02 Jan 2023

భారతదేశంలో 48,624 ట్విట్టర్ ఖాతాలపై నిషేధం

అక్టోబర్ 26 నుండి నవంబర్ 25 మధ్య భారతదేశంలో పిల్లలపై లైంగిక దోపిడీ, బలవంతపు నగ్నత్వాన్ని ప్రోత్సహించినందుకు 45,589 ఖాతాలను ట్విట్టర్ నిషేధించింది. దేశంలో తమ వేదికపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు 3,035 ఖాతాలను కూడా తొలగించింది. మొత్తంగా, భారతదేశంలో ఈ విషయంపై ట్విట్టర్ 48,624 ఖాతాలను నిషేధించింది.

ఫలానా అమ్మాయి ప్రేమలో నాగశౌర్య.. కొత్త సినిమా ప్రకటన

క్రిష్ణ వ్రింద విహారి సినిమా తర్వాత నాగశౌర్య తన కొత్త సినిమాను ప్రకటించాడు. "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది.

'టీమిండియా ఓపెనర్‌గా అతనే దమ్మునోడు' : గంభీర్

టీమిండియా ఓపెనర్‌గా యువ ప్లేయర్ ఇషాన్ కిషనే దమ్మున ప్లేయర్ అని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌కు సన్నదమవుతున్న టీమిండియా.. ఇషాన్ కిషన్‌నే తమ ప్రధాన ఓపెనర్‌గా ఎంచుకోవాలి. బంగ్లాదేశ్ పర్యటనలో డబుల్ సెంచరీ చేసి విమర్శకుల నోర్లకు ఇషాన్ మూయించాడని పేర్కొన్నారు.

2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా..

2023 జనవరి 1 రాకతో.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టాయి. ఈ‌ఏడాది ఏకంగా 9రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే.. ఈ ఎలక్షన్స్‌ను సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్

క్రిప్టోకరెన్సీ ప్రధాన డెవలపర్‌లలో ఒకరైన బిట్‌కాయిన్ ల్యూక్ డాష్జర్ కు ఈ కొత్త సంవత్సరం అంతగా కలిసిరాలేదు. అతని క్రిప్టో వాలెట్ హ్యాక్ దాడికి గురైంది, అతని వ్యక్తిగత హోల్డింగ్స్ నుండి 216.93 బీట్ కాయిన్ల నష్టానికి దారితీసింది. ఒక్కో బీట్ కాయిన్ ధర $16,570 (దాదాపు రూ. 13.7 లక్షలు)గా ఉంది. అంటే, $3.6 మిలియన్లు (దాదాపు రూ. 30 కోట్లు) నష్టపోయారు.

ఈ ఏడాదైనా భారత్ విజయఢంకా మోగించేనా..?

2022లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన రోహిత్ సేన.. యూఏఈలో జరిగిన ఆసియా కప్‌‌లో ఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. ఈ ఏడాది ఆరంభంలో సొంత గడ్డ మీద శ్రీలంకపై టెస్టు సిరీస్ గెలిచిన భారత్.. టెస్టు ర్యాకింగ్‌లో రెండోస్థానంలో ఉంది.

ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

వాల్తేరు వీరయ్య: మేకింగ్ వీడియోలో చిరంజీవి నుండి మరో లీక్

సంక్రాంతి సందర్భంగా థియేటర్ల వద్ద రచ్చ చేయడానికి వాల్తేరు వీరయ్య రెడీ అవుతున్నాడు. ప్రమోషన్ల జోరు చూస్తుంటే ఈ విషయం తెలిసిపోతుంది. మరికొద్ది రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో చివరి పాటను కూడా వదిలే పనిలో ఉన్నారు.

హార్థిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేస్తారా.. ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..!

2022లో టీమిండియా అశించిన విజయాలు సాధించకపోవడంతో సెలెక్టర్లతో పాటు బీసీసీఐకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలం చెందడంతో టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీస్‌లోనే ఇంటి బాట పట్టింది. వయస్సు మీద పడుతున్న రోహిత్‌శర్మను తప్పించి కొత్త కెప్టెన్‌ను నియమించేందుకు బీసీసీఐ నిమగ్నమైంది.

Hyundai మోటార్ ఇండియాకు కొత్త COOగా తరుణ్ గార్గ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా సోమవారం తన సీనియర్ మేనేజ్‌మెంట్ లీడర్‌షిప్‌లో జరిగిన మార్పును ప్రకటించింది. ఇది జనవరి 1, 2023 నుండి అమలులోకి వచ్చింది.

ట్రంప్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా?.. ఆరోజే తుది నిర్ణయం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా ? అనే అంశాన్ని పరిశీలించేందుకు మాతృ సంస్థ 'మెటా' సిద్ధమవుతోంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. జనవరి 7న ట్రంప్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను పునరుద్ధరించే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మెటా యాజమాన్యం చెప్పింది.

అత్యధిక ధరకు అమ్ముడైన మసూద శాటిలైట్ రైట్స్

2022లో వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో మసూద కూడా ఒకటి. తెలుగు తెరమీద హార్రర్ సినిమాలు లేని లోటును తీర్చింది మసూద. రిలీజైన మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.

'థాంక్ గాడ్.. పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు' : కపిల్

నూతన ఏడాది కుటుంబ సభ్యులకు సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న రిషబ్ పంత్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక సూచనలు చేశారు.

పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశం చెల్లుబాటు అవుతుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు జడ్జీలు తీర్పు చెప్పారు. జస్టిస్ నాగరత్నం ఒక్కరే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తన జడ్జిమెంట్‌ను రాశారు.

సరిగ్గా ఇదే రోజు.. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ అరంగ్రేటం

ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మరణం క్రీడాలోకంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తన స్పిన్ మాయజాలంలో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కులు చూపించిన లెజెండ్.. తన 15 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 1992 సరిగ్గా ఇదే రోజున షేన్ వార్న్ భారత్- ఆస్ట్రేలియా తరపున భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.

పిల్లల కోసం ప్రత్యేకంగా Tab M9ని లాంచ్ చేసిన Lenovo

చైనీస్ టెక్ దిగ్గజం Lenovo Tab M9 పేరుతో కొత్త టాబ్లెట్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఈ ఏడాది మధ్యలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

ఆడవాళ్ళకు మాత్రమే: మీరు పుట్టిన నెల ప్రకారం మీకుండే లక్షణాలు

పుట్టిన తేదీ, నెల, రోజు ప్రకారం వారికి కొన్ని లక్షణాలు వస్తాయని చెప్పుకుంటారు. ప్రస్తుతం ఏ నెలలో పుట్టిన ఆడవాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో చూద్దాం.

రాజౌరిలో మరో పేలుడు.. చిన్నారి మృతి.. 24గంటల్లోనే రెండో ఘటన

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో మరో ఉగ్ర పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజౌరిలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగి 24గంటలు గడవక ముందే రాజౌరిలో మరో పేలుడు సంభవించడంతో కశ్మీర్ లోయలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

నాదల్ రికార్డులపై జకోవిచ్ గురి..!

ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెన్లో ఆడేందుకు నోవాక్ జొకోవిచ్‌కు అవకాశం దక్కింది. కరోనా వ్యాక్సిన్ టీకాను వేసుకోకపోవడంతో గతంలో టోర్నమెంట్స్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో జొకోవిచ్‌ ఆడటానికి అవకాశం రాలేదు. అయితే యూఎస్ ఓపెన్ టోర్ని నుంచి మాత్రం ఆయనే స్వయంగా తప్పుకున్నాడు.

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. లిక్కర్‌పై పూర్తస్థాయిలో పన్ను రద్దు.. ఎక్కడో తెలుసా?

అద్భుతమై ప్రదేశాలకు నెలవైన దుబాయ్‌కు పర్యాటకుల తాకిడి నిత్యం ఉంటుంది. అయితే దేశ పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు.. నూతన సంవత్సరం వేళ.. ఆ దేశ రాజ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.

ఫోన్లు కొనడానికి ఫిజికల్ స్టోర్లకే ఓటు వేస్తున్న భారతీయులు

గత దశాబ్దం నుండి ఆన్లైన్ షాపింగ్ భారతదేశంలో పుంజుకుంది. అయితే ముఖ్యంగా గత అయిదారేళ్ళ నుండి అన్ని బ్రాండ్ల మొబైల్ ఫోన్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటున్నాయి.

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ భవిష్యత్తుపై ఆందోళన..!

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ ఇటీవల జింబాబ్వే పర్యటనకు టీ20 కెప్టెన్‌గా నియమతులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన భవిష్యత్తు క్రికెట్‌పై నూరుల్ మదనపడుతున్నాడు. దీనికి కారణం తన చూపుడువేలుకు శస్త్ర చికిత్స చేసినా పూర్తిగా నయం కాకపోవడం.

నాకు ఆ టైమ్ ఇప్పుడే వచ్చింది.. హిందీ సినిమాపై నయనతార కామెంట్స్

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయన తార, కనెక్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసారు.

ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్

ట్విటర్ చీఫ్ ఎలోన్ మస్క్ జనవరి 2023లో ట్విట్టర్‌లో నావిగేషన్ రాబోతున్నట్లు ప్రకటించారు. కొత్త ట్విట్టర్ నావిగేషన్ సిస్టమ్ వినియోగదారులను పక్కకు స్వైప్ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. రికమెండెడ్ ట్వీట్‌లు, ట్రెండ్‌లు, అంశాలకు వారిని తీసుకువెళుతుంది. కొత్త నావిగేషన్ సిస్టమ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఎలోన్ మస్క్ సృష్టంగా వెల్లడించనప్పటికీ, జనవరిలో రావచ్చని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా?

ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి విస్తరణపై అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. వీలైనంత త్వరలో ఏపీలో పార్టీ కార్యాలయాలన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఏపీలో పార్టీని నడిపే నాయకుల జాబితాను ఇప్పటికే ఖరారు చేశారట. కీలక నాయకుల పేర్లు ఇప్పడు బయటకు వచ్చాయి. వీరందరూ సోమవారం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఇకపై ప్రమాదకరమైన రోడ్ల గురించి అప్డేట్ చేసే Waze యాప్

Waze యాప్ పేరెంట్ సంస్థ అయిన గూగుల్ ట్రాఫిక్ డేటా ఆధారంగా ప్రమాదకరమైన సమీపంలోని రోడ్‌ల గురించి వినియోగదారులకు హెచ్చరిక చేసే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

చలికాలం: కాపీ తాగడం అలవాటుగా మారిపోయిందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

కాఫీ లేదా టీ ఏదైనా సరే.. ఎక్కువ తాగితే అనర్థాలే ఎదురవుతాయి. తాగినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది గానీ అలవాటు వ్యసనంగా మారి అదుపు లేకుండా పోతే ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది.

యోయో ఫిట్‌నెస్ మళ్లీ వచ్చేసింది..!

ఒకప్పుడు టీమ్ ఇండియా ఎంపికకు తప్పనిసరిగా యోయో ఫిట్ నెస్ పరీక్ష ఉండేది. యోయో ఫిట్‌నెస్ పరీక్ష మళ్లీ వచ్చేసింది. ప్రస్తుతం బీసీసీఐ సెలక్షన్ అర్హత ప్రమాణాల జాబితాలో నిర్ణయించాలని ధ్రువీకరించింది. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ కోసం 20 మందితో కోర్ గ్రూప్ ఏర్పాటు చేసి, అందులోని ఆటగాళ్లను టోర్ని ముందు వరకు రోటెట్ చేయాలనుకుంది. ప్రపంచ కప్ లో ఓటమి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త దర్శకుడితో పంజా వైష్ణవ్ ప్రయోగం.. వేసవిలో విడుదల

ఉప్పెన సినిమాతో తెలుగు తెర మీద ఉప్పెన సృష్టించిన హీరో పంజా వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత సరైన విజయం సొంతం చేసుకోలేకపోయాడు. కొండపొలం, రంగరంగ వైభవంగా సినిమాలు బాక్సఫీసు వద్ద తేలిపోయాయి.

స్వీయ- అభ్యాస బ్రెయిలీ పరికరం 'Annie' గురించి తెలుసుకుందాం

గోవాలోని BITS పిలానీకి చెందిన అమన్ శ్రీవాస్తవ, అతని ముగ్గురు స్నేహితుల మధ్య టిఫిన్ తింటున్నప్పుడు ప్రారంభమైన సంభాషణ ఒక పరిశోధన ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంది. ఆ విధంగా బెంగళూరుకు చెందిన టింకర్‌బెల్ ల్యాబ్స్ దృష్టి లోపం ఉన్న పిల్లలకు బ్రెయిలీ లిపిని నేర్పడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి స్వీయ-అభ్యాస పరికరం 'Annie'ని అభివృద్ధి చేసింది.

జైలుపై తుపాకులతో రెచ్చిపోయిన సాయుధులు.. 14మంది మృతి

మెక్సికో జుయారెజ్ నగరంలోని జైలుపై గుర్తులు తెలియని సాయుధులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 14మంది మృతి చెందగా.. 13 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. చనిపోయిన వారిలో 10మంది భద్రతా సిబ్బంది, నలుగురు ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ దాడి నేపథ్యంలో దాదాపు 24మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నట్లు వివరించారు.

'టీ20 వరల్డ్ కప్ చాహెల్ అడుంటే ఎక్కవ నష్టం జరిగేది' : దినేష్ కార్తీక్

టీమిండియా సీనియర్ ఆటగాడు దినేష్ కార్తీక్.. స్పిన్నర్ చాహల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ లో లెగ్ స్పిన్నర్ చాహల్ ను ఆడించి ఉంటే టీమిండియా ఎక్కువ నష్టం జరిగేదని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.

పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది? తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన పెద్దనోట్ల రద్దుపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. జస్టిస్ నజీర్‌, జస్టిస్ గవాయ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇవ్వనుంది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన తర్వాత.. ఈ అంశంపై దాదాపు 58 పిటిషన్లు దాఖలయ్యాయి.

భారతదేశంలో జనవరిలో లాంచ్ కాబోతున్న టాప్ 5 కార్లు

కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు వాహన తయారీదారులు అనేక కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. జనవరి 2023లో భారతదేశంలో ప్రారంభించబోయే టాప్ 5 వాహనాల గురించి తెలుసుకుందాం.

2022: తెలుగు తెరకు పరిచయమైన డబ్బింగ్ హీరోలు.. మొదటి స్థానంలో ఎవరున్నారంటే

సినిమాలోని ఏదైనా అంశానికి తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయితే ఆ సినిమాను నెత్తిన పెట్టుకుని మోస్తారు. అందులో హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఎవరన్న సంగతి వాళ్ళు పట్టించుకోరు.

బౌండరీ లైన్ బయట క్యాచ్ పట్టినా ఔటిచ్చారు.. ఎందుకు..?

బౌండరీ లైన్ బయట క్యాచ్ పడితే అది సిక్సర్ అవుతుంది. అయితే బౌండరీ లైన్ బయట క్యాచ్‌ను ఔటిచ్చారు అంపైర్లు.. బిగ్‌బాష్ లీగ్‌లో ఓ ఫీల్డర్ పట్టిన క్యాచ్ చర్చనీయాంశమైంది.

ఆహారం: బాదం, వేరుశనగ.. ఆరోగ్యానికి ఏది మంచిది?

ఒక రోజులో 28గ్రాముల గింజలు తింటే అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులను దూరం చేస్తాయి. గింజల్లో ముఖ్యమైనవి బాదం, వేరుశనగ.

చంద్రబాబుకే ఎందుకు ఇలా జరుగుతోంది? మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మృతి

చంద్రబాబు సభల్లో వరుస విషాదాలు టీడీపీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కొత్త ఏడాదిలో మొదటి రోజు గుంటూరు వికాస్‌నగర్‌లో జరిగిన తొక్కిసలాటలో మరో ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురూ మహిళలే. ఇటీవల కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో 8మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం

కేంద్ర బడ్జెట్ 2023కి ముందు, నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచే సుంకాల గురించి తాను భయపడుతున్నానని, భారతదేశాన్ని ఇటువంటి చర్యలు అధిక ఖర్చుతో కూడిన దేశంగా మారుస్తుందని. చైనాకు ప్రత్యామ్నాయంగా మారడం మరింత సవాలుగా మారనుందని, టారిఫ్‌లను పెంచడం వలన భారతదేశంలోకి వచ్చే నిధులు ఆగిపోయే అవకాశం ఉందని మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మునుపటి
తరువాత