కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు
అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం బిహార్ విమానాశ్రయంలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయ్యింది.
శబాష్.. 5వేల మార్కును దాటిన డీన్ ఎల్గర్
ఆస్ట్రేలియా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ధక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టులో 5వేల పరుగుల చేసి రికార్డును సృష్టించాడు. టెస్టులో ఈ మైలురాయిని అందుకున్న ఎనిమిదోవ క్రికెటర్గా నిలిచాడు.
షూటింగ్ సెట్లో ప్రభాస్, మారుతి.. ఫోటోలు వైరల్
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుందనగానే ఫ్యాన్స్ అంతా గోలగోల చేసారు. ప్రస్తుతం సినిమా మొదలైంది. ఆల్రెడీ షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ మేరకు ఇంటర్నెట్ లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
శ్రీలంకతో సిరీస్‌లు.. రోహిత్, రాహుల్ దూరం
బంగ్లాదేశ్ పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియా మరో అసక్తికర సమరానికి సిద్ధమవుతోంది. సొంతగడ్డపై శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జనవరి 3 నుంచి టీ20 సిరీస్, 10 నుంచి వన్డే సిరీస్ ప్రారంభకానున్నాయి. భారత్ కెప్టెన్ రోహిత్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
నేపాల్ కొత్త ప్రధానిగా 'ప్రచండ' ప్రమాణ స్వీకారం
నేపాల్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంతో నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ దేశ ప్రధాని షేర్ బహదుర్ దేవ్బా తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. కొత్త ప్రధానిగా సీపీఎన్-మావోయిస్టు సెంటర్ పార్టీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' సోమవారం ప్రమాణ స్వీకారం. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలితో పాటు చిన్న పార్టీల మద్దతుతో ప్రచండ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
ఆరోగ్యం: మగవాళ్ళలో కామకోరికలను పెంచే దూలగొండి గింజల ప్రాధాన్యం
దూలగొండి గింజలు అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ దురదపుట్టించే ఆకు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దూలగుండి ఆకులను ముట్టుకుంటే చాలు దురదతో చచ్చిపోవాల్సిందే.
చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నా.. అందరి చూపు మాత్రం గుడివాడ పైన ఉందని చెప్పాలి. 2024 ఎన్నికల్లో గుడివాడలో ఎలాగైనా వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకుంది. తాజాగా నియోజకవర్గంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యమలో మరోసారి వార్తల్లో నిలిచింది గుడివాడ.
NEO ప్రాజెక్ట్ తో భూమికి ఉల్క నుండి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న NASA
US అంతరిక్ష సంస్థ NASA ఎట్టకేలకు గ్రహశకలాల నుండి రక్షణకు ప్రాధాన్యతనిస్తోంది. ప్లానెటరీ సొసైటీ NEO సర్వేయర్ ప్రాజెక్ట్‌ను 2028లో ప్రారంభించాలని ప్రణాళికలు వేస్తుంది. NEO సర్వేయర్ అనేది భూమితో ఢీకొనే అవకాశం ఉన్న సమీపంలో ఉన్న గ్రహశకలాలు, ఇతర చిన్న వస్తువుల కోసం వెతికే ఉపగ్రహం.
కెఎల్ రాహుల్ నీ ఆటకో దండం స్వామి
విధ్వంసకర బ్యాట్‌మెన్‌గా పేరున్న భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్.. ప్రస్తుతం చెత్త బ్యాటింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టి అశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
2022 సంవత్సరాన్ని మంచి సినిమాతో ముగించాలనుకుంటున్నారా? ఈ లిస్ట్ చూడండి
2022 సంవత్సరం తెలుగు సినిమాకు బాగా కలిసొచ్చింది. బాక్సాఫీసు వద్ద మంచి మంచి సినిమాలు పడ్డాయి. ఆర్ఆర్ఆర్ మొదలుకుని మొన్న రిలీజైన ధమాకా, 18 పేజెస్ వరకు బాక్సాఫీసును షేక్ చేసాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరిక
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురుయ్యారు. దీంతో హుటాహుటిన మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆమెను దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్పించారు.
చాంపియన్ షిప్ విజేత నిఖత్ జరీన్.. పంచ్ ఆదర్స్
తెలంగాణ యువ సంచలనం, బాక్సర్ నిఖత జరీన్ మరోసారి తన పంచ్ పవర్ చూపింది.భోపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించింది.
వాట్సాప్ లో త్వరలో స్టేటస్ రిపోర్ట్ చేసే ఆప్షన్
వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది, దీని ద్వారా వినియోగదారులు వెబ్‌లో స్టేటస్ అప్డేట్స్ రిపోర్ట్ చేయచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇప్పటికే బీటా వినియోగదారులకు అందుబాటులో ఉంది, త్వరలో ఇతర వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. వినియోగదారులు స్టేటస్ విభాగంలో కొత్త మెనుకి వెళ్లడం ద్వారా వారి స్టేటస్ రిపోర్ట్ చేయగలరు.
టెస్టులో వైస్ కెప్టెన్‌గా అశ్విన్‌కు అవకాశం ఇవ్వాలి..!
రవిచంద్రన్ అశ్విన్ ఓ గొప్ప ఫైటర్.. భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు విజయాన్ని అందించాడు. బంగ్లాదేశ్ రెండో టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది. భారత్ టెస్టు వైస్‌కెప్టెన్‌గా ఎందుకు అశ్విన్‌ను నియమించలేదన్న చాలామంది హృదయాల్లో నెలకొన్న ప్రశ్న..?
బీఆర్ఎస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుల నియామకం వేగవంతం.. కేసీఆర్ ఫోకస్
దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత.. బీఆర్‌ఎన్‌ను విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు అధినేత కేసీఆర్. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో జనవరిలో రైతుల సమస్యలపై పెద్ద బహిరంగ సభను నిర్వహించనున్న నేపథ్యంలో... వివిధ రాష్ట్రాల్లో కిసాన్ సెల్‌ల జిల్లా అధ్యక్షుల నియామకాలను వేగవంతం చేశారు.
ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దేశవ్యాప్తంగా తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
కరోనా రోగులతో కిటకిటలాడుతున్న చైనా ఆస్పత్రులు.. ఆ ఒక్క ప్రావిన్స్‌లోనే రోజుకు 10లక్షల కేసులు
చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒమిక్రాన్ BF.7 వేరియంట్ విజృంభణతో చైనాలో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి . ముఖ్యంగా పట్టణాల్లో అయితే... కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఒక్కో ప్రావిన్స్‌లో లక్షల కొద్ది కేసులు నమోదవుతున్నాయి. షాంఘై సమీపంలోని పెద్ద పారిశ్రామిక ప్రావిన్స్ అయిన ఒక్క జెజియాంగ్‌లోనే రోజుకు 10లక్షలు నమోదవుతుండటం గమనార్హం.
2022తో ఆగిపోయిన కొన్ని ఉత్పత్తులు
2022 ఎన్నో ఉత్పత్తులకు మైలురాయి మాత్రమే కాదు కొన్ని ఉత్పత్తులకు చివరి సంవత్సరం కూడా. అవేంటో తెలుసుకుందాం
2022 క్రికెట్ చరిత్రలో ఈ అద్భుత ఇన్నింగ్స్‌లకు ఫ్యాన్స్ ఫిదా
క్రికెట్లో చర్రితలో గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌లు కొన్ని ఉంటాయి. 2022 ఎంతో ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లు ప్రేక్షకుల మదిలో నిలిచిపోనున్నాయి.
కలవరపెడుతున్న వరుస టాలీవుడ్ నటుల మరణాలు
గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతున్న వరుస మరణాలు తెలుగు సినిమా అభిమానులకు కలవరం కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న సీనియర్ నటుడు చలపతి రావు హఠాత్తుగా చనిపోవడంతో అందరూ దిగ్భ్రాంతి చెందారు.
శ్రీలంకతో టీ20 సిరీస్.. కెప్టెన్ గా హర్థిక్ పాండ్యా..?
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టైం ఈ మధ్య అస్సలేమీ బాగోలేదు. ఆసియా కప్ T20 టోర్నమెంట్ మొదలుకొని T20 ప్రపంచ కప్ తో అశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి, హర్థిక్ పాండ్యాకు జట్టు పగ్గాలను అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ వంటకాల్లో ఇండియాకు ఐదో స్థానం.. ఒప్పుకోం అంటున్న నెటిజన్లు
ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన వంటకాలు ఉంటాయి. దేని రుచి దానిదే. భోజన ప్రియులకు వేరు వేరు రకాల విభిన్న ఆహారాలను రుచి చూడాలనే కోరిక ఉంటుంది.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కన్నా లీజు లాభం అంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు
టాక్సీ, లాజిస్టిక్స్ కంపెనీలు వంటి ఫ్లీట్ ఆపరేటర్లు ఎలక్ట్రిక్ వాహనాల్ని ఎక్కువగా లీజుకి తీసుకుంటున్నారు. టాప్ బ్యాంకులు ఎలక్ట్రిక్ వాహనాలకు ఫైనాన్స్ ఇవ్వడానికి విముఖత చూపడంతో లీజుకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
మంచు తుపాను ఎఫెక్ట్: 34 మందిని మృతి.. అంధకారంలో లక్షల మంది
మంచు తుపానుతో అమెరికా అల్లాడిపోతోంది. మైనస్ 40డిగ్రీల ఉష్టోగ్రతలతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు... శీతల గాలుల కారణంగా అగ్రరాజ్యంలో 34మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలోని 60శాతం జనాభాపై ఈ తుపాను ప్రభావం పడింది.
2022లో టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్‌కు అరుదైన గుర్తింపు
భారత్ అగ్రశేణి టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్, మణికా బత్రా టేబుల్ టెన్నిస్ లో అత్యుత్తమ ప్రతిభ చూపారు. 16 ఏళ్ల తరువాత బర్నింగ్ హామ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించి, శబాష్ అనుపించుకున్నాడు శరత్ కమల్.
ఆరోగ్యకరమైన ఆహారం: చలికాలంలో స్వీట్ పొటాటో వల్ల కలిగే ప్రయోజనాలు
స్వీట్ పొటాటో.. దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. కొందరు కందగడ్డ అని, కొందరు రత్నపురి గడ్డ అని అంటారు. చలికాలంలో దీన్ని మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
2022 రివైండ్: తెలుగు తెరకు దిగొచ్చిన బాలీవుడ్ తారలు
ఈ సంవత్సరం తెలుగు చిత్రపరిశ్రమకు కలిసి వచ్చిందనే చెప్పాలి. డైరెక్ట్ సినిమాల నుండి డబ్బింగ్ సినిమాల వరకు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించాయి.
Redmi Note 12 5G ధర ఎంతో తెలుసా?
Redmi Note 12 సిరీస్ వచ్చే నెల జనవరి 5న భారతదేశంలో లాంచ్ అవుతోంది. ఈసారి Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ సహా మూడు కొత్త మోడళ్లను కంపెనీ విడుదల చేస్తోంది. Redmi Note 12 ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది, కానీ చైనా మోడల్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ మూడు కెమెరాలతో వస్తుంది.
బీసీసీఐ సెక్రటరీకి మెస్సీ సంతకం చేసిన జెర్సీ
అర్జెంటీనా ప్రపంచ కప్ విజేత లియోనెల్ మెస్సీ నుండి సంతకం చేసిన జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సెక్రటరీ జే షా అందుకున్నారు.
కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం
దేశానికి కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్ బీఎఫ్ 7' ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం.. తాజాగా మరికొన్ని సూచనలు చేసింది.
చలికాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు
చలి పెరుగుతున్న కొద్దీ గుండె మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు తగ్గిన కొద్దీ రక్తప్రవాహంలో మార్పులు వస్తాయి కాబట్టి గుండెకు ఎక్కువ పని పడుతుంది.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ కి కొత్త పదవి
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వెంటనే నాజామ్ సేథీ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని నియమించింది. ఇందులో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి చోటు దక్కింది.
2022లో అతిపెద్ద విలీనాల గురించి తెలుసుకుందాం
సాధారణంగా కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఒక కంపెనీ మరొక దానిని స్వాధీనం చేసుకుంటుంది. కొనుగోలు చేసిన కంపెనీ దాని పేరు, బ్రాండ్ విలువ సిబ్బందిని ఉంచుకోవచ్చు లేదా ఉంచకపోవచ్చు.
టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ
సంక్షేమ హాస్టళ్లలో ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా నోటిఫికేషన్ ద్వారా 581 ఖాళీలను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, 2, మాట్రాన్ గ్రేడ్-1, 2, వార్డెన్ గ్రేడ్-1, 2తో పాటు మహిళా సూపరింటెండెంట్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రాఫెల్ నాదల్
టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్ రిటైర్మంట్ పై క్లారిటీ ఇచ్చారు. లావర్ కప్ లో తన చిరకాల ప్రత్యర్థి అయిన ఫెదరర్ వీడ్కోలుకు హజరైన తర్వాత తన రిటైర్మెంట్ గురుంచి స్పందించారు.రిటైర్మెంట్ గురించి ఇంకా ఆలోచించడం లేదని స్పష్టం చేశారు.
డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర లేకుండా స్పెషల్ క్రిస్మస్ కేక్
క్రిస్మస్ పార్టీలో ఆహా అనిపించే ఆహారంతో పాటు అమోఘమైన స్వీట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ డయాబెటిస్ ఉన్నవారు ఈ విషయంలో నిరాశ పడాల్సి వస్తుంది.
కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం
కృష్ణ జన్మభూమి వివాద స్థలంపై ఉత్తరప్రదేశ్‌లోని మథుర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జనవరి 2 తర్వాత.. షాహీ ఈద్గా మసీదు ఉన్న వివాదాస్పద స్థలాన్ని సర్వే చేయాలని పురావస్తు శాఖను ఆదేశించింది. జనవరి 20 తర్వాత నివేదికను సమర్పించాలని సూచించింది.
2023లో కూడా ఇంటి నుండి పనిచేసే సౌకర్యం కొనసాగుతుందా?
వచ్చే ఏడాది US జాబ్ మార్కెట్ బలహీనంగా కొనసాగితే, కంపెనీలు రిమోట్‌గా పని చేయడానికి ఉద్యోగులను అనుమతించకుండా వెనక్కి తీసుకోవచ్చు. ఉద్యోగులు సాధారణంగా ఇంటి నుండి పని చేయడంపై రెండు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహమ్మారి సమయంలో ఇంటి నుండి పనిచేస్తూ ఎంతో సమయాన్ని ఆదా చేయడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కొందరు చెప్తే, మరికొందరు కంపెనీ సంస్కృతి కార్యాలయంలో సరైన విధంగా ఉంటుందని చెప్పారు.
ఫ్రెంచ్ ప్రపంచ కప్ విజేత బ్లైస్ మటుయిడి రిటైర్మెంట్
ఫ్రాన్స్ మాజీ మిడ్‌ఫీల్డర్ బ్లేజ్ మటుయిడి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల మటుయిడి 2018లో ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాడు. మూడేళ్ల క్రితం లెస్ బ్ల్యూస్ కోసం తన 84 ప్రదర్శనలలో చివరిగా ఆడాడు.
బర్త్ డే స్పెషల్: తీయనైన తెలుగులో మహ్మద్ రఫీ పాట.. తేనెకన్నా మధురం
1970, 80ల్లో మీకు ఏ సింగర్ ఇష్టమని ఎవరినైనా అడిగితే భాషతో సంబంధం లేకుండా అందరూ మహ్మద్ రఫీ అని చెప్పేవారు. ఆ గొంతులో ఉన్న మాధుర్యానికి అంతగా పరవశించిపోయారు.
ఐర్లాండ్ ఆటగాడిని రూ.4.4 కోట్లకు దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
ప్రపంచలోనే మోస్ట్ పాపులర్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ ఆడటాన్ని చాలా గొప్ప గౌరవంగా భావిస్తారు ప్రపంచదేశాల క్రికెటర్లు.. ఐపీఎల్ 2023 మినీ వేలంలో అసోసియేట్ ప్లేయర్లకు అవకాశం దక్కింది.. ఇండియా, ఐర్లాండ్ మధ్య జరిగిన సీరిస్ లో అద్భుతంగా అదరగొట్టిన జోషువా లిటిల్‌ని రూ.4.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన మొట్టమొదటి ఐర్లాండ్ క్రికెటర్ గా జోషువా లిటిల్ రికార్డు క్రియేట్ చేశాడు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా?
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)తో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కేసీఆర్ అనుకున్నట్లే ఇతర రాష్ట్రాల్లో పాగా వేస్తారా? జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
చలి చంపేస్తుందా? మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి
చలికాలం రాగానే మన శరీరాన్ని చలి నుండి కాపాడుకోవడానికి ఎక్కడో దాచిపెట్టేసిన స్వెట్టర్లను, దుప్పట్లను బయటకు తీస్తుంటారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఐతే చలి చంపేస్తుంది.
ఆరోగ్యం: నాన్ వెజ్ అలవాటు లేని వాళ్ళకు కావాల్సినంత ప్రోటీన్ అందించే ఆహరాలు
మాంసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. చికెన్, గుడ్లు, సాల్మన్ చేపల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ వల్ల శరీరంలోని కణాలు వృద్ధి చెంది శరీరాన్ని పుష్టిగా ఉంచుతుంది.
మీకోసం 2022లో విడుదలైన ఉత్తమ వాట్సాప్ ఫీచర్‌లు!
2022లో, వాట్సాప్ లో కొత్త ఫీచర్లను విడుదల చేసింది పేరెంట్ సంస్థ మెటా. ఆ టాప్ ఫీచర్‌ల జాబితా ఇక్కడ ఉంది.
పింక్‌బాల్ టెస్టుకు భారత్ దూరం
2015లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి పింక్‌బాల్ టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పింక్‌బాల్ టెస్ట్‌గా పిలిచే డే-నైట్ టెస్ట్, ఇతర టెస్టుల కంటే భిన్నంగా ఉంటుంది.
తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా
ఈ సంవత్సరం తెలుగు సినిమాకు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్, కార్తికేయ, సీతారామం, బింబిసార సినిమాలతో బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షం కురిసింది.
81కోట్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అదేంటంటే?
పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి కరోనా ముంచుకొస్తున్న నేపథ్యంలో.. ఇంకో ఏడాది పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద.. 81కోట్ల మందికి రేషన్‌ఉచితంగా అందించాలని ప్రధాని మోదీ అధ్యక్షత కేంద్ర కేబినెట్‌నిర్ణయం తీసుకుంది.
టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం
సీఈఓ ఎలాన్ మస్క్ మాట్లాడుతూ తాను టెస్లాలో 18 నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎలాంటి షేర్లను విక్రయించనని అన్నారు. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి స్టాక్ దాని విలువలో దాదాపు సగం కోల్పోయింది.
అమెరికా విదేశాంగ శాఖ అత్యున్నత పదవిలో భారత సంతతి వ్యక్తి రిచర్డ్ వర్మ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవిని కట్టబెట్టాడు. భారతీయ మూలాలున్న రిచర్డ్ వర్మను అమెరికా విదేశాంగ శాఖలో మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్ డిప్యూటీ సెక్రటరీగా నామినేట్ చేశారు.
మైగ్రేన్ నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించాలి
మాములు తలనొప్పికి, మైగ్రేన్ కి చాలా తేడా ఉంటుంది. మైగ్రేన్ వలన నొప్పి ఎక్కువగా ఉంటుంది. అందుకే మైగ్రేన్ నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
'పూరన్.. యూనివర్శనల్ బాస్ నుండి తీసుకున్న అప్పు తిరిగిచ్చేయాలి': క్రిస్ గేల్
2023 మినీ IPLలో ఆల్ రౌండర్లు ఆధిపత్యం చెలాయించారు. సామ్ కర్రన్ ను Rs.18.5 కోట్ల రికార్డు స్థాయికి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది, గ్రీన్‌ని ముంబై ఇండియన్స్ రూ.17.5 కోట్లకు తీసుకుంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి
తమిళనాడులోని తేని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది అయ్యప్ప భక్తులు మృత్యువాత పడ్డారు. స్వాములు ప్రయాణిస్తున్న వాహనం దాదాపు 40 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.
బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల
మాస్ దేవుడు బాలకృష్ణ, సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. జనవరి 12వ తేదీన వీరసింహారెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు
2022లో మెరుగైన, ఉపయోగకరమైన ఫీచర్స్ తో వినియోగదారులను మెప్పించిన టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే
2022లో టాప్ ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వివరాలు తెలుసుకోండి
స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ల పరంగా 2022 ప్రత్యేకమైన సంవత్సరం. జనవరి 2022 నెలలోనే దాదాపు 5 పెద్ద లాంచ్ లు జరిగాయి. ఆపిల్, సామ్ సంగ్, గూగుల్, OnePlus, Vivo, Xiaomi, Oppo సంస్థలు ఆకర్షిణీయమైన ఫోన్‌లను విడుదల చేశారు.
అఖేతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు
బ్లిగియా సపిడాను మాములుగా అఖే అని పిలుస్తారు. ఈ జమైకన్ జాతీయ పండు నలుపు గింజలతో పసుపు రంగులో ఉంటుంది.
కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు
చైనాతో పాటు అనేక దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈమేరకు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికుల్లో కనీసం 2శాతం మందికి కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. శనివారం నుంచే ఈ పరీక్షలు చేయనున్నారు.
వీరసింహారెడ్డి: బాలయ్య మనోభావాలు దెబ్బతిన్నాయి
అఖండ సినిమా విజయం తర్వాత బాలయ్య నుండి వస్తున్న వీరసింహారెడ్డి అనే సినిమా వస్తోంది. ఈ సినిమాపై అభిమానుల అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి.
నికోలస్ పూరన్ దమ్మున్న అటగాడు : గౌతమ్ గంభీర్
వైస్టిండీస్ అటగాడు నికోలస్ పూరన్ ఐపీఎల్ వేలంలో జాక్ పాట్ కొట్టారు. ఈ ప్లేయర్ కోసం రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటిపడగా.. చివరికి అతడ్ని రూ. 16 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.
Pixel 7a, Pixel Fold ధర ఎంతో తెలుసా?
Pixel 7a, Pixel Fold లాంచ్ కు నెలలు గడువు ఉండగానే ధర, స్పెసిఫికేషన్, డిజైన్ గురించి ఆన్లైన్ లో లీక్ అయింది. ఈమధ్యనే ఐఫోన్ 15 Ultra ధర కూడా ప్రకటించారు. ఇది 2023 చివరి నాటికి లాంచ్ కాబోతుంది.
పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులు… ఆనందంలో ఆ డైరెక్టర్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో బిజీగా గడుపుతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు కోసం ఇటీవల 40రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు.
సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్
ప్రముఖ బ్రాండ్ boAT మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. స్మార్ట్‌వాచ్ అనుకూలమైన ధరతో లాంచ్ అయినప్పటికీ, ఇది బ్లూటూత్ కాలింగ్‌తో సహా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. గతంలో ఇటువంటి ఫీచర్ ఖరీదైన స్మార్ట్‌వాచ్‌లకు మాత్రమే పరిమితం అయ్యివుండేది.
ఐఫోన్ దగ్గర ఉన్నా సొంత GPS వాడుకోనున్న ఆపిల్ వాచ్ తాజా సిరీస్
ఆపిల్ వాచ్ సిరీస్ కు GPS కనెక్టివిటీకు ఇప్పుడు ఐఫోన్ అవసరం లేదు. 2022 నుండి ఆపిల్ వాచ్ ఒక ప్రధాన అప్‌డేట్‌ను పొందింది. ఇప్పుడు ఐఫోన్ దగ్గర ఉన్నా సరే ఆపిల్ వాచ్ తన సొంత GPS ను వాడుతుంది. ఇంతకు ముందు ఆపిల్ వాచ్ ప్రాసెసింగ్ కోసం సమీపంలోని ఆపిల్ వాచ్ పై ఆధారపడేది.
తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం?
అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. వ్యూహాత్మకంగా ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించి.. తెలంగాణలో చాలా కాలంగా యాక్టివ్‌గా లేని టీడీపీని చంద్రబాబు తిరిగి చర్చలోకి తీసుకోచ్చారు. టీడీపీ యాక్టివ్ అయితే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా?
వైసీపీ నేత, మాజీ మంత్రి, మైదుకూరు నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కడప రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి చేసి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.