్ట్స్ బ్లాక్ చేసే ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. పేరెంట్ సంస్థ మరో బ్లాక్ షార్ట్‌కట్‌పై పని చేస్తోంది. అయితే అది చాట్ లిస్ట్ నుండి యాక్సెస్ చేయాలి. రెండు ఫీచర్‌లు ప్రస్తుతం డెవలప్‌మెంట్, టెస్టింగ్‌లో ఉన్నాయి. రాబోయే వారాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
16 Jan 2023
వాట్సాప్iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్
వాట్సాప్ iOS వినియోగదారులకు కెమెరా మోడ్ అందించడం కోసం పని చేస్తోంది. ఇది త్వరలో బీటా పరీక్షకులకు అందుబాటులోకి రానుంది. అయితే, WABetaInfo ద్వారా, రాబోయే ఫీచర్ ఎలా పని చేస్తుందో కొంత సమాచారం బయటికి వచ్చింది. కెమెరా మోడ్ iOS వినియోగదారులకు వేగంగా 'ఫోటో' నుండి 'వీడియో' మోడ్‌కి మార్చడం సులభమవుతుంది.
12 Jan 2023
ధరభారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్
ఫిబ్రవరి 1న జరిగే Galaxy అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ సిరీస్‌ను ప్రారంభించనున్నట్లు సామ్ సంగ్ సృష్టం చేసింది. భారతదేశంలో లాంచ్ కి ముందే ప్రీ-బుకింగ్‌లకు మొదలయ్యాయి. ఈ సిరీస్ లో S23, S23 ప్లస్, S23 అల్ట్రా మోడల్‌లు ఉంటాయి. హ్యాండ్‌సెట్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకున్న వారికి రూ. 5,000 విలువైన ఇ-వోచర్ తో పాటు అనేక ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.
11 Jan 2023
భారతదేశంRealme 10 vs Redmi Note 12 ఏది సరైన ఎంపిక
భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ మార్కెట్లో పోటీపడుతున్న Realme, Redmi వంటి బ్రాండ్‌లు అనేక రకాల ఆఫర్‌లతో కొనుగోలుదార్లను ఆకర్షిస్తున్నారు. ఇటీవల విడుదలైన Redmi Note 12కు పోటీగా Realme భారతదేశంలో Realme 10ని ప్రకటించింది.
09 Jan 2023
భారతదేశం5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో
ఎయిర్ టెల్, జియో 2022లో తమ 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాయి. మొదట, 5G నెట్‌వర్క్ ఎంపిక చేసిన నగరాలకు మాత్రమే పరిమితం చేసాయి. ప్రస్తుతానికి, భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ రెండూ సంస్థలు తమ 5G నెట్‌వర్క్ కవరేజీని విస్తరిస్తున్నాయి.
03 Jan 2023
గూగుల్గూగుల్ లో ఈ విషయాలు సెర్చ్ చేస్తే మీ పని అంతే!
టెక్నాలజీ రంగంలో 2023 ఒక ముఖ్యమైన సంవత్సరం. ఇంటర్నెట్ టెక్నాలజీల అభివృద్ధి ఆన్‌లైన్ ద్వేషపూరిత-సమూహ కార్యకలాపాలకు లేదా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు, సమాచారానికి కారణం అయింది.
02 Jan 2023
టెక్నాలజీపిల్లల కోసం ప్రత్యేకంగా Tab M9ని లాంచ్ చేసిన Lenovo
చైనీస్ టెక్ దిగ్గజం Lenovo Tab M9 పేరుతో కొత్త టాబ్లెట్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఈ ఏడాది మధ్యలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.
02 Jan 2023
టెక్నాలజీఫోన్లు కొనడానికి ఫిజికల్ స్టోర్లకే ఓటు వేస్తున్న భారతీయులు
గత దశాబ్దం నుండి ఆన్లైన్ షాపింగ్ భారతదేశంలో పుంజుకుంది. అయితే ముఖ్యంగా గత అయిదారేళ్ళ నుండి అన్ని బ్రాండ్ల మొబైల్ ఫోన్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటున్నాయి.
02 Jan 2023
ట్విట్టర్ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్
ట్విటర్ చీఫ్ ఎలోన్ మస్క్ జనవరి 2023లో ట్విట్టర్‌లో నావిగేషన్ రాబోతున్నట్లు ప్రకటించారు. కొత్త ట్విట్టర్ నావిగేషన్ సిస్టమ్ వినియోగదారులను పక్కకు స్వైప్ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. రికమెండెడ్ ట్వీట్‌లు, ట్రెండ్‌లు, అంశాలకు వారిని తీసుకువెళుతుంది. కొత్త నావిగేషన్ సిస్టమ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఎలోన్ మస్క్ సృష్టంగా వెల్లడించనప్పటికీ, జనవరిలో రావచ్చని భావిస్తున్నారు.
02 Jan 2023
టెక్నాలజీఇకపై ప్రమాదకరమైన రోడ్ల గురించి అప్డేట్ చేసే Waze యాప్
Waze యాప్ పేరెంట్ సంస్థ అయిన గూగుల్ ట్రాఫిక్ డేటా ఆధారంగా ప్రమాదకరమైన సమీపంలోని రోడ్‌ల గురించి వినియోగదారులకు హెచ్చరిక చేసే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.
31 Dec 2022
టెక్నాలజీ2023లో స్మార్ట్‌ఫోన్ తయారీలో వినియోగదారులు ఆశిస్తున్న మార్పులు
2022 స్మార్ట్‌ఫోన్ తయారీలో పెద్దగా మార్పులు రాలేదు. అన్నీ బ్రాండ్లు పెద్దగా మార్పులు లేని విభిన్న వెర్షన్ స్మార్ట్ ఫోన్లు అందించాయి. అయితే 2023లో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు నుండి వినియోగదారులు కోరుకునే మార్పులు ఏంటో చూద్దాం.
31 Dec 2022
టెక్నాలజీVIDA V1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించిన హీరో మోటోకార్ప్
హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ VIDA V1 కస్టమర్ డెలివరీలను ప్రారంభించినట్లు తెలిపింది. బ్రాండ్ నుండి మొదటి ఎలక్ట్రిక్ వాహనం బెంగళూరులో డెలివరీ చేశారు. జైపూర్, ఢిల్లీలో డెలివరీలు జరుగుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
31 Dec 2022
గూగుల్2023లో 5G సేవతో OTA అప్‌డేట్‌ను విడుదల చేయనున్న గూగుల్
గూగుల్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న OTA (Over-The-Air) అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది మొదటి 2023 త్రైమాసికంలో పిక్సెల్ ఫోన్‌లలో 5G సేవలకు మద్దతు ఇస్తుంది.
30 Dec 2022
గూగుల్ఇప్పుడు స్పామ్ కాల్స్ గూర్చి హెచ్చరించే గూగుల్ వాయిస్
గూగుల్ వాయిస్ కాల్‌లకు "అనుమానాస్పద స్పామ్ కాలర్" హెచ్చరికను జోడిస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇది అనవసరమైన, అప్రధానమైన కాల్స్ ను ఫిల్టర్ చేస్తుంది. అయితే ఇన్‌కమింగ్ కాల్ స్పామ్ అని వినియోగదారులు ధృవీకరించాలి.
30 Dec 2022
టెక్నాలజీడిసెంబర్ 30న ఉచిత Fire MAX కోడ్‌లు: ఎలా రీడీమ్ చేయాలి
Garena Free Fire MAXలో ఉచిత కోడ్‌లను రీడీమ్ చేయడానికి వినియోగదారులు కొన్ని నియమాలను పాటించాలి.
29 Dec 2022
టెక్నాలజీ2022లో మనం వస్తాయని అనుకున్న Vs వచ్చిన ఆవిష్కరణలు
టెక్నాలజీ కంపెనీలు 2022 లో ఎప్పటిలాగే ఎన్నో ఆవిష్కరణల గురించి హామీ ఇచ్చారు కానీ వాస్తవానికి, హామీకి చాలా దూరంలో ఆగిపోయారు.
28 Dec 2022
టెక్నాలజీజనవరి 3న లాంచ్ కాబోతున్న బడ్జెట్ ఫోన్ POCO C50 గురించి తెలుసుకోండి
భారతదేశంలో POCO C50 అనే కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ జనవరి 3న విడుదల కాబోతుంది. ఇందులో MediaTek లేదా JLQ నుండి ఎంట్రీ-లెవల్ చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. JLQ మార్కెట్లో కొత్త, Android ఆధారిత హ్యాండ్‌సెట్‌లు మరియు టాబ్లెట్‌ల కోసం SoCల తయారీపై దృష్టి పెడుతుంది.
28 Dec 2022
టెక్నాలజీచైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్
Redmi K60 సిరీస్ చైనాలో అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో Redmi K60 స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలు ప్రస్తుతం తెలియదు కానీ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో Redmi K60, Redmi K60 Pro, Redmi K60E మోడల్స్ ఉన్నాయి.
28 Dec 2022
ధరవేగంగా ఛార్జింగ్ అయ్యే GT Neo 5ను జనవరి 5న విడుదల చేయనున్నRealme
240W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మొట్టమొదటి ఫోన్ రాబోతుంది. అదే Realme సంస్థ విడుదల చేయనున్న GT Neo 5. టెక్నాలజీ కమ్యూనికేషన్ సమావేశంలో జనవరి 5, 2023న తన ఫ్లాష్-చార్జింగ్ ఆవిష్కరణను ఆవిష్కరించబోతుంది.
27 Dec 2022
టెక్నాలజీHONOR సంస్థ విడుదల చేసిన 80 GT, Pad V8 Pro ఫీచర్లు, ధర
HONOR తన తాజా స్మార్ట్‌ఫోన్ HONOR 80 GTని, కొత్త టాబ్లెట్ Pad V8 Proని విడుదల చేసింది. ఆసియా మార్కెట్లలో Honor జోరందుకుంది. మాతృ సంస్థ నుండి విడిపోయిన తరువాత తన ఖ్యాతిని తిరిగి పొందేందుకు కృషి చేస్తోంది.
26 Dec 2022
మెటావాట్సాప్ లో త్వరలో స్టేటస్ రిపోర్ట్ చేసే ఆప్షన్
వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది, దీని ద్వారా వినియోగదారులు వెబ్‌లో స్టేటస్ అప్డేట్స్ రిపోర్ట్ చేయచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇప్పటికే బీటా వినియోగదారులకు అందుబాటులో ఉంది, త్వరలో ఇతర వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. వినియోగదారులు స్టేటస్ విభాగంలో కొత్త మెనుకి వెళ్లడం ద్వారా వారి స్టేటస్ రిపోర్ట్ చేయగలరు.
26 Dec 2022
ఐఫోన్2022తో ఆగిపోయిన కొన్ని ఉత్పత్తులు
2022 ఎన్నో ఉత్పత్తులకు మైలురాయి మాత్రమే కాదు కొన్ని ఉత్పత్తులకు చివరి సంవత్సరం కూడా. అవేంటో తెలుసుకుందాం
24 Dec 2022
టెక్నాలజీRedmi Note 12 5G ధర ఎంతో తెలుసా?
Redmi Note 12 సిరీస్ వచ్చే నెల జనవరి 5న భారతదేశంలో లాంచ్ అవుతోంది. ఈసారి Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ సహా మూడు కొత్త మోడళ్లను కంపెనీ విడుదల చేస్తోంది. Redmi Note 12 ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది, కానీ చైనా మోడల్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ మూడు కెమెరాలతో వస్తుంది.
24 Dec 2022
ఫీచర్అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు
2022లో మెరుగైన, ఉపయోగకరమైన ఫీచర్స్ తో వినియోగదారులను మెప్పించిన టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే
21 Dec 2022
టెక్నాలజీ2022లో టాప్ ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వివరాలు తెలుసుకోండి
స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ల పరంగా 2022 ప్రత్యేకమైన సంవత్సరం. జనవరి 2022 నెలలోనే దాదాపు 5 పెద్ద లాంచ్ లు జరిగాయి. ఆపిల్, సామ్ సంగ్, గూగుల్, OnePlus, Vivo, Xiaomi, Oppo సంస్థలు ఆకర్షిణీయమైన ఫోన్‌లను విడుదల చేశారు.
23 Dec 2022
ఫీచర్సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్
ప్రముఖ బ్రాండ్ boAT మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. స్మార్ట్‌వాచ్ అనుకూలమైన ధరతో లాంచ్ అయినప్పటికీ, ఇది బ్లూటూత్ కాలింగ్‌తో సహా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. గతంలో ఇటువంటి ఫీచర్ ఖరీదైన స్మార్ట్‌వాచ్‌లకు మాత్రమే పరిమితం అయ్యివుండేది.
22 Dec 2022
టెక్నాలజీఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వినియోగదారుల ఫోన్ చార్జీలు పెరుగుదలకు కంపెనీల రాబడిపై ఒత్తిడి పెరగడం కారణం. సెప్టెంబర్ త్రైమాసికంలో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, జియోలు ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయంలో లాభాలను పొందాయి.